19.07.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


జీరో మరియు హీరో అవ్వండి

ఈరోజు ఎందువలన పిలిచాను? (బలం నింపడానికి). బలం నింపడానికి పిలిచాను అంటున్నారు అంటే ఏ విషయంలో నిర్భలత ఉంది అని భావిస్తున్నారు? విశేషంగా ఏ విషయంలో బలం నింపుకోవాలి? సర్వీస్లో కూడా బలం దేని ద్వారా నిండుతుంది? మీలో ఎంత బలం నిండింది అనేది చూసుకోవాలి. మీ అందరి పేరే శివశక్తి. శక్తులలో శక్తి ఉండే ఉంటుంది కదా! లేక శక్తి స్వరూపంగా ఇప్పుడు అవుతున్నారా? ఏ రత్నం సృష్టిలో అలంకరించడానికి తయారయ్యింది అని బాప్ దాదా చూడడానికి వచ్చారు. నగ తయారైపోయింది కానీ తయారైపోయిన తర్వాత ఏమి చేయాలి? పాలిష్ (మెరుగు). ఇప్పుడు కేవలం పాలిష్ అవ్వాలి. ముఖ్యంగా ఏ విషయంలో మెరుగుపడాలంటే - అందరు ఎక్కువలో ఎక్కువ అవ్యక్తస్థితిలో ఉండడానికి విశేష సమయం ఇవ్వాలి. అవ్యక్త స్థితి యొక్క పాలిష్ మిగిలి ఉంది. పరస్పరం మాట్లాడే సమయంలో ఆత్మ రూపంలో చూడండి. శరీరంలో ఉంటూ కూడా ఆత్మని చూడండి. ఇది మొదటి పాఠం దీని అవసరమే ఉంది. ఏవైతే ధారణలు విన్నారో వాటిని జీవితంలోకి తీసుకురావడానికి ఈ మొదటి పాఠమే పక్కా చేసుకోవాలి. ఈ ఆత్మిక దృష్టి యొక్క స్థితి ప్రత్యక్షంలో తక్కువగా ఉంటుంది. సర్వీస్ యొక్క సఫలత ఎక్కువ రావాలి అంటే కూడా ముఖ్య సాధనం ఇదే - అత్మిక స్థితిలో ఉంటూ సేవ చేయాలి. మొదటి పాఠమే పాలిష్, దీని అవసరమే ఉంది. రోజంతటిలో ఈ ఆత్మిక దృష్టి స్మృతి ఎంత ఉంటుంది అని ఎప్పుడైనా నోట్ చేసుకున్నారా! ఈ స్థితి యొక్క పరిశీలన మీ సర్వీస్ ఫలితం ద్వారా కూడా చూసుకోవచ్చు. ఈ స్థితి దీపంతో సమానం. దీపం దగ్గరికి దీపపుపురుగు స్వతహాగానే వెళ్తుంది. మీరందరూ టీచర్సే, టీచర్స్ నుండి ఎలా అవ్వడానికి భట్టీకి వచ్చారు? మీరు చాలా ఆలోచిస్తున్నారు. కానీ చాలా సహజం. తన సమానంగా చేయడానికి పిలిచాను. తన సమానంగా అంటే జీరోగా చేయడానికి పిలిచాను. జీరో అంటే బిందువు లేక బీజం కూడా వస్తుంది. జరిగిపోయిన విషయాలకి జీరో (బిందువు) పెట్టాలి. విశేషంగా జీరో స్మృతి చేయడానికి పిలిపించాను. చాలా పెద్ద టీచర్ రూపంగా అయితే అయ్యారు కానీ చాలా చిన్నగా చేయడానికి వచ్చాను. అందరికంటే చిన్న రూపం బాబాది మరియు మీ అందరిది కూడా. కనుక జీరోని స్మృతి ఉంచుకుంటే హీరో అవుతారు. హీరో పాత్రధారిగా కూడా అవుతారు మరియు బాప్ దాదాకి ప్రియంగా కూడా అవుతారు. వజ్రాన్ని కూడా హీరా (హిందీ) అంటారు. మరియు ముఖ్య పాత్రధారిని హీరో అంటారు. ఇప్పుడు ఎందువలన పిలిచానో అర్ధమయ్యిందా? కేవలం రెండు పదాలను స్మృతి చేయించడానికి పిలిచాను జీరో మరియు హీరో. ఈ రెండు విషయాలను స్మృతి ఉంచుకుంటే బాబా సమానంగా సర్వ గుణ సంపన్నంగా అయిపోతారు. విస్తారాన్ని మలుచుకుంటారు కదా! 15 రోజులు చాలా చదువుకున్నారు, చాలా కాపీలు నింపుకున్నారు. బాప్ దాదా మీకు విస్తారాన్ని సారంలో వినిపిస్తున్నారు. మిగిలినవి మర్చిపోయినా కానీ ఇది మర్చిపోరు కదా! ఇది స్మృతి ఉంచుకుని చూడండి - సర్వీస్లో ఎంత త్వరగా పరివర్తన వస్తుందో! మీ అందరి కోరిక ఇదే - మేము కూడా మారాలి మరియు సమయం కూడా మారాలి మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళాలనే కోరిక ఉంటే ఈ రెండు విషయాలు స్మృతిలో ఉంచుకోండి. లోపాలకి బదులు అద్భుతం చేసి చూపించండి. లోపాలు సమాప్తి అయిపోతాయి. ఎక్కడ చూసినా, విన్నా అప్పుడు అద్భుతమే, అద్భుతం చూస్తారు. కనుక ఈ బట్టీ నుండి ఎలా తయారై వెళ్తారు? జీరో, జీరోలో ఏ విషయం ఉండదు. వెనుకటి సంస్కారాలు ఏవీ ఉండవు. ఇక్కడ వదలడానికి కూడా వచ్చారు కదా! కనుక ఏవైతే వదలాలో వాటిని వదలి వెళ్తున్నారా లేక కొద్దిగా వెంట తీసుకుని వెళ్తున్నారా? ఏమి వదిలారు మరియు ఎంతవరకు వదిలారు? కొద్ది సమయం కోసం వదిలారా లేక సదాకాలికంగా వదిలారా? అనేది కూడా చూసుకోవాలి. సంఘటనా శక్తితో వదిలారా లేక స్వశక్తితో వదిలారా? సంఘటనా శక్తి సహాయం చేస్తుంది కానీ సంఘటనా శక్తితో పాటు స్వ శక్తి కూడా కావాలి. ఏది వదిలినా సదాకాలికంగా వదలాలి. బాప్ దాదాకి మీరందరూ ప్రియమైనవారే. ఎందుకంటే బాప్ దాదా కూడా పిల్లలైన మీ అందరి సహాయంతో కార్యం చేస్తున్నారు. కార్యంలో సహాయకారి అయ్యేవారు ప్రియంగా ఉంటారు. కానీ సహాయకారిగా అవ్వటంతో పాటు ధైర్యవంతులుగా తక్కువ అవుతున్నారు, ధైర్యం వదిలేస్తున్నారు. ధైర్యం ఉంటే తప్పక సహాయం లభిస్తుంది. కనుక సహాయకారితో పాటు ధైర్యవంతులుగా కూడా అవ్వండి. చిన్న చిన్న విషయాలలో ధైర్యహీనులుగా అవ్వకూడదు. ధైర్యవంతులుగా అవ్వటం ద్వారా మీ అందరిలో ఉన్న కోరిక పూర్తి అవుతుంది. ఇప్పుడు ధైర్యం అవసరం. ధైర్యం ఎలా వస్తుంది? ప్రతీ సమయం, ప్రతి అడుగులో, ప్రతి సంకల్పాన్ని బలి చేసినప్పుడే ధైర్యం వస్తుంది. ఎవరు బలిహారం అవుతారో వారిలో ధైర్యం ఎక్కువ ఉంటుంది. కనుక ఎంతెంత తమని తాము బలిహారం చేసుకుంటారో అంతగానే బాబా కంఠహారంలో సమీపంగా వస్తారు. ఇప్పుడు బలిహారం అయితే మరలా ప్రభు కంఠహారంగా అవుతారు. బలిహారం అయ్యి కర్మ చేస్తే ఇతరులని కూడా బలిహారం చేయించగలరు. వారిని వారసులు అంటారు. ఇప్పుడు ప్రజలు చాలామంది తయారవుతున్నారు. వారసులు తక్కువ తయారవుతున్నారు. ఎంత ఎక్కువ తయారు చేస్తారో అంతగానే సమీపంగా వస్తారు. ఇప్పుడు వారసులను తయారుచేసే పద్ధతిని ఆలోచించండి. మంచిది.