25.12.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అనాసక్తంగా అయ్యేటందుకు తనువు మరియు మనస్సుని తాకట్టు వస్తువులుగా భావించండి

బాప్ దాదాని ఎక్కడికి పిలిచారు మరియు ఎందువలన పిలిచారు? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? మధువనంలో వచ్చారు. కానీ మధువనంలో కూడా బాబా ఎక్కడికి వచ్చారు? పూలతోటలో కూర్చున్నారా? లేక సభలో కూర్చున్నారా? బాప్ దాదా ఆత్మల ఆత్మీయతను చూస్తున్నారు. మరియు వెనువెంట ప్రతీ పుష్పం ద్వారా వచ్చే ఆత్మిక సువాసనను కూడా తీసుకుంటున్నారు. బయటివారు పూల ద్వారా సారాన్ని తీస్తారు. దానిని సెంటు అంటారు. దాని సువాసన చాలా మంచిగా మరియు మధురంగా ఉంటుంది. మధవనంలో ఉంటూ కూడా ఆత్మిక ప్రపంచంలో విహరిస్తున్నారు. మీరందరూ కూడా ఆత్మిక రూపంలో ఉంటూ ప్రతీ కర్మ చేయాలి. అప్పుడే సర్వీసులో లేదా కర్మలో వెలుగు వస్తుంది. ఇప్పుడు క్రొత్తదనం కావాలనుకుంటున్నారు కదా! లేక ఎలా నడుస్తున్నారో దానిలో సంతుష్టంగా ఉన్నారా? ఎప్పుడైతే ప్రతీ కర్మలో, ప్రతీ సంకల్పం, మాటలో ఆత్మీయత వచ్చినప్పుడే క్రొత్త వెలుగు వస్తుంది. ఆత్మీయత ఎలా వస్తుంది? ఆత్మీయత సదా స్థిరంగా ఉండడానికి ఏమి చేయాలి? ఏమి మారాలి? (ప్రతీ ఒక్కరూ భిన్న భిన్న విషయాలు చెప్పారు) ముఖ్య విషయాలు అన్నీ అందరికీ పక్కాగా ఉన్నాయి. కానీ ఆత్మీయత ఉండకపోవడానికి కారణం ఏమిటి? నమ్మకధారిగా, ఆజ్ఞాకారిగా ఎందుకు కాలేకపోతున్నారు (సంబంధం యొక్క లోపం). సంబంధంలో కూడా ఎందుకు లోపం వస్తుంది? నిశ్చయబుద్ధి యొక్క తిలకం అందరికీ పెట్టబడింది. ఆత్మీయత ఎందుకు స్థిరంగా ఉండటం లేదు? ఆత్మీయత స్థిరంగా ఉండకపోవడానికి కారణం ఏమిటంటే తమని తాము మరియు ఇతరులని అనగా ఎవరి సేవ కోసం మనం నిమిత్తం అయ్యామో వారిని బాప్ దాదా యొక్క తాకట్టు వస్తువుగా భావించాలి. ఎంతగా మిమ్మల్ని మీరు మరియు ఇతరులని తాకట్టుగా భావిస్తారో అంతగా ఆత్మీయత వస్తుంది. తాకట్టుగా భావించకపోతే ఏదోక లోపం వస్తుంది. మనస్సులో సంకల్పాలను కూడా మనస్సుని తాకట్టు వస్తువుగా భావించి చేయండి. ఈ తాకట్టు వస్తువుని నాది అనే భావం కలపకూడదు. దీనినే మరోమాటలో మీరు ఇతరులకి చెప్తారు - నిమిత్తంగా ఉండండి అని. వారికి నిమిత్తంగా ఉండండి అని చెప్తున్నారు కానీ మీ మనస్సు, తనువు మరియు ఏవైతే నిమిత్త రూపంలో లభించాయో అనగా జిజ్ఞాసువులు అయినా, సెంటరు అయినా, లేక స్థూలంగా ఏ వస్తువులు అయినా కానీ తాకట్టు వస్తువులుగా భావించాలి. తాకట్టుగా భావించడం వలన అనాసక్తత వస్తుంది. బుద్ధి అటు వెళ్ళదు. అనాస్తకంగా ఉండటం ద్వారా ఆత్మీయత వస్తుంది. ఇంతగా మిమ్మల్ని మీరు పూర్తిగా దీపానికి బలి చేసుకోవాలి. ఎంతగా బలి అవ్వాలంటే ఇవి నా సంస్కారాలు అనే మాట కూడా తొలగిపోవాలి. నా సంస్కారం అనేది మరలా ఎక్కడ నుండి వచ్చింది? నా సంస్కారం కారణంగానే ఈ విషయాలు అన్నీ వచ్చేస్తున్నాయి. నా సంస్కారం అనేది ఎక్కడ నుండి వచ్చింది? సంస్కారమే మారిపోవాలి అంతగా బలి అయిపోవాలి. సంస్కారమే మారిపోయినప్పుడు మీరందరూ అవ్యక్త చిత్రాలుగా అయిపోతారు. సంగమయుగం యొక్క సంపూర్ణ స్థితికి చిత్రం ఏమిటి? ఫరిస్తాలో ఏ విశేషత ఉంటుంది. పూర్తిగా తేలికతనం ఉంటుంది. తేలికతనం కారణంగా ఎటువంటి పరిస్థితి అయినా తమ స్థితిని ఆవిధంగా తయారుచేసుకుంటారు. బరువుగా ఉండేవారు ఏ పరిస్థితులలోనూ తమని తాము స్థితులు చేసుకోలేరు. ఫరిస్తా యొక్క ముఖ్య విశేషత అన్ని విషయాలలో తేలికగా ఉంటారు. సంకల్పం, వాణీలో, కర్మలో మరియు సంబంధంలో కూడా తేలికగా ఉంటారు. ఈ నాలుగు విషయాలలో తేలికగా ఉంటే ఫరిస్తా స్థితి ఉన్నట్లు. ఇప్పుడు ఈ నాలుగు విషయాలలో ఎంత తేలికతనం వచ్చింది? అని మీకు మీరు చూసుకోవాలి. ఎవరైతే తేలికగా ఉంటారో వారు ఏ ఆత్మ సంస్కారాలని అయినా పరిశీలించగలరు. మరియు ఏ పరిస్థితి ఎదురుగా వచ్చినా కానీ ఒక్క సెకనులో నిర్ణయం చేయగలరు. ఇదే ఫరిస్తా స్థితి యొక్క పరిశీలన. ఈ అన్నీ గుణాలు ప్రతి కర్మలో ప్రత్యక్షంగా కనిపించినప్పుడే సంపూర్ణ స్థితికి సమీపంగా వచ్చినట్లు భావించండి. సాకార బాబాలో సంపూర్ణ స్థితి ఏ విషయాలలో కన్పించేది. ముఖ్య విషయం మీ సంపూర్ణ స్థితిని ఈ విషయాల ద్వారా మీరే పరిశీలించుకోండి. ఈ గ్రూప్ యొక్క ముఖ్య గుణం ఏమిటి? ఆ గ్రూప్ యజ్ఞ స్నేహి మరియు ఈ గ్రూప్ యజ్ఞ సహయోగి. సహయోగంలో అయితే అందరూ పాస్ అయ్యారు. ఒక ఏమి చేయాలి? ఇలాంటి స్థితి కూడా వస్తుంది. ఎవరి మనస్సులో ఏ సంకల్పం వస్తే అది మొదటే మీకు చేరిపోతుంది. వారు చెప్పవలసిన, మీరు వినవలసిన అవసరం ఉండదు. కానీ ఈ స్థితి కొరకు అనగా ఇతరుల సంకల్పాలను తెలుసుకునేటందుకు మీ సంకల్పాలపై పూర్తి బ్రేక్ ఉండాలి మరియు శక్తిశాలిగా ఉండాలి. ఒకవేళ మీ సంకల్పాలని మలుచుకోలేకపోతే ఇతరుల సంకల్పాలను అర్ధం చేసుకోలేరు. అందువలన సంకల్పాలను సర్దుకోవాలి. ఎంతెంత సంకల్పాలని మలుచుకునే శక్తి ఉంటుందో అంత ఇతరుల సంకల్పాలను అర్థం చేసుకునే శక్తి కూడా ఉంటుంది. మీ సంకల్పాల విస్తారంలోకి వెళ్ళిపోతున్న కారణంగా మిమ్మల్ని మీరే అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఇక ఇతరులను ఏమి అర్ధం చేసుకుంటారు? అందువలన ఈ స్థితి కూడా నెంబర్ పురుషార్ధం అనుసరించి వస్తుంది. ఇది కూడా సంపూర స్థితికి పరిశీలన. ఎంత వరకు సంపూర్ణ స్థితికి సమీపంగా వచ్చారో ఈ విషయాల ద్వారా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఇది ఆల్ రౌండ్ గ్రూప్, ఆల్ రౌండర్ల లక్ష్యం ఏమి ఉంటుంది? లక్షణాలు ఉన్నాయి కానీ ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో అది ఇంకా ముందుకి వెళ్ళడానికి పెట్టుకోవాలి. ఇప్పటివరకు ఏదైతే ప్రత్యక్షంలో చేసారో ఆ లెక్క ద్వారా ఏ రాజుగా లెక్కించబడతారు? ఇప్పుడు చేసిన సేవ యొక్క సాక్షాత్కారం ప్రకారం ఏ రాజు అవుతారు? పురుషార్థం ద్వారా పదవి స్పష్టం అవుతూ ఉంటుంది. సూర్యవంశీయులే కాని ఒకరు విశ్వ మహారాజు. ఆ విశ్వమహారాజుతో పాటు వెనువెంట తమ రాజ్యం యొక్క రాజులు కూడా ఉంటారు. మీరు ఏ రాజు ఇప్పుడు చెప్పండి? ఆదిలో ఎవరు వస్తారు. విశ్వమహారాజు అవ్వాలన్నా లేక విశ్వ మహారాజు యొక్క సమీప సంబంధీకులు అవ్వాలన్నా సాధనం ఏమిటి? విశ్వకళ్యాణం అయితే సరే కానీ విశ్వమహారాజు అయ్యేవారికి ఇప్పుడు ఏమి గుర్తు ఉంటుంది? ఇది కూడా బ్రాహ్మణుల విశ్వం అంటే చిన్న ప్రపంచం కనుక ఎవరైతే విశ్వమహారాజులు అవుతారో వారికి విశ్వం అంటే బ్రాహ్మణ కులం యొక్క ప్రతీ ఆత్మతో సంబంధం ఉంటుంది. ఇక్కడ ఈ చిన్న పరివారంలో సర్వుల సంబంధంలోకి ఎవరైతే వస్తారో వారే అక్కడ విశ్వమహారాజు అవుతారు. ఇప్పుడు ఏ రాజు అవుతారో చెప్పండి. స్వయం సింహాసనంపై కూర్చుంటారు. మరియు సింహాసనాధికారి అయ్యేవారికి సమీప సహయోగ్యులుగా ఉంటారు. సమీప సంబంధీకులుగా కూడా అవ్వాలంటే ఇప్పుడేమి చేయాలి? పూర్తి దైవీపరివారంతో, సర్వాత్మలతో ఏదొకరకంగా సహయోగి అవ్వాలి. మొత్తం కులం యొక్క సేవకి నిమిత్తం అవ్వటం. కేవలం సర్వీసుకి నిమిత్తం అవ్వటం. కానీ ఏదోక రకంగా అందరికి సహయోగి అవ్వాలి. అలాగే అక్కడ వారికి సమీప సహయోగి అవుతారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి.

విశ్వమహారాజుగా అవుతారు కదా! నెంబర్ వారీగా విశ్వమహారాజులుగా ఎవరెవరు అవుతారు అనేది కూడా రోజు రోజుకి ప్రత్యక్షంగా చూస్తారు. ఇప్పుడు ఇక తయారుకాలేము అని అనుకోకండి. ఇప్పుడు కూడా జంప్ చేసి వెళ్ళవచ్చు. మేకప్ (అలంకరణ) చేసుకోవడానికి ఇప్పుడు ఇంకా సమయం ఉంది కానీ కొద్ది సమయమే ఉంది. సమయం తక్కువ ఉంది కనుక విశేష శ్రమ చేయాలి. కానీ అలంకరణ చేసుకోవచ్చు. విశ్వమహారాజు యొక్క సంస్కారాలు ఎలా ఉంటాయి? ఈ రోజు బాప్ దాదా విశ్వమహారాజుగా తయారుచేసే చదువు చదివిస్తున్నారు. వారి సంస్కారాలు ఏమి ఉంటాయి? బాబా సర్వులకి స్నేహి మరియు సర్వులు బాబాకి స్నేహి. ఈ గుణం ప్రత్యక్షంలో చూసారు కదా! అలాగే ఒక్కొక్కరు వారి పట్ల స్నేహం యొక్క పూల వర్షం కురిపిస్తారు. స్నేహం యొక్క పూలవర్షం ఇక్కడ పడినప్పుడే జడచిత్రాలపై కూడా పూలు వేస్తారు. ఆత్మనైన నాపై పూలవర్షం ఎంత కురుస్తుంది అని మీకు మీరు చూసుకోండి. వారు దాగి ఉండరు. ఎంత స్నేహ పుష్పాలు పడతాయో అంత ద్వాపరయుగంలో పూజా పుష్పాలు పడతాయి. అక్కడక్కడ కొద్దిమంది పువ్వులు వేయడానికి అప్పుడప్పుడు వెళ్తారు మరియు అక్కడక్కడ రోజూ పుష్పవర్షం ఉంటుంది. తెలుసా? దీనికి కారణం ఏమిటి? అందరి స్నేహ పుష్పాలకి పాత్రులు అవుతాము అనే లక్ష్యం పెట్టుకోండి. స్నేహం ఎలా లభిస్తుంది? ఒక్కొక్కరికి మీరు సహయోగం ఇస్తే మీకు సహయోగం లభిస్తుంది. మరియు ఇక్కడ ఎంతమందికి సహయోగి అవుతారో అంత స్నేహానికి పాత్రులు అవుతారు. మరియు అలాగే మరలా విశ్వమహారాజు అవుతారు. అందువలన లక్యం ఉన్నతంగా పెట్టుకోండి. ఈ రోజు భక్తి మార్గం యొక్క ఒక చిత్రం జ్ఞాపకం వస్తుంది. ఈ రోజు బాబా మిమ్మల్ని చూస్తున్నారు మరియు నవ్వుతున్నారు. వ్రేలు ఇచ్చేవారే కదా! వ్రేలు ఇచ్చేసారా లేక ఇవ్వాలా? ఎంత వరకు వ్రేలు చేరుకుంది? వ్రేలు ఇంకా ఇవ్వాలి అంటే ఎంత వరకు వ్రేలు చేరుకోవాలో అంత వరకు లేదు పర్వతం ఎత్తలేదు ఎందుకు ఎత్తడం లేదు? అందరి సంఘటితంలో బలం లభించినప్పుడే కల్పపూర్వం స్మృతిచిహ్నం సఫలత అవుతుంది. అందువలన కొద్దిగా ఎత్తుతున్నారు మరలా కూర్చుంటున్నారు. ప్రతి ఒక్కరు తమ వ్రేలు ఇస్తున్నారు కానీ ఇప్పుడు సంఘటిత రూపంలో అవసరం. స్వయం వ్రేలు ఇచ్చారు కానీ ఇప్పుడు సంఘటితంలో శక్తి నిండినప్పుడే బలం లభిస్తుంది. ఇప్పుడు శక్తి దళం ప్రత్యక్షం కానున్నది. అందరు పువ్వులుగా అయ్యారు. కానీ ఇప్పుడు సంఘటిత రూపంలో పుష్పగుచ్చంలోకి రావాలి. ఇప్పుడు కొన్ని కొన్ని పుష్పాలు అక్కడక్కడ రంగు చూపిస్తున్నాయి, కొన్ని సువాసన ఇస్తున్నాయి. కొన్ని తమ రూపాన్ని చూపిస్తున్నాయి. కానీ రంగు, రూపం, సువాసన అన్ని రకాలు పుష్పగుచ్చ రూపంలో వచ్చినప్పుడే ప్రపంచం ముందు ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు సంఘటిత రూపంలో ఏదోక క్రొత్తదనం ప్రపంచం ముందు చూపించాలి ఈ పద్ధతి ఆలోచించండి. ఒక్కొక్కరు వేరు అయిపోతున్న కారణంగా శ్రమ ఎక్కువ చేయవలసి వస్తుంది. కానీ సంఘటితంలో శ్రమ తక్కువ, సఫలత ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే సంగమ యుగం యొక్క సంఘటితాన్ని సఫలం చేసుకుంటారో అప్పుడు సేవలో సఫలత ఉంటుంది. యోగ్యతలు ఉన్నాయి కానీ తయారీ వరకు ఉండిపోతుంది. ఇప్పుడు మీ యోగ్యతల ద్వారా ఇతరులని కూడా బాబాకి సమీపంగా వచ్చే యోగ్యంగా చేయండి. ఆత్మలకి సంబంధం జోడించి బీజం వేసే గ్రూప్ ఇది. ఎలాంటి బీజం వేస్తే అలాగే జీవితం తయారవుతుంది. అన్ని విషయాలలో స్వయం ఎంత ధృడంగా ఉంటే అంత అనేకుల పునాది గట్టిగా చేయగలరు. ఎంత మీలో లక్షణాలు ఉంటాయో అంత లక్షణాలు కలిగినవారు వస్తారు. ఒకవేళ మీలో లక్షణాలు తక్కువగా ఉంటే లక్షణాలు కలిగినవారు తక్కువ వస్తారు. అందువలన మేము అందరి పునాది వేసేవారము అని భావించండి. మీ లక్షణాల ద్వారానే సంఖ్య తయారవుతుంది. బాప్ దాదా గుణాలు మీలో వచ్చినప్పుడే ఇతరులని మీ సమానంగా చేయగలరు.