29.05.1970
ఉదయం మురళి ఓం శాంతి
అవ్యక్త్-బాప్దాదా మధుబన్
సమీపరత్నాల యొక్క గుర్తులు.
సమయం
ఎంత సమీపంగా వచ్చినట్లు కనిపిస్తుంది? లెక్క తీయగలరా? భవిష్య లక్షణాలతో పాటు
సంపూర్ణ స్వరూపం యొక్క లక్ష్యం కూడా ఎదురుగా ఉంటుందా? సమీపత యొక్క లక్షణాలు ఏమి
ఉంటాయి? కొందరికి తమ శరీరం వదిలేసేటప్పుడు తెలిసిపోతుంది కదా! అలాగే మీకు కూడా
ఈ శరీరం వేరుగా అనుభవం అవుతుంది. దీనిని ధరించి నడిపిస్తున్నాము. సమీపరత్నాల
సమీపతకు గుర్తు ఇదే. సదా తమ ఆకారి రూపం మరియు భవిష్య రూపం ఎదురుగా చూస్తూ
ఉంటారు. ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది. ప్రకాశ తేలిక ఫరిస్తా స్వరూపం ఎదురుగా
కనిపిస్తుంది, మేము ఇలా తయారవ్వాలి అనుకుంటారు. మరియు భవిష్య రూపం కూడా
కనిపిస్తుంది. ఇప్పుడు ఇది వదలి అది తీసుకుంటాం అనే అనుభూతి అయితే సంపూర్ణతకి
సమీపంగా వచ్చినట్లు భావించండి. ఒక కంటిలో సంపూర్ణ స్వరూపం, మరియు రెండవ కంటిలో
భవిష్య స్వరూపం ఇలా ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఎలా అయితే మీ స్వరూపం
ప్రత్యక్షంగా అనుభవం అవుతుందో అలాగే ఇక్కడ కూర్చుని ఉండగానే ఇక్కడ లేము,
సంపూర్ణ స్వరూపంలో కూర్చున్నాం అని అనుభవం చేసుకుంటారు. పురుషార్థీ శరీరం
పూర్తిగా గుప్తం అయిపోతుంది. ఫరిస్తా స్వరూపం, భవిష్య స్వరూపం రెండూ
ప్రత్యక్షమవుతాయి. ఇలా మొదట మీరు అనుభవం చేసుకున్నప్పుడే ఇతరులకి కూడా అనుభవం
అవుతుంది. ఎలా అయితే ఒక వస్త్రం వదలి మరొకటి ధరిస్తామో అలాగే అనుభవం అవుతుంది.
ఇది గుప్తం అయిపోతుంది, అది ప్రత్యక్షమవుతుంది. స్థూల శరీరాన్ని మర్చిపోతారు. ఈ
స్థితిలో అత్మిక శక్తి కూడా ఉంటుంది. వీలునామా వ్రాసిన తర్వాత నాది అనేది
సమాప్తి అయిపోతుంది, బాధ్యత దిగిపోతుంది. అలాగే ఈ స్థితిలో ఆత్మిక శక్తి కూడా
వస్తుంది మరియు అన్ని అర్పణ చేసినట్లు అనుభవం అవుతుంది. సంకల్ప సహితంగా అన్నీ
అర్పణ అయిపోవాలి. అభిమానాన్ని వదలటం మరియు సంకల్పం వరకు పూర్తిగా అర్పణ అవటం
అంటే స్వరూపంగా అవ్వటం. అప్పుడు సమాన స్థితి వస్తుంది. సమానత మరియు సంపూర్ణత
రెండు ఒకటే. ఇప్పుడు ఈ విషయంలో చార్ట్ పెట్టుకోవాలి. ఆ చార్ట్ సాధారణమైనది.
పంచతత్వాలతో కూడిన ఈ శరీరంలో ఉంటూ కూడా తేలిక స్వరూపం అనుభవం చేసుకుంటారు. లైట్
మాటకి రెండు అర్థాలు ఉంటాయి. లైట్ అంటే తేలిక స్థితి కూడా మరియు లైట్ అంటే
జ్యోతి అని కూడా అర్థం. పూర్తిగా తేలికతనం అంటే లైట్ రూపంగా అయ్యి నిమిత్తంగా
నడుస్తున్నారు. అవ్యక్త రూపంలో ప్రతి విషయంలో సహాయం లభిస్తుంది. మంచిది.