01.02.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


కిరీటం తిలకం మరియు సింహాసనాధికారిగా అయ్యే విధి.

ఈరోజు బాప్ దాదా పిల్లలందరిని చూసి సంతోషిస్తున్నారు. ఈ రోజు బాబా ప్రతి ఒక్కరి నంబర్ వారి కిరీటము మరియు సింహాసనమును చూసున్నారు. మీరు కూడా మీ కిరీటము, సింహాసనాన్ని చూసుకుంటున్నారా? ఎన్ని రకాలైన కిరీటాలు మరియు ఎన్ని రకాలైన సింహాసనాలు ఉన్నాయి? ఇప్పుడు ఏదైనా కిరీటము ఉందా మీకు లేక సత్యయుగంలో 21 జన్మల 21 కిరీటాలు కనిపిస్తున్నాయా! ఇప్పటి కిరీటమే అంటే సంగమయుగంలో కిరీటం ధారణ చేసినప్పుడే అక్కడ అనేక కిరీటాలను ధారణ చేయగలుగుతారు. ఇలా మిమ్మల్ని మీరు కిరీటధారీగా చూసుకుంటున్నారా అని బాబా అడుగుతున్నారు. ఎన్ని కిరీటాలు ధారణ చేస్తారు? రెండు. శక్తులకు అనేకం మరియు పాండవులకి రెండు. ఒకవేళ ఇప్పుడు కిరీటం ధారణ చేయకపోతే భవిష్యత్తులో కిరీటం ఏవిధంగా లభిస్తుంది? కనుక ఈ సమయంలో బాబా పిల్లలందరిని కిరీటధారులుగా మరియు సింహనాధికారులుగా తయారుచేస్తున్నారు. సింహాసనాధికారులుగా ఉంటే కిరీటధారులుగా కూడా ఉంటారు. అయితే సింహాసనం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది?ఇప్పుడు మీరు బాబా యొక్క హృదయ సింహానాధికారులు. మరియు అకాల సింహసనాధికారులుగా అయ్యారు. అలాగే పవిత్రత యొక్క లైట్ కిరీటాన్ని కూడా ఇప్పుడే ధారణ చేస్తున్నారు మరియు బాబా యొక్క హృదయ సింహాసనాధికారి అవ్వటం ద్వారా, సేవధారిగా అవ్వటం ద్వారా బాధ్యత కిరీటాన్ని కూడా ధారణ చేస్తున్నారు. కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరు తమను తాము చూసుకోండి. రెండు సింహాసనాలకు, రెండు కిరీటాలకు అధికారిగా ఎంత సమయం ఉంటున్నాను అని. కిరీటం సింహాసనం అందరికి లభించాయి. కాని కొంత మంది పురుషార్థం అనుసరించి కొద్ది సమయం కిరీటధారిగా, సింహాసనాధికారిగా అవుతున్నారు. చూడండి, స్థూలంగా కూడా కొందరికి కిరీటం ధారణ చేసే అనుభవం తక్కువగా ఉంటే దానిని మాటి మాటికి తీసేస్తారు కదా! కాని బాబా ఇచ్చేటటువంటి కిరీటం, సింహాసనం చాలా సరళంగా మరియు సహజంగా ఉంటాయి. ప్రతి సమయం ఈ కిరీటాన్ని ధారణ చేయచ్చు, సింహాసనాధికారిగా అవ్వచ్చు, సింహానాధికారి సింహసనంపై ఉపస్థితులయినప్పుడే రాజ్య సైన్యం కూడా ఆయన ఆజ్ఞానుసారం నడుస్తుంది. ఒకవేళ సింహాసనం వదిలేస్తే సైన్యం కూడా ఆర్డర్ పై నడవదు. అదే విధంగా మీరు కూడా మీ కిరీటం, సింహాసనం ధారణ చేస్తేనే మీ యొక్క కర్మేంద్రియాలు మీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాయి. ఇవి వదిలేస్తే మీ కర్మేంద్రియాలు కూడా మీ ఆజ్ఞను పాటించవు. సింహాసనాధికారిగా ఉంటేనే మీ కర్మేంద్రియాలు కూడా మీకు నమస్కారం చేస్తాయి. కనుక ఈ కిరీటము సింహాసనం ఎప్పుడు వదలకూడదు అనే ధ్యాస ఉంచుకోండి. మీరు కిరీటం మరియు సింహాసనాన్ని ధారణ చేసిన సంపూర్ణ చిత్రాన్ని సదా స్మృతి ఉంచుకోండి. దీనిని స్మృతి ఉంచుకోవటం ద్వారా అనేక చిత్రాలు ఏవైతే తయారవుతున్నాయో అవి తయారవ్వవు. చూడండి, ఒక్క రోజులో ప్రతి ఒక్కరు రకరకాల చిత్రాలు, రూపాలు మార్చే చిత్రాలు చూపిస్తున్నారు కదా! కానీ మీ యొక్క సంపూర్ణ చిత్రాన్ని ఎదురుగా పెట్టుకోండి. కిరీటధారీగా, సింహాసనాధికారిగా అవ్వటం ద్వారా లక్షణాలు మరియు నషా స్వతహాగానే ఉంటాయి. కనుక మీ కిరీటాన్ని సింహాసనాన్ని ఇప్పుడు వదలకండి. ఎంతెంతగా సంగమయుగంలో కిరీటము మరియు సింహాసనం ధారణ చేసే అనుభవిగా లేక అభ్యాసీగా అవుతారో అంతగానే సత్యయుగంలో కూడా కిరీటధారులుగా, సింహాసనాధికారులుగా అవుతారు. ఒకవేళ సంగమయుగంలో తక్కువ సమయం కిరీటాన్ని, సింహాసనాన్ని ధారణ చేస్తే సత్యయుగంలో కూడా చాలా తక్కువ సమయం కిరీటాన్ని, సింహాసనాన్ని పొందుతారు. సంగమయుగం యొక్క అభ్యాసంలో ప్రతి ఒక్కరికి భవిష్యత్తు యొక్క సాక్షాత్కారం చేయిస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఇతరుల కిరీటం, సింహాసనం చూసి సంతోషపడినట్లయితే సత్యయుగంలో కూడా కిరీటం, సింహాసనం ధరించిన వాళ్లను చూసి సంతోషించాల్సి వస్తుంది. అందువలన సంగమయుగంలో సదాకాలికంగా కిరీటధారీగా మరియు సింహసనాధికారిగా అవ్వండి. బాబా ఈ సమయంలో ఇచ్చేటువంటి కిరీటం, సింహాసనం మరలా ఎప్పుడైనా లభిస్తుందా? ఇప్పుడే లభిస్తుంది. 5000 సంవత్సరాల తరువాత సంగమయుగంలో మాత్రమే లభిస్తుంది. కనుక ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు అనే స్లోగన్ గుర్తు పెట్టుకోండి. చూడండి ఎవ్వరైనా ఇంట్లో కూర్చొండి ఉండగానే మీకు కిరీటాన్ని, సింహసనాన్ని ఇవ్వటానికి వస్తే ఏమి చేస్తారు? సంతోషంగా తీసుకుంటారు కదా! అలాగే బాబా కూడా ఇప్పుడు ఆత్మల ఇంటికి అతిథై వచ్చారు. మన ఇంట్లో కూర్చోని ఉండగానే మనకు కిరీటాన్ని, సింహసనాన్ని బహుమతిగా ఇవ్వటానికి వచ్చారు. మరి బాబా ఇచ్చే ఈ కిరీటాన్ని సింహసనాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? తెలుసా! మాయకి ఏదైనా నివాస స్థానం ఉందా? అక్కడికి వెళ్ళిపోతున్నారా? బాబా చెబుతున్నారు, మీరు 63 జన్మలు మాయతో యుద్ధం చేస్తూ వచ్చారు. దాని పరిణామం కూడా ఎన్నో సార్లు చూసారు. అనేక సార్లు దాని పరిణామం యొక్క అనుభవం అయ్యి మరలా ఆ విషయంలోకి వస్తూ ఉంటే ఏమంటారు? చూపిస్తారు కదా, కీరిటం, సింహసనాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోయినట్లుగా. అలాగే ఇక్కడ కూడా మీకు బాబా ఇచ్చిన కిరీటాన్ని, సింహసనాన్ని వదిలి ముళ్ళ అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ సింహసనం, ఎక్కడ ముళ్ళ అడవి? మీకు ఏమి ఇష్టం? ఏవిధంగా అయితే భక్తులు లేక శృంగారం చేసుకునే వారు నియమప్రమాణంగా మస్తకంలో తిలకం పెట్టుకుంటారు కదా! అదేవిధంగా మీరు కూడా ప్రతిరోజు అమృతవేళ జ్ఞాన స్నానం చేస్తున్నారు. కనుక ప్రతి రోజు అమృతవేళ స్మృతి అనే తిలకం పెట్టుకోవాలి. కాని అమృతవేళ పెట్టుకోవటం మర్చిపోతున్నారు. కొందరు పెట్టుకుంటున్నారు, మరల తొలగించేసుకుంటున్నారు. చూడండి కొంతమందికి తిలకం మాటిమాటికి తొలగించుకునే అలవాటు ఉంటుంది. ఇప్పుడిప్పుడే పెట్టుకుంటారు, ఇప్పుడిప్పుడే తొలగించేసుకుంటారు. అదే విధంగా ఇక్కడ కూడా స్మృతి అనే తిలకం పెటుకుంటున్నారు, మరలా దానిని తొలగించెసుకుంటున్నారు. కొందరైతే అసలు ఈ తిలకం పెట్టుకోవటం మర్చిపోతున్నారు. కొందరు పెట్టుకుంటున్నారు, చెరిపివేసుకుంటున్నారు. కనుక అమృతవేళ ఈ స్మృతి అనే తిలకాన్ని పెట్టుకొని దీన్ని స్థిరంగా ఉంచుకోండి. ఇదే అలంకరణ, శృంగారం మరియు యోగ్య స్థితికి గుర్తు. మీ మస్తకం ద్వారా స్మృతి తిలకం అందరికి కనిపించాలి. ఏవిధంగా అయితే భక్తులు తిలకం పెట్టుకుంటారు కదా! వారిని చూసి వీరు వేరే భక్తులు అని అందరు అనుకుంటారు. అదేవిధంగా మీ మస్తకంలో బాబా స్మృతి అనే తిలకాన్ని చూసి ఇతరులు వీరు యోగి ఆత్మలు అని అనుభవం చేసుకోవాలి. కనుక బాబా ఇచ్చిన తిలకం, కిరీటం, సింహసనం మూడింటిని స్థిరంగా ఉంచుకోండి. తిలకాన్ని తొలగించుకోకండి. మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశక్తివాన్ అని అంటున్నారు కదా! మరియు మాస్టర్ సర్వశక్తివాన్ అయిన మీరు కిరీటాన్ని, సింహసాన్ని ధారణ చేయ్యలేరా? కేవలం కర్మ చేస్తూ స్మృతిలో ఉంచుకోండి. ఇప్పుడు ఏవిధంగా అయితే నోటి ద్వారా వచ్చే మాటలు సరళంగా గ్రహించగలుగుతున్నారో అదేవిధంగా ముందు ముందు ఇతర ఆత్మల యొక్క మనస్సు యొక్క సంకల్పాలను కూడా సహజంగా గ్రహించే స్థితి మీకు తయ్యారవుతుంది. ఒకరికొకరి స్వభావంలో సమానత వస్తే వారి భావాన్ని కూడా మీరు సహజంగా అర్థం చేసుకోగలుగుతారు. కనుక ఎంతెంత బాబా యొక్క సమానతకి సమీపంగా వస్తారో అంత మనస్సు యొక్క సంకల్పాలను కూడా గ్రహించగలుగుతారు. బాబా మనస్సు యొక్క సంకల్పాలను మనం గ్రహించాలంటే మధ్యలో మీ సంకల్పాలు మిక్స్ అవ్వకూడదు. మీ సంకల్పాలపై మీకు తప్పకుండా కంట్రోల్ ఉండాలి. బాబా చెబుతున్నారు, చూడండి - బయట సైన్యాన్ని కంట్రోల్ చేసే శక్తి అందరిలో ఉండదు. కొందరిలో కొంచెం, కొందరిలో కొంచెం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనస్సు యొక్క సంకల్పాలను కంట్రోల్ చేసే కంట్రోలింగ్ పవర్ కూడా నంబర్‌వారీగా ఉంటుంది. కనుక సదా రెండు విషయాలు స్మృతిలో ఉంచుకోండి. 1) నేను ప్రతి సమయం, ప్రతి సెకండు, ప్రతి కర్మ చేస్తూ స్టేజ్ పై ఉన్నాను అనుకోండి. ఇలా ప్రతి కర్మ అటెన్షన్ పెట్టుకొని చేయడం ద్వారా సంపూర్ణ స్థితి వస్తుంది. 2) సదా మీ యొక్క వర్తమాన మరియు భవిష్యత్తు పదవిని స్మృతిలో ఉంచుకోండి. ఒకటి స్టేజ్, రెండు స్టేటస్. ఈ రెండు విషయాలు స్మృతిలో ఉంచుకుంటే ఏ కార్యము మీ పదవికి విరుద్దంగా చెయ్యరు. వెనువెంట స్వయాన్ని స్టేజీపై ఉన్నాను అని భావిస్తే సదా ఉన్నత కర్తవ్యం చేసే ప్రేరణ లభిస్తుంది. కనుక ఈ రెండు విషయాలు సదా స్మృతిలో ఉంచుకోండి. ఒక్కటి స్టేజ్, రెండు స్టేటస్. బాబా అడుగుతున్నారు, బాబాని కలుసుకోవటానికి మీరు దూరం నుంచి వచ్చారా లేదా మిమ్మల్ని కలుసుకోవడానికి బాప్ దాదా దూరం నుంచి వచ్చారా? వేగం స్పీడ్ ఉంది కాని, ఎవరిది దూరం? మీరు బాబాని కలుసుకోవడానికి ప్రయాణం చేసి వచ్చారు, బాప్ దాదా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయాణం చేసి వచ్చారు. కాని మీ ప్రయాణంలో అలసట ఉంటుంది, కాని బాప్ దాదా ప్రయాణంలో అలసట ఉండదు. మధువన్ నివాసిగా అవ్వటం ఇది కూడా డ్రామాలో చాలా చాలా సౌభాగ్యానికి గుర్తు. ఎందుకంటే మధువనం అంటే వరదాన భూమి. కనుక వరదాన భూమికి వచ్చారు. ఇక్కడ మీది శ్రను చేయవలసిన భూమి, కాని మధువనం అంటే వరదానం లభించేటువంటి భూమి, వరదానంలో శ్రమ ఉండదు. కనుక వరదాన భూమికొచ్చి వరదాత ద్వారా లేక నిమిత్త ఆత్మల ద్వారా ఎన్ని వరదానాలు కావాలంటే అన్ని వరదానాలు తీసుకోవచ్చు. నిమిత్తంగా అయిన ఆత్మల ద్వారా జ్ఞానం ఎలా తీసుకుంటారు, ఇది తెలుసా?. బాబా ద్వారా వరదానం తీసుకోవాలి తరువాత నిమిత్త ఆత్మల ద్వారా కూడా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? మధువనంలో వరదానం లభిస్తుంది. ఇక్కడ వాయుమండలంలో ఈ పవిత్ర చరిత్ర భూమిలో వరదానం నిండి ఉంది. కాని నిమిత్త ఆత్మల ద్వారా వరదానం ఏ విధంగా తీసుకుంటారు? ఎందుకంటే వరదానం తీసుకోవటం ద్వారా వరదానంలో శ్రమ తక్కువగా ఉంటుంది. ఏ విధంగా అయితే మందిరాలలో పండాలు, యాత్రికులను వరదానం ఇచ్చే దేవతల దగ్గరకు తీసుకెళ్తారు కదా! అలాగే మీరు కూడా పండాలు. యాత్రికులకు పరదానం ఎలా ఇస్తారు? వరదానం తీసుకునే సాధనం ఏమిటి? శ్రేష్ఠ ఆత్మల ద్వారా వరదానం ఎలా లభిస్తుంది అంటే, ఎందువలన లభిస్తుంది అంటే వారు నిమిత్తంగా అయ్యిన కారణంగా వారి ప్రతి కర్మ ద్వారా సహజంగా ప్రేరణ లభిస్తుంది. ఆ కర్మను మీరు అనుసరించడం ద్వారా పురుషార్థంలో సహజంగా ముందుకు వెళ్ళగలుగుతారు. చూడండి, ఏదైనా వస్తువు సాకారంలోనయినా చూస్తే తొందరగా గ్రహిస్తారు. బుద్ధితో ఆలోచించాలి అంటే గ్రహింపులో సమయం పడుతుంది. అలాగే ఇక్కడ కూడా బాబా మనకి సాకార రూపంలో నిమిత్త ఆత్మల ద్వారా ప్రతి కర్మలో ప్రేరణ ఇస్తున్నారు. ఆ ప్రేరణ ద్వారా మనం నడిచినప్పుడు వరదానంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. అందులో శ్రమ అనేది ఉండదు. చూడండి, మీకు కూడా బిందు రూపాన్ని స్మృతి చేయటం కొద్దిగా కష్టం. అదే సాకార రూపాన్ని స్మృతి చేయటం సహజం. అదే విధంగా బాబా కూడా ఇక్కడ నిమిత్తంగా అయిన శ్రేష్ఠ ఆత్మల యొక్క సేవ, త్యాగం, స్నేహం, సర్వ సహయోగ స్థితి యొక్క ప్రాక్టికల్ కర్మ చూపించి వారి ద్వారా మీకేదైతే ప్రేరణ లభిస్తుందో అది వరదాన రూపంగా చూస్తున్నారు. కనుక నిమిత్త శ్రేష్ఠ ఆత్మల యొక్క త్యాగం ద్వారా, స్నేహం ద్వారా, సేవ ద్వారా, పహయోగ స్థితి ద్వారా ప్రత్యక్ష కర్మలో వారి నుంచి మీకు ఏదైతే ప్రేరణ లభిస్తుందో అదే బాబా నిమిత్త ఆత్మల ద్వారా ఇచ్చే వరదానం. దాని అనుసారంగా మనం నడుచుకునప్పుడు మనకి పురుషార్థంలో శ్రమ అని అనిపించదు. కనుక మీరందరు మధువన వరదాన భూమికి వచ్చారు అంటే బాబా ద్వారా కూడా వరదానం పొంది వెళ్ళాలి, శ్రేష్ఠ ఆత్మల ద్వారా కూడా సహజ కర్మయోగి అయ్యే వరదానం పొంది వెళ్ళాలి. ఎందుకంటే మీరు కర్మలో ఉంటూ స్మృతి చేయటం కష్టం అంటున్నారు. కనుక నిమిత్తంగా అయిన ఆత్మలు కర్మ చేస్తూ బాబా స్మృతి యొక్క ధారణలో ఎలా ఉంటున్నారో మీకు ఈ కర్మయోగి స్థితి నిమిత్త ఆత్మల ద్వారా ప్రేరణ లభిస్తుంది. కనుక మధువన్ వరదానం భూమి నుంచి నిమిత్త ఆత్మల ద్వారా సహజ కర్మయోగి అయ్యే ప్రేరణ యొక్క వరదానం తీసుకొని వెళ్ళండి. ఏ ఒక్క వరదానాన్ని కూడా ఇక్కడ నుంచి వదిలి వెళ్ళకండి. ఇలా మధువనంలో బాబా ద్వారా నిమిత్త ఆత్మల ద్వారా సర్వ వరదానాలు పొందుతూ ఉంటే స్వయం కూడా మాస్టర్ వరదాత అయ్యి సర్వులకు వరదానాన్ని ఇవ్వగలుగుతారు. అచ్చా!