అవ్యక్త స్థితి ద్వా రా సేవ.
ఈ రోజు ధ్వనికి అతీతంగా వెళ్ళే రోజు, మరి బాప్ దాదా
కూడా ధ్వనిలోకి ఎలా వస్తారు? ధ్వనికి అతీతంగా ఉండే అభ్యాసం చాలా అవసరం.
ధ్వనిలోకి వచ్చి ఆత్మలకి సేవ చేసారు. దానికంటే ధ్వనికి అతీత స్థితిలో స్థితులై
సేవ చేసినట్లయితే ఆ సేవ యొక్క ప్రత్యక్ష రుజువును చూడగలరు. మీరు అవ్యక్త
స్థితిని అనుభవం చేసుకుంటూ ఇతరులకు కూడా ఆ స్థితిని ఒక్క సెకను అయినా అనుభవం
చేయించారంటే దాని యొక్క ప్రత్యక్ష ఫల స్వరూపం మీ ఎదురుగా కనిపిస్తుంది. ధ్వనికి
అతీత స్థితులో స్థితులై ధ్వనిలోకి వస్తే ఆ ధ్వని, ధ్వని వలె అనిపించదు, ఆ
ధ్వనిలో ఉన్న అవ్యక్త తరంగాల ప్రభావం ఎవరినైనా కానీ బాబా వైపు ఆకర్షితం
చేస్తుంది. ఆ ధ్వని వింటూ ఉంటే వారికి కూడా అవ్యక్త స్థితి అనుభవం అవ్వటం
మొదలవుతుంది. ఈ సాకార సృష్టిలో చిన్నపిల్లలకి జోలపాట పాడతారు, అది కూడా ధ్వనియే
కానీ ఆ ధ్వని, ధ్వనికి అతీతంగా చేసే సాధనం అవుతుంది. అదేవిధంగా అవ్యక్త
స్థితిలో స్థితులై ధ్వనిలోకి రండి, అప్పుడు ధ్వనికి అతీతమైన స్థితిని అనుభవం
చేయించగలరు. ఒక సెకెను అవ్యక్త స్థితి యొక్క అనుభవంతో ఆత్మ, బాబాతో అవినాశీ
సంబంధాన్ని జోడిస్తుంది. ఈ విధంగా అచంచలమైన సంబంధం బాబాతో జోడిస్తే అటువంటి
అనుభవీ ఆత్మను మాయ కూడా కదిలించలేదు. కేవలం మాటలకి ప్రభావితం అయ్యే ఆత్మలు అనేక
మాటలు వింటారు. కనుక రాకపోకల్లో ఉంటారు అంటే వస్తుంటారు, వెళ్లిపోతుంటారు. కానీ
అవ్యక్త స్థితిలో స్థితులై చెప్పిన మాటల ద్వారా బాబా యొక్క అనుభవం పొందిన
ఆత్మలు రాకపోకల్లో ఉండరు. ఇలాంటి ఆత్మపై ఏ రూపం యొక్క ప్రభావం పడదు. కనుక
స్వయాన్ని కంబైండ్ గా భావించి కంబైండ్ రూపం యొక్క సర్వీస్ చేయండి , అనగా
అవ్యక్త స్థితి మరియు ధ్వని.
ఈ రెండింటి కంబైండ్ రూపంతో చేసిన సేవ వారసులను తయారుచేస్తుంది. కేవలం ధ్వని
ద్వారా సేవ చేస్తే ప్రజలు తయారవుతారు. కనుక ఇప్పుడు సేవలో నవీనత తీసుకురండి.
(ఈవిధమైన సేవ చేయడానికి సాధనం ఏమిటి?) ఏ సమయంలో సేవ చేస్తున్నారో ఆ సమయంలో
జ్ఞానం యొక్క మననం నడుస్తుంది. స్మృతిలో నిమగ్నమయ్యే స్థితి అనేది మనన స్థితి
కంటే తక్కువగా ఉంటుంది. ఇతరుల వైపు ధ్యాస అధికంగా ఉంటుంది, స్వయం యొక్క అవ్యక్త
స్థితి వైపు ధ్యాస తక్కువగా ఉంటుంది. దీని కారణంగా జ్ఞానం యొక్క విస్తారం యొక్క
ప్రభావం పడుతుంది. కానీ సంలగ్నతలో నిమగ్నం అయిన స్థితి యొక్క ప్రభావం తక్కువ
కనిపిస్తుంది.ఇక ఫలితంలో జ్ఞానం చాలా గొప్పది అని అంటున్నారు. కానీ
మగ్నస్థితిలో ఉండాలి. ఈ ధైర్యం పెట్టుకోవటం లేదు. ఎందుకంటే అవ్యక్త స్థితి
ద్వారా సంలగ్నత అంటే బాబాతో సంబంధం జోడించే అనుభవం చేయించలేదు. కానీ కొన్ని
కణాలు లేదా గింజలు తీసుకున్నారు. కనుక ప్రజలుగా అవుతారు. ఇప్పుడు బాబాతో సంబంధం
జోడించడం ద్వారానే ఆ ఆత్మలు భవిష్యత్తులో సంబంధంలోకి వస్తారు, లేదంటే ప్రజలు
అవుతారు. కనుక సేవలో ఇదే నవీనత తీసుకురావాలి. ఒక్క సెకెనులో అవ్యక్త స్థితి
యొక్క అనుభవం ద్వారా సంబంధాన్ని జోడించాలి. సంబంధం మరియు సంప్రదింపులు
రెండింటిలో తేడా ఉంది. సంప్రదింపుల్లోకి వస్తున్నారు, సంబంధం రావటం లేదు.
అర్థమైందా?
ఈరోజు అవ్యక్త స్థితిని అనుభవం చేసుకున్నారు. ఈ
అనుభవాన్ని సదాకాలికంగా స్థిరంగా ఉంచుకుంటే ఇతరులకు కూడా అనుభవం
చేయించగలుగుతారు. ఈ రోజుల్లో వాచా ద్వారా లేదా అనేక రకాల సాధనాల ద్వారా,
అనేకులు ఆత్మలను ప్రభావితం చేస్తున్నారు. కానీ అనుభవం అనేది మీరు తప్ప మరెవ్వరు
చేయలేరు, మరియు చేయించలేరు. అందువలన ఈ సమయంలో ఆత్మలకు అనుభవం చేయించడం చాలా
అవసరం. కొద్ది సమయంలో అనుభవం చేసుకోవాలి - అందరిలో కూడా ఇదే అభిలాష ఉంది.
వినాలనే కోరిక లేదు. కనుక మీరు అనుభవంలో స్థితులై అనుభవం చేయించండి. అందరికీ
వతనంలో స్నేహం లభించింది. మూడు రకాలైన స్మృతి మరియు స్నేహం వతనానికి
చేరుకున్నాయని చెప్పాను కదా! వియోగి, యోగి మరియు స్నేహి. ఈ మూడు రూపాల యొక్క
ప్రియస్మృతులు బాప్ దాదాకు లభించాయి. ఇప్పుడు రివైజ్ కోర్సు యొక్క సంవత్సరం
కూడా సమాప్తం అయిపోతూ ఉంది. సంవత్సరం పూర్తవగానే విద్యార్థులు తమ రిజల్టు
చూసుకోవలసి ఉంటుంది. మరి ఈ సంవత్సరం యొక్క రిజల్టులో ప్రతి ఒక్కరు తమ యొక్క ఏ
రిజల్టు చూసుకోవాలి? దీని కొరకు ముఖ్యంగా నాలుగు విషయాలు ధ్యాసలో ఉంచుకోవాలి,
1. మీలో అన్ని రకాల శ్రేష్టత ఎంత వరకు వచ్చింది? 2 ఫంపూర్ణతలో లేదా సర్వ
సంబంధాలలో సమీపత ఎంత వచ్చింది? 3. మీ యొక్క మరియు ఇతరుల యొక్క సంబంధంలో
సంతుష్టత ఎంతవరకు వచ్చింది? 4. మీలో ధైర్యం ఎంత వరకు వచ్చింది? ఈ నాలుగు
విషయాలు స్వయంలో పరిశీలించుకోవాలి. ఈ రోజు మీ రిజల్టు చెక్ చేసుకునే కర్తవ్యం
మొదట చేయాలి. ఈ రోజు కేవలం స్మృతి దినోత్సవంగా జరుపుకోవడం కాదు, కానీ మీ
సమర్థతను పెంచుకునే రోజుగా జరుపుకోవాలి. ఈ రోజు మీ స్థితిని పరివర్తన చేసుకునే
రోజుగా భావించండి. పారదర్శక వస్తువులు మంచిగా ఉంటాయి కదా! అదేవిధంగా మీరు కూడా
పారదర్శక (ట్రాన్స్పరంట్) స్థితిలో స్థితులై పరివర్తన (ట్రాన్స్ఫర్) అవ్వాలి.
ఈరోజు యొక్క గొప్పతనం అర్థమైందా! ఎంత పారదర్శకంగా మీరు అవ్వాలంటే మీ శరీరంలో
ఉన్న ఆత్మ అందరికీ స్పష్టంగా కనిపించాలి. మీ ఆత్మిక స్వరూపం వారి ఆత్మిక
స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించాలి. దీనినే అవ్యక్త స్థితి లేదా ఆత్మిక స్థితి
యొక్క అనుభవం అని అంటారు.
ఈ రోజు స్మృతియాత్ర యొక్క ఫలితం ఏమిటి?
స్నేహస్వరూపంగా ఉందా లేక శక్తి స్వరూపంగా ఉందా? ఈ స్నేహం కూడా శక్తి యొక్క
వరదానాన్ని ఇప్పిస్తుంది. కనుక ఈ రోజు స్నేహం యొక్క వరదానం పొందే రోజు. 1.
పురుషార్ధం ద్వారా ప్రాప్తి 2. వరదానం ద్వారా ప్రాప్తి. ఈ రోజు పురుషార్ధం
ద్వారా శక్తిని పొందటం కాదు, స్నేహం ద్వారా శక్తి యొక్క వరదానం ప్రాప్తింప
చేసుకునే రోజు. కనుక ఈ రోజుని విశేష వరదాని రోజుగా భావించండి. స్నేహంతో వరదాత
నుండి ఏ వరదానాన్ని అయినా ప్రాప్తింప చేసుకోవచ్చు. అర్ధమైందా! పురుషార్థం
ద్వారా కాదు, స్నేహం ద్వారా. ఎవరు ఎన్ని వరదానాలు తీసుకుంటారో ఎవరిది వారిదే.
కానీ స్నేహం ద్వారా అందరు సమీపంగా వచ్చి వరదానం పొందవచ్చు. గ్రహించగలిగితే
అద్భుతం. ఈ వరదాని రోజున ఎవరు ఎంత గ్రహించగలిగితే అంతగా వారు వరదానాలను
పొందారు. ఒక్క బాబా తప్ప మరెవ్వరి స్మృతి ఆకర్షించకుండా ఉండేటందుకు పురుషార్ధం
చేస్తున్నారు కదా! అదేవిధంగా ఈ రోజు సహజ స్మృతిని అనుభవం చేసుకున్నారు. మంచిది.