అతీతం మరియు విశ్వానికి ప్రియంగా అయ్యే విధి.
అందరు మీ యొక్క అలౌకిక మరియు పారలౌకిక నషా మరియు
గమ్యంలో సదా ఉంటున్నారా? అలౌకిక నషా మరియు గమ్యం, పారలౌకిక నషా మరియు గమ్యం
రెండూ తెలుసా? రెండింటిలో తేడా ఉందా లేక ఒకటేనా? అలౌకిక నషా మరియు గమ్యం
ఈశ్వరీయ జన్మది, పారలౌకిక నషా మరియు గమ్యం భవిష్య జన్మది. ఈశ్వరీయ జన్మ యొక్క
నషా మరియు గమ్యం స్మృతి ఉంటుందా? ప్రతి సమయం రెండూ గుర్తుంటే ఏవిధంగా
అయిపోతారు? అలౌకిక నషా మరియు గమ్యంతో అతీతం అవుతారు, మరియు పారలౌకిక నషా మరియు
గమ్యంతో విశ్వానికి ప్రియంగా అవుతారు. రెండు నషాలు మరియు గమ్యాలతో అతీతంగా
మరియు ప్రియంగా అయిపోతారు. అర్ధమైందా!
ఇప్పుడు అందరి నుండి అతీతం అవ్వాలి. మీ దేహంతో కూడా
అతీతంగా అవ్వాలి. అప్పుడు అన్ని విషయాల నుండి అతీతం అయిపోతారు. అతీతంగా
అవ్వటానికి ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. అతీతంగా అవ్వటం ద్వారా స్వతహాగానే
అందరికీ ప్రియంగా అయిపోతారు. ప్రియంగా అవ్వటానికి పురుషార్ధం ఉండదు, అతీతంగా
అవ్వటానికి పురుషార్ధం ఉంటుంది. అందరికీ ప్రియంగా అవ్వాలంటే ఏమి పురుషార్ధం
చేయాలి? సర్వుల నుండి అతీతం అవ్వాలి. మీ దేహంతో అతీతంగా అయితే అవుతున్నారు.
కానీ ఆత్మలో ఉన్న పాత సంస్కారాలతో కూడా అతీతంగా అవ్వండి. ప్రియంగా అయ్యే
పురుషార్ధం చేసి ప్రియంగా అయిపోతే ఏమి ఫలితం వస్తుంది? మరింత ప్రియంగా
అయిపోతారు. కనుక బాప్ దాదా హృదయ సింహాసనానికి దూరం అయిపోతారు. అందువలన ఈ
పురుషార్ధం చేయకూడదు. అతీత వస్తువు ఏదైనా కానీ ప్రియంగా ఉంటుంది. ఈ సంఘటనలో
ఏదైనా అతీత వస్తువు కనిపిస్తే అందరి తగుల్పాటు మరియు అందరి ప్రేమ అటువైపు
వెళ్ళిపోతుంది. కనుక మీరు కూడా అతీతంగా అవ్వండి. సహజ పురుషార్థము కదా! అతీతం
కాలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటి? (ఆకర్షణ) ఆకర్షణ కూడా స్వార్థంతో, ఈ
సమయంలో తగుల్పాటు స్నేహంతో లేదు. స్వార్థంతో ఉంటుంది. స్వార్ధం కారణంగా
తగుల్పాటు మరియు తగుల్పాటు కారణంగా అతీతం అవ్వలేకపోతున్నారు. మరి దీని కోసం ఏమి
చేయాలి? స్వార్థం అనగా అర్ధం ఏమిటి? స్వార్ధం అనగా స్వ రధాన్ని స్వాహా చేయండి.
ఈ రధం ఏదైతే ఉందో అనగా దేహాభిమానం, దేహ స్మృతి, దేహంపై తగుల్పాటు. ఈ
స్వార్థాన్ని ఏ విధంగా సమాప్తి చేస్తారు? దానికి సహజ పురుషార్ధం - స్వార్ధం
యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి, తెలుసుకుని అర్ధ స్వరూపంగా అవ్వాలి. కేవలం ఒకే
మాట యొక్క అర్థం తెలుసుకోవటం ద్వారా సదా ఒకనివారిగా మరియు ఏకరసంగా తయారవుతారు.
ఈరోజు టీచర్స్ యొక్క ప్రారంభోత్సవ రోజు. సంపూర్ణ
ఆహుతి చేయగల సామర్థ్యం ఉందా? ఇన్చార్జ్ మరియు టీచర్స్ యొక్క గ్రూపు ఇది. అంతేనా
లేక ఇంకా తయారయ్యేవారా? ముఖ్య ధారణ ఏమిటంటే సదా మీ సంపూర్ణ స్థితిని లేదా
సంపూర్ణ స్వరూపాన్ని ఆహ్వానిస్తూ ఉండండి. ఎవరినైనా ఆహ్వానించవలసి వస్తే
బుద్దిలో వారి స్మృతి ఉంటుంది కదా! అదేవిధంగా ఈ విషయాన్ని కూడా స్పృతి
ఉంచుకోవటం ద్వారా ఫలితం ఏమి వస్తుంది? రాకపోకల చక్రం ఏదైతే తిరుగుతూ ఉందో అది
ఆగిపోతుంది. రాకపోకల చక్రం అనగా ఏమిటి? ఒకొక్కసారి ఉన్నత స్థితిలో ఉంటున్నారు,
ఒకొక్కసారి క్రిందకి వచ్చేస్తున్నారు. ఇలా పైకి క్రిందకి రావటం, పోవటం అనే
చక్రం నుండి ముక్తి అవుతారు. అనగా ఈ వ్యర్ధ విషయాల నుండి దూరం అయితే సదా మెరిసే
అదృష్ట సితార అయిపోతారు. ఇన్చార్జ్ టీచర్ అవ్వాలంటే మొదట మీ ఆత్మ యొక్క
బ్యాటరీని చార్జ్ చేసుకోండి. బ్యాటరీ ఎంత బాగా చార్జ్ అవుతుందో అంత మంచి
ఇన్చార్జి టీచర్‌గా అవ్వగలరు. ఎవరి బ్యాటరీ ఎంత చార్ట్ అయ్యి ఉంటుందో అంత మంచి
ఇన్చార్జి టీచర్‌గా కాగలరు. అర్థమైందా? నేను ఇన్ చార్జిని అని స్మృతి
వచ్చినప్పుడు నా బ్యాటరీ చార్జ్ అయ్యి ఉందా? అని మొదట పరిశీలించుకోండి. కనుక
ఇప్పుడు ఏమి చేయాలి? మంచిగా బ్యాటరీని చార్జ్ చేసుకున్న ఇన్ఛార్జ్ అయ్యి
వెళ్ళాలి. బ్యాటరీ చార్జ్ అవ్వకుండా ఇన్ చార్జ్ అయిపోతే ఏమి ఫలితం వస్తుంది?
చార్జ్ అనే మాటకి రెండు మూడు అర్థాలు ఉంటాయి. 1. బ్యాటరీ చార్జ్ 2. డ్యూటీని
కూడా చార్జ్ అని అంటారు. 3. దోషాన్ని కూడా చార్జ్ అని అంటారు. కొందరి పై చార్జ్
తీసుకుంటారు కదా! కనుక ఇన్చార్జ్ యొక్క బ్యాటరీ చార్జ్ అయ్యి ఉంటే యదార్ధ
ఇన్చార్జ్ గా అవుతారు. బ్యాటరీ చార్జ్ లేకపోతే యదార్ధ రూపంగా అవ్వలేరు. మరియు
భిన్న భిన్న ఛార్జ్ లు పడతాయి. ఇప్పుడు అర్ధమైందా! ఎలాంటి ఇన్ చార్జ్ గా
అవ్వాలో. ధర్మరాజుపురిలో మొదట చార్జ్ ఇచ్చి తర్వాత శిక్షిస్తారు. కనుక బ్యాటరీ
చార్జ్ లేకపోతే చార్జ్ లు పడతాయి. ఈ గ్రూపు అందరి దృష్టిలోకి రావాలి. ఇప్పుడు
ఈవిధంగా తయారయ్యి వెళ్ళాలి. ఎక్కడ మిమ్మల్ని మీరు మలుచుకోవాలో అక్కడ
మలుచుకోవాలి, ఇలా కోమలంగా అవ్వాలి. కోమల వస్తువుని ఎక్కడ కావాలంటే అక్కడ
మలచవచ్చు. కనుక కోమలంగా అవ్వాలి, కానీ వేటిలో? సంస్కారాలను మలుచుకోవటంలో
కోమలంగా అవ్వండి. కానీ కోమల హృదయంగా అవ్వటం నుండి రక్షించుకోండి. ఈ లక్ష్యం
మరియు లక్షణాలు ధారణ చేసి వెళ్ళండి. స్నేహి మరియు సహయోగిగా అయ్యే ఈ గ్రూపు
కొరకు సూక్తి ఏమిటంటే అధికారిగా అవుతాము మరియు ఆధీనతను తొలగించుకుంటాము.
సంకల్పాలకి అయినా, మాయకి అయినా, ఈ శరీరానికి కూడా అధికారి అయ్యి నడవాలి మరియు
మాయతో కూడా అధికారి అయ్యి దానిని మీ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. సంబంధీకుల యొక్క
ఆధీనతలోకి కూడా రాకూడదు, లౌకికం అయినా లేదా ఈశ్వరీయ సంబంధీకులు అయినా ఆధీనతలోకి
రాకూడదు. సదా అధికారిగా అవ్వాలి. ఈ సూక్తి సదా గుర్తుంచుకోండి. ఇలా తయారయ్యి
వెళ్ళాలి. మానససరోవరంలో స్నానం చేస్తే దేవదూతలుగా అయిపోతారని అంటారు కదా!
అదేవిధంగా ఈ గ్రూపు ఈ భట్టీ అనే మానససరోవరంలో స్నానమాచరించి ఫరిస్తాగా అయ్యి
వెళ్ళాలి. ఫరిస్తా అనగా ప్రకాశమయ శరీరం. ఈ దేహం యొక్క స్మృతి నుండి కూడా అతీతం.
వారి యొక్క పాదం అనగా బుద్ధి ఈ పంచతత్వాల ఆకర్షణకి అతీతంగా అనగా పైకి ఉంటుంది.
ఇలాంటి ఫరిస్తాలను ఏ మాయ లేదా మాయ మనుష్యులు తాకలేరు. ఏ మాయ మనుష్యులు లేదా మాయ
తాకలేని విధంగా తయారయ్యి వెళ్ళాలి. కుమారీల మహిమ చాలా గొప్పగా పాడతారు. కానీ
ఎలాంటి కుమారి? బ్రహ్మకుమారీల మహిమ పాడతారు. బ్రహ్మాకుమారి అనగా బ్రహ్మబాబాని
ప్రత్యక్షం చేసే కుమారి. టీచర్లుగా అయ్యేవారు కేవలం పాయింట్స్ బుద్దిలో
పెట్టుకోవటం కాదు, లేదా వర్ణించటం కాదు కానీ ఆ పాయింట్ గా అయ్యి పాయింట్ ని
వర్తించాలి. ఒకవేళ స్వయం ఆ పాయింట్ స్వరూపం యొక్క స్థితిలో స్థితులు కాకపోతే ఆ
పాయింట్ యొక్క ప్రభావం ఏదీ ఉండదు. అందువలన పాయింట్స్ ని సేకరించటంతో పాటు
పాయింట్ రూపాన్ని స్మృతి చేస్తూ వెళ్ళాలి. చాలా పుస్తకాలను పాయింట్స్ నింపుతారు
కదా! అప్పుడు పరిశీలించుకోండి - సాకార బ్రహ్మాబాబా యొక్క చరిత్రకి నకలుగా
(కాపి) నేను అయ్యానా? కాపీ అనేది ఉన్నది ఉన్నట్లుగానే చేస్తారు కదా! ఆవిధంగా
బాబా సమానంగా కనిపించండి. చెప్పాను కదా - ఎంత సమానత ఉంటుందో అంత ఎదుర్కునే
శక్తి ఉంటుంది. సమానత వస్తే ఎదుర్కునే శక్తి వస్తుంది. మంచిది.
ఈ గ్రూపు తక్కువైనవారు కాదు. ఇంత పెద్ద శక్తిదళం
కోనకోనల్లోకి సేవార్థం వెళ్తే ఏమవుతుంది? బ్రహ్మాకుమారీలకు జై అనే ధ్వని
ప్రసిద్ధం అవుతుంది. ఇప్పుడు అయితే నిందిస్తున్నారు. ఇక్కడే మీ ఎదురుగా మహిమ
అనే పుష్పాలను మీపై జల్లుతారు. ఈ గ్రూపుకి ఇది ప్రత్యక్ష పరీక్ష. నలువైపుల బాప్
దాదాకి మరియు సహాయకారి పిల్లలకు జయజయకారాలు రావాలి. ఇంత శక్తి ఉందా? ఒకని యొక్క
సాంగత్యంలో ఉండటం ద్వారా సాంగత్యదోషం నుండి రక్షించుకుంటారు. సదా
పరిశీలించుకోండి - బుద్ధి యొక్క సాంగత్యం ఎవరితో ఉంది? ఒకనితోనే ఉందా? ఒకనితోనే
ఉంటే అనేక సాంగత్యదోషాల నుండి విడిపించబడతారు. సాంగత్యదోషం అనేక రకాల దోషాలను
ఉత్పన్నం చేస్తుంది. అందువలన ఈ విషయం గురించి చాలా ధ్యాస పెట్టుకోవాలి. బాబా
మరియు మేము ఇక మూడవ వారు ఎవరూ లేరు. ఇలాంటి స్థితి ఉన్నప్పుడు మీ మస్తకంలో మూడవ
నేత్రం సాక్షాత్కారం అవుతుంది. ఇక్కడి యోగానికి స్మృతి చిహ్నంగా అక్కడ ఏమి
చూపించారు? మూడవ నేత్రం. ఒకవేళ బుద్ధిలో మూడవవారు ఎవరైనా వస్తే మూడవనేత్రం
మూసుకుపోతుంది. సదా మూడవ నేత్రం తెరిచి ఉండాలి. దీని కోసం గుర్తుంచుకోండి -
మూడవ వారు ఎవరూ లేరు. మంచిది.