09.12.1970
ఉదయం మురళి ఓం శాంతి
అవ్యక్త్-బాప్దాదా మధుబన్
పురుషార్ధానికి ముఖ్య ఆధారం - గ్రహణ శక్తి.
ఈరోజు
ప్రతి ఒక్కరిలో రెండు విషయాలను చూస్తున్నారు. ఎంత జ్ఞాన స్వరూపులుగా మరియు
శక్తిశాలిగా అయ్యారు? దానిలో కూడా ముఖ్యంగా గ్రహణశక్తి ప్రతి ఒక్కరిలో ఎంత
శక్తిశాలిగా ఉంది అనేది చూస్తున్నారు. పురుషార్థానికి ముఖ్య ఆధారం - గ్రహణ
శక్తి. ఈ రోజులలో సైన్స్ వారు ధ్వనిని గ్రహించే ప్రయత్నం చేస్తున్నారు,
శాంతిశక్తి ద్వారా మీరు వేటిని గ్రహించగలరు? వారు చాలా చాలా పురాతన ధ్వనిని
గ్రహించాలనుకుంటున్నారు. అలాగే మీరు ఏమి గ్రహిస్తున్నారు? 5000 సంవత్సరాల
పూర్వపు మీ దైవీసంస్కారాలను గ్రహించగలుగుతున్నారా? అంతగా గ్రహించే శక్తి
వచ్చిందా! వారు అయితే ఇతరుల ధ్వనిని గ్రహిస్తున్నారు. మీరు మీ అసలైన
సంస్కారాలని కేవలం గ్రహించడమే కాదు, కానీ ప్రత్యక్ష స్వరూపాన్ని తయారు
చేసుకుంటున్నారు. సదా స్మృతిలో ఉంచుకోండి - నేను అలా ఉండేవాడిని, మరలా అలా
తయారవుతున్నానని. ఎంతెంత ఆ సంస్కారాలని గ్రహించగలరో అంత స్వరూపంగా కాగలరు. మీ
స్మృతిని శక్తిశాలిగా తయారు చేసుకొండి, అంటే శ్రేష్టంగా మరియు స్పష్టంగా తయారు
చేసుకోండి. మీ వర్తమాన స్వరూపం మరియు సంస్కారాలు స్పష్టంగా అనుభవం అవుతాయి కదా!
అలాగే మీ ఆది స్వరూపాలను మరియు సంస్కారాలను అంత స్పష్టంగా అనుభవం చేసుకోవాలి.
అర్థమైందా! అంత గ్రహణ శక్తి ఉండాలి. ఎలా అయితే వర్తమాన సమయంలో మీ కర్తవ్యం లేదా
నడవడిక స్పష్టంగా మరియు సహజంగా స్మృతిలో ఉంటుందో అలాగే మీ అసలైన నడవడిక సహజంగా
మరియు స్పష్టంగా స్మృతిలో ఉండాలి. సదా నేను అలా ఉండేవాడిని అనే దృఢ సంకల్పం
ఉండాలి. 5000 సం||ల విషయం నిన్నటి విషయం అని స్మృతిలోకి వస్తుంది. దీనినే గ్రహణ
శక్తి అని అంటారు. మీ స్మృతిని ఇంత శ్రేష్టంగా మరియు స్పష్టంగా చేసుకుని
వెళ్ళాలి. భట్టీకి వచ్చారు కదా! సదా మీ ఆది స్వరూపం మరియు ఆది సంస్కారాలు
ఎదురుగా కనిపించాలి. మీ స్మృతిని శక్తిశాలిగా చేసుకోవటం ద్వారా వృత్తి మరియు
దృష్టి స్వతహాగానే శక్తిశాలిగా అవుతాయి. అప్పుడు ఈ కుమారుల గ్రూపు ఎలా
అవుతుంది? అమూల్య కుమారుల గ్రూపు అయిపోతుంది. ప్రతి ఒక్కరి రెండు నయనాల ద్వారా
రెండు స్వరూపాలు సాక్షాత్కారం అవుతాయి. అవి ఏ స్వరూపాలు? చెప్పాను కదా -
నిరాకారి మరియు దివ్యగుణధారి, ఫరిస్తా రూపం మరియు దైవీ రూపం. ప్రతి ఒక్కరు ఇలా
అనుభవం చేసుకుంటారు. నడుస్తూ, తిరుగుతూ ప్రతి ఒక్కరు లైట్‌హౌస్ మరియు మైట్‌హౌస్
వలె అనుభవం అవుతారు. ఇలా మీ స్వరూపం సాక్షాత్కారం అవుతుందా? 5000 సంవత్సరాల
పూర్వ విషయాన్ని గ్రహించగులుగుతున్నారు లేదా అనుభవం చేసుకుంటున్నారు. అయితే ఈ
అంతిమ స్వరూపం అనుభవం అవ్వటం లేదా? ఇప్పుడు ఏదైతే లోపం ఉందో దానిని
తొలగించుకుని అనుభవీ మూర్తి అయ్యి వెళ్ళాలి. ఎక్కడ ఏ లోపం ఉండకూడదు. భట్టీ
నుండి ఇలా పరివర్తన అయ్యి వెళ్ళాలి. అప్పుడప్పుడు సత్యయుగ ఆత్మలు
ప్రవేశించినపుడు వారికి పూర్తిగా ఈ పురుషార్థి జీవితం యొక్క జ్ఞానం ఉండదు.
అలాగే మీకు బలహీనతలు మరియు లోపాల యొక్క జ్ఞానం ప్రాయలోపం అయిపోవాలి. దీని కొరకు
విశేషంగా ఈ గ్రూపు రెండు విషయాలు స్మృతి ఉంచుకోవాలి. రెండు విషయాలు, రెండు
మాటల్లోనే ఉంటాయి. 1. గెస్ట్ హౌస్ (అతిధి గృహం) 2. గెట్ అవుట్ అంటే
బహిష్కరించడం మరియు ఇక ముందు కూడా లోపలికి రానివ్వకపోవడం. ఈ పాత ప్రపంచాన్ని
సదా గెస్ట్ గా భావించండి. అప్పుడు ఇక ఎప్పుడు ఏ బలహీనత లేదా లోపం ఉండదు. సహజ
పురుషార్థము కదా! ఈ గ్రూపు అద్భుతం చేసి చూపించాలి. అందువలన సదా లక్ష్యం
పెట్టుకోవాలి - 21 జన్మలకు విశ్రాంతి పొందాలి. కానీ ఇప్పుడు మనసా, వాచా, కర్మణా
సేవ లేకుండా ఒక సెకెను కూడా విశ్రాంతి ఉండకూడదు. అప్పుడే శ్రేష్టంగా కాగలరు.
ఎందుకంటే ఇది శ్రమ చేసే సేవాధారుల గ్రూపు. బాగా శ్రమించే వారికి విశ్రాంతి
ఉండదు. ఎప్పుడు విశ్రాంతి తీసుకోరు మరియు వ్యర్ధం కూడా చేయరు. అందువలన శ్రమించే
ఆత్మిక సేవాధారులైన ఈ గ్రూపుకి సేవ తప్ప మరేది ఇష్టమనిపించదు. అప్పుడే పేరుకు
తగ్గ పనిచేసినట్టు.
మరొక
విషయం కూడా స్మృతి ఉంచుకోవాలి - సేవ కోసం స్వయమే అవకాశం తీసుకోవాలి. అప్పుడే
బాప్ దాదా నుండి బహుమతి లభిస్తుంది. మలుచుకోవాలి మరియు ఎదుర్కోవాలి, ఇదే మన
గమ్యం అనేది ఈ గ్రూపు యొక్క స్లోగన్. మాయతో ఎదుర్కోవాలి. కాని దైవీ పరివారంతో
కాదు. వేటిని మలుచుకోవాలి? పాత సంస్కారాలని మలుచుకోవాలి. జ్ఞాన సాగరులతో పాటు
శక్తిశాలిగా కూడా అవ్వాలి. అప్పుడే సేవాధారి కాగలరు, మంచిది. ఈ తిలక ధారణ
మహోత్సవం చూసి రాజ్య తిలకధారణ సమారోహం స్మృతి వస్తుందా? సంపూర్ణ స్థితిలో
ఉండడానికి ఈ తిలకం లభించింది. తరువాత రాజ్యతిలకం లభిస్తుంది. ఇది ప్రతిజ్ఞ
మరియు ప్రత్యక్షత యొక్క తిలకం. ఇంత శక్తి ఉందా? ఆత్మిక సేవాధారి గ్రూపుకి
విశేషంగా ఈ శిక్షణ ఇస్తున్నారు. మిమ్మల్ని మీరు ఎంతగా అధికారిగా భావిస్తున్నారో
అంతగానే సత్కారిగా అవ్వండి. మొదట గౌరవం ఇవ్వాలి, తరువాత అధికారం తీసుకోవాలి.
గౌరవం మరియు అధికారి వెనువెంట ఉండాలి. ఒకవేళ గౌరవం వదిలేసి కేవలం అధికారం
తీసుకుంటే చేసినదంతా వ్వర్థం అయిపోతుంది. అందువలన రెండు విషయాలు వెనువెంట
ఉండాలి.