18.06.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మరజీవ జీవితం యొక్క గుర్తులు (పార్టీలతో)

పాఠశాలకి వెళ్తున్నారు. పాఠశాల యొక్క మొదటి పాఠం ఏమిటి? మిమ్మల్ని మీరు మరజీవగా చేసుకోవటం. మరజీవ అంటే మీ దేహంతో, మిత్ర సంబంధీకులతో, పాత ప్రపంచంతో మరజీవ. ఈ మొదటి పాఠం పక్కా చేసుకున్నారా? (సంస్కారాలతో మరజీవ అవ్వలేదు) ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే వెనుకటి జన్మ సంస్కారాలు కూడా సమాప్తి అయిపోతాయి. అలాగే ఇక్కడ కూడా పాత సంస్కారాలు ఎందుకు జ్ఞాపకం రావాలి? రెండవ జన్మ అయితే వెనుకటి విషయాలు కూడా సమాప్తి అయిపోవాలి. మరజీవ అవ్వటం అనేది మొదటి పాఠం. దీనిని పక్కా చేసుకోవాలి. పాత సంస్కారాలు మనవి కావు, ఎవరివో అని అనిపించాలి. మొదట శూద్రులుగా ఉండేవారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. కనుక పాత శూద్ర సంస్కారాలు ఉండకూడదు. పాత సంస్కారాలు మీవిగా ఎందుకు చేసుకుంటున్నారు? ఇతరుల వస్తువుని తమదిగా చేసుకునే వారిని ఏమంటారు? దొంగ. కనుక ఇక్కడ కూడా ఎందుకు దొంగతనం చేస్తున్నారు? ఇవి శూద్ర సంస్కారాలు, బ్రాహ్మణ సంస్కారాలు కావు. శూద్ర వస్తువులని బ్రాహ్మణులైన మీరు ఎందుకు స్వీకరిస్తున్నారు? అంటరానివారి బట్టలు తాకినా స్నానం చేసేస్తారు. శూద్ర సంస్కారాలు బ్రాహ్మణులకి తగిలితే ఏమి చేయాలి? దీని కొరకు పురుషార్ధం చేయాలి. ఎలా అయితే మురికి వస్తువులని తాకరో అలాగే పాత సంస్కారాల నుండి రక్షించుకోవాలి. తాకకూడదు. ఇంత ధ్యాస మీరు పెట్టుకుంటే ఇతరులకి కూడా ధ్యాస ఇప్పించగలరు. సేవలో సఫలతకి ముఖ్య గుణం ఏమిటి? నమ్రత (వినయం). ఎంత నమ్రతయో అంత సఫలత వస్తుంది. నిమిత్తంగా భావించడం ద్వారా నమ్రత వస్తుంది. నిమిత్తంగా భావించి సేవ చేయాలి. నమ్రత గుణం ద్వారా అందరూ మీ ముందు సమస్కారం చేస్తారు. ఎవరైతే స్వయం వంగి ఉంటారో వారి ముందు అందరు వంగుతారు. నిమిత్తంగా భావించి కార్యం చేయాలి. ఎలా అయితే బాబా నిమిత్త మాత్రంగా శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారో అలాగే నిమిత్త మాత్రంగా శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాను అని భావించండి.

1. శరీరానికి నిమిత్తంగా భావించాలి మరియు సేవలో నిమిత్తంగా భావించాలి. అప్పుడు నమ్రత వస్తుంది. అప్పుడు చూడండి, సఫలత మీ ముందు నడుస్తుంది. ఎలా అయితే బాప్ దాదా కొద్ది సమయం దేహంలోకి వస్తున్నారో అలాగే దేహాన్ని నిమిత్త ఆధారంగా భావించండి. బాప్ దాదాకి దేహంపై తగుల్పాటు ఉంటుందా? ఆధారం అని భావిస్తే ఆధీనం అవ్వరు. ఇప్పుడు దేహానికి ఆధీనం అవుతున్నారు. కానీ అప్పుడు దేహాన్ని ఆధీనం చేసుకుంటారు.

2. దృష్టి ద్వారా సృష్టి తయారవుతుంది అని మహిమ ఉంది. ఏ దృష్టి ద్వారా తయారవుతుంది మరియు ఎప్పుడు తయారవుతుంది? దృష్టి మరియు సృష్టికే ఎందుకు మహిమ ఉంది? నోటి యొక్క మహిమ ఎందుకు జరగటం లేదు? సంగమయుగంలో మొట్టమొదట ఏమి మార్చుకుంటున్నారు? మొదటి పాఠం ఏమి చెప్తున్నారు? సోదరుల దృష్టితో చూడండి. సోదరుల దృష్టి అంటే మొదట దృష్టిని మార్చుకుంటే అన్ని విషయాలు మారుతాయి. అందువలనే దృష్టి ద్వారా సృష్టి తయారవుతుంది అనే మహిమ ఉంది. ఆత్మగా భావించినప్పుడే ఈ సృష్టి పాతదిగా కనిపిస్తుంది. దృష్టిని మార్చుకోవటమే ముఖ్య పురుషార్ధం. ఎప్పుడైతే ఈ దృష్టి మారుతుందో అప్పుడు స్థితి మరియు పరిస్థితి కూడా మారుతాయి. దృష్టి మారటం ద్వారా గుణం మరియు కర్మ స్వతహాగానే మారుతాయి. ఈ ఆత్మిక దృష్టి స్వతహాగా ఉండాలి.

3. ఎవరైతే సంగమయుగంలో స్వయానికి రాజు అవుతారో వారు ప్రజలకి కూడా రాజా అవుతారు. ఎవరైతే ఇక్కడ రాజు అవ్వరో వారు అక్కడ కూడా రాజు అవ్వరు. సంగమయుగంలో అన్ని సంస్కారాల బీజం పడుతుంది. ఇక్కడ బీజం పడకుండా భవిష్య వృక్షం ఎలా వస్తుంది? ఇక్కడ బీజం వేయకపోతే పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ రాజా అవ్వటం ద్వారా ఏమౌతుంది? మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తారు. అధికారిగా అవ్వడానికి ఉదారచిత్ అనే విశేషగుణం కావాలి. ఎంత ఉదారచిత్ అవుతారో అంత అధికారి అవుతారు.

4. బ్రాహ్మణుల కర్తవ్యం - చదువుకోవటం మరియు చదివించటం. దీనిలో బిజీగా ఉంటేనే ఇతర విషయాలు బుద్ధిలోకి రావు. కనుక చదువుకోవటం మరియు చదివించటంలో బిజీగా ఉండండి. ఈ రోజులలో బాప్ దాదా మనస్సు యొక్క వృత్తి మరియు అవ్యక్త దృష్టి ద్వారా కూడా సర్వీస్ చేయవచ్చు అని చెప్పారు. మీ వృత్తి, దృష్టి ద్వారా సేవ చేయటంలో ఏ బంధన ఉండదు. ఏ విషయంలో స్వతంత్రులో ఆ సేవ చేయాలి.