06.08.1970
ఉదయం మురళి ఓం శాంతి
అవ్యక్త్-బాప్దాదా మధుబన్
దృష్టి ద్వా రా సృష్టి యొక్క రచన.
అందరు
అవ్యక్త స్థితిలో ఉంటూ వ్యక్తంలో కార్యం చేస్తున్నారా? ఎలా అయితే బాబా
అవ్యక్తంగా ఉంటూ వ్యక్తంలో ప్రవేశించి కార్యం చేస్తున్నారో అదేవిధంగా బాబా
సమానంగా అయ్యారా? బాబా సమానంగా అయినప్పుడే ఇతరులని కూడా బాబా సమానంగా చేయగలరు.
మిమ్మల్ని మీరు అడగండి - దృష్టి బాబా సమానంగా తయారయ్యిందా? వాణీ మరియు సంకల్పం
బాబా సమానంగా అయ్యాయా? బాబాకి ఏమి స్మృతిలో ఉంటుందో తెలుసా? బాబా స్మృతిలో సదా
ఏమి ఉంటుంది మరియు మీ స్మృతిలో సదా ఏమి ఉంటుంది? తేడా ఏమిటి? సమాన స్మృతి
ఉంటుందా? ఏదైనా స్మృతి ఉంటుందా లేక ఏదీ ఉండటం లేదా? స్మృతి ఉంటుందా? లేక
స్మృతికి కూడా అతీతం అయిపోయారా? ఏ విషయంలో అయినా బాబా సమానంగా మీ స్మృతి
ఉంటుందా? (లేదు) అంతిమంలో అయినా స్మృతిలో సమానత వస్తుందా? (నెంబర్ వారీ). మొదటి
నెంబరు పిల్లలు మరియు బాబాలో తేడా ఉంటుందా? బాప్ దాదాలో తేడా ఉంటుందా? సమానత
వచ్చేస్తుందా? ఎలా అయితే బాబా బేహద్ తండ్రియో అలాగే దాదా కూడా బేహద్ తండ్రి.
బాప్ దాదాకి సమీపంగా, సమానంగా ఉండాలి. ఎంతెంత సమీపతయో అంతంత సమానత ఉంటుంది.
అంతిమంలో పిల్లలు కూడా తమ రచనకి రచయిత అయ్యి ప్రత్యక్షంలో అనుభవం చేసుకుంటారు.
ఎలా అయితే బాబాకి రచనని చూసి రచయిత యొక్క స్వరూపం స్వతహాగా స్మృతి ఉంటుందో,
ఇటువంటి స్థితి నెంబర్ ప్రకారంగా పిల్లలకి కూడా వస్తుంది. దృష్టి ద్వారా సృష్టి
రచించడం వస్తుందా? మీ రచన ఎలా ఉంది? కుఖ వంశావళీయా లేక నయనాల రచనా? దృష్టి
ద్వారా రచన రచిస్తారా? "దృష్టి ద్వారా సృష్టి" అనే మహిమ ఉంది కదా! సృష్టిని
మార్చే దృష్టి ఉండాలి. ఇలా దృష్టిలో దివ్యతను అనుభవం చేసుకుంటున్నారా?
దృష్టి మోసం కూడా చేస్తుంది మరియు దృష్టి పతితులని పావనంగా కూడా చేస్తుంది.
దృష్టి మారటం ద్వారా సృష్టి మారనే మారుతుంది. కనుక దృష్టి ఎంత వరకు మారింది?
దృష్టి ఎలా మారాలో తెలుసా! ఆత్మక దృష్టిని తయారుచేసుకోవాలి. ఆత్మిక దృష్టి,
దివ్య దృష్టి మరియు అలౌకిక దృష్టి తయారయ్యిందా? ఎక్కడ, ఎవరిని చూస్తున్నా
ఆత్మిక స్వరూపమే కనిపించాలి. దృష్టి మారిందా? ఎవరి నయనాలలో అయినా ధూళి ఉంటే
వారికి ఒకే సమయంలో రెండు వస్తువులు కనిపిస్తాయి. అలాగే దృష్టి పూర్తిగా
మారకపోతే ఇక్కడ కూడా రెండు వస్తువులు కనిపిస్తాయి. ఆత్మ మరియు దేహం.
అప్పుడప్పుడు ఆత్మ కనిపిస్తుంది. అప్పుడప్పుడు దేహం కనిపిస్తుంది. అలా
జరుగుతుంది కదా! నయనాలు మంచిగా ఉంటే ఏ వస్తువు ఎలా ఉందో అది యదార్ధ రూపంలో
కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ దృష్టి మారినప్పుడే యదార్థ రూపం ఏధైతే ఉందో అదే
కనిపిస్తుంది. యదార్ధ రూపం ఆత్మ, కానీ దేహం కాదు. యదార్ధ రూపమే కనిపించినప్పుడు
దృష్టి మంచిగా ఉంది అని భావించండి. దృష్టిపై చాలా ధ్యాస పెట్టాలి. దృష్టి
మారిపోతే ఎప్పుడూ మోసం చేయదు. సాక్షాత్కారం దృష్టి ద్వారానే అవుతుంది. మీ
ఒకొక్కరి దృష్టి ద్వారా తమ యదార్ధ రూపం, యదార్థ ఇల్లు మరియు యదార్ధ రాజధాని
చూస్తారు. యదార్ధ దృష్టి అయితే దృష్టిలో అంత శక్తి ఉంటుంది. సదా మిమ్మల్ని మీరు
పరిశీలించుకోండి, ఇప్పుడు ఎవరైనా ఎదురుగా వస్తే నా దృష్టి ద్వారా ఏమి
సాక్షాత్కారం చేసుకుంటారు? మీ వృత్తిలో ఏది ఉంటుందో అదే మీ దృష్టి ద్వారా
ఇతరులు అనుభవం చేసుకుంటారు. ఒకవేళ దేహాభిమాన వృత్తి లేదా చంచలత ఉంటే మీ దృష్టి
ద్వారా సాక్షాత్కారం కూడా అలాగే అవుతుంది. ఇతరుల దృష్టి, వృత్తి కూడా చంచలం
అవుతాయి. యదార్ధ సాక్షాత్కారం చేయించలేరు. అర్ధమవుతుందా? వీరికి ట్రైనింగ్ కదా!
ఈ గ్రూప్ కి ముఖ్య విషయం ఏమిటంటే మీ వృత్తి యొక్క ఉద్దరణ ద్వారా మీ దృష్టిని
దివ్యంగా తయారు చేసుకోవాలి. ఎంత వరకు తయారయ్యింది, తయారవ్వకపోతే ఎందుకు
తయారవ్వలేదు? దీనిపై వీరికి స్పష్టంగా చెప్పాలి. సృష్టి మారకపోవడానికి కారణం
దృష్టి మారలేదు. దృష్టి మారకపోవటానికి కారణం వృత్తి మారలేదు. దృష్టి మారితే
సృష్టి కూడా మారుతుంది. ఈ రోజులలో పిల్లలందరికీ బాప్ దాదా విశేష సైగ ఇదే
చేస్తున్నారు - దృష్టిని మార్చుకోండి, సాక్షాత్కారమూర్తిగా అవ్వండి. చూసేవారు
ఇవి నయనాలు కావు, గారడీ పెట్టె అని అనుభవం చేసుకోవాలి. గారడీ పెట్టె ద్వారా
రకరకాల దృశ్యాలు చూస్తారు కదా! అలాగే మీ నయనాలలో దివ్యస్థితిని చూడాలి. నయనాలు
సాక్షాత్కార సాధనంగా అవ్వాలి. ఈ గ్రూపు ఏ గ్రూపుయో తెలుసా? వీరిలో విశేషత
ఏమిటి? మొత్తం విశ్వంలో విశేష ఆత్మలు. మేము సాధారణ ఆత్మలం అని భావించడం లేదు
కదా? ఇలా ఎప్పుడు భావించకూడదు.
మొత్తం విశ్వంలో విశేష ఆత్మలు ఎవరు? ఒకవేళ మీరు విశేష ఆత్మలు కాకపోతే బాబా
మిమ్మల్ని తనవారిగా ఎందుకు చేసుకున్నారు? మిమ్మల్ని మీరు విశేష ఆత్మగా భావించడం
ద్వారా విశేషత వస్తుంది. ఒకవేళ సాధారణంగా భావిస్తే సాధారణ కర్తవ్యం చేస్తారు.
ఒకొక్క ఆత్మ స్వయాన్ని విశేషంగా భావించి ఇతరులలో కూడా విశేషత తీసుకురావాలి.
పిల్లలైన మీరు విశేష ఆత్మలు. ఈ నషా ఈశ్వరీయ నషా. దేహాభిమానం యొక్క నషా కాదు.
ఈశ్వరీయ నషా కదా! నయనాల ద్వారా కనిపించాలి. ఈ గ్రూపు యొక్క విశేషత ఏమిటి? మీ
గ్రూపు యొక్క విశేషత ఏమిటో మీకు తెలుసా? (తెల్ల కాగితం అని, ఇంకా రకరకాలుగా
చెప్పారు) ఈ గ్రూపు యొక్క బిరుదు చాలా పెద్దది, ట్రైనింగ్ తర్వాత ఇదే గుణం
స్థిరంగా ఉండాలి. ఈ ట్రైనింగ్ కూడా కావాలి. ఇప్పుడు విశేషతలు చాలా మంచిగా
వింటున్నారు! తెల్ల కాగితంపై ఏది వ్రాస్తే అది స్పష్టంగా ఉంటుంది. ఎంత స్పష్టమో
అంత శ్రేష్టంగా ఉంటారు. ఒకవేళ స్పష్టతలో లోపం ఉంటే శ్రేష్టతలో కూడా లోపం
ఉంటుంది. ఇంకేమి కలపకూడదు. కొందరు చాలా కలిపేస్తున్నారు. దీని ద్వారా యదార్ధ
రూపం కూడా అయదార్థంగా అయిపోతుంది. అవే జ్ఞాన విషయాలు మాయా రూపంగా అయిపోతాయి.
అందువలన ఈ గ్రూపు యొక్క ఈ విశేషత చిత్రంలో చూపించండి - ఈ గ్రూపు సదా స్పష్టం
మరియు శ్రేష్టం. సదా మీ యదార్ధ రూపంలో ఉండాలి. ఏ విషయం ఎలాంటిదో ఆ రూపంలోనే
తెలుసుకుని ధారణ చేయాలి మరియు నడుస్తూ ఉండాలి. ఇదే స్పష్టత. ఈ గ్రూపుకి బాప్
దాదా ఏమి బిరుదు ఇస్తున్నారు? చిన్న పిల్లలు దేవుని లాంటి వారు అని అంటారు కదా!
కానీ బాప్ దాదా చిన్న పిల్లలు దేవునితో సమానం అని అంటున్నారు. అన్ని విషయాలలో,
అడుగడుగులో సమానత ఉంచుకోండి. కానీ సమానత ఎలా వస్తుంది?
సమానత
కొరకు రెండు విషయాలు ధ్యాసలో ఉంచుకోవాలి. సాకార బాబాలో ఏమి విశేషతలు ఉండేవి?
సదా మిమ్మల్ని మీరు ఆధారమూర్తిగా భావించండి. మొత్తం విశ్వానికి ఆధారమూర్తులు,
దీని ద్వారా ఏ కర్మ చేసినా బాధ్యతతో చేస్తారు. సోమరితనం ఉండదు. ఎలా అయితే బాప్
దాదా సర్వులకి ఆధారమూర్తియో అలాగే ప్రతి పిల్లవాడు విశ్వానికి ఆధారమూర్తి. ఏ
కర్మ మీరు చేస్తారో అది అందరు చేస్తారు. సంగమయుగంలో ఏ నియమం నడుస్తుందో అది
భక్తి మార్గంలో మారి నడుస్తాయి. మొత్తం విశ్వానికి మీరు ఆధారమూర్తులు! ప్రతి
ఒక్కరు మిమ్మల్ని మీరు ఆధారమూర్తిగా భావించాలి, ఉద్దారమూర్తి అవ్వాలి. ఎంత మీరు
ఉద్దరణ అవుతారో అంత ఇతరులను ఉద్దరించగలరు. మీ ఉద్దరణ చేసుకోకపోతే ఇతరుల ఉద్ధరణ
ఎలా చేస్తారు? ఉద్దారమూర్తి అయినప్పుడే ఇతరుల ఉద్ధరణ చేయగలరు. చిన్నవారు అయినా
కానీ బాబా సమానంగా కర్తవ్యం చేయాలి. ఇది స్మృతి ఉంచుకోవటం ద్వారా సమానత
వస్తుంది. అప్పుడు ఈ గ్రూపుకి ఏదైతే బిరుదు ఇచ్చానో - చిన్న పిల్లలు బాబా నమానం
అని అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇది మర్చిపోకూడదు. మంచిది, ఇప్పుడు ఏమి
చేయాలి? (తిలకం పెట్టుకోవాలి). ఈ తిలకం కూడా సాధారణమైనది కాదు. తిలకం ఎందుకు
పెడతారో తెలుసా? తిలకం సౌభాగ్యానికి గుర్తు. ఏ విషయాలు అయితే విన్నారో ఈ
విషయాలలో స్థిరం అయ్యేటందుకు గుర్తు - తిలకం. తిలకం మస్తకంలో పెట్టుకుంటారు
అంటే ఈ విషయాలు బుద్దిలో ఉండాలి. అందువలన తిలకం పెడుతున్నారు. ఇంకా ఎందుకు?
(కొందరు తమ ఆలోచన వినిపించారు) బాప్ దాదా చెప్పేది వేరు. ఈ టీకా (తిలకాన్ని
హిందీలో టీకా అంటారు) మాయా రోగాల నుంచి నివృత్తి చేసేది, సదా ఆరోగ్యంగా ఉంచే
టీకా. టీకా అంటే బిందువు మరియు టీకా అంటే ఇంజక్షన్ రెండూ స్మృతిలో ఉంచుకోవాలి.
ఒకటి శక్తిశాలిగా చేసేది మరియు రెండవది సదా సౌభాగ్యం మరియు భాగ్యంలో స్థితులు
చేసేది. రెండు టీకాలు బాప్ దాదా వేస్తున్నారు. మాట ఒకటే కానీ రహస్యం రెండు
రకాలు. గుర్తు స్థూలంగా ఉంటుంది. కానీ రహస్యాలు రెండు. అందువలన మామూలుగా తిలకం
పెట్టుకోవటం కాదు, తిలకం పెట్టుకోవటం అంటే సదాకాలిక ప్రతిజ్ఞ చేయటం. తిలకం
ప్రతిజ్ఞకి గుర్తు. సదా ప్రతి విషయంలో పాస్ విత్ ఆనర్ అవుతాము అనే ప్రతిజ్ఞకి
గుర్తు ఈ తిలకం. ఇంత ధైర్యం ఉందా? పాస్ కూడా కాదు, పూర్తిగా పాస్ విత్ ఆనర్
అవ్వాలి. పాస్ విత్ ఆనర్ మరియు పాస్ అవ్వటం రెండింటిలో తేడా ఏమిటి? పాస్ విత్
ఆనర్ అంటే మనస్సులో కూడా, సంకల్పాలతో కూడా శిక్ష పొందరు. ధర్మరాజు శిక్షల విషయం
తర్వాత కానీ తమ సంకల్పాల అలజడి లేదా శిక్షలకి అతీతంగా ఉంటారు. వీరినే పాస్ విత్
ఆనర్ అంటారు. తమ పొరపాటు వలన స్వయాన్ని శిక్షించుకోవటం, అలజడి అవ్వటం, పిలవటం,
అయోమయం అవ్వటం నుండి అతీతంగా ఉంటారు. వీరినే పాస్ విత్ ఆనర్ అంటారు. ఇలా
ప్రతిజ్ఞ చేయడానికి తయారుగా ఉన్నారా? సంకల్పంలో కూడా అలజడి అవ్వకూడదు. వాణి,
కర్మ, సంబంధ సంప్రదింపుల విషయం వదిలేయండి. అది స్థూల విషయం. ఇలా ప్రతిజ్ఞ చేసే
గ్రూపుయేనా? ధైర్యవంతులు. ధైర్యం స్థిరంగా ఉంటే అందరు సహాయకారి ఆకులుగా ఉంటారు.
సహయోగి అయితే స్నేహం లభిస్తూ ఉంటుంది. వృక్షంలో కోమలమైన లేత ఆకులు చాలా
బావుంటాయి. పక్షులు కూడా వాటినే తింటాయి. కేవలం ఒకరికే ప్రియంగా ఉండాలి.
ఎవరికి? బాప్ దాదాకి. కానీ మాయా పక్షులకి కాదు. మీరు కూడా కోమల ఆకులు. కోమల
ఆకులు అద్భుతం చేయాలి. ఏ అద్భుతం చేయాలి? మీ ఈశ్వరీయ చరిత్రపై అందరిని ఆకర్షితం
చేయాలి. మీపై కాదు. చరిత్రపై చేయాలి. ఈ గ్రూపుపై చాలా ధ్యాస ఉంది. ఈ గ్రూప్
తమపై తాము కూడా ఇంత ధ్యాస పెట్టుకోవాలి.