26.01.1970
ఉదయం మురళి ఓం శాంతి
అవ్యక్త్-బాప్దాదా మధుబన్
స్మృతియాత్ర యొక్క సంపూర్ణ స్థితి.
బాప్
దాదా కూడా ఇక్కడ కూర్చున్నారు మరియు మీరు కూడా కూర్చున్నారు కానీ బాప్ దాదా
మరియు మీలో తేడా ఏమిటి? మొదట్లో సాకార రూపంలో కూడా ఇక్కడ కూర్చునేవారు. కానీ
ఇప్పుడు కూర్చుంటున్నప్పుడు ఏమి అనుభవం అవుతుంది? సాకారంలో బాబా అద్దెకు
తీసుకొని వచ్చాను అని భావించేవారు. అలాగే ఇప్పుడు కూడా అనుభవం అవుతుందా!
ఇప్పుడు అతిథి అయ్యి వస్తున్నారు. మీరందరూ మిమ్మల్ని మీరు అతిథిగా
భావిస్తున్నారా! కానీ మీరు భావించటంలో మరియు బాబా భావించటంలో తేడా ఉంది. ఎవరైతే
వస్తూ, పోతూ ఉంటారో వారిని అతిథి అంటారు. ఇప్పుడు వచ్చింది మరలా
వెళ్ళిపోవడానికి, అది బుద్ధి యోగం యొక్క అనుభవం. ఇది ప్రత్యక్ష అనుభవం. రెండవది
- శరీరంలోకి ప్రవేశించి కర్తవ్యం ఎలా చేయాలో ఆ అనుభవం బాబా సమానంగా ఉండాలి.
రోజు రోజుకీ పిల్లలైన మీ స్థితి ఎంతో కొంత సమానస్థితి అవుతూ ఉంటుంది. మీరు కూడా
ఇలా అనుభవం చేసుకుంటారు. నిజంగా అద్దెకు తీసుకున్నదిగా అనుభవం అవుతుంది.
కర్తవ్యం కోసం అతిధులం. ఎప్పటి వరకూ మిమ్మల్ని మీరు అతిథిగా భావించరో అంత వరకూ
అతీత స్థితి రాదు. ఎవరైతే ఎంత అతీత స్థితిలో ఉంటారో వారి స్థితిలో ఏ విశేషత
ఉంటుంది? వారి మాటలో, నడవడికలో ఉపరామ్ (అతీత) స్థితి ఇతరులకు అనుభవం అవుతుంది.
ఎంతెంత స్థితి ఉన్నతం అవుతూ ఉంటుందో అంతంత ఉపరామ స్థితి వస్తుంది. శరీరంలో ఉంటూ
కూడా ఈ ఉపరామ స్థితికి చేరుకోవాలి. పూర్తిగా ఈ దేహం మరియు ఆత్మ రెండూ వేరుగా
అనుభవం అవ్వాలి. దానినే స్మృతి యాత్ర యొక్క సంపూర్ణస్థితి అని అంటారు లేదా యోగం
యొక్క ప్రత్యక్ష సిద్ధి అని అంటారు. మాట్లాడుతూ, మాట్లాడుతూ అతీత స్థితి
ఆకర్శించాలి. మాటలు వింటూ కూడా విననట్లుగా ఉండాలి. ఇలాంటి అనుభవం ఇతరులకి కూడా
జరగాలి. ఈ విధమైన స్థితిని కర్మాతీత స్థితి అంటారు. కర్మాతీతం అంటే దేహ బంధన
నుంచి కూడా ముక్తి అవ్వాలి, కర్మ చేస్తున్నారు. కానీ ఆ కర్మల ఖాతా తయారు
కాకూడదు. ఎలాగైతే అతీతంగా ఉంటే ఏ తగుల్పాటు ఉండదో అలాగే కర్మ చేసేవారు వేరు
మరియు కర్మ వేరు ఇలాంటి అనుభవం రోజు రోజుకి అవుతూ ఉంటుంది. ఈ స్థితిలో ఎక్కువ
బుద్ది ఉపయోగించవలసిన అవసరం లేదు. సంకల్పం రాగానే ఏది జరగాలో అదే జరుగుతుంది. ఈ
స్థితిలోకి అందరికీ వస్తుంది. మూలవతనం వెళ్ళేముందు (వయా) సూక్ష్మవతనం వెళ్తారు.
అక్కడ అందరు వచ్చి కలుసుకోవాలి, మరలా మీ ఇంటికి వెళ్ళి తర్వాత మీ రాజ్యంలోకి
వస్తారు. ఎలా అయితే సాకార లోకంలో మేళా జరుగుతుందో అలాగే సూక్ష్మవతనంలో కూడా
ఉంటుంది. ఆ ఫరిస్తాల మేళా సమీపంగా ఉంది. ఫరిస్తాలు పరస్పరం కలుసుకుంటాయి.
ఆత్మలు, ఆత్మలతో మాట్లాడుతున్నాయి అని కథలు చెప్పారు కదా! ఏవైతే కథలు ఉన్నాయో
అవి ప్రత్యక్షంలో అనుభవం అవుతాయి. ఆ మేళా రోజుల కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు సేవకీ నిమిత్తం అయ్యాము. అన్ని మర్చిపోయి కూర్చున్నారు. ఆ అవ్యక్త
స్థితిలో మనస్సు మరియు వ్యక్త దేశంలోని తనువు ఉన్నట్లు అనుభవం అవుతుందా?
మంచిది.
మిమ్మల్ని మీరు ఎక్కడ నివసించేవారిగా భావిస్తున్నారు? పరంధామ నివాసిగా
భావిస్తున్నారా? ఇది ఎంత సమయం స్మృతి ఉంటుంది? ఈ ఒక విషయాన్నే స్మృతి ఉంచుకోండి
- మేము పరంధామనివాసి ఆత్మలం, ఈ వ్యక్తదేశంలో ఈశ్వరీయ కర్తవ్యం చేయడానికి
నిమిత్తమాత్రంగా వచ్చాము. మధువవానికి వచ్చి విశేషంగా ఏ గుణం తీసుకున్నారు?
మధువనం యొక్క విశేషగుణం - మధురత, మధు అంటే మధురత, స్నేహీ. ఎంత స్నేహి అవుతారో
అంత బేహద్ వైరాగిగా అవుతారు. ఇది మధువనం యొక్క అర్థం. అతి స్నేహీ అవ్వాలి మరియు
అంతగానే బేహద్ వైరాగ్యవృత్తి ఉండాలి. మధువనం యొక్క విశేష గుణాలను జీవితంలో ధారణ
చేస్తే సహజంగానే సంపూర్ణం అవుతారు. ఇప్పుడు ఆత్మిక టీచర్ మొదటి నెంబర్ టీచర్‌గా
అవుతారు. ఎందుకంటే మీ ధారణ ఎలా ఉంటే అలా ఇతరులకి అనుభవం చేయించగలరు. ఈ రెండు
గుణాలు మీలో ధారణ చేయాలి. మధువన పరిధి నుండి బయటికి వెళ్ళే ముందు మీలో వీటిని
పూర్తిగా నింపుకుని వెళ్ళండి. 1. స్నేహం ద్వారా 2. బేహద్ వైరాగ్యవృత్తి ద్వారా.
ఏ పరిస్థితులనైనా సహజంగా ఎదుర్కోగలరు. సఫలతా సితారగా అవ్వడానికి ఈ రెండు ముఖ్య
గుణాలను మధువనం యొక్క బహుమతిగా తీసుకువెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్తే అక్కడికి
వెళ్ళగానే ఇక్కడ విశేష వస్తువులు ఏమిటి అని అడుగుతారు కదా! ఆ ప్రసిద్ధ విశేష
వస్తువుని తప్పకుండా వెంట తీసుకువెళ్తారు. అలాగే ఇక్కడ మధువనం యొక్క రెండు
విశేష గుణాలను మీ వెంట తీసుకెళ్ళాలి. మధురత అనే సూక్ష్మ తేనెను తీసుకుని
వెళ్ళాలి. తర్వాత సఫలతయే సఫలత లభిస్తుంది. అసఫలత మీ జీవితం నుండి తొలగిపోతుంది.
మీ మస్తకంలో సఫలతా సితార మెరుస్తూ కనిపిస్తుంది. మీరు సఫలతా సితారలా లేక
పురుషార్థీ సితారలా? ఏమని భావిస్తున్నారు? సఫలతా సితారాలేనా? ఎటువంటి లక్ష్యం
ఉంటుందో అటువంటి లక్షణాలు ఉంటాయి. ఇప్పటివరకూ కూడా మేము పురుషార్థులం అని
భావిస్తే దానివలన చిన్న చిన్న పొరపాట్లలో మిమ్మల్ని మీరు క్షమించుకుంటున్నారు.
మేము ఇంకా పురుషార్థులం కదా అని అనుకుంటున్నారు. అందువలన ఇప్పుడు
పురుషార్థీలుగా కాదు, సఫలతా స్వరూపులుగా అవ్వాలి. ఎంత వరకు పురుషార్థంలో
ఉంటారు? ఎప్పుడైతే స్వయం సఫలతా స్వరూపంగా అవుతారో అప్పుడు ఇతరాత్మలకి కూడా
సఫలతకు మార్గం చెప్పగలరు. ఒకవేళ స్వయమే అంతిమం వరకూ పురుషార్థీగా నడిస్తే
సంగమయుగం యొక్క ప్రాలబ్దాన్ని ప్రత్యక్ష రూపంలో ప్రాప్తించుకోలేరు. ఈ జీవితంలో
పురుషార్థిగానే ఉంటారా? ఈ సంగమయుగం యొక్క ప్రాలబ్దం ప్రత్యక్ష రూపంలో పొందరా?
సంగమయుగంలో పురుషార్థం యొక్క ఫలం ఏమిటి? (సఫలత). సఫలతా స్వరూపం నిశ్చయం
చేసుకోవటం ద్వారా సఫలత లభిస్తుంది. నేనే సఫలతా సితారను అని భావిస్తే అసఫలత ఎలా
వస్తుంది? సర్వశక్తివంతుని సంతానం ఏ కార్యంలో అసఫలులు అవ్వరు. మీ మస్తకంలో
విజయీ సితార చూస్తున్నారా లేక చూసారా? విజయం అయితే నిశ్చితమే కదా! విజయం అంటే
సఫలత, ఇప్పుడు సమయం మారుతూ ఉంది. సమయం మారినప్పుడు పురుషార్థం కూడా
మార్చుకోవాలి కదా. ఇప్పుడు బాబా సఫలతా రూపం చూపిస్తున్నారు. అందువలన పిల్లలు
కూడా వ్యక్త దేహంలో ఉంటూ సఫలతా రూపం చూపించలేరా? సదా మిమ్మల్ని మీరు సఫలతా
మూర్తిగా భావించండి. నిశ్చయాన్ని విజయం అంటారు. ఎటువంటి విశ్వాసం ఉంచుకుంటారో
అటువంటి కర్మయే జరుగుతుంది. నిశ్చయంలో లోపం ఉంటే కర్మలో కూడా లోపం
వచ్చేస్తుంది. స్మృతి శక్తిశాలిగా ఉంటే స్థితి మరియు కర్మ కూడా శక్తివంతంగా
ఉంటాయి. అందువలన ఎప్పుడూ కూడా మీ స్మృతిని బలహీనం చేసుకోకూడదు. శక్తిదళం లేదా
పాండవులు ఎప్పుడైనా అసఫలులు అవుతారా? పాండవులు ఏమి చేశారో కల్పపూర్వపు విషయాలు
జ్ఞాపకం ఉన్నాయా? విజయీగా అయ్యారు కదా! అందువలన ఇప్పుడు మీ స్మృతిని శ్రేష్టంగా
చేసుకోండి. ఇప్పుడు సంగమయుగంలో విజయీ తిలకం లభిస్తుంది. తర్వాత ఈ విజయీతిలకం
ద్వారా రాజ్య తిలకం లభిస్తుంది. ఈ విజయీ తిలకాన్ని ఎవరూ తొలగించలేరు. అటువంటి
నిశ్చయం ఉందా? విజయీరత్నాలకి ప్రతి విషయంలో విజయమే విజయం లభిస్తుంది. వారికి
ఓటమి ఉండదు. అనేక జన్మల నుంచి ఓడిపోతూ వచ్చారు. ఇప్పుడు వచ్చి విజయీ అయిన
తర్వాత ఓటమి ఎందుకు? “విజయం మాదే” ఇలా ఒకే బలం, ఒకే నమ్మకం ఉండాలి. ఒకవేళ
ఎవరైనా ఈ మార్గంలో నడవలేకపోతే పెళ్ళి చేయవలసే ఉంటుంది. వారి బాధ్యత కూడా మీ
నుండి తొలగించుకోవాలి. విధి లేక చేయవలసి వచ్చినా సాక్షి అయ్యి చేయాలి. అప్పుడు
అది కర్తవ్యం నిలుపుకోవటం అయ్యింది. కానీ ఇష్టంతో కాదు. కర్తవ్యం
నిలుపుకుంటున్నారు. 1. ఇష్టంతో చేయటం. 2. నిమిత్తమాత్రంగా కర్తవ్యం
నిలుపుకోవటం. ఆత్మలందరు ఒకే సమయంలో ఈ జన్మ సిద్ధఅధికారం తీసుకునే పాత్ర లేదు.
పరిచయం తప్పకుండా లభిస్తుంది. గ్రహిస్తారు కానీ కొంతమందికి ఇప్పుడు, కొంతమందికి
వెనుక పాత్ర ఉంటుంది. బీజాలలో కూడా కొన్ని వెంటనే ఫలం ఇస్తాయి, కొన్ని ఆలస్యంగా
ఇస్తాయి. అలాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికీ తమ సమయానుసారంగా పాత్ర ఉంటుంది.
కర్తవ్యంగా భావించి చేస్తే మాయ ప్రభావం అంటుకోదు. లేకపోతే వాయుమండలం యొక్క
ప్రభావం పడవచ్చు. అందువలన కర్తవ్యంగా భావించి చేయాలి. ఫర్జ్ (కర్తవ్యం) మరియు
మర్జ్(నిమగ్నం అయిపోవటం)లో కేవలం ఒక్క అక్షరమే తేడా. బిందు రూపంగా అవ్వటం లేని
కారణంగా కర్తవ్యంలో కూడా లీనమైపోతున్నారు. సహయోగులకి సహాయం సదా లభిస్తుంది.
బాబా యొక్క సహాయం ప్రతీ కార్యంలో ఎలా లభిస్తుందో అనుభవం అవుతుందా? ఒకరికొకరి
విశేషత చూసి ఒకరికొకరు ముందు ఉంచుకోవాలి. ఎవరినైనా ముందు ఉంచటం కూడా మీరు
ముందుకు వెళ్ళటం, శివజయంతికి సేవ సహజంగా జరుగుతుంది. ఎంత ధైర్యం ఉంటే అంత సేవ
చేయండి. ఎందుకంటే మున్ముందు సేవకి అవకాశం కూడా తక్కువ లభించే సమయం రానున్నది.
అందువలన ఎంత చేయగలిగితే అంత చేయండి. పొరపాట్లు ఎందుకు జరుగుతాయి? దాని లోతులోకి
వెళ్ళండి. ఈ పొరపాటు ఎందుకు జరిగింది అని అంతర్ముఖులుగా అయ్యి ఆలోచించాలి. ఇది
మాయ యొక్క రూపం, నేను రచయిత అయిన బాబా సంతానాన్ని ఇలా మీతో మీరు మాట్లాడండి.
వాటిని తొలగించుకుని వృద్ధి అవ్వటానికి ప్రయత్నం చేయండి. ఎక్కడికైనా
వెళ్ళినప్పుడు మీ స్మృతిచిహ్నం ఏదో ఒకటి ఇస్తారు మరియు ఏదో ఒకటి తీసుకు
వెళ్తారు. మధువనంలో విశేషంగా ఏ స్మృతిచిహ్నం ఇచ్చారు? ప్రతి ఆత్మకి ఈశ్వరీయ
స్నేహం మరియు సహయోగం యొక్క స్మృతిచిహ్నం ఇవ్వాలి. ఎంత ఒకరికొకరు స్నేహి, సహయోగి
అవుతారో అంతగానే మాయా విఘ్నాలు తొలగటంలో సహయోగం లభిస్తుంది. సహయోగం ఇవ్వటం అంటే
సహయోగం తీసుకోవటం.
పరివారంలో ఆత్మిక స్నేహం ఇవ్వాలి. మరియు మాయ పైన విజయం పొందే సహయోగం
తీసుకోవాలి. ఇలా ఇచ్చి పుచ్చుకునే లెక్క మంచిగా ఉండాలి. ఈ సంగమయుగంలోనే అనేక
జన్మల సంబంధాలను జోడించుకోవాలి. స్నేహమే సంబంధం జోడించుకోవటానికి సాధనం. బట్టలు
కుట్టడానికి సాధనం - దారం. అలాగే భవిష్య సంబంధం జోడించుకోవడానికి ఆధారం స్నేహం
అనే దారము. ఇక్కడ జోడిస్తే అక్కడ మంచి సంబంధం లభిస్తుంది. జోడించే సమయం మరియు
స్థానం ఇదే. ఎప్పుడైతే అనేకుల స్నేహం సమాప్తి అయిపోతుందో అప్పుడు ఈశ్వరీయ
స్నేహం జోడించబడుతుంది. కనుక ఇప్పుడు అనేకుల స్నేహం సమాప్తి చేసి ఒకే స్నేహం
జోడించాలి. అనేకుల స్నేహం అలజడి చేసేదిగా ఉంటుంది మరియు ఒకే స్నేహం సదాకాలికంగా
పరిపక్వంగా చేస్తుంది. అనేక వైపుల నుంచి తెంచాలి మరియు ఒకే వైపుకి జోడించాలి.
తెంచకుండా జోడించలేరు. ఇప్పుడు లోటుని కూడా నింపుకోవచ్చు. తర్వాత నింపుకునే
సమయం కూడా సమాప్తి అయిపోతుంది. ఇలా భావించి ప్రతి అడుగు ముందుకు వేయాలి. అందరు
తీవ్ర పురుషార్థులా లేక పురుషార్థులా?
తీవ్రపురుషార్థులకు మనస్సులో, సంకల్పంలో కూడా ఓటమి ఉండదు. ఈ విధమైన స్థితి
తయారుచేసుకోవాలి. సంకల్పంలో కూడా మాయ ఓడించకూడదు. వీరినే తీవ్ర పురుషార్థి
అంటారు. వారు మనస్సుని శుద్దసంకల్పాలలో ముందుగానే బిజీగా ఉంచుతారు. కనుక ఇతర ఏ
సంకల్పాలు రావు. పూర్తిగా నిండిపోతే ఒక బిందువు కూడా పట్టదు. క్రిందికి
కారిపోతాయి. కనుక మనస్సులో వ్యర్థ సంకల్పాలు కూడా రావడానికి కూడా స్థానం
ఉండకూడదు. ఇంతగా మిమ్మల్ని మీరు బిజీగా చేసుకోండి. మనస్సుని బిజీగా చేసుకునే
పద్ధతి ఏదైతే లభిస్తుందో దానిని మీరు పూర్తిగా ప్రయోగించటం లేదు. అందువలన
వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తున్నాయి. ఒకవైపు బిజీగా ఉంచడం ద్వారా రెండవవైపు
స్వతహాగానే తొలగిపోతుంది. మననం చేయడానికి చాలా ఖజానా లభించింది. దీనిలో
మనస్సుని బిజీగా ఉంచాలి.
సమయం
యొక్క వేగం తీవ్రంగా ఉందా లేక మీ పురుషార్ధం యొక్క వేగం తీవ్రంగా ఉందా? సమయం
వేగంగా నడుస్తూ, మీ పురుషార్థం యొక్క వేగం తక్కువగా ఉంటే ఫలితం ఏమి వస్తుంది?
సమయం ముందు వెళ్ళిపోతుంది. పురుషార్థి ఆగిపోతారు. సమయం అనే బండి వెళ్ళిపోతుంది,
ప్రయాణం చేయవలసినవారు ఉండిపోతారు. జరిగిపోయిందేదో జరిగిపోయింది - ఇది సమయం
యొక్క వేగం. జరిగిపోయిన విషయాన్ని సమయం మరలా రిపీట్ చేస్తుందా? పురుషార్థంలో
ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిలో జరిగిపోయిందేదో జరిగిపోయింది అని భావించి ఇక ముందు
ప్రతి సెకను ఉన్నతిని తీసుకురండి. సమయంతో సమానంగా స్వయం నడుస్తున్నారా? సమయం
అయితే మీ రచన. రచనలో ఈ గుణం ఉంది. అంటే రచయితలా కూడా ఉండాలి కదా! డ్రామా రచన
అయితే మీరు రచయిత యొక్క పిల్లలు కదా! మరి రచన కంటే బలహనంగా ఎందుకు ఉన్నారు?
అందువలన కేవలం ఒక విషయం ఙ్ఞాపకం ఉంచుకోవాలి - డ్రామాలో ప్రతి సెకను లేదా ఏ
రూపంలోనైనా జరిగిపోయిన విషయం మరలా జరగదు. అది మరలా 5000 సంవత్సరాల తర్వాతే
జరుగుతుంది. అలాగే బలహీనతలను కూడా మాటిమాటికి ఎందుకు పునరావృతము చేస్తున్నారు?
బలహీనతలు ఇలా పునరావృతము కాకపోతే పురుషార్ధం తీవ్రం అవుతుంది. బలహీనతలు
తొలగిపోయినప్పుడు వాటి స్థానంలో శక్తి నిండుతుంది. బలహీనతలు పునరావృతం అవుతూ
ఉంటే శక్తి నిండదు. అందువలన జరిగిపోయిందేదో జరిగిపోయింది. జరిగిపోయిన బలహీన
విషయాలు తిరిగి సంకల్పంలో కూడా రాకూడదు. ఒకవేళ సంకల్పంలో వస్తే అది మాట మరియు
కర్మలోకి వచ్చేస్తుంది. సంకల్పంలోనే సమాప్తి చేసేస్తే వాణీ, కర్మలోకి రాదు.
అప్పుడు మనసా, వాచా, కర్మణా మూడు శక్తిశాలిగా అయిపోతాయి. చెడు వస్తువులను
వెంటనే పడేస్తారు కదా! మంచి వస్తువులను ఉపయోగిస్తారు అలాగే చెడు విషయాలను
పడేయండి. అప్పుడు సమయం పురుషార్ధం కంటే వేగంగా వెళ్ళదు. అప్పుడు సమయం కోసం మీరు
ఎదురు చూస్తూ ఉంటారు. మేము తయారయ్యి ఉన్నాము, సమయం వస్తే వెళదామని.
తయారుకాకపోతే సమయం కొంచెం మా కోసం ఆగితే బావుండును అనే సంకల్పం వస్తుంది.
బంధనాలలో ఉండేవారికి యోగం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ విషయం గురించి అయినా
ఎవరైనా ఆపితే బుద్ధి తప్పకుండా అటే వెళ్ళిపోతుంది. వారు ఇంట్లో కూర్చుని
ఉండగానే చరిత్రను అనుభవం చేసుకుంటారు. కానీ దీనికోసం అటువంటి సంలగ్నత
కావాలి.?ఎప్పుడైతే ఇటువంటి సంలగ్నత ఉంటుందో అప్పుడు బంధనాలు తెగిపోతాయి. ఒక్కని
స్మృతియే అనేక బంధనాలను త్రెంచేది. ఒకరితో జోడించాలి అనేకుల నుంచి త్రెంచాలి.
ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు. ఇటువంటి స్థితి తయారైతే బంధనాలన్నీ సమాప్తి
అయిపోతాయి. ఎంతెంత తెగిపోని స్నేహం ఉంటుందో అంతంత తెగిపోని సహాయం లభిస్తుంది.
సహయోగం లభించడం లేదంటే స్నేహంలో లోపం ఉన్నట్లే. తెగిపోని స్నేహం ఉంచుకుని
తెగిపోని సహాయం పొందాలి. కల్పపూర్వపు అధికారాన్ని తిరిగి తీసుకోవడానికి వచ్చాము
అని భావిస్తున్నారా? మేమే కల్పపూర్వంలోని వాళ్ళం అనే స్మృతి వస్తుందా? ఇప్పుడు
కూడా ఉన్నాము, మరలా అవుతాం. ప్రతి ఒక్కరు నిమిత్తం అవుతాము అనే నషా ఎవరికైతే
ఉంటుందో వారి ముఖంలో సంతోషం మరియు జ్యోతిరూపం కనిపిస్తుంది. వారి ముఖంలో
అలౌకిక, అవ్యక్త మెరుపు కనిపిస్తుంది. వారి నయనాలలో, ముఖంలో సదా సంతోషమే సంతోషం
కనిపిస్తుంది. వారిని చూసిన వారు కూడా తమ దు:ఖాన్ని మర్చిపోతారు. ఎవరైనా దు:ఖి
ఆత్మగా ఉంటే తమ దు:ఖాన్ని పోగొట్టుకుని సంతోషం కోసం అనేక సాధనాలను తయారు
చేసుకుంటారు. అందువలన దర్పణంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ ముఖం ద్వారా కూడా
సేవ జరగాలి. మనం మాట్లాడకుండానే ముఖం సేవ చేయాలి. ఈ రోజుల్లో ప్రపంచం వారు కూడా
తమ ముఖాన్నే అలంకరించుకుంటున్నారు కదా! అలాగే మీ ముఖం కూడా ఇలా
అలంకరించుకున్నట్లు అందరికీ కనిపించాలి. సర్వశక్తివంతుడైన బాబా యొక్క పిల్లలకు
శక్తి రాకపోవటం అనేది ఎలా జరుగుతుంది? జరుగుతుందంటే తప్పక బుద్ధి లైన్లో లోపం
ఉన్నట్లే. ఆ లైన్ జోడించడానికి ఏవైతే యుక్తులు లభిస్తున్నాయో వాటిని
అభ్యాసంలోకి తీసుకురండి. తెంచకుండా జోడిస్తున్నారు. అందువలన పూర్తిగా
జోడించబడటం లేదు. కొద్ది సమయం జోడించబడుతుంది మరలా తెగిపోతుంది. అందువలన అనేక
వైపుల నుంచి తెంచి ఒకేవైపు జోడించాలి. దీనికోసం సాంగత్యం మరియు ధ్యాస అవసరం.
ప్రతి సంకల్పం, అడుగు కూడా ఆలోచించి వేయండి. మా ఈ సంకల్పం యదార్ధంగా ఉందా, లేదా
అని. ఇంత ధ్యాస సంకల్పంపై ఉన్నప్పుడే వాణి, కర్మ కూడా మంచిగా ఉంటాయి. సంకల్పం
మరియు సమయం రెండూ సంగమయుగం యొక్క విశేష ఖజానాలు. వీటి ద్వారా చాలా సంపాదన
చేసుకోగలరు. ఎలా అయితే స్థూల ధనాన్ని ఆలోచించి అర్థం చేసుకుని ఉపయోగిస్తారు
కదా! ఒక పైసా కూడా వ్యర్ధంగా పోదు. అలాగే ఈ సంగమయుగం యొక్క సమయం, సంకల్పం
వ్యర్ధంగా పోకూడదు. సంకల్పం శక్తిశాలిగా ఉంటే మీ సంకల్పం ఆధారంగా సత్యయుగ
సృష్టిని తీసుకురాగలరు. మీ సంకల్పాలు బలహీనంగా ఉంటే మీ కోసం త్రేతాయుగీ
సృష్టిని తీసుకువస్తారు. ఈ ఖజానా మొత్తం కల్పంలో మరెప్పుడు లభించదు. కష్టంతో
ఒకేసారి లభించే వస్తువుకి ఎంత విలువ ఉంచుకోవాలి? ఇప్పుడు తయారైనవారే
తయారవుతారు. తర్వాత ఇక తయారైన వారిని చూస్తూ ఉండవలసి వస్తుంది. అప్పుడు
తయారుచేసుకోలేరు. ఇప్పుడు తయారు చేసుకోగలరు. ఇప్పుడు దాని కోసం ఇంకా కొంచెం
సమయం ఉంది. ఇతరులకి చెప్తారు కదా! చాలా సమయం వెళ్ళిపోయింది, కొంచెం మిగిలి ఉంది
అని, కానీ అది మీ కోసం ఉపయోగిస్తున్నారా! సమయం కొద్దిగానే ఉంది కానీ పని చాలా
చేయాలి. మీకు మీరు ధృఢ ప్రతిజ్ఞ చేసుకోండి - ఈరోజు నుండి ఈ విషయాలు ఇక ఉండవు
అని, ఈ సంస్కారాలను మరలా మీలో ప్రత్యక్షం కానివ్వకూడదు. ఈ వ్యర్థ సంకల్పాలను
ఎప్పుడు ఉత్పన్నం కానివ్వకూడదు. ఈ విధమైన ధృఢ ప్రతిజ్ఞ చేసినప్పుడే
ప్రత్యక్షఫలం లభిస్తుంది. ఇప్పుడు రోజులు మారిపోతూ ఉన్నాయి. కనుక స్వయాన్ని
కూడా మార్చుకోవాలి. ఇప్పుడు బలహీన పురుషార్ధం యొక్క రోజులు పోయాయి. ఇప్పుడు
తీవ్ర పురుషార్ధం చేసే సమయం. తీవ్ర పురుషార్ధం చేసే సమయంలో ఎవరైనా బలహీన
పురుషార్ధం చేస్తే ఏమంటారు! అందువలన ఇప్పుడు తెలివిలోకి రండి. మాటిమాటికి
మూర్చితులుగా కావద్దు. సంజీవని మూలికను వెంట ఉంచుకుని సదా తెలివిలో ఉండండి.
అప్పుడు ఇక చేస్తాము, అయిపోతుంది, చూస్తాము, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు.
అటువంటి విషయాలు చాలా సమయం నుండి విన్నారు. అలాగే బాబా! చేసి చూపిస్తాము అనే
మాట బాప్ దాదా ఇప్పుడు వినాలనుకుంటున్నారు. మీ నడవడికలో అలౌకికత
తీసుకువచ్చినప్పుడు ఆ అలౌకిక నడవడికకు లౌకికసంబంధీకులు కూడా స్వయం ఆకర్షితం
అవుతారు. లౌకిక సంబంధీకులపై మాట ప్రభావం చూపదు. నడవడికకి ఆకర్షితం అవుతారు.
ఇప్పుడు చాలా వేగంతో నడవాలి. అందరి ముందు ఉదాహరణగా కనిపించే విధంగా మారి
చూపించండి. ఇప్పుడు ఒక సెకను కూడా పోగొట్టుకోకూడదు. పరిశీలన చేసుకోండి. ఇప్పుడు
సమయం చాలా తక్కువగా ఉంది. సమయం కూడా బేహద్ వైరాగ్యవృత్తిని ఉత్పన్నం చేస్తుంది.
కానీ సమయం కంటే ముందు శ్రమతో మీరు ఏదైతే చేస్తారో దానికి ఎక్కువ ఫలం
లభిస్తుంది. ఎవరైతే స్వయం చేయలేరో వారికి సమయం సహాయం చేస్తుంది. కానీ వారు
సమయానికి బలిహారం అవుతారు. కానీ స్వయం అవ్వరు. ఎన్నిసార్లు బాప్ దాదాని
కలుసుకున్నారు? అనేకసార్లు ఈ జన్మసిద్ధ అధికారం లభించింది అనే స్మృతి ఉందా! ఎంత
ఉన్నతమైన అధికారం. ఎవరు ఎంత ప్రయత్నించినా పొందలేనిది మీరు సహజంగా
పొందుతున్నారు. ఈ అనుభవం ఉందా? సమయం ఎంత మిగిలి ఉంది మరియు ఏమి పురుషార్ధం
చేశాము అని రెండింటిని పరిశీలన చేసుకుంటున్నారా? సమయం తక్కువగా ఉంది.
పురుషార్ధం చాలా చేయాలి. విద్యార్థులు ఎప్పుడైనా చివరి సమయంలో వచ్చి
హాజరవుతారా? వారు కొద్ది సమయంలో ఎంత శ్రమ చేస్తారు! సమయం ఎంత వేగంగా వెళ్తుందో
అంత వేగంగా పురుషార్ధం ఉందా? ఎప్పుడో అనే మాటని తొలగించాలి. తీవ్రపురుషార్థులు
ఎప్పుడో అనే మాట అనరు, ఇప్పుడే అంటారు. ఇప్పటి నుండి చేస్తాము అంటారు. ఈ
సంగమయుగం యొక్క ఒక సెకను కూడా ఎంత విలువైనది! ఒక సెకను అయినా వ్యర్థంగా వెళ్తే
ఎంత సమయం వ్యర్ధం అవుతుంది? కల్పమంతటి యొక్క అదృష్టాన్ని తయారు చేసుకునేది ఈ
కొద్ది సమయంలోనే. ఒక సెకను కోటానుకోట్ల సంపాదన కూడా చేయిస్తుంది మరియు ఒక సెకను
కోటానుకోట్ల సంపాదన కూడా పోగొడుతుంది. ఇలా సమయాన్ని పరిశీలన చేసుకుని అడుగులను
వేగంగా వేయండి. సమస్యలైతే వస్తూనే ఉంటాయి. స్థితి ఎంత శక్తిశాలిగా ఉండాలంటే మన
స్థితి ద్వారా పరిస్థితులు కూడా మారిపోవాలి. పరిస్థితుల ఆధారంగా స్థితి
ఉండకూడదు. స్థితి పరిస్థితిని మార్చగలదు. ఎందుకంటే సర్వశక్తివంతుని సంతానం కనుక
ఈశ్వరీయ శక్తి పరిస్థితులను మార్చలేదా? రచయిత యొక్క పిల్లలు రచనని మార్చలేరా?
రచన శక్తిశాలిగా ఉంటుందా లేక రచయిత శక్తిశాలి ఉంటారా? రచయిత యొక్క పిల్లలు కనుక
రచనకి ఎలా ఆధీనం అవుతారు? అధికారం ఉంచుకోవాలి, కానీ ఆధీనం కాకూడదు. ఎంత
అధికారిగా ఉంటారో అంత పరిస్థితులు కూడా మారిపోతాయి. ఒకవేళ వాటి వెనుక పడుతూ
ఉంటే అవి ఇంకా ఎదుర్కుంటూ ఉంటాయి. ఈ పరిస్థితుల వెనుక పడటం అంటే ఎవరైనా తమ
నీడను పట్టుకోవాలంటే పట్టుకోగలరా? ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. కనుక వాటిని
వదిలేయండి.
వాయుమండలాన్ని మార్చడం చాలా సహజం. ఇంత చిన్న అగరువత్తి, సువాసనను ఇచ్చే చిన్న
వస్తువులు కూడా వాయుమంబడలాన్ని మార్చగలుగుతున్నప్పుడు, జ్ఞానం యొక్క శక్తి
ద్వారా వాయుమండలాన్ని మార్చలేరా? వాయుమండలాన్ని సదా శుద్ధంగా ఉంచాలి అనే ధ్యాస
పెట్టుకోవాలి. ప్రజలు ఏమి మాట్లాడినా కానీ మీకు ఆ విషయంపై సంలగ్నత లేనప్పుడు ఆ
విషయం వింటున్నట్లున్నా దానిని వినరు. శరీరం అక్కడే ఉంటుంది కానీ మనస్సు అక్కడ
ఉండదు. ఇలా అనేకసార్లు జరుగుతూ ఉంటుంది. మనస్సు వేరేవైపు ఉంటుంది. అక్కడ
కూర్చున్నా కానీ కూర్చోనట్లే. తనువుతో కూర్చోవలసి వచ్చినా మనస్సు అక్కడ
ఉండకూడదు. దీని కొరకు ధ్యాస ఉంచుకోవాలి. ఎప్పటి వరకు ధైర్యం చేసి అడుగు వేయరో
అంతవరకు ముందు ఉన్నత గమ్యంగా అనిపిస్తుంది. ఒకవేళ ధైర్యం చేసి పాదం పెడితే
లిఫ్టులో వెళ్ళినట్లు వెంటనే చేరుకుంటారు. ధైర్యం పెట్టుకుంటే మెట్లు కూడా
లిఫ్ట్ అయిపోతాయి. ధైర్యం అనే పాదం పెట్టండి, చేయగలరు. కాని లోకమర్యాదల యొక్క
త్యాగం మరియు దైర్యం యొక్క ధారణ ఉండాలి. ఒకరికొకరి సహయోగం కూడా ఉన్నతమైన
లిఫ్ట్. పరిస్థితులు వస్తాయి, కాని మీ స్థితిని శక్తిశాలిగా ఉంచుకోవాలి.
అప్పుడు ఎటువంటి సమయమో అటువంటి పద్దతి కూడా టచ్ అవుతుంది. ఒకవేళ సమయానికి
యుక్తి రావటం లేదు అంటే యోగబలం లేనట్లు భావించండి. యోగయుక్తంగా ఉంటే తప్పకుండా
సహాయం కూడా లభిస్తుంది. యదార్థ పురుషార్థుల యొక్క పురుషార్థంలో కూడా ఇంత పవర్
ఉంటుంది. ఎక్కువ ఆలోచించవలసిన అవసరం కూడా ఉండదు. అనేకవైపుల తగుల్బాటు
ఉన్నప్పుడే మాయ యొక్క అగ్ని కూడా అంటుకుంటుంది. కాని తగుల్పాటు ఉండకూడదు.
కర్తవ్యం నిలుపుకోవాలి, కానీ దానిపై తగుల్పాటు ఉండకూడదు. తప్పక ఇక బాధ్యత
నిలుపుకోవలసి వస్తుంది అని భావించండి. ఇతరులకు ఉదాహరణగా ఉండే విధంగా
శక్తిశాలిగా ఉండాలి. ఎవరు ఉదాహరణగా అవుతారో వారే పరీక్షలలో పాస్ అవుతారు.
పరీక్షలలో పాస్ అవ్వాలంటే ఉదాహరణ అయ్యి చూపించండి. వీరిలో ఇంత నవీనత ఎలా
వచ్చిందని మనల్ని చూసి ఇతరులకి ప్రేరణ రావాలి. అటువంటి సేవాధారిగా అవ్వాలి.
ఎలాగైతే ఆదిలో సింధ్ హైదరాబాద్ నుండి శక్తులు వెళ్ళి వారి శక్తిని చూపించారో
అలాగే ఇప్పుడు దక్షిణ హైదరాబాద్లో కూడా శక్తి చూపించాలి. ఆదిలో వచ్చిన శక్తులు
ఇంతమంది శక్తులను తయారుచేశారు. ఇప్పుడు మీరు సృష్టిని మార్చాలి, అంత ముందుకు
వెళ్ళాలి. మేము శక్తులం ప్రపంచాన్ని మార్చి చూపిస్తాము అనే పాట ఉంది. సృష్టిని
ఎవరు మారుస్తారు? ఎవరైతే స్వయం మారతారో వారే సృష్టిని మారుస్తారు.
శక్తులను సింహంపై సవారీ చేస్తున్నట్లు చూపిస్తారు. ఏ సింహంపై? ఈ మాయ ఏదైతే
సింహం రూపంలో వస్తుందో దానిని మనం అధీనం చేసుకుని స్వారీ చేయాలి, అంటే అది
మాయాశక్తిని సమప్తి చేయాలి. ఈ విధంగా శక్తులను సింహంపై సవారీ చేస్తున్నట్లు
చూపిస్తారు కదా! వారు మీరే కదా! అవన్నీ మీ చిత్రాలే! ఈవిధమైన సింహం లాంటి
శక్తులు ఎప్పుడు మాయతో భయపడరు. మాయ వారిని చూసి భయపడుతుంది. ఇలా మాయను
జయించేవారిగా అయ్యారు కదా! శక్తిగా కాకుండా బంధన తెగదు. స్మృతిశక్తి ఉండాలి.
ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు. ఈ సౌభాగ్యం కోట్లలో కొద్దిమందికే లభిస్తుంది.
ఇలా మిమ్మల్ని మీరు ఇంత కోటానుకోట్ల భాగ్యశాలి ఆత్మలుగా భావిస్తున్నారా?
శక్తిదళం చాలా అద్భుతం చేయగలదు. ఎవరైతే ఎముకలు అరిగేలా సేవ చేస్తారో వారికి
బాబా కూడా సహాయం చేస్తారు. స్నేహిగా ఉన్నవారితో బాబా కూడా స్నేహిగా ఉంటారు.
అటువంటి పిల్లలే బాబా ఎదురుగా ఉంటారు. ఎవరు ఎంత దూరంగా ఉన్నా కానీ బాప్ దాదాకి
మనస్సుతో సమీపంగా ఉంటారు. అన్నింటికంటే మంచి బహుమతి - మీ ముఖం సదా హర్షితంగా
ఉండాలి. ఎప్పుడు ఏ అలజడి యొక్క రేఖలు ఉండకూడదు. ఎలా అయితే పూర్ణ చంద్రుడు ఎంత
సుందరంగా అనిపిస్తాడో అలాగే మీ ముఖం కూడా హర్షితంగా ఉండాలి. మీ ముఖం ద్వారా
ఇతరులు కూడా తమ రూపం చూసుకోవాలి. ఇలా మెరుస్తూ కనిపించాలి. ముఖం దర్పణంగా
అవ్వాలి. అనేక ఆత్మలకి తమ ముఖం చూపించాలి. ఇప్పుడు పదమాపద భాగ్యశాలి అవ్వాలి.
మహాదాని అవ్వాలి. దయాహృదయుడైన బాబా యొక్క పిల్లలు, కనుక సర్వాత్మలపై దయ
చూపించాలి. ఈ దయాభావన ద్వారా ఎలాంటి ఆత్మలైనా మారతారు. కనుక రోజంతటిలో ఎంత
దయాహృదయంగా అయ్యాను అనేది పరిశీలన చేసుకోండి. ఎంతమంది ఆత్మలపై దయ చూపించాను
అని. ఇతరులకు ఇక సుఖం ఇవ్వటంలో మీ సుఖం నిండి ఉంటుంది. ఇవ్వటం అంటే తీసుకోవటం.
ఇతరులకి సుఖం ఇవ్వటం ద్వారా స్వయం కూడా సుఖస్వరూపంగా అవుతారు. ఏ విఘ్నాలు రావు.
దానం చేయటం ద్వారా శక్తి లభిస్తుంది. అంధులకి నేత్రదానం చేయటం ఎంత గొప్పకార్యం.
మీ అందరి పని ఇదే. అజ్ఞానాంధులకి జ్ఞాననేత్రం ఇవ్వాలి. మరియు మీ స్థితి సదా
అచంచలంగా ఉండాలి. పిల్లలైన మీ స్థితి యొక్క స్మృతి చిహ్నమే - అఛలఘర్. ఎలా అయితే
బాప్ దాదా ఏకరసంగా ఉంటారో అలాగే పిల్లలైన మీరు కూడా ఏకరసంగా ఉండాలి. ఎప్పుడైతే
ఒకే రసంలో ఉంటారో అప్పుడు ఏకరసస్థితిలో ఉంటారు. మంచిది.