13.03.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బంధన్ముక్త ఆత్మ యొక్క గుర్తులు.

ఇక్కడ కూర్చున్న వారందరు స్వయాన్ని బంధన్ముక్త ఆత్మగా భావిస్తున్నారా? అనగా అందరు బంధన్ముక్తులుగా అయ్యారా లేక ఇప్పటికీ ఏదొక బంధన ఉందా? శక్తి సేన బందన్ముక్తంగా అయ్యారా? సర్వ బంధన్ముక్తులం అయ్యాము అనేవారు చేయి ఎత్తండి! సేవ కారణంగా నిమిత్తమాత్రంగా ఉన్నాము అనేది మరో విషయం. కానీ మీ బంధనను సమాప్తం చేసుకున్నారా? మేము బంధన్ముక్తులం అయ్యాము కేవలం నామమాత్రంగా సేవార్థం కర్తవ్యార్ధం ఈ శరీరంలో ఉన్నాము అని భావిస్తున్నారా? (చాలామంది చేయి ఎత్తారు) చేతులు ఎత్తిన వారందరు ఎప్పుడైనా కానీ సంకల్పాలకు లేదా శరీరం యొక్క పరిస్థితులకి సంకల్పమాత్రంగానైనా ఆధీనం అవుతున్నారా లేదా కొంచెం సమయం అయినా అలజడి లేదా అలజడిని లేశమాత్రంగానైనా అనుభవం చేసుకుంటున్నారా లేక వీటి నుండి కూడా అతీతం అయిపోయారా? బంధన్ముక్తులు అయిపోతే మనస్సుకి వశం అవ్వరు అనగా సంకల్పాలకి వశమవ్వరు, పరిస్థితులను ఎదుర్కునే సంపూర్ణ శక్తి ఉంటుంది. ఎవరైతే చేయి ఎత్తారో వారు ఇలా ఉన్నారా మరి? ఈ బంధనలో ఇప్పుడు ఇంకా బంధించబడి ఉన్నారు కదా! బంధన్ముక్తుల గుర్తులు ఏవి? బంధమ్మక్తులు సదా యోగయుక్తంగా ఉంటారు. బంధన్ముక్తుల గుర్తు - యోగయుక్తం, మరి ఎవరైతే ఇలా యోగులుగా ఉంటారో, యోగుల యొక్క ముఖ్య గుణం ఏమి కనిపిస్తుంది? తెలుసో తెలియదో అవి బుద్ధి ద్వారా ఆట ఆడిస్తున్నారు. మరయితే యోగుల ముఖ్య గుణం లేదా లక్షణాలు ఏవిధంగా ఉంటాయి? ఎంత యోగులో అంతగా వారు సర్వులకు సహయోగిగా ఉంటారు మరియు సర్వుల సహయోగానికి స్వతహాగానే అధికారి అవుతారు. యోగి అనగా సహయోగి. ఎవరు ఎంత యోగిగా ఉంటారో వారికి సహయోగం తప్పక ప్రాప్తిస్తుంది. సర్వుల నుండి సహయోగం పొందాలంటే యోగి అవ్వండి. యోగికి సహయోగం ఎందుకు ప్రాప్తిస్తుంది? ఎందుకంటే బీజంతో యోగం జోడిస్తారు. బీజంతో సంబంధం అనగా స్నేహం ఉంటుంది. కనుక స్నేహానికి బదులుగా సహయోగం ప్రాప్తిస్తుంది. కనుక బీజంతో యోగం జోడించేవారికి, బీజానికి స్నేహమనే నీరు ఇచ్చేవారికి సర్వాత్మల ద్వారా సహయోగం అనే ఫలాన్ని పొందుతారు. సాధారణ వృక్షం నుండి ఫలాన్ని పొందేటందుకు ఏమి చేస్తారు? అదేవిధంగా యోగికి ఒకొక్కరితో యోగం జోడించవలసిన అవసరం ఉండదు, ఒకొక్కరి నుండి సహయోగం పొందాలనే ఆశ ఉండదు. కానీ ఒకే బీజంతో యోగం అనగా సంబంధం ఉన్న కారణంగా సర్వాత్మలు అనగా వృక్షం అంతటితో సంబంధం ఉన్నట్లే. కనుక సంబంధం జోడించటంపై శ్రద్ధ పెట్టండి. సహయోగిగా అయ్యేటందుకు మొదట మిమ్మల్ని మీరు అడగండి, ఎంత మరియు ఎలాంటి యోగిగా అయ్యాను? సంపూర్ణ యోగి కాకపోతే సంపూర్ణ సహయోగిగా కాలేరు మరియు సహయోగం లభించదు. ఎవరు ఎంతగా ప్రయత్నించినా కానీ బీజంతో యోగం జోడించకుండా ఏ ఆకు అనగా ఏ ఆత్మ నుండి సహయోగం ప్రాప్తించటం అనేది జరగదు. అందువలన సర్వులకు సహయోగం ఇచ్చేటందుకు మరియు సర్వుల నుండి సహయోగం తీసుకునేటందుకు సహజ పురుషార్థం ఏమిటి? బీజరూపితో సంబంధం అనగా యోగం. అప్పుడప్పుడు శ్రమించి ఒకొక్కరి నుండి సహయోగం పొందాలనే ఆశ సమాప్తం అవుతుంది, శ్రమ నుండి ముక్తులు అయిపోతారు. ఎందుకంటే ఎప్పుడైతే సర్వశక్తుల యొక్క సహయోగం, సర్వాత్మల యొక్క సహయోగం ప్రాప్తిస్తాయో అలాంటి శక్తిరూప ఆత్మ కొరకు ఏ బంధనను అయినా తెంచుకోవటం కష్టమనిపిస్తుందా? బంధన్ముక్తులు అయ్యేటందుకు యోగయుక్తులుగా అవ్వాలి. మరియు యోగయుక్తులు అవ్వటం ద్వారా స్నేహం మరియు సహయోగయుక్తులు అయిపోతారు. కనుక ఈ విధంగా బంధన్ముక్తులు అవ్వండి. సహజం సహజం అంటూనే ఎంత సమయం గడిచిపోయింది.

ఇలాంటి స్థితి ఇప్పుడు తప్పకుండా ఉండాలి. బంధన్ముక్త స్థితి గురించి చెప్పాను కదా! శరీరంలో ఉంటూ కేవలం ఈశ్వరీయ కర్తవ్యం కోసం ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాను అని భావించాలి. ఆధీనత ఉండకూడదు. నిమిత్తంగా ఆధారం తీసుకున్నారు. ఎవరైతే శరీరాన్ని నిమిత్త ఆధారంగా భావిస్తారో వారు ఎప్పుడూ ఆధీనం అవ్వరు. నిమిత్త ఆధారమూర్తులే సర్వాత్మల ఆధారమూర్తులు కాగలరు. స్వయమే ఆధీనం అయితే వారు ఏమి ఉద్దరిస్తారు? ప్రతీ ఒక్కరు ఆధీనత నుండి ఎంత అతీతంగా ఉంటారో అంతగా సేవలో కూడా సఫలత లభిస్తుంది. కనుక అన్ని సఫలతల కొరకు సర్వ ఆధీనతల నుండి అతీతం అవ్వటం చాలా అవసరం. ఈ స్థితిని తయారు చేసుకునేటందుకు రెండు మాటలను గుర్తుంచుకోండి, వాటి ద్వారా సహజంగానే ఈ స్థితిని పొందగలరు. ఆ రెండు మాటలు ఏవి? బంధన్ముక్తులు అయిపోతే టెలిఫోన్ ద్వారా పరస్పర మాటలను ఎలా గ్రహించగలుగుతున్నారో అలా ఎవరి సంకల్పంలో ఏమి ఉందో దానిని కూడా మీరు గ్రహించగలుగుతారు. ఇప్పుడు అర్జునులుగా అవుతున్నారు. అందువలన ఆలోచించవలసి వస్తుంది. ఆ రెండు మాటలు 1. సాక్షి 2. సాథీ (తొడు). మీ తోడుని సదా తోడుగా ఉంచుకోండి. సాక్షియై ప్రతీ కర్మ చేయండి. సాథీ మరియు సాక్షి. ఈ రెండు మాటలను అభ్యాసంలోకి తీసుకురండి. అప్పుడు ఈ బంధన్ముక్త స్థితి చాలా త్వరగా తయారవుతుంది. సర్వశక్తివంతుడు తోడుగా ఉండటం వలన సర్వశక్తులు కూడా ప్రాప్తిస్తాయి. మరియు వెనువెంట సాక్షియై నడవటం ద్వారా ఏ బంధనలోను చిక్కుకోరు. అయితే బంధన్ముక్తులు అయ్యారు కదా! దీని కొరకు ఈ రెండు మాటలను సదా గుర్తుంచుకోండి - యోగం, సహయోగము. రెండు విషయాలు వచ్చేశాయి. ఇప్పుడు ఇలాంటి పురుషార్ధం ఎంత సమయంలో చేస్తారు? పూర్తిగా బంధన్ముక్తులై సాక్షి స్థితిలో నిమిత్తమాత్రంగా శరీరంలో ఉండి కర్తవ్యం చేయాలి. ఇప్పుడు ఈసారి మీతో మీరు సంకల్పం చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మీకు (టీచర్లు) సహజం కూడా. విశేషంగా టీచర్లకి ఇది సహజం, ఎందుకు? ఎందుకంటే వారి పూర్తి జీవితమే నిమిత్తం. అర్థమైందా? టీచర్లు ఉన్నదే నిమిత్తంగా, కనుక వీరు ఈ సంకల్పం చేయాలి. ఈ శరీరంలో మేము నిమిత్తమాత్రంగా ఉన్నామని, ఇదయితే సహజం కదా! వీరికి (అన్నయ్యలకి) అయితే డబల్ భాద్యత. అందువలన వీరు యుద్ధం చేయవలసి ఉంటుంది. వాటిని తొలగించుకోవటానికి, ఇక నిమిత్తమైనవారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు అయితే సహజం. మీకు (మాతలకు) సహజమైనది ఏది? ఎలాగైతే వారికి విశేష విషయం కారణంగా సహజమో అలాగే మీకు కూడా ఒక విషయం కారణంగా సహజం. ప్రవృత్తిలో ఉండేవారికి ఏ విషయం కారణంగా సహజం అంటే వారి ఎదురుగా సదా తేడా కనిపిస్తూ ఉంటుంది. తేడా తెలిస్తే నిర్ణయం చేయటం సహజం అవుతుంది. నిర్ణయశక్తి తక్కువ ఉంది, అందువలనే సహజంగా అనిపించటం లేదు. దీని ద్వారా ఏమి ప్రాప్తిస్తుంది అని ఒకసారి అనుభవం అయిపోతే ఇక నిర్ణయం తీసుకోగలరు. మోసాన్ని ఒకసారి అనుభవం చేసుకుంటే ఇక మాటిమాటికీ మోసపోతారా ఏమిటి? నిర్ణయ శక్తి తక్కువగా ఉంటే కష్టం అనిపిస్తుంది. వీరు ప్రవృత్తిలో లేదా కుటుంబంలో ఉంటూ వాటి యొక్క అనుభవీలు. కనుక ఎదురుగా రెండింటి తేడా ఉంటుంది, కనుక మోసం నుండి రక్షించబడతారు. ఎవరైతే వరదానానికి అధికారి అవుతారో వారు ఎవరికీ ఆధీనం అవ్వరు. అర్థమైందా! ఇప్పుడు ఇక ఆధీనత సమాప్తం - అధికారం ప్రారంభం. ఎప్పుడూ ఏ ఆధీనత యొక్క సంకల్పం కూడా రాకూడదు. ఇలా నిశ్చయం పక్కాగా ఉండాలి. వీరికి నిశ్చయంలో ఎప్పుడూ శాతం ఉండదు. శక్తి సేన స్వయంలో ఏమి ధారణ చేశారు? స్నేహం మరియు శక్తి సమానంగా ఉంటే ఇక సంపూర్ణంగా అయిపోయినట్లే. మీ శూరవీర రూపం సాక్షాత్కారం చేసుకున్నారా? శూరవీరులు ఎప్పుడూ ఎవరితోను భయపడరు, కానీ వారి ఎదురుగా వచ్చేవారు భయపడతారు. ఇప్పుడు సాక్షాత్కారం చేసుకున్న శూరవీరతను సదా ఎదురుగా పెట్టుకోండి. ఈ రోజు చెప్పిన రెండు మాటలను సదా గుర్తుంచుకోండి. మంచిది.