20.05.1971
ఉదయం మురళి ఓం శాంతి
అవ్యక్త్-బాప్దాదా మధుబన్
విధాత వరదాత స్థితి.
విధాత మరియు వరదాత ఈ రెండు గుణాలను మీలో అనుభవం
చేసుకుంటున్నారా? బాబా విధాత మరియు వరదాత కూడా అదేవిధంగా మిమ్మల్ని మీరు రెండు
రకాలుగా ప్రాప్తి స్వరూపులుగా భావిస్తున్నారా? ఎంతెంతగా వరదాతగా అవుతారో
అంతంతగా వరదాతగా అయ్యి వరదానం ఇచ్చే శక్తి పెరుగుతుంది. అయితే రెండూ అనుభవం
అవుతున్నాయా లేక ఇప్పుడు కేవలం విధాత యొక్క పాత్ర నడుస్తుంది, వరదాత యొక్క
పాత్ర అంతిమంలోని నడుస్తుందా? ఏమని భావిస్తున్నారు? (కొందరు అన్నారు - రెండూ
నడుస్తాయి; కొందరు అన్నారు - ఇప్పుడు ఒకటే నడుస్తుంది) వరదానం అనేది ఏ ఆత్మలకి
ఇస్తారు? మరియు వరదాతగా ఎవరి కోసం అవుతారు? 1. జ్ఞానాన్ని ఇవ్వటం 2. వరదాన
రూపంలో ఇవ్వటం. అయితే విధాతయా మీరు లేక వరదాతయా? ఎవరికి వరదానం ఇస్తున్నారు?
విధాత అనగా జ్ఞానం ఇచ్చేవారిగా అయితే అవుతున్నారు కానీ అక్కడక్కడ విధాతతో పాటు
వరదాతగా కూడా అవ్వవలసి ఉంటుంది. అది ఎప్పుడు? ఏ ఆత్మ అయినా ధైర్యహీనంగా,
నిర్భలంగా ఉంది కానీ నేను కూడా ఎంతో కొంత ప్రాప్తిని పొందాలనే కోరికతో లేదా
భావనతో ఉంది, అలాంటి ఆత్మల కోసం జ్ఞానదాతతో పాటు విశేష రూపంలో శుభ భావన
పెట్టుకుని, శుభ చింతకులై ఆత్మకి బలం ఇస్తున్నారు. అంటే విధాతతో పాటు వరదాతగా
కూడా అయినట్లే కదా! మీ తరపు నుండి ఆ ఆత్మకి అదనపు బలాన్ని వరదానం రూపంలో
ఇస్తున్నారు. కనుక వరదానం కూడా ఇవ్వవలసి ఉంటుంది మరియు దాతగా కూడా అవ్వవలసి
ఉంటుంది. కనుక రెండూ కావాలి. ఈ అనుభవం ఎప్పుడు చేసుకున్నారు? భక్తి మార్గంలో
అయితే సాక్షాత్కారం ద్వారా వరదానం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఆ ఆత్మలు ఎంత
నిర్బలంగా ఉంటారంటే జ్ఞానాన్ని ధారణ చేయలేవు, స్వయం పురుషార్ధిగా అవ్వలేవు కనుక
వరదానం యొక్క కోరిక పెట్టుకుంటారు. మరియు ఆ వరదాన రూపంలో వారికి ఎంతో కొంత
ప్రాప్తిస్తుంది. అదేవిధంగా బలహీన ఆత్మలు మీ ఎదురుగా వస్తే వారి యొక్క కోరికను
చూసి దయ లేదా కృప యొక్క భావన వస్తుంది. దయాహృదయులై మీ శక్తినంతటినీ సహాయంగా
ఇచ్చి వారిని ఉన్నతి చేయాలి. ఇదే వరదాన రూపం. ఇప్పుడు చెప్పండి - మీరు రెండూనా
లేక ఒకటేనా? కొంతమంది ఆత్మల కోసం మీరు విశేష కార్యక్రమం కూడా పెట్టవలసి
ఉంటుంది. ఎందుకంటే వారు తమ శక్తితో ధారణ చేయలేరు. కనుక శక్తిని వరదానంగా ఇచ్చే
శివశక్తులు మీరు. విధాత స్థితి ద్వారా జ్ఞానాన్ని ఇచ్చే సేవ ఎక్కువ జరుగుతుంది.
అంతిమంలో జ్ఞానం ఇచ్చే సేవ తగ్గిపోతుంది. వరదానం ఇచ్చే సేవ ఎక్కువ అవుతుంది.
అందువలన అంతిమ సమయంలో వరదానం తీసుకునే ఆత్మలలో కూడా అదే సంస్కారం నిండిపోతుంది.
నిండిన ఆ సంస్కారంతోనే ద్వాపరయుగంలో భక్తుల రూపంలో ప్రత్యక్షం అవుతుంది.
ఇప్పుడు జ్ఞానదాతగా అయ్యే సేవ, తర్వాత వరదాత యొక్క సేవ ఉంటుంది. అర్థమైందా!
మున్ముందు ఎక్కువ సమయం కూడా ఉండదు మరియు ఆత్మలలో శక్తి కూడా ఉండదు. అందువలన
వరదాత అయ్యి వరదానం ఇచ్చే సేవ జరుగుతుంది. ఇప్పుడు ఈ సేవ తక్కువ చేస్తున్నారు.
తర్వాత ఎక్కువ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు వారసులుగా అయ్యే సేవ చేస్తున్నారు. ఆ
తర్వాత కేవలం ప్రజలను తయారు చేసే సేవ చేయాలి. కానీ కొంచెం సమయంలో ఇంతమంది
ప్రజలను తయారు చేసేటందుకు, వరదాతగా అయ్యేటందుకు ముఖ్యంగా ఏమి శ్రద్ధ పెట్టాలి.
వరదాతమూర్తిగా అయ్యి కొంచెం సమయంలో అనేకాత్మలకు వరదానం ఇవ్వగలగాలి. దాని కోసం
ఏమి చేయాలి? వరదాతగా అయ్యేటందుకు ముఖ్య పురుషార్ధం ఏమిటంటే భక్తిమార్గంలో
మాటిమాటికి నీకు బలిహారం అయిపోతాను అని అంటూంటారు. ఆ మాటను ఇప్పుడు ప్రత్యక్ష
రూపంలో చేయాలి. ఎవరిపైన మీరు బలిహారం అయిపోతారో వారు మీకు సర్వ వరదానాలను ఇచ్చి
వరదాతమూర్తిగా తయారు చేస్తారు. కనుక ప్రతీ సమయం ప్రతి కర్మలో ప్రతి సంకల్పంలో
నీకు అర్పణ అయిపోతాను అని అనుకోండి. ఏదైతే మాట ఇచ్చానో దానిని పాలన
చేస్తున్నాను అని భావించండి. బాబా వరదాతమూర్తి కదా! మీరు కూడా బాబా సమానంగా
వరదాతమూర్తులేనా? ఇది పరిశీలించుకుంటున్నారా? ఒక సంకల్పం కూడా ఎవరి గురించి
ఉండకూడదు. ఏ సంకల్పం వస్తుందో దానిని బాబాకి అర్పించాలి. బలిహారం అయిపోతాను అనే
రహస్యంతో నిండి ఉండాలి ఆ సంకల్పం. ఇలా పరిశీలన చేసుకుంటే మాయ ఎదుర్కునేటందుకు
సాహసించలేదు. ఎదుర్కునేటందుకు సాహసించలేదు కానీ మాటిమాటికీ నమస్కారం చేసి
వీడ్కోలు తీసుకుంటుంది. అర్హమైందా? ఈవిధంగా తయారయ్యేటందుకు ఇంత పరిశీలన అవసరం.
మరో విషయం , వరదానిమూర్తిగా అయ్యేటందుకు మీలో సర్వశక్తుల స్టాకు జమ అయ్యి ఉందా
అని పరిశీలించుకోవాలి. జమ అయితేనే ఇతరులకు ఇవ్వగలరు. జమ అవ్వకపోతే ఇతరులకు ఎలా
ఇవ్వగలరు? కనుక వరదానమూర్తిగా అయ్యేటందుకు సర్వశక్తులను ఇతరులకు ఇచ్చేటంతగా
స్వయంలో జమ చేసుకోవలసి ఉంటుంది. మరి అంత జమా ఖాతా ఉందా? సంపాదించుకున్నారు
మరియు తినేశారు, ఈ ఫలితం ఉందా? 1. సంపాదించుకోవటం మరియు తినేయటం 2. జమ
చేసుకోవటం. 3. స్వయాన్ని నడిపించుకునేటంతగా కూడా జమ చేసుకోకపోవటం మరియు ఇతరుల
సహాయంతో స్వయం నడవవలసి రావటం. మీరు మూడవ లేదా రెండవ స్థితి నుండి దాటేశారు కదా!
సంపాదించుకోవటం మరియు తినేయటం నుండి దాటేశారు కదా! మొదటి స్థితి - జమ
చేసుకోవటం. రోజూ మీ బ్యాంకు ఖాతాను చూసుకుంటున్నారా? చాలామంది బికారులు బిక్షం
అడిగేటందుకు వస్తారు కనుక అందరికీ ఇవ్వగలిగేటంతగా జమ చేసుకోవాలి. జమ చేసుకోవటం
నేర్చుకున్నారా? ఎంత జమ చేసుకున్నారో ఖాతాలో చూస్తే తెలిసిపోతుంది. మీ ఖాతాను
మీరు చూసుకున్నారా? కొంతమంది ఖాతా నుండి తీసుకుని తెలియకుండానే తినేస్తూంటారు.
ఆ తర్వాత ఖాతా చూసుకుంటే ఏమయ్యిందో తెలుస్తుంది అప్పుడు. ఇక్కడ అయితే అలా
అవ్వదు, కదా! ఖాతా జమ అయిన వారి యొక్క విశేష గుణాలు లేదా కర్తవ్యం ఏమి
కనిపిస్తుంది? ఎవరి దగ్గర ఖాతా జమ అయ్యి ఉంటుందో వారి ముఖంలో వర్తమానం మరియు
భవిష్యత్తు అనగా ఈశ్వరీయ నషా మరియు నారాయణ నషా కనిపిస్తాయి. వారి నయనాలలో,
మస్తకంలో సర్వాత్మలకు స్పష్టంగా నషా కనిపిస్తుంది. జమ అయిన వారికి గుర్తు ఇదే.
వారి ముఖమే సేవ చేస్తుంది. వారి ముఖమే సేవాధారి. ఎవరి దగ్గర ఎక్కువ జమ అయ్యిందో
ఎవరి దగ్గర తక్కువ జమ అయ్యిందో వారి ముఖం నుండే కనిపిస్తుంది. జమ చేసుకున్నవారి
ముఖం మరియు మూర్తి ద్వారా తెలిసిపోతుంది. జడచిత్రాలు తయారుచేస్తారు వాటిలో కూడా
కొన్ని చిహ్నాలు కనిపిస్తాయి. అది జడచిత్రాల ద్వారా కూడా అనుభవం అవుతుంది. అవి
మాట్లాడవు కానీ ముఖం మరియు మూర్తి ద్వారా అనుభవం అయిపోతుంది. అదేవిధంగా మీ
ముఖమే మీ ప్రతీ సంకల్పాన్ని మీ ప్రతీ కర్మని స్పష్టం చేస్తుంది. అయితే
మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నా ముఖం ద్వారా ఏ ఆత్మకి అయినా నషా మరియు
గమ్యం కనిపిస్తుందా? ఎవరైనా ఉన్నత కులానికి చెందిన పిల్లలు బీదవారిగా
అయిపోయారనుకోండి అయినా కానీ వారిలో ఒక మెరుపు నషా కనిపిస్తుంది. దాంతో వీరు
ఉన్నత కులానికి చెందినవారని అర్థమవుతుంది. అదేవిధంగా ఎవరైతే సదా ఖజానాలతో
సంపన్నంగా ఉంటారో వారి ముఖం ఎప్పుడూ దాగదు. మీ దగ్గర దర్పణం ఉంది కదా!
దర్పణాన్ని సదా వెంట ఉంచుకుంటున్నారా? ప్రతీ సమయం దర్పణంలో చూసుకుంటూ
ఉంటున్నారా? కొందరు ఎలా ఉంటారంటే మాటిమాటికి దర్పణంలో చూసుకోవలసిన అవసరం ఉండదు.
మరయితే మీరు సెకను సెకను చూసుకుంటున్నారా లేక చూసుకోవలసిన అవసరమే లేదా?
పరిశీలించుకునే అభ్యాసం సహజం అయ్యే వరకు మాటిమాటికి పరిశీలించుకుంటారు. ఆ
తర్వాత నెమ్మది నెమ్మదిగా ఎలా అయిపోతారంటే ఇక మాటిమాటికీ చూసుకోవలసిన అవసరం
ఉండదు. అంటే సదా అలంకరించబడే ఉంటారు. ఎప్పటి వరకు సదా అలంకరించుకుని ఉండే
అలవాటు అవుతుందో అప్పటి వరకు మాటిమాటికి స్వయాన్ని చూసుకోవలసి మరియు తయారు
చేసుకోవలసి ఉంటుంది. మాయ ఏ రకంగానైనా ఏ రూపంలోనైనా నా అలంకారాన్ని పాడు చేయలేదు
కదా రెండు లేదా నాలుగు సార్లు చూసుకున్నారు! ఇక ఆ తర్వాత మాటిమాటికీ
చూసుకోవలసిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఇతరుల ద్వారా మీ సాక్షాత్కారం మీకు
జరుగుతుంది. ఇతరులు వారికి వారే వర్ణన చేస్తారు. గుణగానం చేస్తారు. మంచిది.
అందరూ విజయీరత్నాలే కానీ మీ మెడలో విజయీమాల ఎంత ఉంది అది కూడా చూసుకోవాలి. ఈ
విజయీమాల రోజు రోజుకీ పెరిగిపోతుంది. కనుక ఎంత పెరుగుతుంది మరియు ఎంత పెరిగిందో
చూసుకోవాలి. మాల పెద్దది అయిపోతే అప్పుడు ఏమి చేస్తారు? రెండు వరుసలుగా
చేసుకుని వేసుకుంటారు. దాంతో అలంకారం మరింత సుందరం అయిపోతుంది. అంత పెద్దమాల మీ
మెడలో పడిందా? ఇది కూడా పరిశీలించుకోండి - ఈ రోజు నా విజయీమాలలో ఎన్ని
విజయీరత్నాలు పెరిగాయి? మంచిది. దృష్టి ద్వారా సృష్టి మారుతుంది. ఇది ఇప్పటి
మహిమయే. ఎలాంటి తమోగుణి లేదా రజోగుణి ఆత్మలు వచ్చినా కానీ మీ సతోగుణి దృష్టి
ద్వారా వారి వృత్తి మారిపోవాలి. ఇక ముందు ఈ అనుభవం చాలామంది ఆత్మలు
చేసుకుంటారు. స్మృతి చిహ్నం చూపించారు కదా - మూడు లోకాలు సాక్షాత్కారం
అయినట్లుగా, ఇది కూడా ఇప్పటి మహిమయే. మీ ఎదురుగా రావటంతోనే మీ దృష్టి ద్వారా
వారికి మూడు లోకాలు ఏమిటి తమ యొక్క జీవిత కథ అంతా అర్థమైపోతుంది. ఆదిలో స్థాపనా
సమయంలో జ్ఞానం ద్వారా సేవ అంత ఎక్కువ లేదు. దృష్టి ద్వారా అద్భుతం చేసేవారు
కనుక అంతిమంలో కూడా జ్ఞానం ద్వారా సేవ చేసే అవకాశం లభించదు. ఆదిలో ఏదైతే
జరిగిందో అదే అంతిమంలో మీ ద్వారా జరుగుతుంది. వృక్షం కంటే ముందు బీజం
ప్రత్యక్షంగా ఉంటుంది. మధ్యలో అది గుప్తం అయిపోతుంది. అంతిమంలో మరలా అదే
ప్రత్యక్షం అవుతుంది. అదేవిధంగా ఆది ఆత్మలైన మీ ద్వారా ఏదయితే మొదట పునాది
పడిందో అదే సేవ అంతిమంలో కూడా జరుగుతుంది. మంచిది. |
|