15.02.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


శివరాత్రి సందర్భముగా అవ్యక్త బాప్ దాదా యొక్క మహావాక్యాలు
(సంతరీ దాదీ తనువు ద్వారా)

ఈరోజు ఎవరికి స్వాగతం చెప్పే రోజు? (తండ్రి మరియు పిల్లలకి) కానీ కొంతమంది పిల్లలు తమని తాము మర్చిపోయారు, బాబాని కూడా మరిపింపచేసారు. ఈరోజు మొదట్లో వలె స్వాగత రోజు, ఎన్ని ఉత్తరాలు వచ్చేవి, మర్చిపోయారు కదా! ఇది నిశ్చయం ఇది చదువు. ఎప్పుడైతే నిశ్చయం స్థిరంగా ఉంటుందో ఆ కార్యం కూడా ఎలా నడిచేదో అలా నడుస్తూ ఉంటుంది. నిశ్చయం లేకపోతే కార్యంలో కూడా కొద్దిగా ... పిల్లలు తమ కర్తవ్యం తెలుసుకుంటున్నారా, నేను ఎవరి పిల్లవాడిని? బాబా సదా ఉండేవారు మరియు పిల్లలు కూడా సదా ఉంటారు. దేహాభిమానం స్వధర్మాన్ని మరిపింపచేస్తుంది. మర్చిపోవటం ద్వారా కార్యం ఎలా నడుస్తుంది? ముందుకి ఎలా వెళ్తారు? ఎప్పుడైతే బాబా తన పరిచయం ఇచ్చారో అప్పుడు పిల్లలకి కూడా తమ పరిచయం లభించింది. ఎంత సమయం నుండి ఈ లక్ష్యాన్ని గట్టిగా చేసుకోవటానికి శ్రమ చేసారు. ఆ శ్రమకి ఫలం ఎంతవరకు వచ్చింది? కేవలం జ్ఞాపకం తెప్పించడానికి చెప్తున్నాను. మురళీ చెప్పడానికి రాలేదు.

కేవలం పిల్లలను కలుసుకోవడానికి వచ్చాను. ఈ బిడ్డ చెప్తుంది - పిల్లలు మిమ్మల్ని చాలా జ్ఞాపకం చేస్తున్నారు, మీరు వస్తే సంతోషపడతారని. కానీ నిశ్చయం ఉన్నవారు సంతోషంగానే ఉంటారు. అయినా కానీ పిల్లలను కలుసుకునేటందుకు కొద్ది సమయం కొరకు మిమ్మల్ని మీరు సౌభాగ్యశాలిగా భావించండి. ఎవరికైతే తండ్రి, టీచర్, సద్గురువుతో పూర్తి సంలగ్నత, సంబంధం ఉంటుందో వారినే సదా సౌభాగ్యశాలి అంటారు. కన్యకి సంబంధం నిశ్చయం అయిన తర్వాత ఏమి జరుగుతుంది? భర్తతో పూర్తి సంలగ్నత పెట్టుకుంటుంది. అప్పుడే ఆమెను సదా సౌభాగ్యవతి అంటారు. కానీ ఎంతవరకు సౌభాగ్యవతి? లోపల ఏమి నిండి ఉంటుంది! కన్య అంటే 100 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తమంగా లెక్కించబడుతుంది. సంబంధం కుదిరిన తర్వాత అశుద్ధం అయిన కారణంగా ఆంతరంగికంగా దౌర్భాగ్యమే కానీ ఇది ఎవరికి కూడా తెలియదు. సదా సౌభాగ్యవతి ఎవరు అనేది బాబాయే చెప్తారు. సదా పూర్తిగా పరమాత్మతో సంలగ్నత ఉన్నవారే సౌభాగ్యవతి. ఇప్పుడు చదువుకునే సమయం. బాబా తన కర్తవ్యం తాను చేస్తున్నారు, సలహాలు ఇస్తూ చదివిస్తున్నారు. ఎప్పటి వరకు చదివించాలో అప్పటివరకు చదివిస్తూనే ఉంటారు. వినాశనం ఎదురుగా ఉంది. దాని సంబంధం - బాబాతో ఉంది. బాబా మిమ్మల్ని వీడి వెళ్ళిపోయారని భావించకండి. వీడిపోలేదు మరియు వీడ్కోలు కూడా ఇవ్వలేదు. ఎప్పటివరకు వినాశనం అవ్వదో అప్పటివరకు బాబా తోడుగా ఉంటారు. కొన్ని కార్యాల కోసం బాబా వతనం వెళ్ళారు. సమయానుసారం అవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనిలో వీడిపోయింది లేదు. వీడ్కోలు, వీడ్కోలు వలె అనిపించదు. మీరు వీడ్కోలు ఇచ్చేసారా? ఒకవేళ వీడ్కోలు ఇచ్చేసి ఉంటే విడిపోతారు. వీడ్కోలు ఇవ్వకపోతే విడిపోరు. ఇది డ్రామాలో పాత్ర నడుస్తూ ఉంటుంది. బాబా యొక్క ఆట నడుస్తూ ఉన్నది. ఆటలో ఆట నడుస్తూ ఉంది. మున్ముందు ఇంకా చాలా ఆటలు చూడనున్నారు. ఇంత ధైర్యం ఉందా? ధైర్యం పెట్టుకుంటే చాలా చూడగలరు. మున్ముందు చాలా చూడాలి. కనుక అడుగడుగు సంభాళించుకుని నడవాలి..ఒకవేళ సంభాళించుకుని నడచుకోకపోతే అక్కడక్కడ ఎత్తుపల్లాలు కూడా వస్తాయి. ప్రమాదం కూడా జరుగుతుంది. పిల్లలను కలుసుకునేటందుకు కొద్ది సమయం కొరకు వచ్చాను. చాలా కార్యాలు చేయాలి. వతనం నుండి చాలా చేయవలసి ఉన్నాయి. పిల్లల మనస్సు యొక్క ఆశలను పూర్తి చేయాలి మరియు భక్తుల ఆశ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. సర్వ కార్యాలు సంగమయుగంలోనే జరుగుతాయి. బాబా యొక్క పరిచయం లభించింది. ఖజానా, లాటరీ లభించాయి. ఇప్పుడు పిల్లల సేవ పూర్తి అయ్యింది. వతనం నుండి ఇప్పుడు సర్వులకీ చేయాలి. స్వంత పిల్లలు ఉన్నారు, సవతి పిల్లలు ఉన్నారు. సేవ అయితే అందరికీ చేయాలి. ఉదయంకూడా వచ్చి దృష్టి ద్వారా పరిచయం ఇచ్చాను. దృష్టి ద్వారా శక్తి ఇచ్చాను. 2. అందరికీ సుఖం ఇవ్వటమే బాబా కర్తవ్యం. ఇప్పుడైతే అందరు మ్యూజియం సర్వీస్ చేయాలి. అందరికీ బాబా పరిచయం ఇవ్వాలి. బాబా సర్వీస్ కొరకు ఏ చిత్రాలను తయారు చేయించారో వాటి ద్వారా సేవ చేయాలి. వ్రేలు ఇవ్వటం ద్వారా పర్వతాన్ని ఎత్తగలరు కదా! గోపగోపికలు వ్రేళ్ళతో పర్వతాన్ని ఎత్తారు అనే మహిమ ఉంది. కనుక వ్రేలు ఇవ్వకపోతే పర్వతం లేవదు. సృష్టిలోని ఆత్మలని ఉద్దరణ చేసి పర్వతాన్ని ఎత్తి వెంట తీసుకు వెళ్ళాలి. సమూహం ఉంటుంది కదా! అంతిమంలో సమూహంగా అయి అందరితో పాటు ఉండాలి. ఆదిలో సాక్షాత్కారంలో ఎరుపు సమూహం చూసారు, అప్పుడు దాని అర్థం తెలియలేదు. అది ఆత్మల సమూహము, వారిని వెంట తీసుకువెళ్ళే కార్యక్రమం డ్రామాలో ఉంది. అందరికీ సేవ చేయాలి. మంచిది.

ఉదయమే లేచి బాబా స్మృతిలో ఉండండి. ఎందుకంటే ఆ సమయంలో బాబా అందరినీ స్మృతి చేస్తారు. ఆ సమయంలో కొంతమంది పిల్లలు కనిపించటం లేదు. వెతకవలసి వస్తుంది. ఒంటరిగా కూర్చుని స్మృతి చేస్తున్నారు కానీ సంఘటనలో కూడా తప్పకుండా నడవాలి. ఎంత స్మృతిలో ఉంటారో అంత బాబాకి సమీపంగా ఉంటారు. బాబాని మర్చిపోతే అయోమయం అయిపోతారు. బాబాని సదా వెంట ఉంచుకుంటే మర్చిపోలేరు.