17.11.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


భూమి (వ్యక్తం) నుండి ఆకాశానికి (అవ్యక్తంలోకి) వెళ్ళే యుక్తులు

ఈ భట్టీకి దేనికోసం వచ్చారు? దేహంలో ఉంటూ విదేహిగా అయ్యే అభ్యాసం చేయటం కోసం వచ్చారు. ఎప్పుడైతే ఇక్కడ పాదం పెట్టారో అప్పటి నుండే ఈ స్థితి ఉండాలి. ఏదైతే లక్ష్యం పెట్టుకుంటామో దానిని చేరుకోవడానికి అభ్యాసం మరియు ధ్యాస కావాలి.

బాప్ దాదా ప్రతీ ఒక్కరినీ క్రొత్త విషయం కోసం పిలిచారు. గృహస్థంలో ఉన్న అన్నయ్యలను (అదరకుమారులు) విశేషంగా ఎందుకోసం పిలిచారంటే ఇంతకు ముందు గృహస్థంలో ఏవైతే వ్యతిరేకమైన మెట్లు ఎక్కారో వాటి నుండి క్రిందకి దింపడానికి పిలిచారు. ఆ వ్యతిరేక మెట్ల నుండి దిగి మరలా ఏ మెట్లు ఎక్కాలి? భూమి నుండి ఆకాశానికి వెళ్ళాలి. వ్యతిరేకమైన మెట్ల యొక్క జ్ఞానం కొద్దిగా ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానం నుండి అజ్ఞానిగా చేయడానికి మరియు సత్యజ్ఞానం యొక్క పరిచయం ఇచ్చి జ్ఞాన స్వరూపంగా చేయటానికి పిలిచాను. మొదట దించాలి, ఆ తర్వాత ఎక్కించాలి. పూర్తిగా దిగనంత వరకు ఎక్కలేరు కూడా. అన్ని విషయాల నుండి దిగిపోవటానికి తయారుగా ఉన్నారా? ఎంత పెద్ద మెట్ల నుండి దిగాలి. వ్యతిరేక మెట్లు ఎంత పెద్దవి? ఇప్పటివరకూ ఏదైతే పురుషార్ధం చేసారో దానిలో పూర్తిగా మెట్లు దిగిపోయాం అని భావిస్తున్నారా లేక ఇప్పుడు దిగుతూ ఉన్నారా? పూర్తిగా దిగిపోతే ఎక్కడంలో ఆలస్యమవ్వదు. కానీ దిగుతూ, దిగుతూ అక్కడక్కడా ఆగిపోతున్నారు. కనుక ఏ లక్ష్యంతో పిలిచానో ఇప్పుడు అర్థమైందా? 63 జన్మలలో ఏవైతే వ్యతిరేక మెట్లు ఎక్కారో వాటి నుండి పూర్తిగా దిగిపోవాలి. తర్వాత ఎక్కాలి కూడా. దిగటం సహజమా లేక ఎక్కడం సహజమా? దిగటం సహజమేనా లేక అది కూడా కష్టమేనా? ఇప్పుడు ఏదైతే పురుషార్ధం చేస్తున్నారో అది దిగిపోయి ఎక్కడానికి చేస్తున్నారా లేక కేవలం ఎక్కడానికే చేస్తున్నారా? కొన్ని తొలగించుకుంటున్నారు, కొన్ని తయారు చేసుకుంటున్నారు. రెండు పనులు జరుగుతున్నాయి కదా! అంతిమ మెట్టు ఏది దిగాలో మీకు తెలుసా? ఈ దేహాభిమానాన్ని వదిలేయాలి. శరీరం యొక్క వస్త్రాన్ని ఎంత సహజంగా తీసేస్తున్నారో అలాగే ఈ శరీరం అనే వస్త్రాన్ని కూడా సహజంగా తీసేయాలి. మరియు సహజంగానే సమయానికి ధరించాలి ఈ అభ్యాసం పూర్తిగా నేర్చుకోవాలి. కానీ కొందరికీ ఈ దేహాభిమానం ఎందుకు తొలగటం లేదు? ఈ దేహం యొక్క వస్త్రం సహజంగా ఎందుకు తీయలేకపోతున్నారు? ఎవరి వస్త్రం అయితే బిగువుగా ఉంటుందో వారు వస్త్రాన్ని తీయలేరు. అలాగే ఇక్కడ కూడా ఏదోక సంస్కారంతో ఈ దేహమనే వస్త్రం తగులుకుని ఉంటే దీనిని కూడా తీయలేరు. లేకపోతే ఎక్కడం, దిగడం మరియు ఈ దేహమనే వస్త్రం వదలటం మరియు ధరించటం చాలా సహజం. ఈ దేహ రూపీ వస్త్రం ఏ సంస్కారంతో తగులుకుని ఉంది అని పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే అన్ని సంస్కారాలతో అతీతం అయిపోతారో అప్పుడు స్థితి కూడా అతీతం అయిపోతుంది. అందువలనే బాప్ దాదా కూడా అనేకసార్లు చెప్తారు - అన్ని విషయాలలో సహజంగా ఉండండి అని. ఎప్పుడైతే స్వయం అన్నింటిలో సహజంగా ఉంటారో అప్పుడు అన్ని కార్యాలూ సహజం అయిపోతాయి. మిమ్మల్ని మీరు బిగువు చేసుకుంటే కార్యంలో కూడా బిగువు వచ్చేస్తుంది. ఇంత సమయం నుండి పురుషార్థంలో నడుస్తున్నారు కదా! వారికి ఇప్పటికే కర్తవ్యంలో చాలా అతీత స్థితి రావాలి. ఇప్పుడు ఈ భట్టిలో ఏదైతే బిగువు స్థితి ఉందో దానిని మరియు ఏవైతే వ్యతిరేక మెట్లు దిగవలసి ఉన్నాయో అవి దిగిపోవాలి మరియు లిఫ్ట్ ఎక్కాలి. కానీ లిఫ్టులో కూర్చోవడానికి ఏమి చేయాలి? లిఫ్టులో ఎవరు కూర్చోగలరు? బాబాకి అయితే మొత్తం ప్రపంచంలో యోగ్యమైన పిల్లలే శ్రేష్ఠ బహుమతి. కనుక లిఫ్టులో ఎక్కడానికి బాబాకి బహుమతిగా అవ్వాలి మరియు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ బహుమతి రూపంలో ఇచ్చేయాలి. బాబాకి బహుమతిగా అవ్వాలి మరియు బాబాకి బహుమతి ఇవ్వాలి. అప్పుడే లిఫ్టులో కూర్చోగలరు. అర్థమైందా? ఇప్పుడు బహుమతి ఇచ్చానా మరియు బహుమతిగా అయ్యానా, ఈ రెండు పనులూ చేసానా? అని చూసుకోండి. బహుమతిని చాలా సంభాళించుకుంటారు మరియు షోకేస్లో అలంకరించి పెడతారు. ఏయే రకాల బహుమతులో అయా రకాలుగా అలంకరించి పెడతారు. అలాగే మీరు కూడా ఎలాంటి బహుమతిగా అవ్వాలంటే - దాని ద్వారా లిఫ్ట్ కూడా లభించాలి మరియు సృష్టి అనే షోకేస్లో అందరి కంటే ముందు ఉండాలి. షోకేస్లో అందరికంటే ముందు ఉండడానికి అదర్ కుమారులు రెండు విషయాలపై ధ్యాస ఉంచుకోవాలి. షోకేస్లో పెట్టే వస్తువులలో ఏ విశేషత ఉంటుంది?( ఆకర్షణీయంగా ఉండేవి) 1. మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా (అట్రాక్టివ్) చేసుకోవాలి. 2.చురుకుగా (యాక్టివ్) ఉండాలి. విశేషంగా ఈ రెండు విశేషతలను అదర్ కుమారులు నింపుకోవాలి. ఈ రెండు గుణాలూ వచ్చేస్తే ఇంకేమీ మిగలవు. అక్కడక్కడా చురుకుగా ఉండటంలో లోపం కనిపిస్తుంది. ఈ భట్టీ నుండి విశేషంగా ఏ ముద్ర వేసుకుని వెళ్తారు? ఆకర్షణీయులు మరియు చురుకైనవారు అనే ముద్ర వేసుకుని వెళ్తే మీ నడవడిక (యాక్టివిటీ) కూడా మారిపోతుంది. ఎంతెంత ఈ ముద్ర లేదా గుర్తు వేసుకుని వెళ్తారో అంతంత మీ నడవడిక దృఢంగా మరియు పరివర్తన అయినట్లు కనిపిస్తుంది. ముద్రయే బలహీనంగా వేసుకుని వెళ్తే నడవడికలో కూడా మార్పు కనిపించదు. విన్నారు కదా - భట్టికి రావటం అంటే మీ రంగు మరియు రూపాన్ని మార్చుకోవాలి.

భట్టిలో వేసిన వస్తువులో ఏదైతే కల్తీ ఉంటుందో అది కాలిపోతుంది. అసలు రూపాన్ని, అసలు కర్తవ్యాన్ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళాలి. ఆ రూపం ఏమిటి? ఏమి మార్చుకుంటారు? ఇప్పుడు రంగు మార్చుకుంటున్నారు. ఒకే రంగుని గట్టిగా ఉంచుకోవాలి. దానిపై ఏ రంగు అంటకూడదు. మరియు ఆ రంగుని ఎవరు చెరపలేకుండా ఉండాలి మరియు చెరగకూడదు.మరొక రంగు అంటుకోకూడదు. అన్ని విషయాలలో చురుకుగా ఉండాలి. ఏ సమయంలో ఏ సేవ అయినా కానీ సదా తయారుగా ఉండాలి. ఏ పనిలో అయినా కాని ఎవరైతే చురుకుగా ఉంటారో వారు ఆ కార్యాన్ని త్వరగా అర్థం చేసుకుని సఫలతని పొందుతారు. చురుకుగా లేనివారు ఆ కార్యం గురించే ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ సమయాన్ని పోగొట్టుకుంటారు మరియు సఫలత కూడా రాదు. చురుకుగా అంటే సదా తయారుగా ఉండాలి. వారు ప్రతి కార్యాన్ని కూడా పరిశీలించగలరు. దానిలో ఇమిడిపోతారు కూడా మరియు సఫలత కూడా పొందుతారు. ఈ మూడు విషయాలు వారిలో ఉంటాయి. బరువుగా ఉంటే చురుకైనవారు అని అనరు. పురుషార్థంలో, సంస్కారాలలో బరువుగా ఉన్న వారిని చురుకైనవారు అని అనరు. చురుకుగా ఉండేవారు సదా తయారుగా ఉంటారు మరియు సహజంగా ఉంటారు. స్వయం సహజంగా అయితే అన్ని కార్యాలు సహజం అయిపోతాయి మరియు పురుషార్ధం కూడా సహజం అయిపోతుంది. స్వయం సహజంగా లేకపోతే పురుషార్థం మరియు సేవ కూడా సహజంగా ఉండవు. కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. సేవ కష్టం కాదు కానీ మీ సంస్కారాలు, బలహీనతలు కష్టం రూపంలో కన్పిస్తున్నాయి. పురుషార్థం కూడా కష్టం కాదు. కానీ మీ బలహీనతలు కష్టంగా చేస్తున్నాయి, లేకపోతే కొందరికి సహజంగా, కొందరికి కష్టంగా ఎందుకు అనిపిస్తుంది? ఒకవేళ కష్టమే అయితే అన్ని విషయాలు, అందరికి కష్టం అనిపించాలి కానీ అదే విషయం కొంతమందికి కష్టం, కొంతమందికి సహజం ఎందువలన? మీ బలహీనతలే కష్టరూపంలో వస్తాయి. అందువలన ఈ రెండు విషయాలను ధారణ చేయాలి. ఎప్పుడైతే మొదట మీలో విశేషతలు ఉంటాయో అప్పుడే ఆకర్షణీయంగా కాగలరు. ఆకర్షణీయంగా ఉండడానికి హర్షితంగా కూడా ఉండాలి, హర్షితంగా అంటే అతీంద్రియ సుఖంలో ఊగాలి. ఙ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితంగా ఉండాలి. అవ్యక్తస్థితిని అనుభవం చేసుకుంటూ అతీంద్రియ సుఖంలో ఊగాలి. వారినే హర్షితులు అని అంటారు. మనస్సుతో మరియు తనువుతో రెండు రకాలుగా హర్షితంగా ఉండాలి. ఎవరైతే ఇలా హర్షితంగా ఉంటారో వారే ఆకర్శణీయంగా ఉంటారు. ప్రకృతి మరియు మాయకి ఆధీనం కాకుండా ఆధీనం చేసుకోవాలి. ఆధీనం అయిపోతున్న కారణంగా అధికారాన్ని పోగొట్టుకుంటున్నారు. అందువలన ఆధీనం కాకూడదు. ఆధీనం చేసుకోవాలి అప్పుడే మీ అధికారాన్ని పొందుతారు. ఎంత అధికారాన్ని పొందుతారో అంత ప్రకృతి మరియు ప్రజల ద్వారా గౌరవం లభిస్తుంది. కనుక గౌరవం పొందడానికి ఏమి చేయాలి? ఆధీనతను వదలి అధికారాన్ని ఉంచుకోండి. అధికారం ఉంచుకోవటం ద్వారా అధికారిగా అవుతారు కాని అధికారం వదిలి ఆధీనం అయిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకి ఆధీనం అయిపోతున్నారు, మీ రచనకి ఆధీనం అయిపోతున్నారు. రచన అంటే లౌకిక పిల్లలు కాదు కానీ రచన అంటే సంకల్పాలకి ఆధీనం అయిపోతున్నారు. ఎలాగైతే లౌకిక పిల్లలకి ఆధీనం అయిపోతున్నారో అలాగే మీ రచన అయిన సంకల్పాలకు, కర్మేంద్రియాలకి కూడా ఆధీనం అయిపోతున్నారు. ఆధీనం అవ్వటం ద్వారానే మీ అధికారాన్ని పోగొట్టుకుంటున్నారు. కనుక పిల్లలుగా అయ్యారు అంటే అధికారిగా అయ్యారు. సర్వదా సుఖం, శాంతి, పవిత్రత జన్మ సిద్ద అధికారం అని చెప్తారు కదా! మిమ్మల్ని మీరు అడగండి - పిల్లలుగా అయ్యాము, కానీ పవిత్రత, సుఖం, శాంతి యొక్క అధికారాన్ని పొందామా అని? ఒకవేళ అధికారం పోయింది అంటే ఏదోక విషయానికి ఆధీనం అయిపోతారు. ఇప్పుడు ఆధీనతను వదలండి. మీ జన్మ సిద్ధ అధికారాన్ని పొందండి. ఏదైతే చెప్తున్నారో దాని ప్రభావం ఎప్పుడు పడుతుంది?

7 సంవత్సరాల తర్వాత వస్తుందా లేక రెండు సంవత్సరాల తర్వాత వస్తుందా? ప్రభావం కూడా పడకపోవడానికి కారణం ఏమిటి? ఎందుకంటే ఇప్పటివరకూ కొన్ని విషయాలలో స్వయమే ప్రభావితం అయిపోతున్నారు. ఎవరైతే స్వయం ప్రభావితం అయిపోతారో వారి ప్రభావం పడదు. ప్రభావం పడాలంటే ఈ అన్ని విషయాలకి ప్రభావితం కాకూడదు. అప్పుడు చూడండి ఎంత త్వరగా ప్రభావం వస్తుందో? మీ నడవడిక ద్వారా ప్రభావం వేయగలరు. ఇటువంటి సౌభాగ్యం మొత్తం కల్పంలో ఒక్కసారే లభిస్తుంది. సత్యయుగంలో కూడా లౌకిక తండ్రితో ఉంటారు కానీ పారలౌకిక తండ్రితో ఉండరు. 84 జన్మలలో ఎంత అలంకరించుకుని ఉంటారు? రకరకాల అలంకరణ చేసుకున్నారా? బాప్ దాదా యొక్క స్నేహం ఇదే - పిల్లలను అలంకరించి షోకేస్లో సృష్టి ఎదురుగా తీసుకురావాలి అని. అందరూ సంపూర్ణంగా అయ్యి షోకేస్ అంటే విశ్వం ఎదురుగా వస్తే ఆ అలంకరణ ఎంత అందంగా ఉంటుంది. సత్యయుగం యొక్క అలంకరణ కాదు. గుణాల నగలను ధరించాలి. మంచిది.