సంపూర్ణ సమర్పణ యొక్క గుర్తులు
ఎవరిని చూస్తున్నారు? ఎవరు, ఎవరిని చూస్తున్నారు?
(ఇద్దరు, ముగ్గురు తమ తమ ఆలోచనలు చెప్పారు). ఈ రోజు బాప్ దాదా తన సంపూర్ణ దీపపు
పురుగులని చూస్తున్నారు. ఎందుకంటే ఎంత వరకు దీపపు పురుగులుగా అయ్యారనేది
చూడడానికి వచ్చారు. అక్కడైతే దీపపు పురుగు దీపం దగ్గరికి వెళ్తుంది కానీ
ఇక్కడైతే దీపం కూడా దీపపు పురుగులతో కలుసుకుంటుంది. సంపూర్ణ దీపపు పురుగుల
లక్షణాలు ఏమిటి మరియు వారి పరిశీలన ఏమిటి? మీకు తెలుసా? (ప్రతి ఒక్కరు
చెప్పారు). మీరందరూ చెప్పినవన్నీ యదార్థమైనవే. ముఖ్యసారం ఏమిటంటే - ఎవరైతే
దీపపు పురుగులుగా ఉంటారో వారు దీపానికి స్నేహిగా ఉంటారు. సమీపంగా ఉంటారు మరియు
సర్వసంబంధాలు ఆ ఒకనితోనే ఉంచుకుంటారు. సర్వసంబంధాలు, స్నేహీ, సమీపం మరియు
ధైర్యం ఈ నాలుగు విషయాలు సంపూర్ణ దీపపు పురుగులలో కనిపిస్తాయి. మీ అందరినీ ఈ
భట్టీకి ఎందుకు పిలిపించాను? ఈ నాలుగు విషయాలు ఏవైతే వినిపించానో వాటిని మీలో
సంపూర్ణ శాతంలో ధారణ చేయాలి. ఒక శాతం కూడా తక్కువ కాకూడదు. కొంతమంది పిల్లలు
మేము మంచిగానే ఉంటున్నాము కానీ కొద్దిగా శాతం ఉంది అంటున్నారు. ఎవరిలో అయితే
శాతం లోపంగా ఉంటుందో వారిని సంపూర్ణ దీపపు పురుగులు అనరు. ఆ దీపపు పురుగుని
రెండవరకం అంటారు. వారు చుట్టూ తిరుగుతూ ఉంటారు. త్వరగా ఒకేసారి దీపానికి బలి
అయ్యేవారు ఆలోచించి, అర్ధం చేసుకుని అడుగు వేసేవారు. ఎవరైతే ఆలోచించి, అర్థం
చేసుకుని అడుగు వేస్తారో వారిని చుట్టూ తిరిగేవారు అంటారు. ఈ రెండవరకం వారు
అనేక రకాల సంకల్పాలు, విఘ్నాలు మరియు కర్మలనే చక్రంలో తిరుగుతూ ఉండేవారు. ఈరోజు
పాండవసేనని భట్టీకి పిలిచారు. ఎక్కడైనా ఏదైనా పెద్ద ఫ్యాక్టరీ ఉంటే దాని ముద్ర
వేస్తారు. ఒకవేళ ఆ ఫ్యాక్టరీ యొక్క ముద్ర లేకపోతే ఆ వస్తువులను ఖరీదు చేయరు.
అదేవిధంగా మీరు ఈ భట్టీకి ముద్ర వేయించుకోవడానికి వచ్చారు. ట్రేడ్ మార్క్
ఉంటుంది కదా! మీరు ఏ ముద్ర వేయించుకోవడానికి వచ్చారు? సంపూర్ణ సమర్పణ యొక్క
ముద్ర వేయించుకోకపోతే ఏమౌతుందో తెలుసా? ఎలా అయితే ముద్రలేని వస్తువు యొక్క
విలువ తక్కువ ఉంటుందో అలాగే ఆత్మలైన మీకు కూడా స్వర్గంలో విలువ తగ్గిపోతుంది.
కనుక మీ రాజధానిలో సమీపంగా రావడానికి ఈ ముద్ర వేసుకోవలిసిందే. మాతలకైతే
నష్టోమోహ యొక్క మంత్రం లభించింది మరియు పాండవసేనకి సంపూర్ణ సమర్పణ అనే మంత్రం
లభించింది. పాండవులకే మహిమ ఉంది - పర్వతాలు ఎక్కి చనిపోయారని, పర్వతాలపై కాదు
కానీ ఉన్నత స్థితిలో స్థితులై స్వయం క్రింద నుండి అనగా తక్కువ స్థితి నుండి
పూర్తిగా ఉన్నత స్థితి అంటే అవ్యక్త స్థితిలో స్థితులు అయ్యారు అనగా అవ్యక్త
స్థితిలో సంపూర్ణత పొందారని అర్థం. పాండవులకి స్మృతిచిహ్నం ఇది. ఈ
స్మృతిచిహ్నాన్ని స్మృతి ఇప్పించడానికి మరియు ప్రత్యక్షంలోకి తీసుకురావడానికి
భట్టికి వచ్చారు. సంపూర్ణ సమర్పణ అని ఎవరిని అంటారు? సంపూర్ణ సమర్పణ అంటే తనువు
- మనస్సు - ధనం మరియు సంబంధం, సమయం అన్నింటిలో అర్పణ అవ్వాలి. మనస్సుని సమర్పణ
చేస్తే మనస్సుని శ్రీమతం లేకుండా ఉపయోగించకూడదు. ఇప్పుడు చెప్పండి - ధనాన్ని
శ్రీమతం అనుసారంగా ఉపయోగించడం సహజమే, తనువుని శ్రీమతానుసారంగా ఉపయోగించటం సహజమే
కానీ మనస్సు శ్రీమతానికి వ్యతిరేకంగా ఒక్క సంకల్పం కూడా చేయకూడదు. దీనినే
సమర్పణ అంటారు. అందువలనే మన్మనాభవ అనే ముఖ్య మంత్రం ఉంది. ఒకవేళ మనస్సు సంపూర్ణ
సమర్పణ అయిపోతే తనువు- మనస్సు - ధనం సమయం సంబంధం వెంటనే అటువైపు నిమగ్నం
అయిపోతాయి. ముఖ్య విషయం మనస్సుని సమర్పణ చేయాలి అంటే వ్యర్థ సంకల్పాలు,
వికల్పాలని సమర్పణ చేయాలి. ఇదే సంపూర్ణ దీపపు పురుగు యొక్క పరిశీలన. సంపూర్ణ
సమర్పణ అయినవారి మనస్సులో బాప్ దాదా గుణాలు, కర్తవ్యం, మరియు సంబంధాలు తప్ప
ఇంకేమీ ఆకర్పించవు. ఇలాంటి ముద్ర వేసుకున్నారా, ఇప్పుడు చెప్పండి? ఈరోజులలో
మీరందరూ ఆఫీసులో పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఆఫీసు వస్తువులని మీ పనులలో
ఉపయోగించుకుంటారు కదా! అదేవిధంగా మీరు సమర్పణ చేసిన వస్తువులు మీవి కావు.
ఎవరికి ఇచ్చేశారో వారివి అయ్యాయి. వారి వస్తువులని మీరు మీ కార్యంలో
ఉపయోగించుకోకూడదు. కానీ సంస్కారం అయిపోయిన కారణంగా అప్పుడప్పుడు శ్రీమతంతో పాటు
మన్మతం, దేహాభిమానం యొక్క మతం, శూద్ర స్థితి యొక్క మతం ఉపయోగిస్తున్నారు.
అందువలనే కర్మాతీత స్థితి లేదా అవ్యక్తస్థితి సదా ఏకరసంగా ఉండటం లేదు, ఎందుకంటే
మనస్సు రకరకాల రసనలతో ఉంటే స్థితి కూడా రకరకాలుగా ఉంటుంది. ఒకని రసంలో ఉంటే ఒకే
స్థితి ఉంటుంది. బాప్ దాదా పిల్లలని తేలిక చేస్తున్నారు కానీ పిల్లలు తెలివి
తక్కువవారు అయ్యి బరువు ఎత్తుకుంటున్నారు. ఎందుకంటే 63 జన్మల నుండి వికర్మల
యొక్క భోజా, లోకమర్యాదల యొక్క భోజా (బరువు) తలపై పెట్టుకునే అలవాటు అయిపోయింది.
అందువలన భారాన్ని దించి మరలా పెట్టుకుంటున్నారు. ఎవరికి ఏ అలవాటు ఉంటే ఆ అలవాటు
గట్టిగా అయిపోతుంది కదా! అందువలన మీ అలవాటు కారణంగా మీ బాధ్యతను మరలా మీపై
పెట్టుకుంటున్నారు. పాండవులు ఒక్కొక్కరు ఒకవేళ సంపూర్ణ సమర్పణ అయిపోతే ఏమౌతుందో
చెప్పండి? ఎప్పుడైతే పాండవ సేన తయారయిపోతుందో అప్పుడు కౌరవులు మరియు యాదవులు
మైదానంలోకి వస్తారు. తర్వాత ఏమౌతుంది? మీ రాజ్యం మీకు లభిస్తుంది. ఎప్పటివరకు
అయితే ఏది ఆలోచిస్తానో, మాట్లాడతానో, వింటానో, చేస్తానో అది శ్రీమతం లేకుండా
చేయను అని ప్రతిజ్ఞ చేయరో అప్పటివరకు ఈ భట్టి ద్వారా లాభం పొందలేరు. ఇలా
ఉత్సాహ, ఉల్లాసాలతో వచ్చారు కదా! ఏదో తయారవ్వాలని,మారాలని వచ్చారు కదా! భయం
లేదు కదా? ఎంతెంత లోతులోకి వెళ్తారో అంత భయం మాయం అయిపోతుంది. ఎప్పటివరకు అయితే
ఏ విషయం యొక్క లోతులోకి వెళ్ళరో అంత భయం వస్తుంది. సాగరం యొక్క పైపై అలలను
చూస్తే భయం వేస్తుంది కానీ సాగరం యొక్క లోతులోకి వెళ్తే ఏమౌతుంది? పూర్తిగా
శాంతి మరియు శాంతితో పాటు ప్రాప్తి కూడా అవుతుంది. అందువలన ఏదైనా భయపడే విషయం
వచ్చినా లోతులోకి వెళితే భయం మాయం అయిపోతుంది. ఇప్పుడు ఏ లక్ష్యం మరియు
లక్షణాలను ధారణ చేయాలి? దీనిలో ఎవరైతే మొదటి నెంబర్ అవుతారో వారికి ఏమి
లభిస్తుంది? భవిష్యత్తులో అయితే రాజధాని లభిస్తుంది కానీ ఇక్కడ కూడా బహుమతి
లభిస్తుంది. అందువలన ప్రతి ఒక్కరు నెంబర్ వన్లోకి వస్తాము అని ప్రయత్నం చేయండి.
రెండవ నెంబర్ వారికి లభించదు. ఎవరైతే విజయం పొందుతారో వారే మొదటి నెంబర్లోకి
వస్తారు. ఈ విజయం పొందే ప్రయత్నం చేస్తే మొదటి నెంబర్లోకి వస్తారు. మీకు తిలకం
పెట్టాలి. లేక మీరు బిందురూపమేనా? ఎన్ని రకాలైన బిందువులు ఉంటాయి? ఈ రోజు మీకు
రెండు తిలకాలు పెడుతున్నారు. 1.నిరోగిగా అయ్యే తిలకం 2. భవిష్య రాజ్యభాగ్యం
యొక్క తిలకం. బిందురూపం యొక్క స్మృతి ఉంచుకోవడానికి బిందువు (తిలకం) పెడతారు.
బిందువు పెడుతూ పెడుతూ బిందువు అయిపోతారు. ఏ వ్యర్థ సంకల్పాలు వచ్చినా వాటికి
బిందువు పెడితే బిందువు అయిపోతారు.