24.01.1970
ఉదయం మురళి ఓం శాంతి
అవ్యక్త్-బాప్దాదా మధుబన్
బ్రాహ్మణుల ముఖ్య వ్యాపారం - సమర్పణ చేయటం మరియు
చేయించటం
మీ
జీవన నౌక ఎవరికి సమర్పణ చేసారు? (శివబాబాకి) శ్రీమతంపై పూర్తిగా నడుస్తున్నారా?
శ్రీమతంపై నడవటం అంటే ప్రతి కర్మలో అలౌకికత తీసుకురావటం. శివబాబా వారసత్వానికి
పూర్తి అధికారిగా మిమ్మల్ని మీరు భావిస్తున్నారా? ఎవరైతే వారసత్వానికి
అధికారిగా అవుతారో వారికి అన్నింటి పైన అధికారం ఉంటుంది. ఏ విషయానికి ఆధీనం
అవ్వరు. దేహం, దేహసంబంధీకులు లేక దేహం యొక్క వస్తువులకి ఆధీనం అయ్యేవారు
అధికారి కాలేరు. అధికారి ఆధీనమవ్వరు. సదా మిమ్మల్ని మీరు అధికారిగా భావించడం
ద్వారా ఏ మాయ రూపానికి ఆధీనం అవ్వటం నుండి రక్షించుకుంటారు? సదా అలౌకిక కర్మలు
ఎంత చేసాను మరియు లౌకిక కర్మ ఎంత చేసాను? అని పరిశీలించుకోండి. అలౌకిక కర్మ
ఇతరులకి అలౌకికంగా అయ్యే ప్రేరణనిస్తుంది. అందరు ఈ లక్ష్యం పెట్టుకున్నారు -
మేమందరం ఉన్నతోన్నతమైన బాబా యొక్క పిల్లలం ఉన్నతోన్నత రాజ్యపదవిని పొందుతామని.
లేక ఏది లభిస్తే అది చాలా? ఉన్నతోన్నతమైన బాబా పిల్లలు కనుక లక్ష్యం కూడా
ఉన్నతంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే అవినాశి ఆత్మిక స్థితిలో ఉంటారో అప్పుడే
అవినాశి సుఖ ప్రాప్తిని పొందుతారు. ఆత్మ అవినాశి కదా! మధువనానికి వచ్చి మధువనం
యొక్క వరదానం పొందారా?
వరదానం అనేది శ్రమ లేకుండా లభిస్తుంది. అవ్యక్త స్థితిలో అవ్యక్త ఆనందం,
అవ్యక్త స్నేహం, అవ్యక్త శక్తి ఇవన్నీ సహజంగా లభిస్తాయి. ఈ విధంగా వరదానం
స్థిరంగా ఉండాలి. దీనికి ప్రయత్నం చేయాలి. సదా వరదాత స్మృతిలో ఉండటం ద్వారా ఈ
వరదానం అవినాశిగా ఉంటుంది. ఒకవేళ వరదాతని మర్చిపోతే వరదానం కూడా సమాప్తి
అయిపోతుంది. అందువలన వరదాతను ఎప్పుడు వేరు చేయకూడదు. వరదాత వెంట ఉంటే వరదానం
కూడా వెంట ఉంటుంది. మొత్తం సృష్టిలో అన్నిటికంటే ప్రియమైన వారు ఎవరు? (శివబాబా)
అయితే బాబా స్మృతి స్వతహాగానే ఉండాలి. అందరికంటే ప్రియాతి ప్రియమైనవారు ఒకరే
అయితే ఆయన స్మృతి ఎందుకు మర్చిపోతున్నారు? అంటే ఎవరోకరు తప్పకుండా జ్ఞాపకం
వస్తున్నారు అని అర్థం. కనుక మర్చిపోతున్నారు. ఏ విషయమైనా కారణం లేకుండా ఉండదు.
అలాగే విస్మృతికి కూడా కారణం ఉంటుంది. విస్మృతి కారణంగా ప్రియమైన వారు
దూరమైపోతున్నారు. విస్మృతికి కారణం - మీ బలహీనత.
ఏదైతే శ్రీమతం లభిస్తుందో దానిపై పూర్తిగా నడవని కారణంగా బలహీనత వస్తుంది.
మరియు బలహీనత కారణంగా విస్మృతి వస్తుంది. విస్మృతిలో ప్రియమైన వారిని
మర్చిపోతున్నారు. అందువలన సదా కర్మ చేసే ముందు శ్రీమతం యొక్క స్మృతి ఉంచుకుని
తర్వాత కర్మ చేయండి. అప్పుడు అది శ్రేష్టకర్మ అవుతుంది. శ్రేష్టకర్మ ద్వారా
స్వతహాగానే శ్రేష్ట జీవితం తయారవుతుంది. అందువలన ప్రతి కార్యం ముందు మిమ్మల్ని
మీరు పరిశీలించుకోవాలి. కర్మ చేసిన తర్వాత పరిశీలించుకుంటే ఏదైతే వ్యతిరేక కర్మ
జరిగిందో అది వికర్మగా అవుతుంది. అందువలన మొదట పరిశీలించుకోండి తర్వాత కర్మ
చేయండి. డబల్ హాస్పిటల్ యొక్క సేవ చేస్తున్నారా? ఈశ్వరీయ చదువు సహజంగా మరియు
సరళంగా ఎవరికైనా ఇచ్చే పద్ధతి వస్తుందా? ఒక సెకనులో ఎవరికైనా బాబా పరిచయం
ఇవ్వగలరా? ఎంత ఇతరులకి పరిచయం ఇస్తారో అంతగానే మీ భవిష్యప్రాప్తిని తయారు
చేసుకుంటారు. ఇక్కడ ఇవ్వాలి మరియు అక్కడ తీసుకోవాలి. కనుక తీసుకోవడమే అయ్యింది.
ఎంత ఇస్తూ ఉంటారో అంత మేము .తీసుకుంటున్నాము అని భావించండి. ఈ జ్ఞానం యొక్క
ప్రత్యక్షఫలాన్ని మరియు భవిష్య ప్రాప్తిని కూడా అనుభవం చేసుకోవాలి. వర్తమాన
ప్రాప్తి ఆధారంగానే భవిష్యత్తున్ని అర్ధం చేసుకోగలరు. వర్తమాన అనుభవం
భవిష్యత్తున్ని స్పష్టం చేస్తుంది.
మిమ్మల్ని మీరు ఏ రూపంలో భావించి నడుస్తున్నారు? నేను శక్తిని, జగన్మాతను అనే
భావన ఉంటుందా? జగన్మాత రూపంలో జగత్తుకి కళ్యాణం జరుగుతుంది. శివశక్తి రూపంలో ఏ
బలహీనత ఉండదు. నేను జగన్మాతను మరియు శివశక్తిని. ఈ రెండు స్మృతిలో ఉంచుకోండి.
అప్పుడు మాయాజీత్ అవుతారు. విశ్వకళ్యాణం యొక్క భావన ద్వారా అనేక ఆత్మల
కళ్యాణానికి నిమిత్తం అవుతారు. సంబంధాలతో నష్టోమోహ అయ్యారా లేక మీ శరీరంతో
అయ్యారా? నష్టోమోహ యొక్క అంతిమస్థితి ఎంత వరకు వచ్చింది? ఎంత నష్టోమోహులుగా
అవుతారో అంత స్మృతిస్వరూపంగా అవుతారు. స్మృతిని సదా స్థిరంగా ఉంచుకోవటానికి
సాధనం - నష్టోమోహ అవ్వాలి. నష్టామోహ అవ్వటం సహజమా లేక కష్టమా? మిమ్మల్ని మీరు
సమర్పణ చేసుకుంటే అన్నీ సహజం అవుతాయి. ఒకవేళ సమర్పణ అవ్వకుండా మీపై పెట్టుకుంటే
కష్టమవుతుంది. సహజంగా చేసుకోవడానికి ముఖ్య సాధనం సమర్పణ చేయాలి. అప్పుడు బాబాకి
ఏది కావాలంటే అది చేయిస్తారు. ఎలా అయితే మిషన్ ద్వారా మొత్తం కర్మాగారం
నడుస్తుంది. ఆ యంత్రం యొక్క పని - కర్మాగారాన్ని నడిపించటం. అలా మనం నిమిత్తం.
నడిపించే వారు ఎలా నడిపిస్తే అలా నడవటమే. ఇలా భావించడం ద్వారా కష్టం అనుభవం
అవ్వదు. ఈ స్థితిని రోజు రోజుకి గట్టిగా చేసుకోవాలి. ఈ ముఖ్య విషయంపై ధ్యాస
ఉంచాలి. ఎంత స్వయాన్ని బాబా ముందు సమర్పణ చేసుకుంటారో అంతగానే బాబా కూడా పిల్లల
ముందు సమర్పణ అవుతారు. అంటే ఏదైతే బాబా ఖజానా ఉందో అది స్వతహాగానే వారిది
అవుతుంది. ఏ గుణం అయితే మీలో ఉందో అది ఇతరులకి ఇవ్వటం కష్టం అవుతుందా? సమర్పణ
అవ్వటం మరియు ఇతరులని చేయటం ఇదే బ్రాహ్మణుల వ్యాపారం. బ్రాహ్మణుల వ్యాపారం
బ్రాహ్మణులు తెలుసుకోకపోతే ఎవరు తెలుసుకుంటారు? ఎలా అయితే బాబా కొంచెంలో రాజీ
అవ్వరో అలాగే పిల్లలు కూడా కొంచెంలో రాజీ కాకూడదు. (రాజ్ కోట్ పార్టీతో).
మిమ్మల్ని మీరు రాజుగా చేసుకున్నారా? రాజ్ కోట్ యొక్క సేవ ఎంత ఫలీభూతం అవ్వాలి?
పేరే రాజ్ కోట్. కనుక ఇక్కడ రాజ్యపదవి పొందేవారు కూడా ఎక్కువగా ఉండాలి. ఇటువంటి
లక్ష్యం పెట్టుకుని సేవ చేస్తూ వెళ్ళండి. రాజులని తయారుచేయాలి. కానీ ప్రజలని
కాదు, ప్రజలు సమయానికి స్వతహాగానే తయారైపోతారు. ఎవరు ఎంతమందిని రాజ్యపదవిని
పొందేవారిగా తయారుచేస్తారో వారే మహారాజా, మహారాణీ అవుతారు. ఇంత ఉన్నత లక్ష్యం
పెట్టుకోవాలి. నిశ్చయానికి గుర్తు ఏమిటి? విజయం. ఎంత నిశ్చయబుద్దిగా అవుతారో
అంత అన్ని విషయాలలో విజయీ అవుతారు. నిశ్చయబుద్ధి ఎప్పుడూ ఓడిపోరు. ఓడిపోతే
నిశ్చయం యొక్క లోపం ఉన్నట్లు భావించాలి. నిశ్చయబుద్ది విజయీరత్నాలలో నేను ఒక
రత్నాన్ని అని మిమ్మల్ని మీరు భావించాలి. విఘ్నాలు వస్తాయి. కానీ వాటిని
సమాప్తి చేసుకునే యుక్తి - సదా ఇది పరీక్ష అని భావించండి. మీ స్థితిని
పరిశీలించడానికి ఈ పరీక్ష వచ్చింది. ఏ విఘ్నం వచ్చినా దానిని పరీక్షగా భావించి
దాటాలి. విషయాలను చూడకూడదు, పరీక్షగా భావించాలి. పరీక్షలో కూడా రకరకాల ప్రశ్నలు
ఉంటాయి. అప్పుడప్పుడు మనస్సు యొక్క, లోకమర్యాదల యొక్క, సంబంధీకుల యొక్క,
దేశవాసీయులు యొక్క ప్రశ్నలు ఉంటాయి. కానీ వాటికి భయపడకూడదు. లోతులోకి వెళ్ళాలి.
అందరు స్వతహాగానే ఆకర్షింపబడే విధంగా వాతావరణం తయారుచేయాలి. ఎంత స్వయం అవ్యక్త
వాయుమండలాన్ని తయారుచేయటంలో నిమగ్నమవుతారో అంత స్వతహాగా అన్నీ జరుగుతాయి. ఎలా
అయితే మార్గంలో వెళ్తున్నప్పుడు సువాసన వస్తే వెళ్ళి చూడాలని మనస్సులో
అనిపిస్తుంది. అలాగే ఈ అవ్యక్త సువాసన కూడా స్వతహాగా ఆకర్షిస్తుంది. దీనిలో
రాజ్ కోట్ వారు ముందు వెళ్తారో లేక జానాఘడ్ వారు వెళ్తారో చూస్తాను.
రాజ్యపదవిని పొందేవారు ఎంతమంది, ఎక్కడ నుండి ఎక్కువ వస్తారో పోటీ.
ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దానిని పూర్తి చేసుకోవడానికి అలాంటి లక్షణాలు
కూడా మీలో నింపుకోవాలి. బలహీన పురుషార్థం చేసేవారు ఎక్కడి వరకు చేసుకుంటారు?
ప్రయత్నం అనే మాట అంటూ ఉంటే ప్రయత్నంలోనే ఉండిపోతారు. ఇది చేయాల్సిందే అనే
లక్ష్యం పెట్టుకోవాలి. ప్రయత్నం అని అనటం బలహీనత. బలహీనతని తొలగించుకోవడానికి
ప్రయత్నం అనే మాటని తొలగించుకోవాలి. నిశ్చయం ద్వారా విజయం లభిస్తుంది. సంశయం
రావటం ద్వారా శక్తి తక్కువ అయిపోతుంది. నిశ్చయబుద్ది అయితే అందరి యొక్క సహయోగం
కూడా లభిస్తుంది. ఏదైనా కార్యం చేసేటప్పుడు నేను లేకుండా ఈ కార్యం జరగదు అని
ఆలోచిస్తే అది సఫలం అవుతుంది. ఈరోజు నుంచి ప్రయత్నం అనే మాటను సమాప్తి
చేయండి.నేను శివశక్తిని అని భావించండి, శివశక్తి సర్వ కార్యాలు చేయగలదు.
శివశక్తులు సింహంపై స్వారీ చేస్తున్నట్లు చూపిస్తారు. అనగా మాయ సింహం రూపంలో
వచ్చినా భయపడరు. శివశక్తి ఎప్పుడూ ఓడిపోరు. ఇప్పుడు సమయం ఎక్కడ ఉంది? కనుక సమయం
కంటే ముందుగానే మిమ్మల్ని మీరు మార్చుకుంటే ఒకటికి లక్ష రెట్లు ఫలితం
లభిస్తుంది. మారాలంటే ఈ విధంగా మారాలి. గత కల్పం కూడా వారసత్వం తీసుకున్నాము
అనే స్మృతి వస్తుందా? మిమ్మల్ని మీరు పాతవారిగా భావించడం ద్వారా కల్పపూర్వపు
స్మృతి ద్వారా పురుషార్ధం సహజం అవుతుంది. ఎందుకంటే నిశ్చయం ఉంటుంది. కల్పపూర్వం
నేను తీసుకున్నాను ఇప్పుడు కూడా తీసుకునే తీరతానని. కల్పపూర్వపు స్మృతి శక్తిని
ఇప్పించేదిగా ఉంటుంది. మిమ్మల్ని మీరు క్రొత్తవారిగా భావిస్తే బలహీన సంకల్పాలు
వస్తాయి. పొందగలనో, లేదోనని. కానీ నేనే అలా అయ్యాను అని కల్పపూర్వపు స్మృతి
ద్వారా శక్తి వస్తుంది.
సదా మిమ్మల్ని మీరు ధైర్యవంతులుగా తయారుచేసుకోవాలి. ధైర్యాన్ని
పోగొట్టుకోకూడదు. ధైర్యం ద్వారా సహాయం కూడా లభిస్తుంది. మేము సర్వశక్తివంతుడైన
బాబా పిల్లలం. బాబాని స్మృతి చేసారు - ఇదే ధైర్యం. బాబాని స్మృతి చేయటం సహజమేనా
లేక కష్టమా? సహజంగా చేసుకోవటంలో సహజం అవుతుంది. నా కర్తవ్యమే ఇది అని
అనుకోవాలి.ఏమి చేయను? అనే సంకల్పం రావటం ద్వారా కష్టం అవుతుంది. ఎప్పుడు మీలో
బలహీన సంకల్పాలు రానివ్వకూడదు. ఒకవేళ మనస్సులో బలహీన సంకల్పాలు వస్తే వాటిని
అక్కడే సమాప్తి చేసి శక్తిశాలిగా చేసుకోవాలి. ఇప్పటివరకు ప్రయత్నం చేస్తూనే
ఉంటే అవ్యక్త ఆకర్షణ యొక్క అనుభవం ఎప్పుడు చేసుకుంటారు? ఎప్పటి వరకు ప్రయత్నం
అని అంటారో అంత వరకు అవ్యక్త ఆకర్షణ మీలో రాదు, మరియు ఇతరులపై పడదు. ఇది బలహీన
భాష. సర్వశక్తివంతుని పిల్లలు ఇలా అనకూడదు. వారి సంకల్పం, వాణీ అన్నీ నిశ్చయంతో
ఉంటాయి. అలాంటి స్థితి తయారుచేసుకోవాలి. సదా సంకల్పరూపీ పునాది శక్తిశాలిగా
ఉందా అని పరిశీలించుకోండి.
తీవ్రపురుషార్థీలలో సంకల్పం, మాట, కర్మ సమానంగా ఉండే విశేషత ఉంటుంది. సంకల్పం
ఉన్నతంగా మరియు కర్మ బలహీనంగా ఉంటే వారిని తీవ్రపురుషార్థి అనరు. మూడింటి సమానత
కావాలి. మాయ అప్పుడప్పుడు తన రూపాన్ని చూపిస్తుంది. కానీ సదాకాలికంగా వీడ్కోలు
ఇవ్వడానికి వస్తుంది అని సదా భావించండి. సదా శివబాబా తోడు ఉన్నారు అని
భావించాలి. శివబాబా స్మృతితో వేరుకాకపోతే ఇక ఎవరు ఏమి చేయగలరు? ఎవరైనా ఇద్దరు
బిజీగా ఉంటే వారిని మూడవ వారు భంగపర్చరు (డిసర్చ్). గొడవచేసేవారు ఎవరూ రాకూడదు
అనుకుంటారు. అక్కడయితే వారు (డోంట్ డిస్టర్స్) బోర్డ్ పెట్టేస్తారు. అలాగే మీరు
కూడా బోర్డ్ పెట్టండి. అప్పుడు మాయ తిరిగి వెళ్ళిపోతుంది. వచ్చేటందుకు స్థానమే
లభించదు. కుర్చీ ఖాళీగా ఉంటే ఎవరో ఒకరు కూర్చుంటారు.
మాతలకి చాలా సహజం - కేవలం బాబాని జ్ఞాపకం చేయాలి అంతే. బాబాని జ్ఞాపకం చేయటం
ద్వారా జ్ఞానం స్వతహాగానే నిండుతుంది. ఎవరైతే బాబాని స్మృతి చేస్తారో వారికి
ప్రతీ కార్యంలో బాబా యొక్క సహాయం లభిస్తుంది. స్మృతిలో ఎంత శక్తి ఉందంటే ఇక్కడ
పొందిన అనుభూతిని అక్కడ కూడా స్మృతిలో ఉంచుకుంటే ఆ స్మృతి అవినాశి అయిపోతుంది.
బుద్దిలో మాటిమాటికి మేము పరంధామ నివాసులం, కర్తవ్యం కోసం వచ్చాం. మరలా తిరిగి
వెళ్ళిపోవాలి అని జ్ఞాపకం ఉంచుకోండి. ఎంత బుద్దిని ఈ విషయాలలో బిజీగా ఉంచుతారో
అంత ఇక మరలా ఎక్కడా భ్రమించదు. ఎవరికైనా సరే యుక్తితో జ్ఞానం చెప్పాలి. మొత్తం
జ్ఞానం చెప్తే భయపడతారు. మొదట ఈశ్వరీయ స్నేహంలోకి తీసుకురావాలి. శరీరధారులకి
ధనం కావాలి, బాబాకి మనస్సు కావాలి కనుక మనస్సుని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే
ఉపయోగించాలి. ఇంకెక్కడా ఉపయోగించకూడదు. యోగయుక్త అవ్యక్తస్థితిలో స్థితులై
రెండు మాటలు మాట్లాడినా కూడా ఉపన్యాసం చెప్పినట్లు అవుతుంది. ఒక గంట ఉపన్యాసం
యొక్క సారాన్ని రెండు మాటలలో చెప్పగలరు. రోజు రోజుకి అడుగు ముందుకి
వేస్తున్నారా! ఇప్పుడు ఇంకా సమయం ఉంది, అప్పుడు పురుషార్థం చేసేస్తాం అని
ఆలోచించకండి. సమయానికి ముందే సమాప్తి చేసుకుని ఈ స్థితి యొక్క అనుభవం పొందాలి.
ఒకవేళ సమయం వచ్చినప్పుడు ఈ స్థితిని అనుభవం చేసుకుంటే సమయంతో పాటు స్థితి కూడా
మారిపోతుంది. సమయం సమాప్తి అయిపోతే అవ్యక్తస్థితి యొక్క అనుభవం సమాప్తి అయ్యి
ఇంకొక పాత్ర వచ్చేస్తుంది. అందువలన ముందు నుండే అవ్యక్తస్థితిని అనుభవం
చేసుకోవాలి. కుమారీలు పరుగు పెట్టడంలో వేగంగా ఉంటారు. అలాగే ఈ ఈశ్వరీయ పరుగులో
కూడా వేగంగా వెళ్ళాలి. ఫస్ట్ వచ్చినవారే సమీపంగా వస్తారు. ఎలాగైతే సాకార బ్రహ్మ
ఫస్ట్ వచ్చారు కదా! లక్ష్యం అయితే ఉన్నతంగా పెట్టుకోవాలి. లక్ష్యం సంపూర్ణంగా
ఉంటే పురుషార్థం కూడా సంపూర్ణంగా చేయాలి. అప్పుడే సంపూర్ణ పదవి లభిస్తుంది.
సంపూర్ణ పురుషార్థం అంటే అన్ని విషయాలతో స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి. ఇది
పెద్ద విషయమేమీ కాదు. తెలుసుకున్న తరువాత స్మృతి చేయటం కష్టం అనిపిస్తుందా?
తెలుసుకోవడాన్నే జ్ఞానం అని అంటారు. జ్ఞానమే లైట్, మైట్. కాకపోతే జ్ఞానం
ఎందుకు? దానిని తెలుసుకోవటం అనరు. ఇక్కడ తెలుసుకోవటం మరియు చేయటం సమానంగా
ఉండాలి. ఇతరులలో తెలుసుకోవటం మరియు చేయటంలో తేడా ఉంటుంది. జ్ఞానం ఎలాంటిది అంటే
అది రూపాన్ని తయారు చేస్తుంది. ఈశ్వరీయ జ్ఞానం ఏ రూపాన్ని తయారు చేస్తుంది?
ఈశ్వరీయ స్థితిని తయారుచేస్తుంది. అయితే ఈశ్వరీయ జ్ఞానం తీసుకున్నవారు ఈశ్వరీయ
రూపంలోకి ఎందుకు రారు? కంఠస్త పట్టడం అనేది వేరే విషయం, తెలుసుకోవటం అంటే
బుద్ధిలో ధారణ చేయటం అనేది వేరే విషయం . ధారణ ద్వారా కర్మ స్వతహాగా జరుగుతుంది.
ధారణ అంటే విషయాన్ని బుద్దిలో నింపుకోవటం. ఎప్పుడైతే బుద్ధిలో నిండి ఉంటుందో
అప్పుడు బుద్ది సలహా ప్రకారం కర్మేంద్రియాలు నడుచుకుంటాయి. జ్ఞాన సాగరుని
పిల్లలం మేము, ఈశ్వరీయ జ్ఞానం యొక్క లైట్, మైట్ మా వెంట ఉందని భావించి నడవాలి.
జ్ఞానం వినటం వేరే విషయం. కేవలం జ్ఞానం వినటం కాదు, దానిని నింపుకోవాలి. భోజనం
తినటం వేరే విషయం, జీర్ణం చేసుకోవటం వేరే విషయం. తినటం ద్వారా శక్తి రాదు.
జీర్ణం చేసుకోవటం ద్వారా శక్తి వస్తుంది. తిన్నటువంటి భోజనాన్ని జీర్ణం
చేసుకున్నప్పుడే శక్తిరూపం అవుతుంది. సర్వశక్తివంతుని పిల్లలు చేయలేనిది ఏదైనా
ఉంటుందా? సదా మేము ఉదాహరణగా అయ్యే కర్మని చేసి చూపిస్తాము అనే లక్ష్యం
పెట్టుకోండి. నిరీక్షణలో ఉండకండి, ఉదాహరణగా అవ్వండి. బాబా ఉదాహరణగా అయ్యారు
కదా! ఎవరైనా భ్రమించి తమ ఇంటికి చేరుకున్నప్పుడు విశ్రాంతిని అనుభవం
చేసుకుంటారు కదా! అలాగే మీరు మీ ఇంటికి వచ్చారు. ఇక్కడ విశ్రాంతి అనుభవం
అవుతుందా? స్థానం లభించటం ద్వారా విశ్రాంతి స్థితి ఉంటుంది. సదా విశ్రాంతి
స్థితిలో ఉండండి. కార్యం కోసం వెళ్ళినా కానీ ఈ స్థితిని వెంట తీసుకువెళ్ళండి.
దీనిని వెంట ఉంచుకుంటే ఎన్ని కార్యాలు చేస్తున్నా స్థితి విశ్రాంతిగా ఉంటుంది.
విశ్రాంతిలో శాంతి, సుఖం అనుభవం అవుతాయి. ఎప్పుడైతే మీలో శక్తి ఉంటుందో అప్పుడు
వాతావరణం యొక్క ప్రభావం పడదు. కానీ మన ప్రభావం వాతావరణంపై పడుతుంది. వాతావరణం
సర్వశక్తివంతమైనదా లేక బాబాయా? మీరు సర్వశక్తివంతుడైన బాబా పిల్లలైతే మరి
వాతావరణం మీ కంటే శక్తిశాలిగా ఎందుకు ఉంది? మీ శక్తిని మరచిపోవటం వలనే వాతావరణం
యొక్క ప్రభావం పడుతుంది. ఏవిధంగా అయితే డాక్టర్ జబ్బుతో ఉన్న పేషెంట్ (రోగి)
దగ్గరికి వెళితే రోగి ప్రభావం డాక్టర్ పై పడదు కదా! అలాగే మీ యొక్క స్మృతి
ఉంచుకుని సేవ చేయాలి. మన శక్తితో వాతావరణాన్ని తయారు చేయాలి, కానీ వాతావరణం
మనల్ని తయారుచేయకూడదు. దంపతులుగా ఉంటూ ఒంటరిగా ఆత్మ యొక్క స్మృతిలో ఉంటున్నారు
కదా! ఆత్మ ఒంటరి కదా! ఒకవేళ ఆత్మ సంబంధంలోకి వచ్చినా కూడా ఎవరి సంబంధంలోకి
రావాలి? సర్వసంబంధాలు ఎవరితో ఉన్నాయి? ఒక బాబాతో ఉండాలి. ఒకటి నుండి రెండుగా
కూడా అవ్వాలి. అంటే బాబా మరియు పిల్లలు ఇంకే సంబంధం ఉండకూడదు. సర్వసంబంధాలు
ఒకనితో జోడించాలి. ఒకరి నుండి రెండు అనగా శివబాబా నా తోడు. ఈ స్థితినే ఉన్నతమైన
స్థితి అంటారు. మూడవ వారిని చూస్తూ కూడా చూడకూడదు. ఒకవేళ చూడాలంటే ఒకరినే
చూడాలి. మాట్లాడాలంటే ఆయనతోనే మాట్లాడండి. ఈ విధమైన స్థితి ద్వారానే మాయని
జయించగలరు. మాయని జయించిన వారే విశ్వాన్ని జయించగలరు. ఈ శుద్ద స్నేహం మొత్తం
కల్పంలో ఒకేసారి లభిస్తుంది. అటువంటి స్నేహాన్ని మనం పొందుతున్నాము అనేది
జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరికీ లభించనిది మనం పొందాము. ఈ నషా మరియు నిశ్చయంలో
ఉండాలి. ఢిల్లీలో ఎప్పుడు అద్భుతం చేస్తారు. ఢిల్లీ యొక్క ధ్వనియే నలువైపులా
వ్యాపిస్తుంది. ఢిల్లీలోని పేరు ప్రత్యక్షం అవ్వటం అంటే భారతదేశంలో కూడా పేరు
ప్రత్యక్షం అవ్వటం. ఇంత బాధ్యత ఢిల్లీ వారు తీసుకోవాలి. సమయం తక్కువ, సేవ
ఎక్కువ ఉంది. ఎప్పుడు వేగంతో సేవ చేస్తారో, అప్పుడే అందరికీ సందేశం అందుతుంది.
ఇతరులను ధనవంతులుగా చేయటానికి సమయం ఇవ్వటం కూడా మహాదానం. మహాదానం యొక్క ఫలం
కూడా అంతగానే లభిస్తుంది.
బాబా తోడును సదా ఉంచుకుంటే వీరికి తోడుగా సర్వశక్తివంతుడు ఉన్నారని మాయ దూరంగా
పారిపోతుంది. ఒంటరిగా చూసినప్పుడు రావటానికి సాహసిస్తుంది. అడవులల్లోకి వేటకి
వెళ్ళినప్పుడు జంతువులు యుద్ధం చేయకుండా అగ్ని వెలిగిస్తారు కదా! అలాగే స్మృతి
అనే అగ్ని వెలిగి ఉంటే మాయ రాలేదు. సంలగ్నత అనే ఈ అగ్ని ఆరిపోకూడదు. బాబాని
తోడు ఉంచుకోవటం ద్వారా శక్తి స్వతహాగానే లభిస్తుంది. ఇక విజయమే విజయం. బాప్
దాదాకి ముసలి మాతలంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా దు:ఖలతో అలసిపోయి ఉన్నారు.
అలసిపోయిన పిల్లలపై బాబాకి స్నేహం ఉంటుంది. ఇంత స్నేహం పిల్లలు కూడా
పెట్టుకోవాలి. ఇంట్లో కూర్చుని కూడా స్పృతియాత్రలో పాస్ అయితే ముందుకి
వెళ్ళగలరు. ఎంత స్మృతియాత్రలో సఫలులు అవుతారో, అంతగా మనస్సు యొక్క భావన కూడా
శుద్ధం అవుతుంది. అందరూ సేవలో సహయోగి అవుతున్నారా? ఎంత ఇతరులకు సందేశం ఇస్తారో
అంత మీకు కూడా సంపూర్ణత యొక్క సందేశం లభిస్తుంది. ఎందుకంటే ఇతరులకు చెప్పటం
ద్వారా మిమ్మల్ని మీరు సంపూర్ణంగా తయారుచేసుకునే ధ్యాస స్వతహాగానే ఉంటుంది. సేవ
చేయటం కూడా మిమ్మల్ని మీరు సంపూర్ణంగా చేసుకునేటందుకు మధుర బంధన, ఈ బంధనలో
మిమ్మల్ని మీరు ఎంత బంధించుకుంటారో, అంత సర్వ బంధనాల నుండి ముక్తి అవుతారు.
సర్వ బంధనాల నుండి ముక్తి అవ్వటానికి సాధనం ఏమిటి? ఒక్క బంధనలోనే మిమ్మల్ని
బంధించుకోవాలి. ఈ మధుర బంధన కూడా ఇప్పుడే ఉంటుంది. మరెప్పుడూ ఉండదు. అందరూ ఈ
ఈశ్వరీయ బంధనలో బంధించబడిన ఆత్మలు. శ్రేష్టకర్మ ద్వారానే శ్రేష్ట పదవి
లభిస్తుంది, మరియు శ్రేష్టాచారిగా అవుతారు. ఒకే శ్రేష్ట కర్మ ద్వారా వర్తమానం
శ్రేష్టంగా తయారవుతుంది మరియు భవిష్యత్తు కూడా తయారవుతుంది. దేని ద్వారా అయితే
వర్తమానం మరియు భవిష్యత్తు రెండూ శ్రేష్టంగా అవుతాయో ఆ కర్మ చేయాలి. అహ్మదాబాద్
వారు అందరికంటే ఎక్కువ సేవ చేయాలి. ఎందుకంటే అహ్మదాబాద్ అన్ని సెంటర్స్ కి
బీజం, బీజంలో ఎక్కువ శక్తి ఉంటుంది. కనుక బాగా సవాల్ చేయండి. మత్తు నిద్రలో
ఉన్నవారు కూడా మేల్కొవాలి. కుమారీలు చాలా అద్భుతం చేయగలరు, ఒకొక్క కుమారీలో ఎంత
శక్తి ఉంటే అంత సేవలో సఫలత చూపించాలి. కుమారీలు పురుషార్ధంలో, సేవలో అందరికంటే
వేగంగా వెళ్ళగలరు. సేవలో శక్తులు ముందా? పాండవులు ముందా? కల్పపూర్వం పాండవుల
యొక్క స్మృతిచిహ్నం ఉంది కదా! ఎన్నిసార్లు పాండవులుగా అయ్యారు.
లెక్కలేనన్నిసార్లు అయ్యారు. ఇది పక్కాగా జ్ఞాపకం ఉంటుంది కదా! ఈ స్మృతి ఉంటే
ఎప్పుడూ విస్మృతి రాదు. కల్పపూర్వం కూడా మేమే అయ్యాం , ఇప్పుడు కూడా మేమే
అవుతాం అనే నషా, నిశ్చయం ఉండాలి. మేమే హక్కుదారులం, ఎవరికి? ఉన్నతోన్నమైన
బాబాకి. ఈ స్మృతి ఉండటం ద్వారానే ఏకరసస్థితి ఉంటుంది. ఒకని స్మృతిలో ఉండటం
ద్వారానే ఏకరసస్థితి ఉంటుంది.
అవ్యక్తంలో సేవ ఎలా జరుగుతుంది అనేది అనుభవం అవుతుందా? అవ్యక్తంలో సేవలో తోడుగా
సదా ఎలా ఉంటారో కూడా అనుభవం అవుతుందా? స్నేహీ ఆత్మలతో ప్రతీ సెకను తోడు ఉంటానని
బాబా ప్రతిజ్ఞ చేసారు కదా! ఈవిధంగా సదా తోడు యొక్క అనుభవం అవుతుందా? కేవలం రూపం
మారింది. కానీ కర్తవ్యం అదే నడుస్తుంది. స్నేహీ పిల్లలపై ఛత్రఛాయ ఉంది. ఆ
ఛత్రఛాయ క్రింద అన్ని పనులు జరుగుతున్నాయి. వ్యక్తం నుండి అవ్యక్తంలోకి,
అవ్యక్తం నుండి వ్యక్తంలోకి ఇలా మెట్లు ఎక్కడం మరియు దిగటం అలవాటు అయ్యిందా?
ఇప్పుడిప్పుడే అక్కడ, ఇప్పుడిప్పుడే ఇక్కడ ఎవరికైతే ఈ స్థితి యొక్క అభ్యాసం
అవుతుందో వారికి ఈ వ్యక్త దేశం కూడా అవ్యక్తంగా అనుభవం అవుతుంది. స్మృతి మరియు
దృష్టి మారిపోతాయి. అందరూ ఎవరెడీ అయి కుర్చున్నారా? దేహం యొక్క కర్మలఖాతాలతో
తేలిక అయిపోవాలి. వతనంలో ఆదిలో పక్షుల ఆట చూపించేవారు. పక్షులను ఎగురవేసేవారు.
అలాగే ఆత్మ కూడా పక్షి కదా! ఈ పక్షి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు
ఎగరగల్గుతుంది. అభ్యాసం ఉన్నప్పుడే ఎగరగల్గుతుంది. ఎప్పుడైతే స్వయం ఎగిరే పక్షి
అయి ఎగురుతారో, అప్పుడే ఇతరులను కూడా ఎగిరింప చేయగలరు. ఇప్పుడైతే సమయం
పడుతుంది. పరోక్షంగా వతనం యొక్క అనుభవం చెప్పారు. పరోక్షంగా వతనంలో ఎంత సమయం
వెంట ఉంటారు? ఎలా అయితే ఈ సమయంలో ఎవరిపైన అయినా స్నేహం ఉంటే, వారు విదేశాలలో
ఉంటే, వారి మనస్సు కూడా అక్కడే ఎక్కువగా ఉంటుంది. ఏ దేశంలో వారు ఉంటారో, తమని
తాము కూడా ఆ దేశవాసిగా భావిస్తారు. అలాగే మీరు కూడా సూక్ష్మవతనవాసిగా అవ్వాలి.
సూక్ష్మవతనాన్ని స్టూలలోకంలో అనుభవం చేసుకుంటున్నారా లేక స్వయం సూక్ష్మలోకంలో
బాబా వెంట ఉన్నట్లు అనుభవం చేసుకుంటున్నారా? సూక్ష్మవతనవాసి బాబాని ఇక్కడ
అనుభవం చేసుకుంటున్నారా లేక మిమ్మల్ని మీరు సూక్ష్మవతనవాసిగా చేసుకుని బాబా
వెంట ఉంటున్నారా? స్థూల లోకంలో ఉంటూ కూడా సూక్ష్మవతనవాసి అవుతున్నారు అని బాప్
దాదా భావిస్తున్నారు. అవ్యక్త స్థితిలో స్థితులై సహాయం తీసుకుంటున్నారా?
అవ్యక్త స్థితిలో స్థితులైతే సహాయం తీసుకోగలరు. స్థూల వతనంలో ఉంటూ కూడా
సూక్ష్మవతనవాసి అవుతున్నారని బాప్ దాదా భావిస్తున్నారు. సూక్ష్మవతనం యొక్క
వాతావరణంలోనే సూక్ష్మం నుండి సేవ తీసుకోగలరు. వ్యక్త రూపంగా అవ్యక్త సహాయం
లభిస్తుంది. ఇప్పుడు ఎక్కువ సమయం మిమ్మల్ని మీరు ఫరిస్తాగా భావించండి. ఫరిస్తాల
ప్రపంచంలో ఉండటం ద్వారా చాలా తేలికస్థితి అనుభవం అవుతుంది. సూక్ష్మవతనాన్నే
స్థూల లోకంలోకి తీసుకువచ్చినట్లుగా అనుభవం అవుతుంది. స్థూలం మరియు సూక్ష్మంలో
తేడా ఉండకూడదు. అప్పుడు సంపూర్ణ స్థితిలో కూడా తేడా ఉండదు. ఈ వ్యక్త దేశం
అవ్యక్త దేశంగా అయిపోతుంది. సంపూర్ణతకి సమీపంగా వచ్చేస్తారు. బాప్ దాదా
వ్యక్తంలోకి వస్తూ కూడా అవ్యక్త రూపం యొక్క, అవ్యక్త దేశం యొక్క అవ్యక్త
ప్రవాహంలో ఉంటారు. ఆ స్థితినే పిల్లలకి అనుభవం చేయించటానికి వస్తున్నారు. అలాగే
మీరందరు కూడా మీ అవ్యక్తస్థితి యొక్క అనుభవం ఇతరులకు చేయించండి. ఎప్పుడైతే
అవ్యక్త స్థితి సంపూర్ణంగా ఉంటుందో, అప్పుడే మీ రాజ్యంలో వెంట ఉంటారు. ఒక
కంటిలో అవ్యక్త సంపూర్ణ స్థితి మరియు రెండవ కంటిలో రాజ్య పదవి. ఈ రెండు
సాకారంలో కనిపించినట్లు స్పష్టంగా కనిపిస్తాయి. బాల్యరూపం మరియు సంపూర్ణరూపం
కూడా కనిపిస్తుంది. ఇలా అయ్యి తర్వాత ఇలా అవుతానని స్మృతి ఉంటుంది. భవిష్య
రూపురేఖలు కూడా సంపూర్ణంగా కనిపిస్తాయి. ఎంతెంత ఫరిస్తా జీవితానికి సమీపంగా
వస్తారో, అంతంత రాజ్యపదవి కూడా ఎదురుగా చూస్తారు. ఈ రోజుల్లో కొంతమందికి తమకు
గత జీవితం అంతా స్మృతి ఉంటుంది. అలాగే మీకు కూడా ఇలా అవుతాను అని స్మృతిలో
ఉంటుంది. ఆ భవిష్య సంస్కారాలు ప్రత్యక్షం అవుతాయి. గుప్తంగా ఉండవు, ప్రత్యక్షం
అవుతాయి.