18.01.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


పితాశ్రీ అవ్యక్తమైన తర్వాత అవ్యక్తవతనం నుండి ప్రాప్తించిన దివ్య సందేశం
( గుల్జార్ దాది ద్వారా )

1. తనువు, మనస్సుల అలజడిని సమాప్తము చేసి దేహిఅభిమానులుగా కండి

ఈరోజు నేను వతనానికి వెళ్లినప్పుడు శివబాబా చెప్తున్నారు - "సాకార బ్రహ్మ యొక్క ఆత్మలో ఆది నుండి అంత్యము వరకు 84 జన్మల చక్రమును తిరిగే సంస్కారము ఉన్నది. కనుక ఈరోజు కూడా వతనం నుండి చక్రము తిరిగి రావటానికి వెళ్లి ఉండిరి. ఉదాహరణమునకు సైన్సు వారు రాకెట్ ద్వారా చంద్రుని వద్దకు వెళతారు. ఎంతెంత చంద్రుని వద్దకు చేరుతూపోతారో, అంతే ఈ భూమ్యాకర్షణ నుండీ దూరమవుతూ పోయారు. భూమ్యాకర్షణ శక్తి పూర్తిగా సమాప్తమవుతుంది. అక్కడికి చేరుకోగానే చాలా తేలికదనము అనుభవమవుతుంది. (ఏదేని వస్తువు లేదా వ్యక్తి యొక్క ద్రవ్యరాశి భూమిపై ఉండే ద్రవ్యరాశి చంద్రునిపై 1/6 వంతు మాత్రమే ఉంటుంది. ఉదా - 16 కేజీలు బరువుగల వ్యక్తి ద్రవ్యరాశి చంద్రునిపై 10 కేజీలు మాత్రమే ఉంటుంది). ఏవిధంగా పిల్లలైన మీరు సూక్ష్మవతనానికి వచ్చినప్పుడు స్థూల ఆకర్షణ సమాప్తమైనట్లే అచ్చట కూడా భూమ్యాకర్షణ ఉండదు. అయితే ఇది ధ్యానము ద్వారా, అది సైన్స్ ద్వారా. ఇంకొక తేడాను కూడా బాప్ దాదా వినిపిస్తున్నారు - వారు రాకెట్ లో వెళ్ళినపుడు వారు ఎక్కడెక్కడ తిరగాలనే సంబంధం క్రింది వారితో ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అది మీ చేతిలోనే ఉంటుంది. దీని తర్వాత బాబా ఒక దృశ్యమును చూపారు.

చాలా ఎతైన ఒక ప్రకాశవంతమైన పర్వతం ఉండినది. పర్వతం క్రింద శక్తి సైన్యము మరియు పాండవదళము ఉండినారు. పర్వతముపైన బాప్ దాదా నిల్చొని ఉండినారు. కొంతసేపటి తరవాత చాలా పెద్ద గుంపు అయ్యారు. మనమందరము అక్కడ సాకార రూపములో కాకుండా మందిరాలలోని సాక్షాత్కార మూర్తులు నిల్చొని ఉండినట్లు నిల్చొని ఉండినాము. పైకి చూడాలని ప్రయత్నిస్తూ ఉండినారు . కాని పైకి చూడలేకపోయారు . అందరూ చాలా దయనీయ స్థితిలో ఉండినారు . కొద్దిసేపటి తర్వాత ఒక ఆకాశవాణి లాంటి శబ్ధము వచ్చింది . శక్తుల ద్వారా పాండవుల ద్వారాయే కళ్యాణం జరగాలి. ఆ సమయంలో మనందరి ముఖాలపై చాలా దయాభావన ఉండినది . ఆ తర్వాత అనేక మందికి శక్తులు మరియు పాండవుల ద్వారా అవ్యక్త బ్రహ్మ యొక్క సాక్షాత్కారం, శివబాబా యొక్క సాక్షాత్కారం కలుగుతూ ఉండినది . తర్వాత ఈ దృశ్యం కనిపించినది. కొందరు నవ్వుతూ ఉండినారు. కొందరు పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉండినారు . కొందరు ప్రేమతో కన్నీరు కారుస్తూ ఉండినారు. అయితే శక్తులందరూ అగ్నిగోళం లాగా తేజస్వీ రూపంతో స్థితమై ఉండినారు. ఆ దృశ్యం గురించి బాబా ఇలా వినిపించారు . అంతిమ సమయంలో ఈ వ్యక్త శరీరం కూడా పూర్తిగా స్థిరమైపోతుంది. ఇపుడు పాత శరీరం లెక్కాచారాలున్న కారణంగా శరీరం తనవైపుకు లాగుచున్నది . కాని అంతిమంలో పూర్తి స్థిరంగా, శాంతముగా అయిపోతుంది . మనసులోగాని , తనువులోగాని ఎలాంటి అలజడి ఉండదు . దీనినే బాబా దేహిఅభిమాన స్థితి అని అంటారు . దృశ్యం సమాప్తమయిన తర్వాత బాబా ఇలా చెప్పారు. పిల్లలందరికీ ఇప్పుడు దేహి-అభిమానిగా అయ్యే పురుషార్థం చేయమని చెప్పండి. ఎంత సేవ పట్ల గమనమున్నదో అంతే ఈ ముఖ్యమైన విషయంపై కూడా గమనిక ఉండాలి. దేహిఅభిమానులుగా కావాలి.

2. పాత సంస్కారాల రూపీ ఆకులను సమాప్తము చేసి బీజరూపస్థతిని తయారు చేసుకోండి

ఈరోజు నేను వతనానికి వెళ్లినపుడు బాప్ దాదా పిల్లలయిన మనందరికీ స్వాగతం చెప్పుటకై ఎదురుగా ఉపస్థితులై ఉండినారు. నేను అక్కడికి చేరుకోగానే సాకార రూపంలో ఎలా దృష్టితోనే పలకరించేవారో, అలాగే అనుభవం కలిగినది. అయితే ఈరోజు దృష్టిలో విశేషించి ప్రేమ సాగరుని రూపం ఎమర్జ్ అయివుండినది. ఒక్కొక్క పుత్రుని తలంపు నయనాలలో ఇమిడి ఉండినది. బాబా చెప్పారు పిల్లలందరూ - బాబాకు తలంపు ఉన్నది. కొంతమంది పిల్లల స్మృతి అవ్యక్తముగా ఉంటే, మరి కొందరి స్మృతిలో అవ్యక్త భావంతోపాటు వ్యక్త భావం కూడా కలిసి ఉండినది. 75 శాతం పిల్లల స్మృతి అవ్యక్తముగా ఉండినది కాని 25 శాతం వారి తలంపు మిక్స్ గా ఉండినది. తర్వాత బాబా అందరికీ స్నేహము మరియు శక్తి నిండిన దృష్టినిచ్చి ముద్ద తినిపించారు . తర్వాత ఒక దృశ్యం కనిపించింది. పిల్లలందరూ గుమిగూడి నిల్చొనివున్నారు. మరియు పై నుంచి చాలా పుష్పాల వర్షం కురుస్తూ ఉండినది. పూర్తిగా నలువైపులా పుష్పాలు తప్ప ఇంకేమీ కనిపించలేదు. బాబా ఇలా వినిపించారు - బచ్చీ ! బాప్ దాదా పిల్లలందరికీ స్నేహము , మరియు శక్తులను ఇచ్చే ఉన్నారు. కాని జతజతలో దివ్యగుణములనే పుష్పాలను కూడా శిక్షణల రూపములో చాలా వర్షించారు. కాని దివ్యగుణాలను ప్రతి బిడ్డ యథా శక్తి అనుసారంగా ధారణ చేశారు. దీని తర్వాత మరలా మరో దృశ్యమును చూపారు. మూడు రకాల గులాబి పుష్పాలు ఉండినవి. ఒకటి ఇనుముతో తయారుచేయబడివున్నది. రెండవది తేలికైన ఇత్తడితో తయారుచేయబడినది. మరియు మూడవది నిజమైన గులాబి పుష్పము ఉండినది . ఇపుడు బాబా చెప్పారు - పిల్లల రిజల్టు కూడా ఈ విధముగానే ఉన్నది. ఇనుముతో చేసిన పుష్పాలు పిల్లల యొక్క కఠిన సంస్కారాలకు గుర్తు. ఇనుమును చాలా కొట్టవలసి ఉంటుంది. వేడి చేయకుండా, సుత్తి దెబ్బ వేయకుండా ఇది పరివర్తన కాదు. ఈ రకంగా చాలా మంది పిల్లల సంస్కారాలు ఇనుము సమానంగా కఠినముగా ఉన్నాయి. ఎంత భట్టిలో ఉంచినా అది పరివర్తన
కావు. రెండవ రకము - కొంచెము వంచటము నుండి లేక శ్రమవల్ల అవి కొంచెం మార్పు చెందుతాయి. మూడవది - సహజంగానే గులాబి. వీరు గులాబీల సమానంగా కావటంలో ఏ మాత్రం శ్రమ తీసుకోలేదు అని చెప్తూ చెప్తూ బాబా నిజమైన గులాబీ పుష్పమును తన చేతిలో తీసుకొని కొద్దిగా చేతిలో అటు, ఇటు త్రిప్పారు. అలా త్రిప్పగానే వాటి మొత్తం రెక్కలన్నియూ క్రింద పడిపోయి కేవలం మధ్యలోని బీజం మాత్రమే ఉండినది. అప్పుడు బాబా ఇలా చెప్పారు - చూడు! ఏవిధంగా దీని రేకులు ఎంత త్వరగా సహజముగా వేరయిపోయినాయో, అలాగే పిల్లలు కూడా అలాంటి పురుషార్థము చేయాలి. వెంటనే ఒక్కసారిగా పాత సంస్కారాలు, పురాతన దేహ సంబంధాలనే రేకులు తొలగిపోవాలి. మరలా బీజరూప అవస్థలో స్థితమైపోవాలి. కనుక పిల్లలందరికీ ఈ సందేశాన్నివ్వు - స్వయమును చెక్ చేసుకోండి, ఒకవేళ సమయం వచ్చినట్లయితే ఏ సంస్కారం అనే ఆకులు అంటుకొని ఉండవు కదా! మరలా అపుడు శ్రమ చేయాల్సిపడే విధంగా ఉండదు కదా? కర్మాతీత అవస్థ సహజముగానే తయారవుతుందా లేక ఏదేని కర్మ బంధనం ఆ సమయములో ఆటంకపరచదు కదా అని పరిశీలించుకొని దానిని సరిచేసుకునేందుకు ప్రయత్నించండి.

3. స్నేహము మరియు సంఘఠన కొరకు ఒకరి సలహాకు ఒకరు గౌరవమునివ్వండి

ఈరోజు బాబాను మధుబన్ లోనికి వచ్చుటకు ఆహ్వానించుటకు వతనంలోకి వెళ్లాను అపుడు బాప్ దాదా సైగల నుంచి ఈరోజు రావాలనే ఆలోచన బాబాకు లేనట్లుగా నాకు అనుభవం కలిగింది. ఇంతలోనే బాబా చెప్తారు - మంచిది బిడ్డా! పిల్లలందరూ పిలిచారంటే బాప్ దాదా పిల్లలందరికీ సేవాధారి. ఇది విని ఇప్పుడే రానని, మరలా అంతలోనే వస్తానని ఎందుకు అన్నారు! అనే ఆలోచన నాలో కలిగింది. నా మనసులోని సంకల్పాలను గ్రహించిన బాబా ఇలా చెప్పారు - ఆలోచించి కర్మ చేసి చూపుట, బాబా మీకు నేర్పిస్తున్నారు. పిల్లలయిన మీరు కూడా ఒకరు. మరొకరి సలహాలకు. ఒకరు మరొకరి ఆలోచనకు గౌరవం ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా ఒక ఆలోచన ఇచ్చారనుకోండి. అప్పుడు మీకు ఇష్టమనిపించదనుకోండి, అయిననూ మీరు వారి ఆలోచనను వెంటనే తెంచి వేయరాదు. మొదట వారని ఇలాంటి మాటలతో గౌరవించండి. హా! ఎందుకు కాదు, చాలా బాగుంది ......…..ఇలా మీరు అనటం నుంచి వారిలో ఆలోచన ఫోర్స్ తగ్గిపోతుంది. ఆ తర్వాత మీరు ఏది వారికి అర్థం చేయిస్తారో వారు దానిని అర్థం చేసుకోగలుగుతారు. ఒకవేళ డైరెక్టుగా వారి ఆలోచనలకు తెంచి వేసినట్లయితే రెండు ఫోర్స్ ల మధ్య ఘర్షణ జరిగి, ఫలితములో సఫలత రాదు. అందువల్ల ఒకరి ఆలోచనలకు అనగా సలహాలకు మరొకరు మొదట గౌరవాన్ని, ఇవ్వడము ఎంతో అవసరము . దీని ద్వారానే పరస్పరంలో స్నేహము మరియు సంఘఠన కొనసాగుతూ ఉంటాయి.

4. సాకర శృంగారానికి ప్రాక్టికల్ స్వరూపము - అవ్యక్త స్థితిని తయారుచేసుకొని చూపించండి

ఈరోజు వతనానికి వెళ్ళినపుడు అక్కడికి చేరుకోగానే బాప్ దాదా ఎదుటనే ఉండినారు. అయితే నేనేమి చూశానంటే బ్రహ్మాబాబా మెడలో లెక్కలేనన్ని మాలలు పడివున్నాయి. అప్పుడు బాబా అన్నారు - ఈ మాలలను తీసి చూడు! నేను మాలలను తీసి చూడగా వాటిలో పెద్దవిగానూ, మరికొన్ని చిననవిగానూ ఉండినాయి. వీటి రహస్యమేమిటి బాబా? అని నేను అడిగాను. బాబా ఇలా చెప్పారు - బచ్చీ! ఇవన్నీ ఫిర్యాదులు, ఆక్షేపణల మాలలు. ఎందుకంటే పిల్లలు ఏకాంతంలో కూర్చున్నపుడు బాబాకు స్నేహంలో ఫిర్యాదులే చేస్తారు. పిల్లలకు భలే డ్రామా గుర్తుంటుంది. కాని అత్యంత ప్రియమైన వస్తువు ఖచ్చితముగా ఉంటుంది. కనుక అనుకోకుండా డ్రామాలోని అద్భుతమును చూచి ప్రతి పిల్లవాడు లోలోపల మనసులోనే ఆక్షేపణలు చేస్తూ ఉంటారు. జ్ఞానమయితే పిల్లలకు ఉంటుంది కాని, జ్ఞానము జతలో స్నేహము . ప్రేమ కూడా ఉన్నాయి. అందువల్ల ఈ పిర్యాదులను తప్పని చెప్పరాదు. తర్వాత నేను అడిగాను - బాబా! మీరు వీటికి బదులు ఏమి ఇచ్చారు? అప్పుడు బాబా చెప్పారు - ఏ విధమైన పిల్లలో అలాంటి జవాబు. బాబా అన్నారు - నేను కూడా పిల్లలకు రెస్పాన్స్ గా ఫిర్యాదుల మాలనే ధరింపజేస్తాను. అది ఏది? తర్వాత బాబా వినిపించారు - పిల్లల పట్ల బాబా ఉంచుకున్న ఆశలను సాకార రూపంలో మీరు తండ్రికి చూపించలేకపోయినారు . దానిని ఇపుడు మీరు అవ్యక్తరూపంలో చూపించాలి. ఇంకా బాబా ఇలా చెప్పారు - ఈ నిందలు కూడా మధురమైన ఆత్మిక సంభాషయే. ఇది కూడా పిల్లల ఆట. సాకార రూపంలో బాప్ దాదా చేయించిన శృంగారమును ఇప్పుడు అవ్యక్తవతనం నుండి బాప్ దాదా చూస్తారు. ఆ దృశ్యం సమాప్తమయినది, తర్వాత భోగ్ స్వీకరింపజేశాను. తర్వాత నేను బాబాను అడిగాను - బాబా! మీరు మొత్తం దినమంతా వతనంలో ఏమి చేస్తారు? అపుడు బాబా చెప్పారు - పద! నేను మీకు వతనంలోని మ్యూజియంను చూపుతాను. మీరు మ్యూజియం తయారుచేయాలంటే మొదట ప్లాను తయారుచేస్తారు. కాని బాబా మ్యూజియం ఒక్క సెకండులోనే తయారవుతుంది. అప్పుడేమి చూశానంటే ఒక పెద్ద హాలు ఉండినది. ఒకే హాలులో పిల్లలందరం అనేక రకాల మాడల్స్ రూపాలలో నిల్చొని ఉన్నాము. బాబా మ్యూజియం - ఇప్పుడు నీవు వెళ్లు. వెళ్లి ఒక మాడల్ ను చూడు! బాప్ దాదా ఏమేమి అలంకారాలు చేశారు? కళాకారుడు మూర్తిని అలంకరిస్తాడు కదా ! మరి బాప్ దాదా ఏమేమి అలంకరించారో చూడు! నేను ఒక మూర్తి దగ్గరికి వెళ్లి చూస్తే అందులో నాకేమీ ప్రత్యేకంగా కనిపించలేదు . పూర్తిగా అలంకరించబడిన మూర్తి కనిపిస్తూ ఉండినది . అప్పుడు బాబా ఇలా చెప్పారు - ఏది బాహ్య శృంగారం ఉందో దానిని సాకారంలోనే పిల్లలలో అలంకరించి వచ్చాను. కాని ఇప్పుడు అవ్యక్త రూపంలో ఏమి అలంకరిస్తున్నాను? శృంగారమంతా ఉండనే వుంది. ఆభరణాలు కూడా ఉన్నాయి. కాని ఆభరణాల మధ్యలో నగ పొదుగుతూ ఉన్నాను. బాబా అలా చెప్పిన వెంటనే కొన్నింటిలో ఒక వజ్రము(రత్నము) ఎక్కువగా కనిపించసాగింది. బాబా చెప్పారు పిల్లల పట్ల ముఖ్య శిక్షణ ఇదే అయినది - అవ్యక్త స్థితిలో స్థితమై వ్యక్త భావంలోకి రండి. ఏకాంతంలో కూర్చున్నపుడు అవ్యక్త స్థితి ఉంటున్నది. కాని వ్యక్తంలో ఉండి అవ్యక్త భావములో స్థితమగుట తప్పిపోవుచున్నది. అందువల్ల ఏకరస కర్మాతీత స్థితి అను రత్నము తక్కువగా ఉంది. కనుక ఎవరి జీవనంలో ఏ లోపమును చూస్తానో దానిని అలంకరిస్తున్నాను. ఏ విధంగా సాకార రూపంలో ఈ కార్యం చేస్తూ ఉండినో, అదే కార్యమును అవ్యక్త రూపంలోనూ చేస్తున్నాను. కనుక పిల్లలను వెళ్లి అడుగు - దినమంతటిలో బాబా పిల్లలను అలంకరిస్తున్నట్లు పిల్లలకు అనిపిస్తున్నదా? ఆ సమయంలో యోగయుక్త స్థితిలో ఏ పిల్లలు ఉంటారో వారికి అని తెలుస్తుంది - బాబా ఇప్పుడు నాతో మాట్లాడుచున్నారు. నన్ను అలంకరిస్తున్నారు. ఏ విధంగా నేను అవ్యక్తవతనములో పిల్లలతో కలుస్తూ, వినోదము కలుగజేస్తూవుంటానో అలా అవ్యక్తరూపంలోని పిల్లలు ఈ అనుభవమును చేయగలుగుతారు. నేను కూడా విశేషమైన సమయంలో విశేషమైన పిల్లలను గుర్తు చేసుకుంటాను. ఇలా పిల్లలకు టచింగ్ కలుగుతూనే ఉంటుంది కూడా. నేను అన్నాను - ఈ ఉపరామ అవస్థ సహజమైన తలంపు చేయు పద్ధతి. ఇప్పుడు పిల్లలకు ఎక్కువ సమయం లేదని, బాబా ఎప్పుడు ఎవరినైనా పిలిపించుకుంటారు అని తెలియజేయి.

5. ఈరోజు వతనానికి వెళ్లినప్పుడు ప్రకాశవంతమైన తేలికగా ఉన్న మేఘాలను దాటుకొని వతనానికి వెళ్తున్నట్లు అనుభవమయ్యింది. సూర్యాస్త సమయంలోని ఎరుపు రంగు వలె మేఘాల కాంతి ఎర్రగా కనిపిస్తూ ఉంది. నేను వతనానికి చేరుకున్నాను. అక్కడ కూడా ప్రకాశవంతమైన మేఘాల మధ్య బాప్ దాదా ముఖము సూర్య - చంద్రుల వలె ప్రకాశిస్తూ ఉండడం చూశాను. దృశ్యము చాలా సుందరంగా కనిపించింది. కాని ఈరోజు వాయుమండలం పూర్తి శాంతిగా ఉంది. బాప్ దాదా కలయికలో కూడా శాంతి, శక్తులు అనుభవమవుతూ ఉన్నాయి. బాబా చిరునవ్వుతో భలే పిల్లలైన మీరు సాకార శరీరములో, సాకార సృష్టిలో ఉన్నారు కాని సాకారములో ఉంటున్నా ఇలాగే లైట్ మైట్ స్వరూపములో ఉండాలి. ఎవరైనా చూస్తే ఎవరో ఫరిస్తాలు తిరుగుతూ ఉన్నారని అనిపించాలి. అయితే ఈ స్థితి ఏకాంతములో కూర్చొని అంతర్ముఖావస్థలో ఉండి స్వయాన్ని చెక్ చేసుకున్నపుడు వస్తుంది. అటువంటి స్థితి ద్వారానే ప్రపంచములోని ఆత్మలకు పిల్లలైన మీ ద్వారా సాక్షాత్కారము జరుగుతుంది . ఈరోజు వతనంలో ఒకవైపేమో సంపూర్ణ శాంతిగా ఉంది, మరోవైపు చాలా ప్రేమ రూపంగా ఉంది. అక్కడ ఏమి చూశాను? బాబా బాహువుల్లో పిల్లలందరూ ఇమిడిపోయి ఉన్నారు. దానితో పాటు బాబా ప్రేమ సాగరులుగా కనిపించారు. బాబా అన్నారు - శక్తులైన మీరు కూడా ఇప్పుడు ఆత్మలను ఇలా ఇంత ప్రేమతో సమీపంగా తీసుకురావాలి. మీ దృష్టిలో తండ్రి సమానంగా ప్రేమ మరియు శక్తుల పవర్ రెండూ ఉన్నపుడే ఆత్మలు సమీపంగా వస్తారు. తర్వాత బాబా మూడవ దృశ్యము చూపించారు - బాబా ముందు లెక్కలేనన్ని కార్డులు పడున్నాయి. బాబా నాతో - ఈ కార్డులన్నీ ఒక మంచి దృశ్యముగా(సీనరీగా) కనిపించునట్లు పేర్చు అని అన్నారు. ఎందుకంటే ప్రతి కార్డు పైన ఒక సీనరీ డిజైన్ ఉంది. కొన్నిటిలో చిత్రాలు, కొన్నిటిలో శరీరాలు ఉన్నాయి. వాటిని పేర్చునపుడు అవి ఒక్కొక్కసారి ఉల్టాగా(తలక్రిందులుగా), ఒక్కొక్కసారి సుల్టాగా(చక్కగా) అయిపోతున్నాయి. ఇది చూచి బాప్ దాదా చాలా నవ్వుతున్నారు. అందులో చాలా మంచి సత్యయుగ సీనరీలు ఉన్నాయి. ఒక దానిలో కృష్ణుడు బాలుని రూపములో ఊయలలో ఊగుతూ కనిపించాడు. ఒక దాసి ఊయల ఊపుతూ ఉంది. మరోదానిలో సఖీ - సఖులు ఆట్లాడుకోవడం ఉంది. అనగా సత్యయుగములోని దినచర్య ఉంది. తర్వాత నాకు వీడ్కోలు ఇచ్చు సమయములో బాబా నాతో - " బచ్చీ , అందరికీ శక్తి స్వరూప భవ, ప్రేమ స్వరూప భవ " అని సందేశమివ్వు అని చెప్పారు.

6. ఈరోజు నేను ఈ దేహము, దేహ ప్రపంచానికి అతీతంగా సూక్షవతనానికి అనగా దేనినైతే బ్రహ్మపురి అని అంటారో అందులోకి వెళ్లాను. అక్కడ తండ్రి అయిన పరమాత్మ ఒక దృశ్యాన్ని చూపించాడు - అక్కడ ఒక చాలా పెద్ద గుంపు చూచాను. ఎవరో టికెట్లు పంచుతున్నట్లు గుంపులోని ప్రతి ఒక్కరూ నాకు కూడా టికెట్ లభించాలని ప్రయత్నిస్తున్నారు. కొంత సమయము తర్వాత చూస్తే కొందరికి టికెట్లు లభించాయి, కొంతమందికి లభించలేదు. టికెట్ లభించినవారు మనసులో సంతోషంగా కనిపించారు, లభించనివారు ఒకరి ముఖాలు ఒకరు చూచుకుంటున్నారు. ఆ టికెట్ ఎక్కడికో వెళ్లుటకు. తర్వాత మరో దృశ్యము చూచాను. చాలా సుందరమైన ఒక పెద్ద ద్వారము కనిపించింది . ఆ గేటు అకస్మాత్తుగా తెరచుకుంది. ఎవరి వద్ద అయితే టికెట్ ఉందో వారు ద్వారము గుండా లోపలికి వెళ్లిపోయారు. టికెట్ లేని వారు చాలా పశ్చాత్తాపముతో చూస్తూ ఉండినారు. ఆ గేటుపై “ స్వర్గ ద్వారము " అని వ్రాయబడి ఉంది. బాబా రహస్యాన్ని ఇలా వినిపించారు - తండ్రి అయిన పరమాత్మ తన పిల్లలందరి ద్వారా సత్యయుగ నూతన సృష్టి అయిన స్వర్గములోకి వెళ్లుటకు టికెట్లు ఇప్పిస్తున్నారు. అయితే కొంతమంది పిల్లలు ఇప్పుడు కాదు, తర్వాత తీసుకుంటాములే అని అనుకుంటున్నారు. అయితే ఈ టికెట్ లభించే సమయం సమాప్తమై స్వర్గములోకి వెళ్లుటకు వంచితులుగా కారాదు. ఇంకా బాబా ఇలా చెప్పారు - కొంతమంది ఆత్మలు వింటారు, ఇక్కడ ఏ కార్యము జరుగుతూ ఉందో అని ఆలోచిస్తారు. అందువలన బాప్ దాదా తన పిల్లలకిదే శిక్షణనిస్తున్నారు - రాబోయే సమయము ఎటువంటిదంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మీ భాగ్యాన్ని పోగొట్టుకోకండి. అందుకే ఈ దృశ్యాన్ని చూపించాను. తర్వాత మరొక దృశ్యాన్ని చూచాను. ఒక నది ప్రవహిస్తూ ఉంది, ఆ నదిలో దూరదూరాల నుండి వచ్చి చాలామంది స్నానము చేస్తున్నారు. కాని ఆ నదికి సమీపంగా ఉండేవారు చాలా మంది స్నానము చేయుట లేదు. అయితే కొంతమంది వారిని నది ఎక్కడుంది అని అడుగుతూ ఉండినారు. కాని నదికి సమీపంగా ఉన్నవారికి నదిలో స్నానమాచరించుటకు గల మహత్యము తెలియదు. అంతేకాక ఎవరైతే స్నానము చేయుటకు అతురతతో ఉన్నారో వారి ఆతురతను, వారి కోరికను తగ్గిస్తూ ఉండినారు. బాబా నాతో ఇలా అన్నారు - బచ్చీ, నీవు ఏదైతే నది చూచావో అది జ్ఞాన గంగ. ఈ గంగకు సమీపంగా ఉండేవారు ఆబూ నివాసులు. దూరదూరాల నుండి వచ్చి ఇందులో స్నానము చేస్తున్నారు. కాని ఇక్కడ నివసించువారు దీని మహత్యాన్ని తెలుసుకోక వారిని ఆపుతున్నారు. కనుక ఈ పొరపాటులో వారు అలాగే ఉండిపోరాదు. ఎందుకంటే బాప్ దాదాకు అందరూ పిల్లలే. భలే ఆజ్ఞాకారులుగా లేకపోయినా పిల్లలందరూ బాబాకు ప్రియమైనవారే. అందువలన బాబా పిల్లలకు శిక్షణనిస్తున్నారు - ఈ అమూల్యమైన సమయం ఏదైతే జ్ఞానగంగలో స్నానము చేయుటకు లభిస్తూ ఉందో దానినెప్పుడూ పోగొట్టుకోరాదు. కొద్ది సమయం తర్వాత మరో దృశ్యము చూశాను - కొంతమంది స్నానము చేశారు, కొంతమంది నీటిని నింపుకొని ఉంచుకున్నారు. ఇంతలో నది తన దారిని మార్చుకొని ఆ వైపు వెళ్లిపోయింది. ఎవరైతే స్నానము చేయలేదో, నింపుకొని ఉంచుకోలేదో వారు ఇతరుల నుండి ఒక్కొక్క చుక్కను(జ్ఞాన బిందువును) వేడుకుంటున్నారు, ఒక్క బిందువు కొరకు తపిస్తున్నారు. బాబా ఈ దృశ్యమును చూపించి - ఇప్పుడిలాంటి సమయము వస్తుందని చెప్పారు. తర్వాత బాబా పిల్లలందరికీ ఒక మహామంత్రమును బహుమతిగా ఇచ్చారు - పరమపిత అయిన నా స్మృతిలో ఉండండి, మీ జీవితాలను పవిత్రంగా, యోగులుగా చేసుకోండి. బాప్ దాదా తన పిల్లలందరికి వారి స్నేహానికి రిటర్న్ గా ఈ మహామంత్రాన్ని బహుమతిగా(సౌగాత్ గా) ఇచ్చారు.

7. కర్మభోగముపై యోగబలము విజయము పొందుట - ఒక సాటిలేని అనుభవము

ఈరోజు వతనములోకి వెళ్తూనే అక్కడ శివబాబా, మన బ్రహ్మబాబా ఇరువురు కూర్చొని ఉండడం చూచాను. వారి ముందు ఒక చిన్న పర్వతము(గుట్ట) తయారై ఉండుట కూడా చూచాను. ఆ గుట్ట ఏమిటి? అది లెక్కలేనన్ని జాబుల గుట్ట. జాబులన్నీ కలిసి ఒక పర్వతముగా తయారయ్యాయి. నన్ను చూస్తూనే బ్రహ్మబాబా " ఈశూ ఎక్కడ? ఎన్ని జాబులొచ్చాయో చూడు" అని అన్నారు. అందుకు నేను, బాబా! నేను వచ్చానని చెప్పాను. ఈశూను కూడా వెంట తీసుకొచ్చావు కదా! అని బాబా అన్నారు. చూస్తూ ఉండు నేను, ఈశూ ఇరువురమూ కలిసి రెండు నిముషాలలో జాబులన్నిటి పని పూర్తి చేస్తాము అని బ్రహ్మబాబా అన్నారు. శివబాబా సాక్షిగా చూస్తూ నవ్వుతూ ఉండినారు. ఇంతలో ఈశూ బహన్ కూడా వతనములో ఎమర్జ్ అయ్యింది. ఈశూ ముఖము చాలా ప్రశాంతంగా ఉంది. బాబా ఈశూతో "బిడ్డా ఏమాలోచిస్తున్నావు? ఈరోజు ఈ జాబులన్నిటికి జవాబులివ్వాలి" అని అన్నారు. అప్పుడు పూర్తి సాకార వతన సంస్కారము ఎమర్జ్ అయినట్లుండినది. మమ్మా నిల్చొని ఇదంతా చూస్తూ ఉంది. ఇంతలో శివబాబా బ్రహ్మబాబాతో “మీరెక్కడున్నారు?వతనములో ఉన్నారు" అని అన్నారు. మరలా ఒక సెకండులోనే రూపము మారిపోయింది. బ్రహ్మబాబా ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారిగా గాఢమైన నిశ్శబ్ధమైపోయింది. ఇంతలో బాబా నాతో “బచ్చీ, ఈ జాబు తెరిచి చూడు" అని అన్నారు. అందుకు నేను “లెక్కలేనన్ని జాబులున్నాయి బాబా" అని అన్నాను. అందుకు బాబా - బచ్చీ, అన్నీ చదివేందుకు ఒక సెకండు కూడా పట్టదు ఎందుకంటే అన్ని జాబులలో ఉండేది ఒకే విషయము అని అన్నారు. తర్వాత బాబా ఇలా వినిపించారు - ఈ జాబులన్నిటిలో ఉండేది పిల్లల ఫిర్యాదులే ఉండినవి. ఇప్పుడు బాబా పిల్లలందరికి జవాబులిస్తారు. అందరికీ ఒక సెకండులో జవాబులిచ్చేస్తాను, చూస్తూ ఉండు అని అన్నారు. బాబా వ్రాసినట్లే ఎర్రని అక్షరాలలో జాబులు వ్రాశారు. ఆ జవాబులు ఇలా వ్రాశారు - "బ్రాహ్మణ కులభూషణ, స్వదర్శన చక్రధారి, ప్రకాశించే రత్నాల వంటి పిల్లలకు - సమాచారమేమంటే పిల్లలందరి, ఫిర్యాదుల పత్రాలు సూక్ష్మవతనంలో నాకు లభించాయి. అందుకు బదులుగా బాప్ దాదా పిల్లలకిలా చెప్తున్నారు - డ్రామా భావీ బంధనంలో ఆత్మలన్నీ బంధింపబడి, అందరూ పాత్ర చేస్తున్నారు. ఆ డ్రామాలోని మధురాతి మధురమైన బంధనమనుసారము ఈరోజు నేను అవ్యక్త వతనంలో పాత్ర చేస్తున్నాను. పిల్లలందరూ హృదయపూర్వకమైన, గాఢమైన ప్రేమతో అవ్యక్త రూపం ద్వారా చాలా చాలా చాలా ప్రియమైన స్మృతులు స్వీకరించండి. తండ్రి స్థితి ఎలా ఉందో, పిల్లలు కూడా అలాంటి స్థితినే కలిగి ఉండాలి. ఇది బాప్ దాదా వ్రాసిన జాబు.
తర్వాత బాబాకు భోగ్ సమర్పించాము. బాబా మాతో "బచ్చీ, ఈరోజు కొంతమంది కొత్త పిల్లలు కూడా వచ్చారు. మొదట నేను వారికి తినిపిస్తాను" అని అన్నారు. అప్పుడు బాబా వతనంలో పిల్లలందరిని ఎమర్జ్ చేశారు. బాబా త్వరత్వరగా ఒక్కొక్కరికి దృష్టి ఇస్తూ, చేతి ముద్ద కూడా తినిపించారు. ఒక సెకండు దృష్టి ఇచ్చినా, ఆ దృష్టిలో చాలా(శక్తి) నిండి ఉంది. ఆ తర్వాత మేము మూడవ దృశ్యము చూచాము. నేను బాబాతో - బాబా, అందరూ మిమ్ములను ఒక ప్రశ్న అడగమని చెప్పారు అని అన్నాను. అందుకు బాబా “ఏ ప్రశ్న అయినా అడుగు, బాబా ఒక పదములోనే జవాబిస్తాడు" అని చెప్పారు.

ప్రశ్న : - చివరి సమయంలో మీరేమీ చెప్పలేదు, బయట కనిపించిన దృశ్యమైతే మేమందరమూ విన్నాము, కానీ లోపల ఏమి జరిగిందో ఆ అనుభవము కూడా వినాలనుకుంటున్నాము.

అందుకు బాబా - బచ్చీ, ఆట కేవలం 10-15 నిమిషాలే జరిగింది. ఆ కొద్ది సమయంలోనే అనేక ఆటలు జరిగాయి. ఆ సమయంలో రకరకాల అనుభవాలు జరిగాయి. మొదటి అనుభవమేమంటే - చాలా జోరుగా యుద్ధము జరుగుతూ ఉంది. ఎవరెవరికి? యోగబలము మరియు కర్మభోగానికి. కర్మభోగము కూడా ఫుల్ ఫోర్సుతో తన వైపు లాగుతూ ఉంది, యోగబలము కూడా ఫుల్ ఫోర్సులో ఉంది. శారీరిక లెక్కాచారాలన్నీ యోగాగ్నిలో భస్మమైపోతూ ఉన్నట్లు అనుభవమయ్యింది. నేను సాక్షిగా వ్యాయామశాలలో కూర్చొని మల్లయుద్ధము చూచినట్లు చూస్తున్నాను. అనగా రెండిటి ఫోర్సు ఫుల్ గానే ఉంది. కొంత సమయం తర్వాత కర్మభోగము(నొప్పి, బాధ) పూర్తిగా నిర్బలమైపోయింది. బాధ పూర్తిగా మాయమైపోయింది. చివరికి యోగబలము కర్మభోగముపై విజయం పొందినట్లనిపించింది. ఆ సమయంలో మూడు విషయాలు జత జతలో జరిగాయి. అవి ఏవి? ఒకవైపు "బాబా, మీరు నన్ను మీ వద్దకు పిలుస్తున్నారని బాబాతో మాట్లాడుతున్నాను, రెండవ వైపు పిల్లల స్మృతి అంత గాఢంగా లేదు కాని పిల్లలందరి స్నేహ స్మృతి శుద్ధ మోహ రూపములో ఉంది. అయితే ఆ శుద్ధ మోహము వలన పిల్లల వద్ద శెలవు తీసుకోలేదనే సంకల్పము గాని, మరో సంకల్పము గాని లేదు. మూడవ వైపు శరీరము నుండి ఆత్మ ఎలా బయటకు పోతూ ఉందో అది కూడా అనుభవమవుతూ ఉండినది. కర్మాతీత న్యారా స్థితి - బాబా ఇంతకు ముందు మురళీలలో కూడా బౌ - భౌ శబ్దాల తర్వాత నిశ్శబ్ధమైపోతుందని చెప్పినట్లు పూర్తి గాఢమైన నిశ్శబ్దముఁడెడ్ సైలెన్స్) అనుభవమయింది. ఒక్కొక్క అంగము నుండి ఆత్మ తన శక్తిని ఎలా విడుస్తూ పోతూ ఉందో కూడా అనుభవమయింది. కనుక కర్మాతీత స్థితి అంటే ఏమిటో, మృత్యువంటే ఏమిటో అనుభవమవుతూ ఉండినది. ఇదే నా అనుభవం.

మళ్లీ నేను బాబాతో - "మేమంతా బాబా ముందు ఉండి ఉంటే బాబా పోకుండా అడ్డుపడేవాళ్లమని పిల్లలంటున్నారు బాబా" అని చెప్పాను. అందుకు బాబా "అలా అడ్డుకొని ఉంటే ఇది డ్రామా ఎలా అవుతుంది" అని అన్నారు. అప్పుడు నేను బాబాతో - "బాబా ఇప్పుడీ దృశ్యము కృత్రిమంగా అనిపిస్తూ ఉంది, నిజమైన డ్రామాలాగా లేదు" అని అన్నాను. అందుకు బాబా - బచ్చీ, స్నేహమనే మధురమైన తీగ తగుల్కొని ఉన్నందున నీకు చివరివరకు ఇది అద్భుతంగానే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా సంబంధమైతే ఉంది కదా! భలే సాకార రథము పోయింది కానీ బ్రహ్మ రూపంలో అవ్యక్త పాత్ర అభినయిస్తున్నారు. బాబా మళ్లీ - నేను కూడా అప్పుడప్పుడు సాకార వతనములోకి వచ్చేస్తాను అని అన్నారు. అప్పుడు శివబాబా ఎక్కడున్నావు అని అడుగుతారు. అప్పుడు నేను సాకార వతనంలో ఉన్నట్లు - ఇక్కడ ఇంటి పని జరుగుతూ ఉంది బాబా, అక్కడి దాకా పోతానని అంటాను. అప్పుడు నేను బాబాతో - బాబా, అప్పుడప్పుడు మీరు తిరుగుతూ ఉన్నట్లనిపిస్తుంది అని అన్నాను. అందుకు బాబా - నేను అప్పుడప్పుడు తిరుగుతూనే ఉంటాను, కనుక పిల్లలకు ఆ అనుభవము అవుతూనే ఉంటుందని అన్నాడు. అనగా ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉండినది.

తర్వాత బాబా మరొక దృశ్యాన్ని చూపించారు . ఒక చక్రములో చాలా చక్రాలు కనిపించాయి. చక్రమెలా తయారై ఉందంటే అందులోంచి బయటకు రావడానికి నాలుగైదు మార్గాలు కనిపిస్తున్నాయి కాని బయటకు రాలేకపోతారు. కేవలం బ్రహ్మబాబాను చూపించారు - చక్రములో తిరుగుతూ తిరుగుతూ జీరో పాయింటు వద్ద నిలబడిపోయాడు. బయటకు రాలేదు. బాబా దాని అర్థము తెలిపించాడు - ఇది డ్రామా బంధనము. బ్రహ్మ కూడా డ్రామా చక్రము నుండి బయటకురాలేరు. డ్రామా బంధనము నుండి విడిపించుకొని ఎవ్వరూ బయటకురాలేరు. జీరో పాయింటు వరకు చేరుకున్నారు. అయితే మరలా మధురమైన డ్రామా బంధనముంది. ఈ మధురమైన బంధనాన్ని ఆట రూపములో చూపించారు. తర్వాత నాకు కలకండ, బాదాం తినిపించారు. "ఇక పో బచ్చీ, టైంఅయిపోయింది" అని నాకు తెలవు ఇచ్చారు.

8. సంఘటనే రక్షక సాధనము

ఈరోజు వతనములోకి వెళ్లినపుడు అక్కడ ఎవ్వరూ కన్పించలేదు. దూరం నుండి ఏదో శబ్దము, ఏదో ముఖ్యమైన కార్యము జరుగుతున్నట్లు శబ్దము వస్తూ ఉంది. ముందు నేను కొంతసేపు ఆగాను. తర్వాత ముందుకెళ్లి చూస్తే శివబాబా, బ్రహ్మబాబా, మమ్మా, విశ్వకిశోర్ - ఈ నలుగురూ పరస్పరము మాట్లాడుకుంటూ కనిపించారు. వారి ముందు చాలా ప్లాన్లు ఉండినాయి. అందులో కొన్ని గుర్తులు మొదలైనవి కనిపించాయి. మమ్మా పిల్లలందరి స్థితి గతులను గురించి అడిగింది. అప్పుడు నేను - మమ్మా, మీరు బాబాను కూడా పిలిపించుకున్నారు అని అన్నాను. అందుకు మమ్మా - "పిల్లల నుండి సాకార మాతా - పితలను వేరు చేయుట నాకు కూడా ఇష్టము లేదు కానీ డ్రామా" అని చెప్పింది. మరలా నేను బాబాతో - "బాబా మీ ముందున్న ప్లాన్లు మొదలైనవి ఏమిటి? అని అడిగాను. అందుకు బాబా - బచ్చీ, ఎలాగైతే మార్షల్(సైన్యములో) వద్ద ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతూ ఉందో, ఇక ముందు ఏమి జరగాలో, మొత్తం ప్లానంతా ఉంటుందో అలా ఇక్కడ కూడా స్థాపన కార్యము గురించే మాట్లాడుకుంటున్నాము. దానిని గురించి తర్వాత వినిపిస్తాను. ఆ తర్వాత ఒక దృశ్యాన్ని చూపించారు.

మూడు సంఘటనలు(సమూహాలు) ఉన్నాయి. ఒకటేమో ఎర్ర ఎర్రగా ఉండే చిన్న చీమలు పరస్పరము కలిసి ఒక బంతి వలె అవుతూ ఉన్నాయి. ఆ దృశ్యము ప్రారంభములో బ్రహ్మబాబా చూచిన దృశ్యము వలె ఉండినది. రెండవ సంఘటన - మూలవతనములో ఆత్మలు దీపము రూపములో ఉన్నాయి. మూడవ సంఘటన - మన బ్రాహ్మణులది. అందరూ వలయాకారములో కూర్చొని ఉన్నారు. మధ్యలో బాప్ దాదా ఉన్నారు. అది పుష్పము మధ్యలో తొడిమ ఉండి నలువైపులా ఆకులుంటాయి(పూరేకులు ఉంటాయి) కదా అలా ఉంది. దాని రహస్యాన్ని బాబా ఇలా తెలిపారు - బచ్చీ, ప్రత్యక్షత ప్రారంభమైనపుడు కూడా సంఘటనలో ఉండుట చూశారు, చివర్లో కూడా ఆత్మలు సంఘటన రూపములో ఉండాలి. ఇప్పుడు మధ్యలో కూడా సంఘటనే ఉంది. సంఘటన శక్తి ఉంటే ఎవ్వరూ కదిలించలేరు. బాప్ దాదా ఎక్కడెక్కడ నుండో ఏరి సంఘటనను తయారుచేశారు. కనుక పిల్లలు కూడా సంఘటనలో ఉండి నడుస్తూ ఉంటే మాయ దాడి చేయదు. ఎలాగైతే గులాబి పుష్పాలు గాని, వేరే ఏ పుష్పలను గాని యోగ్యస్థానములో ఉంచుతారు. ఒంటరిగా ఆకు మాత్రమే ఉంటే త్వరగా చేతితో నలిపేస్తారు. కనుక పిల్లలు కూడా సంఘటన రూపములో పుష్పగుచ్ఛముగా ఉంటే విజయాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. ఎవ్వరూ దాడి చేయలేరు. ఇలా చెప్తూ బాబా నాతో - పిల్లలందరికి సంఘటనే సురక్షిత సాధనమని చెప్పమని అన్నారు.

10. ఈరోజు నేను వతనానికి వెళ్లే సమయానికి బాప్ దాదాఁశివబాబా, బ్రహ్మాబాబా) ఇరువురూ చాలా బిజీగా ఉన్నారు. ఇరువురి ముందు చాలా పుష్పాలతో పాటు ఆకులు కూడా ఉన్నాయి. పుష్పగుచ్ఛములో పుష్పాలు, ఆకులు కూడా వేస్తారు కదా. రెండుమూడు రకాల పుష్పాలున్నాయి. వాటిని చూస్తూ, ఏరుతూ ఉన్నారు. బాప్ దాదా ఇరువురూ అదే పనిలో బిజీగా ఉన్నారు. నన్ను చూడను కూడా లేదు. నేను సమీపానికి వెళ్లినప్పుడు నన్ను చూచి మందహాసము చేస్తూ - నేను రోజంతా బిజీగా ఉంటాను అని అన్నారు. ఎంత పెద్ద కార్య వ్యవహారము నడుస్తూ ఉందో చూడు బాచ్చీ అన్నారు. మూడు రకాల పూలను, ఆకులను వేరు వేరుగా ఉంచాము. ముందు నాకు చూపిన మొదటి రకము పుష్పాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మధ్య రకములో పుష్పాలు ఎక్కువగా ఉన్నా వాటితో పాటు కొన్ని ఆకులు కూడా తగుల్కొని ఆ ఉన్నాయి. పుష్పాలేమో బాగున్నాయి కానీ వాటికి తగుల్కొని ఉన్న ఆకులు కొంచెము దోషయుక్తముగా ఉన్నాయి. ఇక మూడవ రకములో ఆకులు ఎక్కువగా ఉన్నాయి, పుష్పాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీటిని చూపిస్తూ బాబా ఇలా తెలిపించారు - మొదటి రకము పుష్పాలనగా పూర్తిగా హృదయమును అధిరోహించి ఉన్నవారు. ఇటువంటి అనన్యమైన దిల్ వాలా పిల్లలు చాలా కొద్దిమందే ఉన్నారు. రెండవ నంబరు పిల్లలు చాలా మంచి పిల్లలు కానీ వారిలో కొంత లోపముంది. పుష్పాలుగా అయ్యారు కానీ వారిలో కొంత లోపముంది. ఇక మిగిలిన మూడవ రకమువారు ప్రజలు. అందులో ఎవరైనా పుష్పాలుగా అవుతే వారు వెనుక వస్తారు. మిగిలిన వారంతా ప్రజలే. పైనున్న రెండు రకాలు క్వాలిటీ పిల్లలు. ఇప్పుడు బాప్ దాదా పుష్పగుచ్ఛాన్ని అలంకరించారు. పుష్పగుచ్ఛాన్ని అలంకరించినపుడు(తయారు చేసినపుడు) కేవలం పుష్పాలతోనే పుష్పగుచ్ఛాన్ని చేస్తే అంతగా శోభించదు. అందులో కొన్ని ఆకులు కూడా వేయాలి. మీరంతా పుష్పాలే కానీ మీతో పాటు ఆకులు కూడా ఉండాలి. మీరు రాజులుగా అవుతే ప్రజలు కూడా కావాలి కదా, పుష్పాలుంటే ప్రజలనే ఆకులు కూడా ఉండాలి. అప్పుడు ప్రజలనే ఆకుల మధ్య పుషాలు శోభిస్తాయి. ఇక్కడ కూర్చొని పిల్లలైన మీ పుష్పగుచ్ఛాన్ని తయారుచేస్తాను. ఒక్కొక్క పుష్టము ఎంతమంది ప్రజలను తయారుచేస్తారో చూస్తాను. ఎవరైతే ఎక్కువ మంది ప్రజలను తయారుచేశారో వారి పుష్పగుచ్ఛము చాలా శోభిస్తుంది. తర్వాత బాబా ఒక ప్రశ్న అడిగారు - ఎవరైనా దేవతలపై పుష్పాలను అర్పిస్తే ఆకులు తీసేస్తారు. ఎందుకు? ఆకులు పుష్పాలకు అలంకారమునిస్తాయి, మరి ఆకులనెందుకు తీసేస్తారు? బాబానే ఇలా వినిపించారు - పిల్లలైన మీ ద్వారానే ఈ ఆచారాలు, పద్ధతులన్నీ తయారవుతాయి. మొదట మీరు అర్పణైనపుడు ఒంటరిగా ఉండినారు. అయితే పుష్పాలను కొంత సమయం అలాగే ఉంచాలనుకుంటే ఆకులు జతలో ఉంటే ఉంచగలరు. అలాగే మీరు మొదట అర్పణ అయినపుడు ఒంటరిగా పుష్పాలైన మీరు మాత్రమే అర్పణయ్యారు. తర్వాత మీరు 21 జన్మలు అవినాశిగా నడవాలి. అందువలన మీకు ప్రజలనే ఆకులు కూడా తగిలించబడ్డాయి. మొదట మీరు వచ్చినపుడు ప్రజలు లేరు కానీ ఇప్పుడు పుష్పాలనే మీకు ప్రజలనే ఆకులతోనే శోభ. అందువలన బాప్ దాదా ప్రజలను తయారు చేయమని చెప్తున్నారు.

11. ఈరోజు నేను వతనములోకి వెళ్లినపుడు సూర్యునికి దగ్గరగా వెళ్లే కొలది సూర్యుని వేడి లేక సకాశ్, తేజస్సు ఎలాగైతే అనుభవమవుతుందో అలా ఈరోజు వతనములో ముందుకు వెళ్లే కొలది ఏదైనా భట్టీకి ఎదురుగా పోతున్నట్లు అనుభవమయింది. ఈరోజు బాబా ఎరుపు రంగు లైటులో (ప్రకాశములో) అవ్యక్త రూపురేఖలతో కనిపిస్తూ ఉన్నారు. అంతేకాక సూర్యుని సమానంగా కిరణాలు వెలువడ్తున్నాయి. క్రింద చాలా ఒక పెద్ద సభ జరుగుతూ ఉంది. సాకారములో ఇటువంటి బ్రాహ్మణుల సభ ఎప్పుడూ జరగదు. బ్రాహ్మణులందరి వైపుకు ఆ కిరణాలు ప్రసరిస్తున్నాయి. వతనములోకి వెళ్లినపుడు నా వైపుకు కూడా ఆ కిరణాల లైట్ - మైట్ ప్రసరిస్తూ ఉండడం చూశాను. కొంత సమయం తర్వాత నేను బాబాతో అదే రూపములో కలిసి "బాబా, నేను భోగ్ తీసుకొని వచ్చాను" అని చెప్పాను. బాబా భోగ్ స్వీకరిస్తూ, తినే సమయంలో లైట్ - మైట్ స్థితిలో ఎలా ఉండాలో నేర్పించారు. తర్వాత నేను బాబాతో పిల్లలకు యాద్ ప్యార్ ఇస్తారు కదా అని అడిగాను. అందుకు బాబా "పిల్లలు స్నేహ రూపమునైతే చాలానే చూచారు, కానీ స్నేహముతో పాటు పిల్లలు శక్తిశాలి స్థితిని ఎంతగా తయారుచేయాలనుకుంటున్నారో అది ఇప్పటి వరకు తక్కువగా ఉంది. కనుక ఈరోజు బాబా స్నేహముతో పాటు శక్తిని నింపుతున్నారు. దీని ద్వారానే సేవలో సఫలత లభిస్తుంది" అని చెప్పారు. కేవలం స్నేహమే కాదు, అందుకు తోడుగా శక్తిని కూడా నింపుకోండని బాబా సందేశము కూడా ఇచ్చారు. పిల్లలు ఈ సృష్టికి లైటు - మైటు కిరణాలను ఇవ్వాలని బాబా దృశ్యములో కూడా చూపించారు. ఇన్ని రోజులు బాబా స్నేహ రూపముతో మిలనం చేస్తూ ఉండినారు. కాని ఈరోజు బాబా స్నేహముతో పాటు లైటు - మైటు రూపంగా ఉండినారు. నేను దానిని బాబా నుండి తీసుకొనుటలో తత్పరమైపోయాను. తర్వాత మళ్లీ సాకార వతనములోకి వచ్చేశాను.

12. ఈరోజు నేను వతనానికి వెళ్లేసరికి అక్కడ ఒక సభ జరుగుతూ ఉన్నట్లుంది - క్లాసు జరుగుతూ ఉంది. నేను మెలమెల్లగా ముందుకు పోసాగాను. బాప్ దాదా నన్ను కనులతో ఆహ్వానించారు. తర్వాత రా అమ్మాయీ(రా బిడ్డా), వీళ్లందరితో పరిచయం చేసుకో, అందరికీ భోగ్ తినిపించు అని అన్నారు. ఏ ఆత్మలైతే అడ్వాన్స్ గా శరీరాలను వదిలి వెళ్లారో వారందరిని వతనంలో ఎమర్జ్ చేసి బాబా క్లాసు చేస్తూ ఉండినారు. నేను అందరికీ మధువనంలో తయారు చేసిన భోగ్ బ్రహ్మ భోజనాన్ని స్వీకరింపజేశాను. ఆ సంఘటనలో ముందు వెళ్లిపోయిన ఆత్మలందరూ ఉన్నారు. తర్వాత నేను ఒక దృశ్యము చూశాను - చాలా ఇళ్లు తయారవుతూ ఉన్నాయి. ఇంటికి పైకప్పు వేయునప్పుడు దానికి క్రింది నుండి చాలా ఆధారాలిస్తారు. సిమెంటు పక్కా అయిపోతూనే ఆ ఆధారము, కర్రలు మొదలైనవన్నీ తీసేస్తారు. ఈ విధంగా ఇళ్లు, ఇంటి పై కప్పులు వేసే ఈ కార్యము చాలా వేగంగా జరుగుతూ ఉంది. నేనా ఇళ్లను చూస్తూ ఉండినాను. బాబా మాయమైపోయారు. బాబా ఈ దృశ్యము ద్వారా - ఇల్లు తయారగునప్పుడు ముందు ఆధారమివ్వబడుతుంది, తర్వాత ఆధారాన్ని తీసివేయడం జరుగుతుంది అని అర్థం చేయించారు. ఆ దృశ్యాన్ని చూస్తూ ఇక్కడకు వచ్చేశాను.

13. స్నేహంతో పాటు జ్ఞాన పునాదిని కూడా దృఢంగా చేసుకోండి - ఈ రోజు వతనంలోకి వెళ్లినప్పుడు బాబా కనిపించలేదు. కొంత సమయమైన తర్వాత బాబాను చూసి మీరెక్కడకు వెళ్లారని అడిగాను. అందుకు బాబా, ఈరోజు గురువారం కదా! కావున పిల్లలందరి వద్దకు తిరిగేందుకు వెళ్లాము. ఈ విధంగా సాకార రూపంలో ఇంత తక్కువ సమయంలో అన్ని స్థానాలకు చేరుకోలేకపోయేవారము. ఇప్పుడైతే అవ్యక్త వతనంలో అవ్యక్త విమానం ద్వారా రాకెట్ కంటే త్వరగా చేరుకోగలరు. "బాబా, అన్ని చోట్లకు తిరిగారు కదా! అక్కడ మీరేం చూశారు?" అని అడిగాను. అందుకు బాబా చెప్పారు - మెజారిటీ పిల్లలు ఇప్పటివరకు స్నేహంతో బాగా నడుస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు అని మనసులో సంకల్పాలు ఉన్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. కానీ సంఘటనకు ఆధారం ఇప్పటి వరకు సరిగ్గా ఉంది. స్నేహం ఆధారంపై ఇప్పటి వరకు నిలిచి ఉన్న పిల్లలు ఇప్పుడు స్నేహముతో పాటు జ్ఞాన పునాది ఏ కొద్దిగా ఢీలా అయినా పిల్లలపై వాయుమండల ప్రభావం చాలా సహజంగా పడవచ్చు. కావున ప్రతి పుత్రుడు స్వయాన్ని చెక్ చేసుకోవాలని బాబా చెప్పారు. అయినా వ్యక్తి దేహంలో ఉన్నప్పుడైతే స్నేహంలో మొదటి ఫోర్స్ బాగా ఉంటుంది. కాని ఈ స్నేహంపై మరలా రోజులు గడుస్తున్న కొలది వాయుమండల ప్రభావం త్వరగా పడవచ్చు. స్నేహంలో శివబాబా కళ్యాణకారి అని లేక బాబా చేసేదంతా సరియైనదని అంటారు కదా! స్నేహానికి వశమై సంకల్పాలను ఆపేశారు. స్నేహంలో మెజారిటి వారి వారి రిజల్టు బాగుంది. వాయుమండల ప్రభావం మన పైన ఉండకూడదు. మన ప్రభావం వాయుమండలంపై ఉన్నప్పుడే నియమానుసారం నడవగలరు. బాబా, మేము జ్ఞాన విషయాలే మాట్లాడతాము అని నేను అన్నాను. అప్పుడు బాబా అన్నారు - అమ్మాయీ, విజ్ఞాన పునాది ద్వారా స్వయాన్ని సంతుష్టంగా ఉంచుకునే పిల్లలు కొద్దిమందే ఉన్నారు. కావున ఈరోజు బాబా ఈ రిజల్టు తెలిపి "మనమే వాయుమండలాన్ని పరివర్తన చేయాలి కాని వాయుమండలము మనలను పరివర్తన చేయకూడదు" అని అందరికీ వినిపించమని చెప్పారు. భోగ్ స్వీకరించిన తర్వాత బాబా ఒక దృశ్యము చూపించారు.

ఒక పెద్ద హాలు ఉంది. ఆ హాలులో నలువైపుల నుండి చాలా దుర్గంధం వస్తూ ఉంది. ఆ గదిలో రెండు - మూడు చాలా మంచి సుగంధభరితమైన అగరుబత్తులు వెలుగుతున్నాయి. నెమ్మది నెమ్మదిగా అగరుబత్తుల సుగంధం ఆ దుర్గంధాన్ని అణిచేసింది. బాబా అన్నారు - చూడు అమ్మాయీ! నలువైపులా దుర్గంధ వాయుమండలం ఉంది కానీ ఇంత చిన్న అగరుబత్తి వాయుమండలాన్ని మార్చేసింది. కావున ఎప్పుడైనా పిల్లలైన మీ పైన కూడా వాయుమండల ప్రభావం పడినప్పుడు ఈ అగరుబత్తి ఉదాహరణను మీ ముందు ఉంచుకోండి. మేము సర్వశక్తివంతులైన తండ్రి పిల్లలమని గుర్తుంచుకోండి. ఒకవేళ వాయుమండల ప్రభావం మన పైన పడినట్లయితే మనకన్నా ఆగరుబత్తియే మంచిది కదా. పిల్లలైన మీరు ఎప్పుడైతే శక్తిశాలిగా, సుగంధభరితంగా అవుతారో అప్పుడీ వాయుమండలము అణిచి వేయబడుతుంది. ఇప్పుడు ప్రతీ పుత్రునికి చదువు లభిస్తున్నది. శిక్షణలు కూడా చాలా మధుర రూపంతో అందరూ వింటారు. కాని ఎలాగైతే మధురమైన రూపంతో వింటారో అదే విధంగా మధురమైన రూపంతో ధారణ కూడా చేయాలి. మధురత చాలా త్వరగా హత్తుకుపోతుంది. అలా మధురంగా తయారైనవారు బాబాతో హత్తుకుపోతారు. స్మృతి మరియు మధురత లేకపోతే బాబా నుండి వేరుగా ఉంటారు. ఉప్పగా ఉన్న వస్తువు ఎలాగైతే పరస్పరము ఎప్పుడూ కలవదు కనుక ఎవరైతే అలా ఉంటారో వారి స్థితి యోగయుక్తంగా ఉండదు. ఇప్పుడు పిల్లలు ఎలా విన్నారో అలా ధారణ చేస్తే చాలా బలం లభిస్తుంది.