06.05.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బాప్ దాదా యొక్క విశేష అలంకారం - నయనరత్నాలు.

ఈ రోజు రత్నాగరుడైన తండ్రి తన యొక్క రత్నాలను చూసి హర్షిస్తున్నారు. ప్రతీ ఒక్క రత్నం శక్తిననుసరించి పురుషార్ధం చేస్తూ ముందుకి వెళ్తున్నారు. మేము ఏ రత్నం అని ప్రతి ఒక్కరికీ తెలుసా? అసలు రత్నాలు ఎన్ని రకాలు? (నవరత్నాలు) మీరు ఏ నెంబరు రత్నం? వజ్రం యొక్క సాంగత్యంలో ఉంటూ వజ్రసమానంగా అవ్వలేదా? అందరూ రత్నాలే కాని ఒకరత్నం పేరేమిటంటే - నయనరత్నం. మరయితే మీరు నయనరత్నం కాదా? ఒకరు నయనరత్నాలు, రెండవవారు - కంఠహారంలోని రత్నాలు, మూడవ స్థితి ఏమిటో తెలుసా ? మూడవ వారు - చేతి కంకణంలోని రత్నాలు. అందరి కంటే మొదటి నెంబరు నయనరత్నాలు, ఆవిధంగా ఎవరు అవుతారు? ఎవరి నయనాలు అయితే కేవలం బాబాను తప్ప మరేదీ చూస్తూ కూడా చూడరో వారే నయనరత్నాలు. నోటితో జ్ఞానాన్ని వర్ణన చేస్తారు కొందరు. కానీ మొదటి నెంబరు వారి నయనాలలో సదా బాబా యొక్క స్మృతి మరియు బాబా యొక్క మూర్తి అందరికీ కనిపిస్తుంది. ఇది తక్కువగా ఉన్నవారు తమ కంఠం ద్వారా సేవ చేస్తారు. కనుక వారు కంఠహారంలోని రత్నాలు. ఇక మూడవ నెంబరు - చేతి కంకణంలోని రత్నాలు. వీరి యొక్క విశేషత ఏమిటి? వీరు ఏదోక రూపంలో సహాయకారి అవుతారు, కనుక కంకణంలోని రత్నంగా అవుతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు అడగండి - నేను ఏ రత్నాన్ని? మొదటి నెంబరా? రెండవ నెంబరా లేక మూడవ నెంబరా? అందరూ రత్నాలే, అందరూ బాప్ దాదాకి అలంకారమే కాని మీరు ఏ నెంబరు రత్నం? ఇప్పుడు చెప్పండి. నయనరత్నాల యొక్క పరిశీలన ఏదయితే చెప్పానో దాంట్లో మీరు పాస్ విత్ అనార్ అయ్యారా? ఆశావంతులలో కూడా నెంబరు ఉంటుంది. సదా ఇది స్మృతి ఉంచుకోండి - మేము బాప్ దాదా యొక్క నయనరత్నాలం. కనుక మా నయనాలలో, మా దృశ్యంలో మరే వస్తువు ఇమడలేదు. నడుస్తూ, తిరుగుతూ, తింటూ త్రాగుతూ మీ నయనాలలో ఏమి కనిపించాలి? బాబా యొక్క మూర్తి లేదా ముఖము. ఇలాంటి స్థితిలో ఉండటం ద్వారా ఎప్పుడూ కూడా ఏ ఫిర్యాదు చేయరు. రకరకాల అలజడులు అలజడి చేస్తున్నాయి. మరియు ఆ అలజడుల కారణంగా మీ గౌరవం నుండి దూరం అయిపోతున్నారు. అలజడి అంటే అర్థం ఏమిటి? మీ గౌరవం ఏదయితే ఉందో దాని నుండి దూరం అయిపోతున్న కారణంగా అలజడి అవ్వవలసి వస్తుంది. మీ గౌరవంలో మీరు స్థితులైతే అలజడి అవ్వలేరు. అలజడులు అన్నింటినీ తొలగించుకునేటందుకు కేవలం శబ్దార్ధ స్వరూపంలో స్థితులవ్వండి. మీ గౌరవంలో మీరు స్థితులవ్వండి. గౌరవం ద్వారా ప్రతిష్ఠ తప్పక లభిస్తుంది. అందువలనే పేరు ప్రతిష్ఠలు అని అంటారు. మీ గౌరవాన్ని తెలుసుకోండి. ఎవరు ఎంతగా తమ గౌరవంలో తాము ఉంటారో వారు అంత ప్రతిష్ఠ పొందుతారు. మీ గౌరవం ఎంతటిదో తెలుసా? ఎంత గొప్ప గౌరవమో తెలుసా? ఏ చెడుని అయినా సమాప్తం చేసేటందుకు బాబా మహిమ పాడండి. కేవలం చిన్న మార్పుతో ఎంత తేడా వస్తుందో! చెడు మరియు మహిమ కేవలం ఒక్క అక్షరాన్ని మార్చాలి. (బురాయి మరియు బడాయి) ఇదయితే 5 సంవత్సరాల చిన్నపిల్లవాడు కూడా చేయగలడు. సదా ఉన్నతోన్నత తండ్రి యొక్క గొప్పతనాన్ని పాడండి. దీంట్లో చదువు అంతా వచ్చేస్తుంది. బాబా యొక్క గొప్పతనం చెప్తే ఏమవుతుంది? పోట్లాట సమాప్తం అవుతుంది. మాయతో పోట్లాడి పోట్లాడి అలసిపోయారు కదా! బాబాని పొగిడితే పోట్లాటతో అలసిపోరు. బాబా గుణాలు పాడుతూ సంతోషంగా ఉండటం ద్వారా పోట్లాట కూడా ఒక ఆట వలె కనిపిస్తుంది. ఆటల్లో సంతోషం ఉంటుంది కదా! పోట్లాటని ఆటగా భావించే వారి గుర్తు ఏమిటి? హర్షితంగా ఉంటారు. సదా హర్షితంగా ఉండేవారిని మాయ ఎప్పుడూ కూడా ఏ రూపంలోను ఆకర్షించలేదు. మాయ యొక్క ఆకర్షణ నుండి రక్షించుకునేటందుకు సదా ఆటలో హర్షితంగా ఉండండి. కేవలం రెండు విషయాలు గుర్తుంచుకోండి అప్పుడు ప్రతి కర్మ స్మృతిచిహ్నం అవుతుంది. సదా స్వయాన్ని విశ్వ పరివర్తనకు ఆధారమూర్తిగా భావిస్తే ప్రతి కర్మ ఉన్నతంగా ఉంటుంది. దాంతో పాటు ఉదారచిత్ అనగా సర్వాత్మల పట్ల సదా కళ్యాణ భావన వృత్తి మరియు దృష్టిలో ఉండటం ద్వారా ప్రతీ కర్మ శ్రేష్టంగా ఉంటుంది. మీ ప్రతీ కర్మ స్మృతిచిహ్న యోగ్యంగా ఉండేలా చేయండి. ఇలా అనుసరించటం కష్టమా? (మ్యూజియం సేవార్ధం వెళ్తున్నారు). త్యాగానికి సదా భాగ్యం తయారవుతుంది. త్యాగం చేసిన వారికి స్వతహాగానే భాగ్యం ప్రాప్తిస్తుంది. అందువలన గొప్ప గొప్ప త్యాగాలు చేసేవారికి చాలా గొప్ప భాగ్యం తయారవుతుంది. అందువలన సంతోషంగా వెళ్ళాలి సేవకి. మంచిది.