త్రినేత్రి, త్రికాల దర్శి మరియు
త్రిలోకనాథులుగా అయ్యేటందుకు యుక్తులు.
ఎవరిని చూస్తున్నారు? ఆకారాన్నా లేక అవ్యక్తాన్ని
చూస్తున్నారా? ఒకవేళ మీ యొక్క లేక ఇతరుల ఆకృతి చూడకుండా అవ్యక్తాన్ని చూస్తే
ఆకర్షణ మూర్తి అవుతారు. ఒకవేళ ఆకృతిని చూస్తే ఆకర్షణ మూర్తి అవ్వరు. ఆకర్షణ
మూర్తి అవ్వాలంటే ఆకృతిని చూడకండి. ఆకృతిలో ఉన్నఆకర్షణా రూపాన్ని చూడటం
ద్వారానే మీ నుండి మరియు ఇతరుల నుండి ఆకర్షణ ఉంటుంది. ఈ సమయంలో ఇదే అవ్యక్త
సర్వీస్ మిగిలి ఉంది. వ్యక్తంలోకి ఎందుకు వచ్చేస్తున్నారు? దీనికి కారణం ఏమిటి?
అవ్యక్తంగా అవ్వటం మంచిగా కూడా అనిపిస్తుంది అయినప్పటికీ వ్యక్తంలోకి ఎందుకు
వస్తున్నారు? వ్యక్తంలోకి రావటం ద్వారా బయటి సంకల్పాలు వస్తాయి మరియు వ్యర్థ
కర్మ జరుగుతుంది. వ్యక్తం నుండి అవ్యక్తం అవ్వటంలో ఎందుకు కష్టమనిపిస్తుంది?
వ్యక్తంలోకి తొందరగా వస్తున్నారు అవ్యక్తంలో కష్టంతో స్థిరం అవుతున్నారు, దీని
కారణం ఏమిటి? మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు? దేహాభిమానం ఎందుకు
వచ్చేస్తుంది? తెలుసు మరియు అనుభవం కూడా చేసుకున్నారు వ్యక్తంలో మరియు
అవ్యక్తంలో తేడా ఏమిటి? నష్టం మరియు లాభం ఏమిటి ఇవన్నీ తెలిసాయి. ఎప్పుడైతే
మీరు స్మృతిలో కూర్చుంటున్నప్పుడు దేహాభిమానం నుండి ఆత్మాభిమాని స్థితిలో ఎలా
స్థితులవుతున్నారు? ఏమంటారు? విషయాలు చాలా సహజమైనవి. మీరందరూ చెప్పినవన్నీ
పురుషార్థానికి సంబంధించినవే కానీ తెలుసుకుని మరియు అంగీకరిస్తూ కూడా
దేహాభిమానంలోకి రావడానికి కారణం ఇదే - దేహం యొక్క ఆకర్షణ ఉంటుంది. ఈ ఆకర్షణ
నుండి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఏదైనా ఆకర్షణ వస్తువు ఉంటే దూరం నుండే
దాని ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణను తొలగించడానికి ఏం చేస్తారు? అయస్కాంతం
స్వతహాగానే తనవైపు ఆకర్షిస్తుంది. మీరు ఆ ఆకర్షణ నుండి దూరం చేయాలంటే ఏమి
చేస్తారు? ఏదైనా వస్తువు స్వతహాగానే దానిని ఆకర్షిస్తుంది. మీరు ఆ వస్తువుని
దాని నుండి దూరం చేయాలంటే ఏమి చేస్తారు? వాటిని దూరం చేస్తారు లేక వాటి మధ్యలో
ఆకర్పించని వస్తువు పెడతారు. ఇలా రెండు రకాలుగా ఉంటుంది. దూరం చేస్తారు లేక
రెండింటి మధ్యలో మరో వస్తువుని పెడితే అవి దూరం అయిపోతాయి. అలాగే ఈ దేహాభిమానం
లేదా వ్యక్తభావం అనేవి కూడా అయస్కాంతం వలె స్వతహాగానే ఆకర్షిస్తాయి,
వద్దనుకున్నా వచ్చేస్తాయి. మరి మధ్యలో ఏమి పెడతారు? స్వయాన్ని తెలుసుకోడానికి
ఏమి అవసరం, దాని ద్వారా స్వయాన్ని మరియు సర్వశక్తివాన్ బాబాని పూర్తిగా
తెలుసుకోగలరు. ఒకే మాట స్వయాన్ని మరియు సర్వశక్తి వాన్ బాబాని పూర్తిగా
తెలుసుకోవడానికి నియమం కావాలి. నియమాన్ని మర్చిపోయినప్పుడు స్వయాన్ని మరియు
సర్వశక్తివాన్ని కూడా మర్చిపోతారు. సోమరితనం లేదా పాత సంస్కారం కూడా ఎందుకు
వస్తున్నాయి? ఏదోక నియమాన్ని మర్చిపోతున్నారా? నియమం ఏదైతే ఉందో అది స్వయాన్ని
సర్వశక్తివంతుడైన బాబాకి సమీపంగా తీసుకువస్తుంది. ఒకవేళ నియమంలో లోపం ఉంటే
స్వయం మరియు సర్వశక్తివంతుని కలయికలో లోపం ఉంటుంది. మధ్య పెట్టుకోవలసినది -
నియమం. ఏదోక నియమాన్ని వదిలేసినప్పుడే ఈ స్మృతి కూడా పాడవుతుంది. ఒకవేళ నియమం
మంచిగా ఉంటే స్వస్థితి మంచిగా ఉంటే అన్ని విషయాలు మంచిగా అవుతాయి. ఈ దేహం యొక్క
ఆకర్షణ ఏదైతే ఉందో అది మాటిమాటికి తన వైపు ఆకర్షితం చేస్తుందో దాని మధ్యలో ఈ
నియమం పెట్టుకుంటే ఈ దేహం యొక్క ఆకర్షణ ఆకర్షించదు. దీని కొరకు మూడు విషయాలు
ధ్యాసలో ఉంచుకోండి. 1.స్వయం యొక్క స్మృతి 2.నియమం మరియు 3.సమయం. ఈ మూడు విషయాలు
స్మృతి ఉంటే ఎలా అయిపోతారు? త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనాధ్. సంగమయుగం
యొక్క మీ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లభిస్తాయి. స్వయాన్ని తెలుసుకోవటం
ద్వారా సర్వశక్తివంతుడు మధ్యలో వచ్చేస్తారు. కనుక ఈ మూడు విషయాలపై ధ్యాస
ఉంచండి. ఏదైనా చిత్రాన్ని చూస్తున్నా (చిత్రం అంటే శరీరం) చిత్రాన్ని చూడకండి.
చిత్రం లోపల ఏదైతే చైతన్యం ఉందో దానిని చూడండి. మరియు ఆ చిత్రానికి ఏదైతే
చరిత్ర ఉందో ఆ చరిత్రలను చూడండి. చైతన్యం మరియు చరిత్రను చూస్తే చరిత్ర వైపు
ధ్యాస వెళ్ళటం ద్వారా చిత్రం అంటే దేహాభిమానం నుండి దూరం అవుతారు. ఒకొక్కరిలో
ఏదోక చరిత్ర తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణ కుల భూషణులే చరిత్రవంతులు.
కేవలం ఒక బాబా చరిత్రయే కాదు కానీ బాబా వెంట ఎవరైతే సహాయకారులు అయ్యారో వారి
ప్రతి నడవడిక కూడా చరిత్ర. కనుక చరిత్రను చూడండి మరియు చైతన్యం లేక
విచిత్రాన్ని చూడండి. చరిత్ర మరియు విచిత్రం ఈ రెండింటినీ చూస్తే దేహ ఆకర్షణ
ఏదైతే ఆకరిస్తుందో అది దూరం అయిపోతుంది. వర్తమాన సమయంలో ఇదే ముఖ్య పురుషార్థం
ఉండాలి. మేము మారిపోయాము అంటారు. అయితే ఈ విషయాలన్నీ మారిపోవాలి కానీ మరలా పాత
సంస్కారాలు మరియు పాత విషయాలు ఎందుకు? మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మొదట
ఏదైతే ఈ భావం ఉందో ఈ భావం మారితే అన్ని విషయాలు మారిపోతాయి. ఆసక్తిలోకి
వచ్చేస్తున్నారు కదా! కనుక ఆసక్తికి బదులు మిమ్మల్ని మీరు శక్తిగా భావిస్తే
ఆసక్తి సమాప్తి అయిపోతుంది. శక్తిగా భావించకపోతే అనేక రకాల ఆసక్తులు వస్తాయి. ఈ
దేహం యొక్క లేక దేహ పదార్థాల యొక్క ఏదైనా ఆసక్తి ఉత్పన్నం అయితే నేను శక్తిని
అని స్మృతి ఉంచుకోండి. శక్తిలో మరలా ఆసక్తి ఎక్కడ ఉంది? ఆసక్తి కారణంగా ఆ
స్థితిలోకి రాలేకపోతున్నారు. కనుక ఆసక్తిని సమాప్తి చేయండి. దీనికొరకు నేను
శక్తిని అని ఆలోచించండి. మాతలకి విశేషంగా ఏమి విఘ్నం వస్తుంది? (మోహం). మోహం ఏ
కారణంగా వస్తుంది? మోహం నాది అనే దాని ద్వారా వస్తుంది. కానీ మీ అందరి ప్రతిజ్ఞ
ఏమిటి? ఆదిలో మీరందరూ బాబా దగ్గరికి వచ్చినప్పుడు మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి?
నేను నీ వాడిని కనుక అన్నీ నీవే. మొదటి ప్రతిజ్ఞయే ఇది. నేను కూడా నీవాడిని
మరియు నావన్నీ నీవే. మరలా నాది ఎక్కడ నుండి వచ్చింది? నీది అనే దానిని నాది అనే
దానిలో కలిపేస్తున్నారు. దీని ద్వారా మొదటి ప్రతిజ్ఞయే మర్చిపోయినట్లు ఋజువు
అవుతుంది. మొట్టమొదటి ప్రతిజ్ఞ ఇదే చేసారు - ఏమి చెప్తారో, ఏమి చేయిస్తారో, ఏది
తినిపిస్తారో, ఎక్కడ కూర్చోపెడతారో అదే చేస్తాము. ఇక్కడ ప్రతిజ్ఞ ఏమిటి? బాబా
మిమ్మల్ని అవ్యక్తవతనంలో కూర్చోపెడుతున్నారు. మరలా మీరు వ్యక్తవతనంలోకి ఎందుకు
వచ్చేస్తున్నారు? ప్రతిజ్ఞని సరిగా నిలబెట్టుకోవటం లేదు. ఎక్కడ కూర్చో పెడితే
అక్కడ కూర్చుంటాము అనేది ప్రతిజ్ఞ, మరి బాబా వ్యక్తవతనంలో కూర్చోండి అని
చెప్పలేదు. వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంలో ఉండండి అని చెప్తారు. మొట్టమొదటి పాఠమే
మర్చిపోతే ఇక ఏమి ట్రైనింగ్ అవుతారు! ట్రైనింగ్ లో మొదటి పాఠం ఫక్కా చేయించండి.
ఏ ప్రతిజ్ఞ చేసానో దానిని నిలుపుకుని చూపిస్తాను అనేది స్మృతి ఉంచుకోండి. ఏ
మాతలైతే ట్రైనింగ్ కి వచ్చారో వారందరూ సమర్పణ అయిపోయారా? ఎప్పుడైతే సమర్పణ
అయిపోయారో ఇక మోహం ఎక్కడ నుండి వచ్చింది? ఏదైనా కాలిపోయి సమాప్తి అయిపోతే మరలా
దానిలో ఏమైనా మిగిలి ఉంటుందా? ఏదీ ఉండదు. ఒకవేళ ఏదైనా మిగిలి ఉంది అంటే
నిప్పుపెట్టారు, కానీ పూర్తిగా కాలలేదు. చనిపోయాయి కానీ అంటించలేదు. రావణుని
కూడా మొదట చంపుతారు. తర్వాత కాలుస్తారు. మరజీవ అయ్యారు. కానీ ఒకేసారి కాలిపోయి
బూడిద అవ్వలేదు. సమర్పణ యొక్క అర్థం చాలా గుహ్యమైనది. నాది అనేది ఏదీ ఉండకూడదు.
సమర్పణ అవ్వటం అంటే తనువు, మనస్సు, ధనం అన్నీ సమర్పణ చేయాలి. మనస్సు అర్పణ
చేసేస్తే ఇక ఆ మనస్సు అనుసారంగా సంకల్పాలు ఎలా వస్తాయి? తనువు ద్వారా వికర్మ
ఎలా చేస్తారు? మరియు ధనాన్ని కూడా వికర్మ లేదా వ్యర్ధ కార్యాలలో ఎలా
ఉపయోగిస్తారు? దీని ద్వారా ఇచ్చి మరలా తీసేసుకుంటున్నారు అని ఋజువు అవుతుంది.
తనువు, మనస్సు, ధనం ఇచ్చేసారు కనుక మనస్సులో ఏమి నడిపించాలి - ఇది కూడా శ్రీమతం
లభించింది, తనువు ద్వారా ఏమి చేయాలి - ఈశ్రీమతం కూడా లభించింది. ధనం ద్వారా ఏమి
చేయాలి అనేది కూడా తెలుసు. ఎవరికి ఇచ్చేసారో వారి మతం పైనే నడవాలి. ఎవరైతే
మనస్సు ఇచ్చేసారో వారి స్థితి ఎలా ఉంటుంది? మన్మనాభవ, వారి మనస్సు అక్కడే
తగులుకునే ఉంటుంది. ఈ మంత్రాన్ని ఎప్పుడు మర్చిపోరు. ఎవరైతే మన్మనాభవ అయ్యారో
వారిలో మోహం ఉంటుందా? మోహజీత్ అవ్వడానికి మీ ప్రతిజ్ఞ జ్ఞాపకం ఉంచుకోండి. ఈ
ట్రైనింగ్ నుండి వెళ్ళేటప్పుడు ఏ ముద్ర వేయించుకుని వెళ్తారు? (మోహజీత్),
మోహజీత్ అనే ముద్ర వేయించుకుంటే ఆ పోస్ట్ గమ్యానికి చేరుకుంటుంది. ఒకవేళ ముద్ర
సరిగా లేకపోతే గమ్యానికి చేరుకోరు. అందువలన తప్పకుండా ముద్ర వేయించుకోవాలి. ఈ
మాతలనే మరలా సమర్పణా సమారోహం చేస్తాను. ఎవరైతే ఈ ముద్ర వేసుకుంటారో వారినే
పిలుస్తాను. మోహజీత్ అయినవారి సమ్మేళనం చేస్తాను. అందువలనే త్వరగా తయారయిపోండి.