సమర్పణ యొక్క ఉన్నతమైన స్థితి - శ్వాస శ్వాస లో
స్మృతి
అవ్యక్త స్థితిలో స్థితమై అవ్యక్తాన్ని వ్యక్తంలో
చూడాలి. ఈరోజు బాప్ దాదా ఒక ప్రశ్న అడుగుతున్నారు సర్వ సమర్పణగా అయ్యారా? (సర్వ
సమర్పణగానే ఉన్నాము) ఇది అందరి యొక్క ఆలోచనా లేక కొంతమందిది ఇంకేదైనా ఆలోచన
ఉందా? సర్వ సమర్పణ అని దేనిని అంటారు? సర్వములో ఈ దేహము యొక్క భ్రాంతి కూడా
వస్తుంది. దేహాన్ని తీసుకున్నట్లయితే ఇవ్వాల్సి కూడా పడుతుంది. కానీ దేహము
యొక్క భ్రాంతిని తెంచుకుని సమర్పణగా అవ్వాలి. మీరందరు ఏమనుకుంటున్నారు? దేహము
యొక్క అభిమానం నుండి కూడా సంపూర్ణ సమర్పణ అయ్యారా? మరణించారా లేక
మరణిస్తున్నారా? దేహము యొక్క సంబంధాలు మరియు మనసు యొక్క సంకల్పాల నుండి కూడా
మీరు దేహీలు అయ్యారు. ఈ దేహము యొక్క అభిమానము పూర్తిగా తెగిపోయినట్లయితే
అప్పుడే సర్వ సమర్పణ జీవితము అని అంటారు. ఎవరైతే సర్వ త్యాగి, సర్వ సమర్పణ
జీవితం కలిగినవారు ఉంటారో వారి యొక్క సంపూర్ణ అవస్థ గాయనం చేయబడుతుంది.
ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతారో అప్పుడే తోడుగా వెళ్తారు. బాబా వెళ్ళినట్లయితే
మేము కూడా కలిసి వెళ్తాము అని మీరు మొదట్లో సంకల్పం చేసారు కదా!మరి అలా ఎందుకు
చేయలేదు? ఇది కూడా ఒక స్నేహం అయ్యింది. అన్ని సాంగత్యాలని వదిలి ఒక్కరి
సాంగత్యాన్ని జోడించే శాంతి ఏదైతే ఉందో అది అంతిమ సమయానికి గుర్తు. ఎప్పుడైతే
చెప్పారో మరి ఎందుకు శరీరం వదలలేదు? వదలొచ్చు కదా? ఇప్పుడు వదలలేరు.
ఎప్పటివరకైతే తమ శరీరంతో లెక్కాచారం ఉంటుందో అంతవరకు శరీరాన్ని వదలలేరు. యోగంతో
లేదా భోగంతో తప్పకుండా లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవలసి ఉంటుంది. ఏదైనా
కఠినమైన లెక్కాచారం ఉన్నట్లయితే ఈ శరీరం ఉంటుంది, వదిలిపోదు. సమర్పణ అయితే
అయ్యారు కానీ ఇప్పుడు సమర్పణ స్థితి ఉన్నతమైంది. ఎవరైతే శ్వాస శ్వాసలో స్మృతిలో
ఉంటారో దానికే సమర్పణ అని చెప్తారు. ఒక్క శ్వాస కూడా విస్మృతి కాకూడదు. ప్రతి
శ్వాసలో స్మృతి ఉండాలి. మరి ఇలా ఎవరైతే ఉంటారో వారి లక్షణాలు ఎలా ఉంటాయి? వారి
ముఖము పైన ఏమి కనిపిస్తుంది? వారి ముఖము పైన ఏమి ఉంటుంది? తెలుసా?(హర్షిత ముఖత)
హర్షిత ముఖత తప్ప ఇంకేదైనా ఉంటుందా? ఎవరు ఎంత సహనశీలంగా ఉంటారో వారిలో అంత
శక్తి పెరుగుతుంది. ఎవరు శ్వాస శ్వాసలో స్మృతిలో ఉంటారో వారిలో సహనశీలతా గుణము
తప్పకుండా ఉంటుంది. మరియు సహనశీలత కారణంగా ఒకటి హర్షితంగా ఉంటారు మరియు శక్తి
కనిపిస్తుంది. వారి యొక్క ముఖము పైన నిర్బలత్వము ఉండదు. ఏమి చేయాలి? ఎలా
చేయాలి? ఈ శబ్దాలు ఏవైతే ముఖము నుండి వెలువడుతాయో, ఇవి నిర్బలతకి గుర్తు. ఇవైతే
రాకూడదు. ఎప్పుడైతే మనసులో వచ్చేస్తుందో అప్పుడు నోటి పైన కూడా వచ్చేస్తాయి.
కానీ మనసులో కూడా రాకూడదు. మన్మనాభవ, మద్యాజీభవ. మన్మనాభవ యొక్క అర్థం చాలా
గుహ్యంగా ఉంది. ఎలాగైతే డ్రామా సెకండ్ తర్వాత సెకండ్ ఏ రీతితో ఎలా నడుస్తుందో
దానితోపాటుగా మనసు యొక్క స్థితి డ్రామా పట్టాల పైన నేరుగా నడుస్తూ ఉండాలి.
కొంచెం కూడా కదలకూడదు. సంకల్పంలో అయినా, మాటలో అయినా సరే. ఇలాంటి అవస్థ ఉండాలి.
డ్రామా యొక్క పట్టాల పైన నడుస్తూ ఉండాలి. కానీ అప్పుడప్పుడు ఆగిపోతారు. నోటితో
అప్పుడప్పుడు కదులుతారు. మనసు యొక్క స్థితి కదులుతుంది. తర్వాత మీరు
పట్టుకుంటారు. ఇది కూడా ఒకవిధంగా ఒక మచ్చ అయిపోతుంది. అయినప్పటికీ ఇప్పటివరకు
కూడా ఒక విషయం వాణి వరకు వస్తుంది కానీ ప్రాక్టికల్ గా రాలేదు. ఏ విషయము వాణి
వరకు వచ్చింది? ప్రాక్టికల్ గా రాలేదు. ఏదైతే వినిపించారో ఇదే డ్రామా యొక్క
డాలు. కానీ బాబా ఇంకో విషయం కూడా తెలిపిస్తున్నారు. ఏదైతే ఇప్పుడు సమయం దగ్గరగా
ఉందో అలా సమయం అనుసారంగా ఏదైతే అంతర్ముఖ అవస్థ వాణికి అతీతంగా, అంతర్ముఖంగా
అయ్యి, కర్మణలో అవ్యక్త స్థితిలో స్థితమై ధారణ చేసేటువంటి అవస్థ కనిపించాలి,
అది ఇప్పుడు తక్కువగా ఉంది. వ్యాపార వ్యవహారాలు కూడా నడుస్తూ ఉండాలి మరియు ఈ
స్థితి కూడా ఉండాలి. ఇవి రెండు జతజతలో సమానంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో లోటు
ఉంది. ఇప్పుడు సాకారంలో అయితే అవ్యక్త స్థితిలో స్థితులై ఉన్నారు. కానీ మీరు
పిల్లలు అవ్యక్త స్థితిలో స్థితులై ఉన్నట్లయితే అవ్యక్తంగా కలుసుకోవడం యొక్క
అలౌకిక అనుభూతిని పొందగలుగుతారు. మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఏదైతే మీలో
ఉండాలో అది వర్తమాన సమయం కొరకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు. అది ఏమిటి? ఎవరికైనా
వస్తుందా? అమృతవేళ లేవాలి - ఇది సాకార రూపంలో కూడా ముఖ్యంగా చెప్పేవారు.
అమృతవేళ యొక్క వాయుమండలం ఇలా ఉంటుంది. సాకారంలో అమృతవేళ పిల్లలతో దూరం
ఉన్నప్పటికీ కలిసేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే బాబా అమృతవేళ చక్రము
చుట్టడానికి వచ్చినపుడు ఆ వాయుమండలం కనిపించటం లేదు. ఎందుకు అలిసిపోయారు? ఈ
అమృతవేళ యొక్క అలౌకిక అనుభవంలో అలసట అంతా దూరం అయిపోతుంది. కానీ ఈ లోటు చూడటంలో
కనిపిస్తుంది. త్వరత్వరగా ఈ అవ్యక్త స్థితిని ప్రతి బిడ్డ అనుభవం చేయాలి - ఇదే
బాప్ దాదా యొక్క శుభ కోరిక అయ్యింది. ఎలాగైతే మీరు ఎప్పుడైతే సాకారంలో సాకార
రితితో కలిసేవారో అప్పుడు మీ యొక్క ఆకారి స్థితి తయారయ్యేది. ఇప్పుడు ఎంతెంత
ఆకారి అవ్యక్త స్థితిలో స్థితులై ఉంటారో అంతగా అలౌకిక అనుభవం చేస్తారు.