13.11.1969
ఉదయం మురళి ఓం శాంతి
అవ్యక్త్-బాప్దాదా మధుబన్
బాప్ దాదా యొక్క ఆశలు
అశరీరి అయ్యి మరలా శరీరంలోకి వచ్చే అభ్యాసం గట్టిగా
అవుతుందా? ఎలా అయితే బాప్ దాదా అశరీరి స్థితి నుండి శరీరంలోకి వస్తున్నారో
అలాగే మీరు కూడా అశరీరీ అయ్యి శరీరంలోకి రావాలి. అవ్యక్తస్థితిలో స్థితులై
తిరిగి వ్యక్తంలోకి రావాలి. ఇటువంటి అభ్యాసం రోజురోజుకి పెంచుకుంటూ
నడుస్తున్నారా? బాప్ దాదా వచ్చినప్పుడు ఎవరిని కలుసుకోవడానికి వస్తారు?
(ఆత్మలను) ఎటువంటి ఆత్మలను? మొత్తం విశ్వంలో శ్రేష్ఠ ఆత్మలైన వారిని బాప్ దాదా
కలుసుకుంటారు. మేమే విశ్వంలో శ్రేష్ట ఆత్మలం అనే నషా ఉంటుందా? శ్రేష్ట ఆత్మలకే
సర్వశక్తివంతుడైన బాబా కలయిక యొక్క సౌభాగ్యం లభిస్తుంది. కనుక బాప్ దాదా భృకటి
మధ్యలో మెరిసే నక్షత్రాన్నే చూస్తారు. సితారలైన మిమ్మల్ని ఏయే పేర్లతో
పిలుస్తారు? అదృష్ట సితారలు మరియు నయన సితారలే కానీ మరే సితారలు? ఏ కార్యం
అయితే ఇప్పుడు పిల్లలకు మిగిలి ఉందో ఆ పేరు యొక్క సితారని మర్చిపోయారా? ఏదైతే
శ్రమతో కూడిన కార్యం ఉందో దానిని మర్చిపోయారు. ఏ కర్తవ్యాన్ని జ్ఞాపకం
తెచ్చుకోండి? బాప్ దాదా యొక్క ఆశాసితారలు. బాప్ దాదా ఏదైతే చెప్పారో అదే కార్యం
ఇప్పుడు మిగిలి ఉంది. బాప్ దాదా పిల్లలపై ఏ ఆశలు పెట్టుకున్నారో ఆ కార్యం
పూర్తి చేసారా? బాప్ దాదా ఒక్కొక్క సితారపై ఇదే ఆశ పెట్టుకున్నారు. ఒకొక్కరు
అనేకులకి పరిచయం ఇచ్చి, యోగ్యులుగా తయారుచేయాలని. ఒకరి ద్వారానే అనేక మంది
తయారవ్వాలి. మేము ఇలా అయ్యామా అని పరిశీలించుకోండి. అనేకులని తయారుచేసారు
దానిలో కూడా సంఖ్యను (క్వాంటిటీ) అయితే తయారుచేశారు. కానీ లక్షణాలు
కలిగినవారిని (క్వాలిటి) తయారుచేయాలి. సంఖ్యను తయారుచేయటం సహజం కానీ లక్షణాలు
కలవారిని తయారుచేయాలి, ఈ ఆశనే బాప్ బాప్ దాదా ప్రతి ఒక్క సితారపై
పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ కార్యం మిగిలి ఉంది. లక్షణాలు కలిగినవారిని తయారు
చేయాలి. సంఖ్యను తయారుచేయటం అనేది జరుగుతుంది. కాని ఇప్పుడు ఈవిధమైన లక్షణాలు
కలిగినవారిని తయారుచేసే సేవ మిగిలి ఉంది. లక్షణాలు కలిగిన ఒక ఆత్మ సంఖ్యని
స్వతహాగానే తీసుకువస్తుంది. లక్షణాలు గల ఒక ఆత్మ అనేకమందిని తీసుకురాగలదు.
క్వాలిటీ, క్వాంటిటీని తీసుకురాగలదు. ఇప్పుడు మిగిలి ఉన్న కార్యాన్ని పూర్తి
చేయాలి. మీ సేవ యొక్క క్వాలిటీ (లక్షణాలు)తో మీరు సంతుష్టంగా ఉన్నారా? సంఖ్యని
చూసి సంతోషపడుతున్నారు కానీ లక్షణాలు కలిగిన వారిని చూసి సేవలో సంతుష్టం
అవ్వాలి. లక్షణాలు గల వారిని ఎలా తీసుకువస్తారు? ఎవరిలోనైతే ఎన్ని దైవీలక్షణాలు
ఉంటాయో అంతగానే లక్షణాలు కలిగిన వారిని తీసుకురాగలరు. కొంతమంది పిల్లలకి తమ
పురుషార్ధంలో, సేవలో చాలా శ్రమ చేయవలసి వస్తుంది. కొంతమందికి ఎక్కువ శ్రమ
చేయవలసి ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. దీనికి కారణం ఏమిటి? అప్పుడప్పుడు
వారికే శ్రమ అనిపిస్తుంది, మరలా అప్పుడప్పుడు వారికే సహజం అనిపిస్తుంది.
ఎందువలన? ధారణ లోపం కారణంగా శ్రమ అనిపిస్తుందా? కొన్ని కర్తవ్యాలలో ప్రజలు
వీరికి భాగ్యంలోనే లేదు అంటారు. ఇక్కడైతే అలా అనరు. ఏ విశేష లోపం కారణంగా శ్రమ
అనిపిస్తుంది? శ్రీమతంపై నడవాలి. అయినప్పటికీ ఎందుకు నడవలేకపోతున్నారు? ఏ
కార్యంలో అయినా అంటే పురుషార్థములో అయినా, సేవలో అయినా శ్రమ అనిపిస్తుంది. అంటే
కారణం ఏమిటంటే - విషయాలు అందరి బుద్దిలో ఉంటున్నాయి కానీ ఆ విషయాల యొక్క
లోతులకి వెళ్ళటంలేదు. లోతైన బుద్ధి గలవారికి ఎప్పుడు శ్రమ అనిపించదు. పైపై
బుద్ధి కారణంగా శ్రమ అనిపిస్తుంది. శ్రీమతంపై నడవడానికి లోతైన బుద్ధి కావాలి.
లోతులోకి వెళ్ళే అభ్యాసం చేయాలి. దీనినే మరో మాటలో - ఏది విన్నారో అది చేయాలి
అంటారు. అంటే దాని లోతులోకి వెళ్ళాలి. మజ్జిగను చిలికినప్పుడు వెన్న ఎలా
వస్తుందో అలాగే ఇక్కడ కూడా లోతులోకి వెళ్ళాలి. లోతులోకి వెళ్ళని కారణంగానే శ్రమ
అనిపిస్తుంది. లోతులోకి వెళ్ళడానికి బదులు ఆ విషయం యొక్క బాహ్యరూపం
చూస్తున్నారు. సేవ చేసే సమయంలో కూడా లోతైన బుద్ధితో జ్ఞానం యొక్క లోతులోకి
వెళ్ళి వారికి చెప్పాలి మరియు వారిని కూడా జ్ఞానం యొక్క లోతులోకి తీసుకువెళ్ళి
వారి శ్రమను కూడా తగ్గించాలి మరియు మీకు కూడా శ్రమ తగ్గాలి. ఈ లోతు యొక్క లోపమే
ఉంది. ఇప్పుడు ఇదే పురుషార్థం చేయాలి. శారీరక శక్తి కూడా ఎలా వస్తుంది? భోజనం
బాగా నమిలి తినినప్పుడు భోజనం శక్తిగా మారుతుంది, భోజనం యొక్క లోతు రూపం ఏమిటి?
రక్తం. రక్తంగా మరినప్పుడే శక్తి వస్తుంది. ఇప్పుడు కేవలం బయట, పైపై రూపం
చూడకుండా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎంత ప్రతి విషయంలో లోపలికి వెళ్తారో
అంత రత్నాలు లభిస్తాయి, మరియు ప్రతి విషయం యొక్క విలువ తెలుస్తుంది. ఎంత జ్ఞానం
యొక్క విలువ, సేవ యొక్క విలువ తెలుస్తుందో అంత విలువైన రత్నాలుగా అవుతారు.
జ్ఞానరత్నాల విలువను తక్కువ చేస్తే స్వయం కూడా విలువైన రత్నాలుగా కాలేరు.
ఒక్కొక్క రత్నం యొక్క విలువను పరిశీలించడానికి ప్రయత్నం చేయండి. మీరు బాప్
దాదాకి విలువైన రత్నాలు కదా! విలువైన రత్నాలను ఏమి చేస్తారు? (దాచి ఉంచుతారు).
విలువైన రత్నాలను బాప్ దాదా కూడా దాచి ఉంచుతున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. మాయ
నుండి రక్షణగా దాస్తున్నారు. మాయతో దాచి ఎక్కడ పెడుతున్నారు? ఎంతెంత అమూల్య
రత్నాలుగా ఉంటారో అంతంత బాబా హృదయసింహాసనంలో ఉంటారు. ఎప్పుడైతే హృదయ
సింహాసనాధికారి అవుతారో అప్పుడు రాజ్య సింహాసనాధికారి అవుతారు. సంగమయుగం యొక్క
సింహాసనం ఏమిటి? సింహాసనం ఉందా లేక బీదవారా? సంగమయుగంలో ఏ సింహాసనం లభిస్తుంది?
బాప్ దాదా యొక్క హృదయ సింహాసనం. ప్రపంచంలో ఉన్న అన్ని సింహాసనాల కంటే
శ్రేష్టమైనది ఈ సింహాసనం. ఎంత గొప్ప సింహాసనం సత్యయుగంలో లభించిన కానీ ఈ
సింహాసనం ముందు అది ఎంత? ఈ సింహాసనం ఎక్కవలసిన, దిగవలసిన పని లేదు. ఈ
సింహాసనంపై ఉంటే మాయ ఏమి చేయలేదు. దీనిని ఎక్కే దిగే పని లేదు. దీనిపై ఉండటం
ద్వారా మాయ యొక్క సర్వబంధనాల నుంచి ముక్తులుగా ఉంటారు. మంచిది. |
|