29.10.1970
ఉదయం మురళి ఓం శాంతి
అవ్యక్త్-బాప్దాదా మధుబన్
దీపావళి యొక్క సత్య రహస్యం.
ఈరోజు
బాప్ దాదా దీపమాలను చూస్తున్నారు. ఇది దీపాల యొక్క మాల కదా! ప్రజలు దీపావళి
జరుపుకుంటారు. బాప్ దాదా దీపావళిని చూస్తున్నారు. ఏ దీపం మంచిగా అనిపిస్తుంది?
ఏ దీపం అయితే అఖండంగా, స్థిరంగా ఉంటుందో అది మంచిగా అనిపిస్తుంది. ఘృతం
తరిగిపోకుండా ఉన్న దీపమే అఖండంగా వెలుగుతుంది. మిమ్మల్ని మీరు అలాంటి దీపంగా
భావిస్తున్నారా? అలాంటి దీపాలకి స్మృతి చిహ్నమే దీపమాల (దీపావళి). మిమ్మల్ని
మీరు మాల మధ్యలో మెరిసే దీపంగా భావిస్తున్నారా? ఈరోజు మా యొక్క స్మృతిచిహ్న
రోజుని జరుపుకుంటున్నాం అని భావిస్తున్నారా! దీపావళి రోజున విశేషంగా రెండు
విషయాలపై ధ్యాస పెడతారు! (స్వచ్ఛంగా ఉంచుతారు, కొత్త ఖాతా తయారుచేస్తారు). కానీ
ఏమి లక్ష్యం పెట్టుకుంటారు? సంపాదన యొక్క లక్ష్యం పెట్టుకుంటారు. సంపాదన యొక్క
లక్ష్యంతో శుభ్రం కూడా చేస్తారు. శుభ్రత కూడా అన్ని రకాలుగా ఉండాలి, మరియు
సంపాదన యొక్క లక్ష్యాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. ఈ స్వచ్చత మరియు సంపాదన
అనే రెండు కార్యాలు మీరందరూ చేసారా? మీతో మీరు సంతుష్టంగా ఉన్నారా? సంపాదన ఉంటే
స్వచ్ఛత తప్పకుండా ఉంటుంది కదా! ఈ రెండు విషయాలలో సంతుష్టం అవ్వటం అవసరం. కానీ
ఎవరైతే సదా దివ్యగుణాలని ఆహ్వానం చేస్తారో వారికే ఈ సంతుష్టత వస్తుంది. ఎవరు
ఎంత ఆహ్వానం చేస్తారో అంత ఈ రెండు విషయాలలో సదా సంతుష్టంగా ఉంటారు. ఎంత
దివ్యగుణాలను ఆహ్వానం చేస్తారో అంత అవగుణాలు ఆహుతి రూపంలో సమాప్తి అయిపోతాయి.
తర్వాత ఏమౌతుంది? కొత్త సంస్కారాలు అనే కొత్త వస్త్రాలు ధరిస్తారు. ఇప్పుడు
ఆత్మ కొత్త సంస్కారాల రూపి కొత్త వస్త్రం ధారణ చేసిందా లేక అప్పుడప్పుడు పాత
వస్త్రాలపై ప్రీతి ఉన్న కారణంగా వాటిని కూడా ధారణ చేస్తుందా! మరజీవ అయ్యారు.
కొత్త జన్మ యొక్క కొత్త సంస్కారాలు ధారణ చేసారు. మరలా పాత సంస్కారాల రూపి
వస్త్రాలను అప్పుడప్పుడు ఎందుకు ధరిస్తున్నారు? పాత వస్త్రాలు అంత ప్రియంగా
అనిపిస్తున్నాయా? బాబాకి ప్రియమనిపించని వస్తువు పిల్లలకి ఎందుకు ప్రియం
అనిపిస్తుంది?
ఈరోజు
వరకు ఏవైతే బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత ఉండిపోయినవో అవన్నీ పాత ఖాతా.
దానిని ఈరోజు సమాప్తి చేయాలి. దీపావళి జరుపుకోవటం అంటే ఇదే, అల్పకాలికంగా కాదు.
కానీ సదాకాలికంగా మరియు అన్ని రూపాల ద్వారా సమాప్తి చేయాలి. దీపావళిని
పట్టాభిషేకం యొక్క రోజు అంటారు. ఈరోజు మీరందరూ ఏ పట్టాభిషేకం చేసుకున్నారు?
పట్టాభిషేకం రోజు ఏమి చేస్తారు? రాజ్య సింహానస సమారోహం ఎప్పుడైనా చూసారా?
స్మృతి వస్తుంది! ఎన్నిసార్లు చేసి ఉంటారు? అనేకసార్లు చూసారు. రోజురోజుకి ఇలా
అనుభవం చేసుకుంటారు - ఎలా అయితే ఈ జన్మలో ప్రత్యక్షంగా చూసిన విషయం స్పష్టంగా
ఎలా ఉంటుందో అలాగే భవిష్య రాజరికం యొక్క సంస్కారాలు ఏ ఆత్మలో అయితే నిండి
ఉన్నాయో అవి నిన్న చూసిన విషయంలా అనుభవం అవుతాయి. ఇలా అనుభవం చేసుకుంటూ ఉంటారు.
అంటే మేము మా సంపూర్ణ స్థితికి మరియు మా రాజ్యానికి సమీపంగా చేరుకున్నాము అని
భావించండి. సత్యయుగ సంస్కారాలు ఆలోచించడం లేదా స్మృతిలోకి తీసుకురావటం కాదు,
కానీ స్వతహాగానే స్పష్టంగా జీవితంలోకి వస్తాయి. ఈ ప్రపంచంలో ఉంటూ కూడా నయనాలలో
సత్యయుగీ దృశ్యాలు కనిపిస్తాయి. అంతే కాదు మీ భవిష్య స్వరూపం ఏదైతే ధారణ చేయాలో
అది కూడా కళ్ళ ముందు మాటిమాటికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఇది
వదిలి అలంకరించబడిన శరీరం ధారణ చేయాలి అని అనుభవం చేసుకుంటారు. సంగమయుగంలోనే
సత్యయుగీ స్వరూపాన్ని అనుభవం చేసుకుంటారు. పురుషార్ధం మరియు ప్రాలబ్దము రెండు
రూపాల ద్వారా ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా చూస్తారు. కనుక ఈ దీపావళి రోజున
దివ్యగుణాలని ఆహ్వానం చేయాలి. ఇప్పుడు మరలా నోటి నుండి వస్తుంది, అవును
కల్పపూర్వం ఇది చేసాము అని. కానీ ఇక ముందు ఈ మాట మారిపోతుంది. ఈ కల్పం యొక్క
విషయం అయిపోతుంది. నిన్నటి విషయం వలె 5000 సంవత్సరాల విషయం స్మృతిలోకి
వస్తుంది. విజ్ఞాన సాధనం ద్వారా దూరంగా ఉన్న వస్తువులు కూడా సమీపంగా మరియు
స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానిని దుర్బిణి అంటారు. అలాగే మీ యొక్క మూడవనేత్రం
ద్వారా కల్పపూర్వపు విషయాలు సమీపంగా మరియు స్పష్టంగా చూస్తారు, మరియు అనుభవం
చేసుకుంటారు. పాత సంస్కారాల ఖాతాను మరలా పొరపాటుగా కూడా చూడకూడదు. పాత
సంస్కారాల వస్త్రాన్ని మరలా ధారణ చేయకూడదు. కొత్త ధనాన్ని ధారణ చేయాలి. ఇదే
ఈరోజు యొక్క మంత్రం.
రత్నజడిత శరీరాన్ని వదలి జడీభూత శరీరంతో ప్రేమ పెట్టుకోకూడదు. సదా బుద్ధిలో
బాప్ దాదా యొక్క స్మృతి లేదా గమ్యం మరియు రాబోయే రాజ్య దృశ్యాలు ఉండాలి. మరియు
నయనాలలో, నోటిలో సదా బాప్ దాదా యొక్క పేరు ఉండాలి. అటువంటి వారినే బాప్ దాదాకి
స్నేహి, మరియు సమీపరత్నాలు అని అంటారు. అందరు శ్రేష్ఠ మరియు సమీప రత్నాలుగా
అయ్యే లక్ష్యం పెట్టుకున్నారా లేక ఏది లభించినా మంచిదేనా? ఈ విషయంలో సంతుష్టం
అయిపోతే సంపూర్ణం కాలేరు. అందువలన మేము విజయీ మరియు సంపూర్ణంగా అయ్యే
చూపిస్తాము అనే లక్ష్యం పెట్టుకోండి. బలహీన మాటలు సమాప్తి అయిపోవాలి. చేస్తాము,
అయిపోతుంది, పురుషార్ధం చేస్తున్నాము.... ఈ మాటలు రాకూడదు. చేసి చూపిస్తాము,
తయారయ్యి చూపిస్తాము .... ఇవి నిశ్చయబుద్ది విజయీ రత్నాలు మాటలు. అవి
ధనస్సుధారి(త్రేతాయుగి) ఆత్మల మాటలు. స్వదర్శన చక్రధారి అవ్వాలనుకుంటున్నారు,
కానీ ధనస్సుధారి అవుతున్నారు. ఎవరొకరు అలా అవుతారు కదా అని కొందరు
అనుకుంటున్నారు. ఈ విషయంలో దయాళువుగా అవ్వకండి. ఎవరొకరు అవ్వాలి కదా కనుక మేమే
అవుతాం అనుకుంటున్నారు, ఇలా అయ్యేవారు చాలా మంది ఉన్నారు. మంచిది.