22.01.1970
ఉదయం మురళి ఓం శాంతి
అవ్యక్త్-బాప్దాదా మధుబన్
అంతిమ కోర్సు - మనస్సులోని భావాలను తెలుసుకోవటం.
అందరు
ఎక్కడ కూర్చున్నారు మరియు ఏమి చూస్తున్నారు? అవ్యక్త స్థితిలో స్థితులై
అవ్యక్తరూపాన్ని చూస్తున్నారా లేక వ్యక్తంలో అవ్యక్తాన్ని చూసే ప్రయత్నం
చేస్తున్నారా? ఈ ప్రపంచంలో ధ్వని ఉంటుంది. అవ్యక్త ప్రపంచంలో ధ్వని ఉండదు.
అందువలన బాబా పిల్లలందరిని ధ్వనికి అతీతంగా తీసుకువెళ్ళే వ్యాయామాన్ని
నేర్పిస్తున్నారు. ఒక సెకనులో అతీతం అవ్వాలి. ఈ అభ్యాసం వర్తమానంలో చాలా అవసరం.
ఎంత అవ్యక్త స్థితిలో స్థితులవుతారో అంత నయనాల సైగల ద్వారా ఎవరి మనస్సులోని
భావాలనైనా తెలుసుకుంటారు. ఇలాంటి సమయం రానున్నది. ఎవరు చెప్పవలసిన అవసరం ఉండదు.
అటువంటి సమయం ఇప్పుడు రానున్నది. ఎలా అయితే మీరు బాబా ఎదురుగా వెళ్ళినప్పుడు
మీరు చెప్పకుండానే మీ మనస్సు యొక్క సంకల్పాలను, భావాలను బాబా తెలుసుకుంటారు
అదేవిధంగా పిల్లలైన మీరు కూడా అంతిమ కోర్స్ చదువుకోవాలి. ఎలా అయితే నోటి భాష
ఉంటుందో అలాగే ఆత్మల భాష ఆత్మీయంగా ఉంటుంది. దీనినే ఆత్మిక సంభాషణ అంటారు. ఆత్మ
కూడా ఆత్మతో మాట్లాడుతుంది.. కానీ ఎలా? ఆత్మల విషయాలు నోటితో ఉంటాయా? ఎంతెంత
ఆత్మిక స్థితిలో స్థితులవుతారో అంతంత ఆత్మ యొక్క విషయాలు సహజంగా మరియు
స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ ప్రపంచంలో నోటి ద్వారా వర్ణన చేయటం ద్వారా ఒకరి
భావాలని ఒకరు తెలుసుకుంటారు. దీని కొరకు ఏ విషయం యొక్క ధారణ అవసరం? సదా బుద్ధి
లైన్ స్పష్టంగా ఉండాలి. మీ బుద్ధిలో లేదా మనస్సులో ఏదైనా అలజడి ఉంటే లేక లైన్
స్పష్టంగా లేకపోతే ఒకరి సంకల్పాలను, భావాలను ఒకరు తెలుసుకోలేరు. లైన్ స్పష్టంగా
లేని కారణంగా మీ సంకల్పాలు కలిసిపోతాయి. మా బుద్ది లైన్ స్పష్టంగా ఉందా? అని
ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఏ రకమైన విఘ్నం బుద్ధిని బాధించటం లేదు కదా!
తెగిపోని, స్థిరమైన, అలసిపోని ఈ మూడు విషయాలు జీవితంలో ఉండాలి. ఒకవేళ ఈ
మూడింటిలో ఏది లోపంగా ఉన్నా బుద్ధి లైన్ స్పష్టంగా లేనట్లే. ఎవరి బుద్ధి లైన్
స్పష్టంగా ఉంటుందో వారి స్మృతి, స్థితి ఎలా ఉంటాయి? ఎంతెంత బుద్ధి లైన్ అంటే
పురుషార్థం యొక్క లైన్ స్పష్టంగా ఉంటుందో అంతంత ఏమి స్మృతిలో ఉంటుంది? ఏ
విషయంలోనైనా వారి ఎదురుగా వర్తమానం వలె భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తుంది.
వారికి వర్తమానం మరియు భవిష్యత్తు సమానంగా ఉంటాయి. ఎలా అయితే సైన్స్ వారు ఈ
రోజుల్లో దూరంగా ఉన్న వస్తువుని కూడా దగ్గరగా కనపడేటట్లు చేస్తున్నారు.
అదేవిధంగా ఎవరి పురుషార్థం యొక్క లైన్ స్పష్టంగా ఉంటుందో వారికి భవిష్యత్తు
దూరంగా ఉన్నా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజల్లో టి.విలో అన్నీ స్పష్టంగా
కనిపిస్తున్నాయి కదా! అదేవిధంగా వారు బుద్ధి మరియు దృష్టి ద్వారా టి.విలో వలె
విషయాలన్నింటినీ స్పష్టంగా చూస్తారు మరియు తెలుసుకుంటారు. ఏ విషయంలోను
పురుషార్థం కష్టం ఉండదు. ఈ అనుభవం అంతిమ స్థితికి పరిశీలన. ఎంతవరకు అంతిమ
స్థితికి సమీపంగా వచ్చారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎలా అయితే సూర్యుడు
పూర్తిగా ప్రకాశించినప్పుడు ప్రతి వస్తువు స్పష్టంగా కనిపిస్తుంది. అంధకారం,
మసక తొలగిపోతాయి.. అదేవిధంగా ఎప్పుడైతే సర్వశక్తివంతుడైన జ్ఞాన సూర్యునితో
తెగిపోని సంబంధం ఉంటుందో అప్పుడు మీకు కూడా ప్రతి విషయం స్పష్టంగా కనిపిస్తుంది
మరియు నడుస్తున్నప్పుడు ఏదైతే మాయ యొక్క అంధకారం లేదా మసక సత్యాన్ని దాచే
విధంగా వస్తుందో అది తొలగిపోతుంది. దీని కొరకు సదా రెండు విషయాలు స్మృతిలో
ఉంచుకోవాలి. ఈ అలౌకిక మేళాకి పిల్లలందరు వచ్చారు. ఎలా అయితే లౌకిక తండ్రి
పిల్లలను మేళాకి తీసుకువెళ్ళినప్పుడు స్నేహి పిల్లలకు ఏదోక వస్తువు కొని
ఇస్తారు. అలాగే బాప్ దాదా కూడా ఈ అమూల్య మేళాలో మీ అందరికీ ఏ అద్భుతమైన వస్తువు
ఇస్తున్నారు? ఈ రోజు ఈ మధుర కలయిక యొక్క మేళాకి స్మృతి చిహ్నంగా బాప్ దాదా ఏమి
ఇస్తున్నారంటే - సదా శుభ చింతకులుగా మరియు శుభచింతనలో ఉండాలి. శుభచింతన మరియు
శుభచింతకులు. ఈ రెండు విషయాలను సదా స్మృతి ఉంచుకోండి. శుభచింతన ద్వారా మీ
స్థితి తయారు చేసుకోగలరు. మరియు శుభచింతకులుగా అవ్వటం ద్వారా అనేక ఆత్మల సేవ
చేస్తారు. ఈ రోజు వచ్చిన పిల్లలందరికీ వతనం నుండి తెచ్చిన అవినాశి బహుమతి.
బాప్ దాదాకి స్నేహం ఎక్కువా లేక పిల్లలకి ఎక్కువా? కొంతమంది పిల్లలు మాకు బాప్
దాదా కంటే ఎక్కువ స్నేహం ఉందని అనుకుంటున్నారు. కొద్దిమందికి ఉంది కానీ
ఎక్కువమందికి కాదు. స్నేహం ఉంది కానీ తెగిపోని మరియు ఏకరస స్నేహం లేదు. పిల్లల
స్నేహం చాలా రూపాలుగా మారిపోతుంది. బాప్ దాదా యొక్క స్నేహం తెగిపోని విధిగా
మరియు ఏకరసంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి. ఎవరి స్నేహం ఎక్కువ? బాప్ దాదా
త్రినేత్రి కనుక పిల్లలను మూడు రూపాలతో చూస్తున్నారు. ఆ మూడు రూపాలు ఏమిటి?
మీరు బాబాని మూడురూపాలతో చూస్తారు, అవి అందరికీ తెలుసు. కానీ బాబా పిల్లలని
మూడు రూపాలతో చూస్తున్నారు. 1. పురుషార్టీ రూపం 2. ఇప్పటి సంగమయుగీ భవిష్య
ఫరిస్తా రూపం 3. భవిష్య దేవతా రూపం. మూడు సాక్షాత్కారం అవుతూ ఉంటాయి. ఎలా ఈ
దేహం యొక్క రూపం ఈ కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుందో అలాగే దివ్యనేత్రం ద్వారా ఈ
మూడు రూపాలు స్పష్టంగా కనిపిస్తాయి. కళ్ళతో చూసిన వస్తువుని వర్ణన చేయటం సహజం
కదా! విన్న విషయాన్ని వర్ణన చేయటం కొంచెం కష్టం అవ్వవచ్చు. కానీ చూసిన
విషయాన్ని వర్ణన చేయటం సహజం, మరియు స్పష్టంగా చేయవచ్చు. అదేవిధంగా ఈ
దివ్యనేత్రం లేదా అవ్యక్త నేత్రాల ద్వారా ప్రతి ఒక్కరి మూడు రూపాలు కూడా ఇంత
సహజంగానే వర్ణన చేస్తారు.
అలాగే మీ అందరికీ కూడా ఒకరికొకరికి ఈ మూడు రూపాలూ కనిపిస్తాయి. ఇప్పుడు యోగ్యత
అనుసరించి శక్తి ఉంది. కాని కొద్ది సమయం తర్వాత శక్తి అనుసరించి అనే మాట కూడా
సమాప్తి అయిపోతుంది. ప్రతి ఒక్కరు తమతమ నెంబర్ ప్రకారంగా సంపూర్ణతని పొందుతారు.
కనుక బాప్ దాదా మీ అందరి సంపూర్ణ ముఖం చూస్తున్నారు. సంపూర్ణత నెంబర్ వారీగా
ఉంటుంది. 108 మాలలో మొదటి మణి మరియు 108వ మణి రెండింటిని సంపూర్ణం అంటారా లేక
అనరా? విజయీరత్నం అంటారా? విజయూరత్నం అంటే తమ నెంబర్ ప్రకారం సంపూర్ణతని
పొందుతారు. వారి కొరకు మొత్తం డ్రామాలో అదే సంపూర్ణత యొక్క మొదటి స్థితి.
సత్యయుగంలో ఎనిమిదవ రాజుని కూడా విశ్వమహారాజు అని అంటారు. కానీ మొదటి మహారాజుకి
లభించే సృష్టి యొక్క సంపూర్ణ సుఖంలో మరియు ఎనిమిదవ నెంబరుకి లభించు సుఖంలో తేడా
ఉంటుంది కదా! అలాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు తమతమ నెంబరు ప్రకారం సంపూర్ణత
పొందుతారు. అందువలన బాప్ దాదా సంపూర్ణ స్థితిని మరియు వర్తమాన సమయ
పురుషార్థాన్ని చూస్తున్నారు. ఎలా ఉన్నారు మరియు ఎలా అవుతారని. వతనంలో కూర్చుని
ఏమి చేస్తావు బాబా అని మీరు అడిగారు కదా! ఇదే చూస్తూ ఉంటాను, మరియు అవ్యక్త
సహయోగం ఇచ్చే సేవ చేస్తాను. బాప్ దాదా వతనంలో కూర్చుని ఏమి చేస్తారో తెలియటం
లేదు అని అందరూ అనుకుంటున్నారు. కానీ సాకారవతనం కంటే సేవావేగంతో అక్కడ ఎక్కువగా
ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సాకార తనువు యొక్క ఖాతా కూడా వెంట ఉండేది. ఇప్పుడైతే ఈ
బంధన నుంచి కూడా ముక్తి అయ్యారు. స్వయం కోసం లేరు సర్వాత్మల కోసం ఉన్నారు.
ఈ శరీరం వదలడం మరియు శరీరాన్ని తీసుకోవటం ఇది అందరికీ అనుభవం ఉంటుందో అలాగే
ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీర అభిమానాన్ని పూర్తిగా వదిలి అశరీరి అవ్వాలి,
మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని ఆధారంగా తీసుకుని కర్మ చేయాలి. ఈ
అభ్యాసం ఉందా? ఈ అనుభవాన్ని పెంచుకోవాలి. ఈ స్థూల వస్త్రం వేరు, మరియు
వస్త్రాన్ని ధరించిన ఆత్మ వేరు. ఇలా పూర్తిగా వేరుగా అనుభవం అవ్వాలి. ఈ
అనుభవాన్ని పెంచుకోవాలి. మేమిక వెళ్ళిపోవాలి అని సదా స్మృతి ఉండాలి. కేవలం సేవ
కోసం శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. కానీ మరలా సేవ పూర్తి కాగానే ఒక్కసారిగా
తేలిక అయిపోవాలి. మీరు ఎక్కడికైనా డ్యూటీకి వెళ్ళి మరలా ఇంటికి వచ్చేసిన తర్వాత
తేలికగా భావిస్తారు కదా! డ్యూటీ వస్త్రం మార్చి ఇంటిలో వస్త్రం ధరిస్తారు.
అలాగే సేవ కోసం ఈ శరీరరూపి వస్త్రం ఆధారంగా తీసుకున్నారు. మరలా సర్వీస్
అయిపోగానే ఈ వస్త్రాల బరువు నుండి తేలికగా మరియు అతీతం అయ్యే ప్రయత్నం చేయండి.
ఒక సెకనులో వస్త్రం నుంచి వేరుగా ఎవరు కాగలరు? ఒకవేళ బిగుతుగా ఉంటే వేరు
కాలేరు. అతుక్కుని ఉన్న దానిని తీయటం కష్టం అవుతుంది. వదులుగా ఉండటం ద్వారా
సహజంగా వేరు అవుతుంది. అలాగే మీ సంస్కారాలలో సహజ స్థితి లేకపోతే అశరీరి
స్థితిని అనుభవం చేసుకోలేరు. ఎలా అవ్వాలో చెప్పాను కదా! సహజంగా మరియు
సంసిద్ధంగా ఉండాలి. సహజంగా అంటే మాయ కూడా సహజంగా వచ్చేంతగా ఉండకూడదు.
అప్పుడప్పుడు సహజంగా ఉండవలసి ఉంటుంది. అప్పుడప్పుడు సంసిద్ధంగా ఉండాలి. అటువంటి
వారే అభ్యాసంలో ఉండగలరు. బాప్ దాదా పిల్లలను క్రొత్తగా ఏమి చూడటం లేదు.
ఎందుకంటే మూడు కాలాలు తెలుసు. కనుక క్రొత్తవారు అని ఎలా అంటారు? అందువలన అందరు
చాలా పురాతనమైనవారు. ఎంత పాతవారో ఈ లెక్క తీయలేరు. కనుక మిమ్మల్ని మీరు కొత్తగా
భావించకూడదు. చాలా పాతవారు మరియు ఆ పాతవారే మరలా తమ హక్కు తీసుకోవడానికి
వచ్చారు. ఈ సంతోషం సదా స్థిరంగా ఉండాలి. పురుషార్ధం చేస్తాము, చూస్తాము అని
ఎప్పుడూ అనకూడదు. లాస్ట్ వచ్చినవారు (వెనుక వచ్చినవారు) మేము వేగంగా వెళ్తాము
అని భావించాలి. ఒకవేళ వేగంగా వెళ్ళాలనే లక్ష్యం పెట్టుకుంటే పురుషార్థం కూడా
అలాగే ఉంటుంది. అందువలన ఇప్పుడు మేము వెనుక వచ్చాము కనుక ప్రజలు అవుతాము అని
అనుకోకూడదు.వెనుక ఇచ్చిన వారికి కూడా రాజ్యపదవి పొందే అధికారం ఉంది.
అవ్యక్త సంభాషణ కూడా కలయికయే. అందువలన అందరు ఇదే నిశ్చయం పెట్టుకోవాలి -
రాజ్యపదవి తీసుకునే తీరుతామని. మనం కాకపోతే ఎవరు అవుతారు? కోట్లలో కొద్దిమంది
ఆత్మలుగా ఎవరు లెక్కింపబడతారు? డ్రామాలో కోట్లలో కొద్దిమంది ఆత్మలం మేమే. ఈ
నిశ్చయం మర్చిపోకూడదు. బాప్ దాదా పిల్లలందరి భవిష్యత్తు చూసి సంతోషిస్తున్నారు.
ఒకరితో ఒకరు మనస్సుతో కలవాలి. కానీ మనందరిలా ఈ వ్యక్త ప్రపంచంలో బాప్ దాదాకి
ఇప్పుడు ఈ వ్యక్త ప్రపంచం లేదు. మీ ప్రపంచం ప్రకారం సమయాన్ని చూడవలసి ఉంటుంది.
వతనంలో సమయం ఉండదు, గడియారం ఉండదు. కానీ ఈ వ్యక్త ప్రపంచంలో ఇవన్నీ చూడాలి.
అక్కడ సూర్యచంద్రులే లేకపోతే ఇక రాత్రి పగలు ఎలా ఉంటాయి? అందువలన సమయం యొక్క
బంధన ఉండదు.