02.07.1970
ఉదయం మురళి ఓం శాంతి
అవ్యక్త్-బాప్దాదా మధుబన్
శాంతిశక్తి యొక్క ప్రయోగం.
మిమ్మల్ని మీరు స్నేహి మరియు శక్తి రూపంగా భావిస్తున్నారా? శక్తుల కర్తవ్యం
ఏమిటో తెలుసా? శక్తులకి ముఖ్యంగా రెండు గుణాల మహిమ జరుగుతుంది. అవి ఏమిటి? మీ
స్మృతి చిహ్నంలో విశేషంగా ఏమి చూపిస్తారు? శక్తుల చిత్రంలో ముఖ్యంలో ఏ విశేషత
ఉంటుంది? స్వయం శక్తులు కానీ మీ విశేషత మీకే తెలియదా? శక్తుల విశేషత ఏమిటంటే
ఎంత ప్రేమమూర్తియో అంత సంహారమూర్తిగా కూడా ఉంటారు. శక్తుల నయనాలు సదా
ప్రేమమూర్తిగా ఉంటాయి కానీ ఎంత ప్రేమమూర్తియో అంత విరాఠ రూపం కూడా ఉంటుంది.
ఒక్క సెకనులో ఎవరినైనా ప్రేమమూర్తిగా చేస్తారు మరియు ఒక సెకనులో ఎవరినైనా
వినాశనం కూడా చేస్తారు. ఇలా ఈ రెండు గుణాలు మీలో కనిపిస్తున్నాయా? రెండు గుణాలు
ప్రత్యక్ష రూపంలో వస్తున్నాయా లేక గుప్తరూపంలో ఉన్నాయా? ప్రేమ స్వరూపం
ప్రత్యక్షంగా మరియు శక్తిరూపం గుప్తంగా ఉంది. అయితే ఆ విరాఠ రూపం ఎప్పుడు
ప్రత్యక్షం చేస్తారు? ఈరోజులలో బాప్ దాదా ఏ స్లోగన్ ఇస్తున్నారో తెలుసా?
ఎప్పుడో కాదు, ఇప్పుడే చేయాలి. ఎప్పుడో అనే మాట బలహీనులు మాట్లాడతారు. శక్తులు
ఇప్పుడే అని అంటారు. ఎలాగైతే స్వయం అవినాశియో అలాగే మాయలో చిక్కుకుని వినాశనం
అవ్వటం అనేది శక్తులకి అసంభవం. ఎవరైతే అవినాశిగా ఉంటారో వారు మాయ యొక్క అలలలో
కొట్టుకుపోవటం అనేది అసంభవం. ఎవరైతే అవినాశి స్థితిలో ఉంటారో వారు మాయ యొక్క ఏ
రూపంలోనైనా వంగటం అసంభవం. బాప్ దాదాకి ఎలా అసంభవమో వారికి కూడా అసంభవం. ఎవరైతే
స్వయం వంగుతారో వారి ముందు ఇతరులు తలవంచుతారు? మొతం విశ్వాన్ని మీ ముందు
వంచుకునేవారే కదా! పులి వంటి శక్తుల యొక్క ఒక సంకల్పం లేక ఒక మాట వ్యర్ధంగా
ఉండవు. ఏదయితే చెప్తారో అది చేస్తారు. సంకల్పం మరియు కర్మలో తేడా ఉండదు.
ఎందుకంటే సంకల్పం కూడా జీవితం యొక్క మూల్య ఖజానా. ఎలా అయితే స్థూల ఖజానాని
వ్యర్థం చేయరో అలాగే శివ శక్తుల మూర్తిలో ఈ రెండూ ప్రత్యక్ష రూపంలో
కనిపిస్తాయి. వారి ఒక సంకల్పం కూడా వ్యర్ధంగా వెళ్ళదు. ఒక్కొక్క సంకల్పం ద్వారా
స్వయం యొక్క మరియు సర్వుల యొక్క కళ్యాణం చేస్తారు. ఒక సెకనులో లేదా ఒక్క
సంకల్పంలో కూడా కళ్యాణం చేయగలరు. అందువలనే శక్తులను కళ్యాణి అంటారు. ఎలా అయితే
బాప్ దాదా కళ్యాణకారియో అలాగే పిల్లలకి కూడా కళ్యాణకారి పేరు ప్రసిద్ధమైనది.
ఇప్పుడు ఈ లెక్క చూడాలి - ఎన్ని సెకనులలో ఎన్ని సంకల్పాలు సఫలం అయ్యాయి, ఎన్ని
అసఫలం అయ్యాయని. ఈ రోజులలో సైన్స్ చాలా ఉన్నతి సాధించింది, ఒక స్థానంలో
కూర్చుని తమ అస్త్రాల ద్వారా ఒక సెకనులో వినాశనం చేసే ఉన్నతి పొందింది. మరి
శక్తులు శాంతిశక్తి ద్వారా ఎక్కడైనా కూర్చుని ఒక సెకనులో పని చేయలేరా? మీరు
ఎక్కడికి వెళ్ళవలసిన లేక వారు రావలసిన అవసరం లేదు. మీరు శుద్ధ సంకల్పాల ద్వారా
ఆత్మలని ఆకర్షించి ఎదురుగా తీసుకువస్తారు, వెళ్ళి శ్రమ చేయవలసిన అవసరం లేదు.
ఇప్పుడు ఇలాంటి ప్రభావం కూడా చూస్తారు. సాకారంలో బాబా చెప్తూ ఉండేవారు - బాణం
ఎలా వేయాలంటే బాణం సహితంగా పక్షి మీ ఎదురుగా రావాలని. ఇప్పుడు ఇది మీ
ఆత్మికశక్తి ద్వారానే జరుగుతుంది. దేని యొక్క ప్రకాశం అన్నింటికంటే ఎక్కువ దూరం
వెళ్తుంది? లైట్‌హౌస్ యొక్క ప్రకాశం. ఇప్పుడు లైట్‌హౌస్ మరియు సర్చ్ లైట్
అవ్వాలి. సాధారణ బల్బ్ వలె కాదు. ఎవరైతే స్వయం ప్రకాశంతో ఉంటారో వారే సర్చ్
లైట్ అవుతారు. ఇప్పుడు ఆ సమయం గడిచిపోయింది. ఇప్పుడు శక్తిశాలిగా కూడా కాదు,
కానీ ఆత్మికశక్తి కలిగినవారు అవ్వాలి. ఆత్మికశక్తి మరియు విశాలశక్తి ఉండాలి.
ఆత్మిక శక్తి మరియు విశాలత్వం అంటే బేహద్ వైపు దృష్టి, వృత్తి ఉండాలి. ఇప్పుడు
ఏమి కలుపుతారు? శక్తి అయితే ఉంది కానీ ఆత్మికశక్తి మరియు విశాల శక్తి. ఈ రోజు
బాప్ దాదా ఏ రూపంలో చూస్తున్నారు? ఆశా సితారల రూపంలో. ఇప్పుడు ఆశా సితారలు
తర్వాత సఫలతా సితారలు అవుతారు. అంటే వర్తమానం మరియు భవిష్యత్తు కూడా
చూస్తున్నారు. సఫలత మీ కంఠహారం. మీ మెడలో సఫలతా మాల కనిపిస్తుందా? సంగమయుగం
యొక్క అలంకరణ ఏమిటి? సఫలతా మాల శక్తిననుసరించి, యోగ్యతననుసరించి ప్రతి ఒక్కరి
మెడలో ఉంది. బాప్ దాదా పిల్లల అలంకరణను చూస్తున్నారు. అలంకరించుకున్న పిల్లలు
మంచిగా అనిపిస్తారు. బాప్ దాదాకి ఇప్పుడు ఏ సంకల్పం నడుస్తుంది? బాప్ దాదా మీతో
ఏమి మాట్లాడబోతున్నారో గ్రహించగలరా? ఈ రోజులలో బాబా బుద్ధి యొక్క వ్యాయామం
చేయించడానికి వస్తున్నారు. ఇప్పుడు మైదానంలో ప్రత్యక్షం అవ్వాలి. గుప్తంగా ఉండే
సమయం కాదు, ఎంత ప్రత్యక్షం అవుతారో అంత బాప్ దాదాని ప్రఖ్యాతి చేస్తారు. బేహద్
లో చక్రం తిరుగుతూ చక్రవర్తి అవుతున్నారా? ఒకే స్థానంలో కూర్చుని
ఉండిపోయేవారిని ఏమంటారు? ఎవరైతే ఒకే స్థానంలో ఉండి సేవ చేస్తూ, బేహద్ లో చక్రం
తిరగరో వారికి భవిష్యత్తులో కూడా వ్యక్తిగత రాజ్యం లభిస్తుంది. బాబా కూడా
అందరికీ సహయోగి అయ్యారు కదా! ఎవరైతే విశ్వం యొక్క ప్రతి ఆత్మతో సంబంధం
జోడిస్తారో లేక సహయోగి అవుతారో వారే విశ్వమహారాజు అవుతారు. ఎలా అయితే బాప్ దాదా
విశ్వ స్నేహి మరియు సహయోగియో అలాగే పిల్లలు కూడా బాబాని అనుసరించాలి. అప్పుడే
విశ్వమహారాజు పదవికి అధికారి అవుతారు. లెక్క ఉంది కదా! ఎలా మరియు ఎంతయో అలా
మరియు అంతయే లభిస్తుంది. ఇప్పుడు ప్రతిజ్ఞ చేయడానికి విశేషం ప్రత్యక్షత
అవ్వాలి. ఇతరులని ప్రఖ్యాతి చేయకూడదు, బాబాని ప్రత్యక్షం చేయాలి. ప్రత్యక్షం
అయినప్పుడే ప్రఖ్యాతి అవుతారు. విశ్వాధికారి అయ్యే లక్ష్యం పెట్టుకున్నారు కదా!
ఇప్పుడు ఇదే తీవ్ర పురుషార్ధం చేయాలి. ఈ పాత ప్రపంచంతో చాలా సహజంగా బేహద్
వైరాగ్యవృత్తిని కలిగించే సాధనం ఏమిటి? (కొందరు చెప్పారు). ఎవరైతే చెప్పారో
వారు సహజంగా భావించి వినిపించారు కదా! ఒకవేళ సహజం అయితే సహజంగానే బేహద్ వైరాగి
అవుతారు. మీ పట్ల మీరు ఉపయోగించకపోతే ఇతరుల పట్ల ఎలా ఉపయోగిస్తారు? బేహద్
వైరాగ్యం అని అంటారు కదా! వైరాగిలు ఎక్కడ నివసిస్తారు? చాలా సహజయుక్తి
చెపున్నాను - బేహద్ వైరాగిగా అవ్వాలంటే సదా మిమ్మల్ని మీరు మధువన నివాసిగా
భావించండి. కానీ మధువనాన్ని ఖాళీగా చూడకండి. మధువనం మధుసూదనుడితో కలిసి ఉంది.
కనుక మధువనం స్మృతి రావటం ద్వారా బాప్ దాదా, దైవీ పరివారం, త్యాగం, తపస్సు
మరియు సేవ కూడా స్మృతి వస్తాయి. మధువనం తపస్వీ భూమి కూడా. మధువనం ఒక సెకనులో
అందరిచే త్యాగం చేయిస్తుంది. ఇక్కడ బేహద్ వైరాగి అయిపోయారు కదా! మధువనం అంటేనే
త్యాగిగా లేదా వైరాగిగా తయారుచేసేది.
బేహద్
వైరాగి అయినప్పుడే బేహద్ సేవ చేయగలరు. ఎక్కడా తగుల్పాటు ఉండకూడదు. మీతో మీకు
తగుల్పాటు ఉండకూడదు అంటే ఇతరుల విషయమే వదిలేయండి. ఈ రోజు బాప్ దాదాలు ఇరువురుకి
ఆత్మిక సంభాషణ జరిగింది. ఈ రోజు ఉదయమే ఒక దృశ్యం వతనం నుండి చూస్తున్నారు -
ప్రతి ఒక్కరు ఎంతవరకు బంధించబడి ఉన్నారు మరియు ఎంత తెంచుకున్నారు, ఎంత వరకు
తెంచుకోలేదు? కొందరికి లావు త్రాళ్ళు ఉన్నాయి, కొందరికి తక్కువ ఉన్నాయి,
కొందరికి బలహీన దారాలు కూడా ఉన్నాయి. ఈ దృశ్యం చూస్తున్నారు. ఏ పిల్లలకి
దారాలు, ఎవరికి త్రాళ్ళు, ఎవరికి ప్రోగులు ఉండిపోయాయి అని. అయినప్పటికీ బంధన
అనే అంటారు కదా! ఏదొక బలహీన లేదా బలమైన దారాలు ఉన్నాయి. బలహీన దారం అయినా బంధన
అంటారు కదా! కానీ వారికి తెంచుకోవటం ఆలస్యమవ్వదు. పెద్ద త్రాళ్ళు ఉన్నవారికి
ఆలస్యం అవుతుంది మరియు శ్రమ అనిపిస్తుంది. ఈరోజు వతనం నుండి ఈ దృశ్యం
చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు - పెద్ద త్రాళ్ళు ఉన్నాయా లేక సన్నని
దారమా? గట్టిదారం ఉందా లేక సన్నని దారం ఉందా? బందీలా లేక స్వతంత్రులా?
స్వతంత్రం యొక్క అర్థం - స్పష్టం. అయినప్పటికీ బాప్ దాదా సంతోషిస్తున్నారు.
అద్భుతం చేస్తున్నారు, కానీ బాప్ దాదా ఇప్పుడు అంతకంటే కూడా ముందుకి
చూడాలనుకుంటున్నారు. ఎంత మీ నోటిలో బాప్ దాదా పేరు ఉంటుందో అంతగానే అందరి
నోటిలో మీ పేరు ఉంటుంది. మధువనమే పరివర్తనా భూమి. ఏమి పరివర్తన చేసుకుని
వెళ్ళాలో తెలుసు కదా!