బిందువు మరియు సింధవు(సాగరుడు) యొక్క స్మృతి
ద్వారా సంపూర్ణత
ఈరోజు ఏ సంఘటనలోకి బాప్ దాదా వచ్చారు? ఈ రోజు ఈ
సంఘటనని ఏమంటారు? ఈరోజు జ్ఞానసూర్యుడు మరియు సితారల యొక్క సంఘటన. ప్రతి ఒక
సితార తమ తమ మెరుపుని చూపించేవారు. బాప్ దాదా ప్రతి ఒక సితార యొక్క మెరుపు
చూడడానికి వచ్చారు. మీరందరూ భట్టీకి వచ్చారు, ఈ భట్టీలో మిమ్మల్ని మీరు ఏవిధంగా
తయారు చేసుకోవడానికి వచ్చారు? ఈ భట్టీ నుండి ఎలా తయారై వెళ్ళాలో తెలుసా?
(ఫరిస్తా) ఫరిస్తాగా అవ్వలేదా? ఈ భట్టీలో బ్రాహ్మణులు మరియు ఫరిస్తా అంటే
సంపూర్ణత యొక్క ముద్ర వేసుకుని వెళ్ళాలి. ఫరిస్తా అయ్యే పురుషార్ధిగా ఉన్నారు
కానీ సంపూర్ణతలో ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని ఈ భట్టిలో స్వాహా చేయడానికి కూడా
వచ్చారు కదా! లోపాలని తొలగించుకోవడానికి ఏ విషయం స్మృతి ఉంచుకుంటారు? దీని
ద్వారా పూర్తిగా సంపూర్ణత యొక్క ముద్ర వేసుకుని వెళ్తారు. ఈ రోజు బాప్ దాదా
చాలా సహజ విషయం వినిపిస్తున్నారు. చాలా సహజాతి సహజమైన విషయం, ఇదే స్మృతి
ఉంచుకోవాలి - నేను బిందువుని మరియు బాబా కూడా బిందువు. కానీ బిందువుతో పాటు
సింధువు. బిందువు మరియు సింధువు ఇది బాబా మరియు పిల్లల పరిచయం. ఈ రెండు మాటలు
స్మృతి ఉంటే సహజంగా సంపూర్ణత వస్తుంది. స్కూల్ లో చిన్నపిల్లలను
చదివిస్తున్నప్పుడు మెట్టమొదట ఏమి నేర్పిస్తారు? మొదట బిందువునే వ్రాయిస్తారు
కదా! తర్వాత క్రమంగా అంకెలు నేర్పిస్తారు. అలాగే బిందువు యొక్క స్మృతి ఒకటిలోనే
అన్ని విషయాలు వస్తాయి. ఒకని స్మృతి మరియు ఏకరస స్థితి, ఒకే మతం మరియు ఒకని
కర్తవ్యంలో సహాయకారి. ఇలా ఒకటి అనే విషయమే స్మృతి ఉంచుకుంటే మిమ్మల్ని మీరు
చాలా ఉన్నతి చేసుకోగలరు. కేవలం బిందువు మరియు ఒకటి అంతే. విస్తారంలోకి
వెళ్ళవలసిన అవసరం ఉండదు. కేవలం సేవ కోసం విస్తారంలోకి వెళ్ళాలి. ఒకవేళ సేవ
లేకపోతే బిందువు మరియు ఒకటి అయిపోవాలి. దీని కొరకు మీ బుద్ధిని నడిపించవలసిన
అవసరం లేదు. కేవలం ఈ విషయాలు స్మృతి ఉంచుకుంటే సహజ సఫలత పొందుతారు. ఇది సహజమా
లేక కష్టమా? సహజమార్గమే కానీ సహజాన్ని ఎందువలన కష్టంగా చేసుకుంటారు?
(సంస్కారం). ఈ సంస్కారం కూడా ఎందుకు ఉత్పన్నం అవుతుంది? మీ విస్మృతియే ఈ అన్ని
విషయాలను ఉత్పన్నం చేస్తుంది. వెనుకటి సంస్కారాలు అయినా, వెనుకటి కర్మ బంధన
అయినా, వర్తమానంలో జరుగుతున్న పొరపాట్లు వీటిన్నింటికి మూలకారణం మీ విస్మృతియే.
మీ విస్మృతి కారణంగా ఈ వ్యర్థ విషయాలన్నీ సహజాన్ని కష్టంగా చేస్తున్నాయి.
స్మృతిలో ఉండటం ద్వారా ఏమౌతుంది? ఏ లక్ష్యం పెట్టుకొని వచ్చారు - విస్మృతిని
పూర్తిగా తొలగించుకుని సంపూర్ణ స్మృతి స్వరూపులుగా అవ్వాలి. విస్మృతి ఉంటే చాలా
విఘ్నం అవుతుంది. స్మృతి ఉంటే సహజంగా మరియు సంపూర్ణత ఉంటుంది. ఏ విషయాలైతే
వినిపించానో ఆ స్మృతిని గట్టిగా చేసుకుంటే విస్మృతి తనంతట తానే పారిపోతుంది.
స్మృతినే వదలకపోతే విస్మృతి ఎక్కడ నుండి వస్తుంది? సూర్యాస్తమయం అయినప్పుడే
చీకటి వస్తుంది. సూర్యాస్తమయమే కాకపోతే చీకటి ఎలా వస్తుంది? అలాగే స్మృతి అనే
సూర్యుడు సదా స్థిరంగా ఉంటే విస్మృతి యొక్క అంధకారం రాదు. అలౌకిక వ్యాయామం
గురించి తెలుసా? అక్కడ వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉండటంతో
పాటు శక్తిశాలి కూడా ఉంటారు. అలాగే ఈ అలౌకిక వ్యాయామం ఎవరు, ఎంత చేస్తారో అంత
ఆరోగ్యంగా అంటే మాయ యొక్క వ్యాధి రాదు మరియు శక్తి స్వరూపులుగా కూడా ఉంటారు.
ఎంతెంత ఈ అలౌకిక బుద్ధి యొక్క వ్యాయామం చేస్తారో అంతగానే ఏదైతే తయారయ్యే
లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని పొందగలరు. వ్యాయామంలో డ్రిల్ మాస్టర్ ఎలా
చెప్తే అలా చేతులు, కాళ్ళు కదుపుతారు కదా! ఇక్కడ కూడా ఒకవేళ అందరికీ ఒక సెకనులో
సాకారి నుండి నిరాకారి అవ్వండి అంటే అవ్వగలరా? ఎలా అయితే స్థూల శరీరం యొక్క
చేతిని, కాలుని వెంటనే సలహా ప్రమాణం వ్యాయామంలో కదుపుతారో అలాగే ఒక్క సెకనులో
సాకారి నుండి నిరాకారి అయ్యే అభ్యాసం ఉందా? సాకారి నుండి నిరాకారి అవ్వటంలో ఎంత
సమయం పడుతుంది? మీ అసలైన స్వరూపమే అది అయితే ఒక సెకనులో ఎందుకు స్థితులు
అవ్వలేకపోతున్నారు?
ఇప్పటి వరకు కర్మబంధన ఉందా? ఇప్పటి వరకు కర్మబంధన అనే
మాట అంటారా? ఎప్పటి వరకు అయితే ఈ పాత శరీరం వదలరో అప్పటి వరకు ఈ కర్మబంధన అనేది
వింటూ ఉంటారు. ఈ క్లాసులో ప్రశ్నకి జవాబు చెప్పేవారు ఎవరు? చాలా పేర్లు
చెప్పారు, మరలా ప్రశ్న- జవాబుకి అతీతంగా వెళ్ళేవారు ఎవరు? భట్టీలో పరిశీలించే
శక్తి వస్తుంది. ప్రతి ఒక్కరూ మేము సంపూర్ణంగా అయ్యే వెళ్తాము అని ప్రయత్నం
చేయాలి. ఈ విధంగా ఇప్పుడు అవ్వగలరా? లేక అంతిమంలో అవుతారా (అవ్వగలం) అయితే ఇక
అంతిమం వరకు ఉండి ఏమి చేస్తారు? (ప్రజలని తయారు చేస్తాము). స్వయం రాజా మరియు
కిరీటధారి అవుతారు మరియు ఇతరులని
ప్రజలుగా చేసుకుంటారు. మీ సమానంగా కూడా చేయాలి,
ప్రజలని కూడా తయారుచేయాలి. ప్రజలు లేకుండా రాజ్యం ఎవరిపై చేస్తారు? ఇక్కడ ఉన్న
సితారలందరూ సంపూర్ణంగా అయ్యే పాట్నా వెళ్తాము అని భావించండి. మేము సంపూర్ణంగా
అవుతాము మరియు ఇతరులని తయారు చేస్తాము అనే ఉత్సాహం మరియు నిశ్చయం ప్రతి
ఒక్కరికీ తప్పక ఉండాలి. ఇవే ఉత్సాహ, ఉల్లాసాలు స్థిరంగా ఉంటే తప్పకుండా
లక్ష్యాన్ని పొందుతారు, మరియు బాప్ దాదాకి నిశ్చయం ఉంది - ఇలా సంపూర్ణం
అయినవారే యజ్ఞకుండం నుండి బయటికి వస్తారు అని. కుండం యొక్క స్మృతి చిహ్నం
చూసారా? ఏవైతే స్థానాలు ఉన్నాయో అవన్నీ యజ్ఞాలే. అయినప్పటికీ యజ్ఞకుండానికి
చాలా గొప్పతనం ఉంటుంది. గంగ మరియు యమున రెండు నదులకి చాలా గొప్పతనం ఉంటుంది.
కానీ రెండింటి సంగమానికి ఎక్కువ గొప్పతనం ఉంటుంది. అక్కడ స్నానం చేయటం
శ్రేష్టంగా భావిస్తారు. గంగ - యమునలు అయితే చాలా స్థానాలలో ఉంటాయి. కానీ
విశేషంగా సంగమంలో స్నానం చేయడానికి ఎందుకు వెళ్తారు? దాని విశేష గొప్పతనం
ఏమిటి? సంగమం యొక్క గొప్పతనం మంచిగా తెలుసు కదా! ఎలా అయితే విశేష స్థానాలకి
విశేష గొప్పతనం ఉంటుందో అలాగే మధవనం భట్టీకి కూడా గొప్పతనం ఉంటుంది. ఈ భట్టీ
నుండి సంపూర్ణత అనే కానుక బాబా నుండి లభిస్తుంది. ఈ కలయిక అంటే సంగమం యొక్క
విశేష సౌభాగ్యం పిల్లలకి లభిస్తుంది. ఈ కలయికయే సంపూర్ణత యొక్క బహుమతి రూపంలో
లభించింది. ఈ మిలనానికి సంగమం యొక్క స్పృతి చిహ్నం తయారైంది. ఈ కలయికయే
సంపూర్ణత యొక్క బహుమతి. భట్టీ నుండి సంపూర్ణత యొక్క ముద్ర లేక గుర్తు
వేయించుకునే వెళ్ళాలి. కానీ దానితో పాటు ఈ భట్టీలో లెక్క చేయటం కూడా మంచిగా
నేర్చుకోవాలి. అక్కడక్కడ లెక్క పూర్తిగా చేయటం లేని కారణంగా ఎక్కడ ప్లస్ (+,
కూడిక) చేయాలో అక్కడ మైనస్ (- తీసివేత) చేస్తున్నారు. ఎక్కడ ఏ విషయంలో కలపాలి
మరియు తీసేయాలి అనే లెక్క కూడా పూర్తిగా నేర్చుకోవాలి. ఎక్కడ తీసివేయాలో అక్కడ
కలుపుతున్నారు. అందువలనే స్థితి అలా అవుతుంది. ప్రవృత్తిలో ఉంటున్న కారణంగా
ఎక్కడ కలపకూడదో అక్కడ కలుపుతున్నారు. ఎక్కడ తీసివేయకూడదో అక్కడ తీసేస్తున్నారు.
ఈ చిన్న లెక్క పెద్ద సమస్య రూపం అవుతుంది. అందువలన కుటుంబంలో ఉంటూ కూడా ఏమి
తెంచాలి, ఏమి జోడించాలి అనేది కూడా పూర్తిగా నేర్చుకోవాలి. జోడించాలి కానీ ఎంత
వరకు మరియు ఏ రూపంలో అనేది రావాలి. మిమ్మల్ని భట్టీకి పిలిచారంటే మీ కార్యం
ఏమిటో చెప్పటానికే. చదువు యొక్క ఏయే
సబ్జక్టు యొక్క నంబరుకి పరిపక్వంగా అవ్వాలి అనేది
చెప్పాలి కదా! 1. అలౌకిక ఈశ్వరీయ వ్యాయామం మరియు 2. లెక్క చేయటం నేర్చుకోవాలి.
ఈ రెండు భట్టీలో నేర్చుకోండి. ఈ రెండు విషయాలలో సంపూర్ణం అయిపోతే సంపూర్ణంగా
అయ్యే వెళ్తారు. స్వయం అయితే తయారయిపోతారు కానీ ఇతరులని తయారుచేసే కార్యం
మిగిలి ఉంటుంది. ఆ కార్యం కొరకే వెళ్ళవలసి ఉంటుంది. సంబంధం కారణంగా వెళ్ళకూడదు.
సేవార్థం వెళ్ళాలి, వెళ్ళటం కూడా సేవ కొరకే. ఎక్కడున్నా కానీ మిమ్మల్ని మీరు
ఇలా భావించి నడిస్తే స్థితి అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. బాప్ దాదా సేవ
నిమిత్తం వస్తూ వెళ్తూంటారు కదా! అలా అనిపిస్తుంది. మీరందరూ కూడా కేవలం సేవ
కోసం నిమిత్తంగా వెళ్ళాలి మరియు సేవలో సఫలత పొంది మరలా సన్ముఖంగా రావాలి.
అవ్యక్త వతనం నుండి వర్తమాన సమయంలో బాప్ దాదా
పిల్లలకి ఏమి మంత్రం ఇస్తున్నారు? త్వరగా వెళ్ళండి, త్వరగా రండి (గో సూన్, కమ్
సూన్). సేవ కోసం వెళ్ళి మరలా సహయోగి అయ్యి త్వరగా రండి. మరలా వెళ్ళండి.
ఎప్పుడైతే ఇక్కడికి త్వరగా వెళ్ళటం, త్వరగా రావటం చేస్తారో అప్పుడు బుద్ధి
ద్వారా కూడా త్వరగా అవ్వగలరు. బుద్ధి యొక్క వ్యాయామం కూడా త్వరగా వెళ్ళటం,
త్వరగా రావటమే కదా! ఈ స్థూలమంత్రం స్మృతి ఉంచుకున్నప్పుడే ఈ స్థితి ఉంటుంది. ఈ
మంత్రంతో ఆ మంత్రానికి సంబంధం ఉంది. అందువలనే ఈ యజ్ఞకుండానికి గొప్పతనం ఉంది
అని చెప్పాను. ఇక్కడ మీకు బహుమతి రూపంలో లభిస్తుంది. అక్కడ పురుషార్ధ రూపంలో
లభిస్తుంది. అంటే యజ్ఞకుండానికి విశేష గొప్పతనం ఉంది కదా! ఇక్కడ వరదానం, అక్కడ
శ్రమ ఉంటుంది. వరదానం లభిస్తున్నప్పుడు ఇక శ్రమ ఎందుకు చేస్తున్నారు? ఇంద్రుని
సింహాసనం తీసుకున్నారు కదా! లేక తీసుకుంటున్నారా? ఇప్పుడు నిశ్చయం యొక్క భాష
మాట్లాడాలి. ఇక్కడ ధరిస్తాం అనేది కూడా సంపూర్ణ నిశ్చయం యొక్క భాష కాదు.
ధరించాం మరియు ధరించే తీరుతాం అనాలి. నిశ్చయబుద్ది విజయంతి. ఒకవేళ మీలో అవుతామో
లేదా అనే సంశయం ఉంటే తయారుకాలేరు. అందువలన స్థితి మరితే భాష కూడా మారుతుంది.
యజ్ఞకుండం నుండి మాట్లాడటం కూడా నేర్చుకుని వెళ్ళాలి. ఉదాహరణ అయ్యి వెళ్ళాలి.
మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఆకర్షితం అయ్యి యజ్ఞకుండంలో స్వాహా అవ్వాలి. బాప్
దాదా ప్రతి ఒక్కరి చిత్రం ద్వారా అదృష్టం మరియు పురుషార్థం చూస్తున్నారు.
ఎంతవరకు తమ అదృష్టాన్ని తయారుచేసుకుంటున్నారు అని. మీరు కూడా ఎప్పుడైనా
ఎవరినైనా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి చిత్రం ద్వారా వారి పురుషార్ధం, వారి
పురుషార్థంలో విశేష గుణాలు ఏవైతే ఉన్నాయో అవే చూడాలి. ప్రతి ఒక్కరి
పురుషార్ధంలో విశేష గుణాలు తప్పక ఉంటాయి. గుణం మరియు ఈర్ష్య (గుణ్ ఔర్ ఘృణ,
హిందీలో ఈ రెండు పదాలు ఒకేలా ఉంటాయి కానీ రెండూ వేర్వేరు), గుణాలు చూడకపోతే
ఈర్ష్య వస్తుంది. ప్రతి ఒక్కరి గుణాలని చూస్తే ఈర్ష్య సమాప్తి అయిపోతుంది.
పాట్నానివాసీలు అతి స్నేహీలు మరియు అతి ప్రియమైనవారు.
ఒకరికొకరు స్నేహీగాఉంటారు. ఆవిధమైన స్నేహీ పిల్లలతో బాప్ దాదాకి కూడా అతి
స్నేహం ఉంటుంది. స్నేహమే సమీపంగా తీసుకువస్తుంది. ఎంత స్నేహీయో అంత సమీపం. కనుక
పాట్నా నివాసీలు ఒకరికొకరు స్నేహీలు. ఈ విధమైన స్నేహీ పిల్లలే ఇప్పుడు మరియు
భవిష్యత్తులో కూడా సమీపంగా వస్తారు. విశేష స్నేహీలు, అందువలన ఈ రోజు విశేషంగా
రెండు బిందువులు పెడుతున్నారు. అతీతమైనవి, లౌకిక బిందువులు కాదు. రెండు
బిందువులు ఏమిటి? 1. నిరాకారి. 2. అతీత స్థితి. ఈ రెండు బిందువులు ప్రతి ఒక్కరి
మస్తకంలో అవినాశి స్థితి కోసం అవినాశి రూపంతో పెడుతున్నారు. అవినాశి తిలకం సదా
స్థిరంగా ఉంటుందా? తిలకాన్ని సౌభాగ్యానికి గుర్తు అంటారు. ఈ తిలకాన్ని సదా
స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఎంతెంత పరిపక్వంగా అవుతారో అంతంత పదవి
పొందుతారు. ప్రతి ఒక్కరు మేమే మొదటి నెంబర్ అని భావించండి. ఒకవేళ ప్రతి ఒక్కరు
మొదటి నెంబర్ అయిపోతే రెండవ నెంబర్ లోకి ఎవరు వస్తారు? బాబా క్లాసులో ఎప్పుడు
నెంబర్ తీయరు. టీచర్ కూడా మొదటి నెంబరే, విద్యార్థి కూడా మొదటి నెంబరే. కనుక
ఒక్కొక్కరు నెంబర్ వన్. ఈ విధమైన క్లాసు యొక్క చిత్రం మధువనంలో ఉండాలి. మంచిది.