18.01.1970
ఉదయం మురళి ఓం శాంతి
అవ్యక్త్-బాప్దాదా మధుబన్
సంపూర్ణ అర్పణ ద్వారా ఆత్మిక శక్తి యొక్క
ప్రాప్తి.
ఈరోజు
ఎందువలన పిలిచారు? ఈరోజు బాప్ దాదా ఏమి చూస్తున్నారు? ఒక్కొక్క సితారను ఏ
రూపంతో చూస్తున్నారు? సితారలలో కూడా ఏ విశేషతను చూస్తున్నారు? ప్రతి ఒక్క సితార
యొక్క సంపూర్ణత యొక్క సమీపతను చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి మీ గురించి మీకు
తెలుసు, ఎంత సంపూర్ణతకి సమీపంగా చేరుకున్నారో? సంపూర్ణతకి సమీపంగా చేరుకున్న
దానికి పరిశీలన ఏమిటి? సంపూర్ణత యొక్క పరిశీలన ఇదే - వారు అన్ని విషయాలను అన్ని
విధాలుగా, అన్ని రూపాలతో పరిశీలించగలరు. ఈ రోజంతా ఏమేమి స్మృతి వచ్చాయి? చిత్రం
స్మృతిలోకి వచ్చిందా లేక చరిత్ర స్మృతిలోకి వచ్చిందా! చిత్రంతో పాటు మరేదైనా
స్మృతి వచ్చిందా? (శిక్షణ, డ్రామా స్మృతి వచ్చాయి) చిత్రంతో పాటు విచిత్రం కూడా
స్మృతి వచ్చిందా? ఎంత సమయం చిత్రం స్మృతిలో ఉన్నారు? ఎంత సమయం విచిత్రుని
స్మృతిలో ఉన్నారు లేక రెండింటి స్మృతి కలిసి ఉందా? విచిత్రునితో పాటు
చిత్రాన్ని కూడా స్మృతి చేయటం ద్వారా స్వయం కూడా చరిత్రవంతులు అయిపోతారు. ఒకవేళ
కేవలం చిత్రం మరియు చరిత్రను స్మృతి చేస్తే చరిత్రయే స్మృతి ఉంటుంది. అందువలన
విచిత్రునితో పాటు చిత్రం మరియు చరిత్రను స్మృతి చేయాలి. ఈరోజు ఇంకేదైనా విశేష
కార్యం చేసారా? కేవలం స్మృతిలోనే నిమగ్నమయ్యారా లేక స్మృతితో పాటు ఇంకేదైనా
చేసారా? వికర్మలు వినాశనం అవ్వటం అనేది స్మృతికి ఫలితం, ఇది కాక విశేషంగా ఏమి
కర్తవ్యం చేసారు? పూర్తిగా ఒక సంవత్సరము యొక్క మీ చార్ట్ చూసారా? ఈ అవ్యక్త
చదువు, అవ్యక్త స్నేహం మరియు సహయోగం యొక్క ఫలితం పరిశీలించుకున్నారా? అవ్యక్తం
స్నేహం మరియు సహయోగానికి వార్షిక పరీక్ష ఏమిటో పరిశీలించుకున్నారా?
పరిశీలించుకున్న తర్వాతే మీ పై ఎక్కువ ధ్యాస పెట్టుకోగలరు. కనుక ఈ రోజు మీ
పేపర్ మీరే పరిశీలించుకోవాలి. ఈ వ్యక్త భావం కంటే అవ్యక్తభావం ఎంత వరకు
పెరిగింది? అనేది పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అవ్యక్త స్థితి పెరిగితే నడవడిక
అలౌకికంగా ఉంటుంది. అవ్యక్త స్థితి యొక్క ప్రత్యక్ష పరిశీలన ఏమిటి? అలౌకిక
నడవడిక. ఈ లోకంలో ఉంటూ అలౌకికంగా ఎంత వరకు అయ్యారనేది పరిశీలించుకోవాలి. ఈ
సంవత్సరంలో ఈ నిశ్చయం యొక్క పరీక్షలో అందరు ఎన్ని మార్కులు తీసుకున్నారో మీకు
తెలుసు. నిశ్చయం యొక్క పరీక్ష అయితే అయిపోయింది. ఇప్పుడు ఏ పరీక్ష జరగాలి? ఏ
విషయంలో పరీక్ష ఉంటుందో తెలిసినప్పటికీ ఫెయిల్ అయిపోతున్నారు. కొంతమందికి ఇది
పెద్ద పేపర్, కొంతమందికి ఇప్పుడు పెద్ద పేపర్ ఇవ్వాలి. ఎలా అయితే ఈ పేపర్ లో
నిశ్చయం యొక్క పరీక్ష జరిగిందో అలాగే ఇప్పుడు ఏమి పేపర్ జరగాలి? వ్యక్తంలో
ఇప్పుడు కూడా మీకు తోడు ఉన్నారు. ఎలా అయితే ఆదిలో నిమిత్తమైన సాకార తనువుతో
తోడుగా ఉండేవారో అలాగే ఇప్పుడు కూడా డ్రామాలో నిమిత్తమైన వారు సాకారంలో మీకు
తోడుగా ఉన్నారు. ఆదిలో కూడా నిమిత్తంగా ఉండేవారు. ఇప్పుడు కూడా నిమిత్తులు
ఉన్నారు. ఈ పరివారం అందరి యొక్క సాకార తోడు చాలా శ్రేష్టమైనది. అవ్యక్తంలో
అయితే బాబా తోడు ఉండనే ఉన్నారు. ఎంత స్నేహం ఉంటే అంత సహయోగం కూడా లభిస్తుంది.
స్నేహంలో లోపం కారణంగా సహయోగం కూడా తక్కువ లభిస్తుంది. సాకారంతో స్నేహం అంటే
మొత్తం పరివారంతో స్నేహం. సాకారం అంటే ఒక్కరే కాదు. ప్రజాపిత బ్రహ్మతో పాటు
పరివారం కూడా ఉంటుంది. మీరు మాలలో మణులు కదా! అంటే మాలలో ఒక మణియే ఉండదు. మాలలో
స్మృతి అనే ఒకే దారంలో, స్నేహంలో పరివారం అంతా ఇమిడి ఉంటుంది. దైవీకులం అయితే
భవిష్యత్తులో ఉంటుంది. కానీ ఈ బ్రాహ్మణ కులానికి చాలా గొప్పతనం ఉంటుంది.
ఎంతెంతగా బ్రాహ్మణకులంలో స్నేహం మరియు సమీపత ఉంటుందో అంతంత దైవీ రాజ్యంలో కూడా
సమీపత ఉంటుంది. సాకారంలో ఏమి ప్రత్యక్షత చూశారు? బాప్ దాదా ఎవరిని ముందు
పెట్టేవారు? పిల్లలని. ఎందుకంటే పిల్లలు లేకుండా తల్లి తండ్రి యొక్క పేరు
ప్రత్యక్షం అవ్వదు. కనుక సాకారంలో బాబా ఎలాగైతే కర్మ చేసి చూపించారో అలాగే మీరు
కూడా అనుసరించండి. ఇక్కడ పరీక్ష ఏమిటో కూడా ముందుగానే చెప్తున్నాను. నిశ్చయం
యొక్క పరీక్ష అయితే అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరి స్నేహం, సహయోగం
మరియు శక్తిలో పరీక్ష జరగనున్నది. ఇప్పుడు మీ అందరి కల్పపూర్వ చిత్రం
ప్రత్యక్షం అయ్యే సమయం సమీపంగా రానున్నది. అనేక రకాల సమస్యల పరివర్తన కొరకు
వ్రేలునివ్వాలి. కలియుగ పర్వతాన్ని దాటాలి. కానీ ఈ సం||రంలో మానసిక సమస్యలు,
తనువు యొక్క సమస్యలు, వాయుమండలం యొక్క సమస్యలు ఇలా అన్ని సమస్యలు అనే
పర్వతానికి స్నేహం మరియు సహయోగం అనే వ్రేలుని ఇవ్వాలి. తనువు యొక్క సమస్య కూడా
రానున్నది. లౌకిక సంబంధాలతో అయితే పాస్ అయిపోయారు కానీ ఈ అలౌకిక సంబంధాలతో కూడా
చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ ఈ సమస్యలన్నింటినీ పరీక్షగా భావించాలి.
ప్రత్యక్ష విషయాలుగా భావించకూడదు. పరీక్షగా భావించి వాటిని దాటితే పాస్
అయిపోతారు. ప్రశ్న తెలిసిపోయింది. కనుక ఇప్పుడు ఎంతమంది పాస్ అవుతారో చూడాలి.
తర్వాత ఈ పరీక్ష యొక్క ఫలితం చెప్తాను. ఈ సమయంలో మీలో ఆత్మిక శక్తిని ధారణ
చేయాలి. ఇప్పుడు ఆత్మిక శక్తి రాలేదు. యోగ్యతననుసరించి, శక్తిననుసరించి శక్తి
ఉంది. ఆత్మిక శక్తి ఎలా వస్తుంది? ఆత్మిక శక్తి రావడానికి సాధనం ఏమిటి? ఆత్మిక
శక్తి ఎందుకు లోపంగా ఉంది? దీనికి కారణం తెలుసా? స్మృతిలో కూడా లోపం ఎందుకు
ఉంది? సాకారంలో ఆత్మిక శక్తి ఎలా వస్తుందో బాబా కర్మ చేసి చూపించారు. మొట్టమొదట
ఏ అడుగు వేశారు? అన్నీ అర్పణ చేసేశారు. అర్పణ చేయటంలో ఆలస్యం చేయలేదు కదా!
లోపల, బయట ఉన్న చెడు అంతటినీ సంపూర్ణంగా అర్పణ చేయనంతవరకు ఆత్మిక శక్తి రాదు.
సాకార బాబా ఏమైనా ఆలోచించారా? ఎలా అవుతుందో, ఏమౌతుందో అని ఎప్పుడైనా
ఆలోచించారా? కొంతమంది ఆలోచించి ఆలోచించి అర్పణ చేస్తారు. దానికి అంతగా ఫలం
లభించదు. ఒక దెబ్బతో బలి అవ్వటం మరియు అనేక దెబ్బలతో బలి అవ్వటంలో తేడా
ఉంటుంది. ఎవరు ముందుగా బలిహారం అవుతారు? ముందుగా బలిహారం అయిన వారికి శక్తి
కూడా మొదటి నెంబర్ శక్తి లభిస్తుంది. ముందుగా అవ్వని వారికి శక్తి కూడా అంతే
లభిస్తుంది. ఈ విషయంపై ఆలోచించాలి. బాప్ దాదాకి వర్తమానంతో పాటు భవిష్యత్తు
కూడా తెలుసు. భవిష్య కర్మబంధన త్రాళ్ళు చూస్తే అంత పరుగు పెట్టలేరు. కర్మబంధన
యొక్క త్రాళ్ళు త్రెంచుకోవటం మీ కర్తవ్యం. ఒకవేళ ఏదైనా తెగకపోతే మనస్సు
ఆకర్షిస్తూ ఉంటుంది. కనుక త్రెంచుకోవటానికే ఉన్నారు. త్రాళ్ళు త్రేగిపోతే ఇక
ఎవరైనా ఆగుతారా? విడిపోయిన దానిని ఎప్పుడు బంధన ఆపలేదు. ఈరోజు ఏమి చేయాలి మరియు
రానున్న సంవత్సరము కొరకు ఏమి తయారీలు చేయాలో అవన్నీ కూడా స్మృతిలో ఉంచుకోవాలి.
విదేహీని భాగస్వామిగా చేసుకుంటే విదేహిగా అవ్వటంలో సహయోగం లభిస్తుంది. విదేహి
అవ్వటంలో సహయోగం తక్కువ లభిస్తుంది. సఫలత తక్కువ కనిపిస్తుంది అంటే విదేహిని
భాగస్వామిగా చేసుకోలేదు. కష్టవిషయాన్ని సహజంగా చేసినప్పుడు అద్భుతం అంటారు. సహజ
విషయాలను దాటడం అద్భుతం కాదు. కష్టాలని దాటడమే అద్భుతం. కష్టాలను కష్టాలుగా
భావించకుండా నడవడమే అద్భుతం. ఆ కష్టాలలో కొద్దిగా అయినా వాడిపోతే ఏమౌతుంది? ఒక
సెకనులో వ్యాపారం చేసేవారు కుడా చిక్కుకోరు. వేగంగా వెళ్ళేవారు ఎక్కడా
చిక్కుకోరు. చిక్కుకున్న వారు వేగంగా వెళ్ళలేరు. అంతిమస్థితిని చూస్తూ వెగంగా
వెళ్ళాలి. ఇప్పుడు కూడా వేగంగా వెళ్ళే అవకాశం ఉంది. కేవలం ఒక హైజంప్ చేయాలి.
అంతిమంలో వేగంగా వెళ్ళలేరు. మంచిది.