25.06.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సేవ మరియు తపస్సు యొక్క సమానత.

స్వయాన్ని వృక్షపతి యొక్క సంతానంగా భావిస్తున్నారా? వృక్షం యొక్క స్మృతి చిహ్నం భక్తిమార్గంలో కూడా నడుస్తుంది. తపస్వీలు తపస్సు చేసేటప్పుడు వృక్షం క్రిందే తపస్సు చేస్తారు. దీనికి కారణం ఏమిటి? వృక్షం క్రింద తపస్సు ఎందుకు చేస్తారు? దీని యొక్క రహస్యం ఏమిటి? అసలు ఇది ఎందుకు ప్రారంభమైంది? దీని యొక్క బేహద్ రహస్యం ఏమిటి? ఈ సృష్టి రూపి వృక్షంలో కూడా మీ యొక్క నివాస స్థానం ఎక్కడ? వృక్షం క్రింద మూలం దగ్గర కూర్చుని ఉన్నారు కదా! జ్ఞాన సహితంగా ఇప్పుడు మీరు ఏదైతే చిత్రం తయారు చేశారో అదే తిరిగి భక్తిమార్గంలో స్మృతిచిహ్నంగా నడుస్తూ ఉంటుంది. వృక్షం యొక్క చిత్రంలో దూరం నుండి ఏమి కనిపిస్తుంది? వృక్షం క్రింద తపస్వీలు కూర్చుని తపస్సు చేస్తున్నట్లు ఉంటుంది. వృక్షం క్రింద కూర్చోవటం ద్వారా స్వతహాగానే వృక్షం యొక్క జ్ఞానం అంతా బుద్ధిలోకి వస్తుంది. మామూలుగా కూడా వృక్షం క్రింద కూర్చున్నప్పుడు ధ్యాస స్వతహాగానే ఆ వృక్షం యొక్క ఫలాలు, పుష్పాలు, ఆకులు మొదలైనవాటిపై వెళ్తుంది. ఇక్కడ కూడా కల్పవృక్షం క్రింద వేర్లు స్థానంలో కూర్చుని ఉన్నప్పుడు మొత్తం వృక్షం యొక్క జ్ఞానమంతా బుద్ధిలోకి స్వతహాగానే వస్తుంది. ఎలాగైతే బీజంలో వృక్షమంతా నిండి ఉంటుందో అదేవిధంగా స్వయాన్ని ఈ కల్పవృక్షం యొక్క మూలం లేదా వృక్షం క్రింద ఉన్న వేర్ల రూపంలో భావిస్తున్నారా? అలా భావిస్తే వృక్షం యొక్క జ్ఞానమంతా స్వతహాగానే బుద్దిలోకి వస్తుంది. ఇప్పటి మీ స్థితియే భక్తిమార్గంలో సృృతిచిహ్నంగా నడుస్తూ వచ్చింది. ఇక్కడ మీరు ప్రత్యక్షంగా తపస్సు చేశారు. భక్తి మార్గంలో స్థూల వృక్షం క్రింద కూర్చుని తపస్సు చేస్తారు. మొట్టమొదట్లో మీకు నషా ఉండేది, మేము వృక్షం యొక్క పై స్థానంలో ఉన్నామని, వృక్షం అంతా క్రింద ఉంది, మేము పైన ఉన్నాము. ఇలా పైన కూడా ఉన్నారు కదా! వృక్షాన్ని తలక్రిందులు చేస్తే మీరు పైన అయిపోతారు కదా! మొదట్లో నషా చాలా ఉండేది, మేము వృక్షంపై కూర్చుని వృక్షమంతా చూస్తున్నామని, అదేవిధంగా ఇప్పుడు కూడా ఇలా భిన్న భిన్న రకాలుగా తపస్సు యొక్క నషా మీకు ఉంటుందా? మొదట్లో ఉన్న సంతోషం ఇప్పుడు ఉన్న సంతోషం కంటే ఎక్కువా లేక ఇప్పుడే ఎక్కువా? అప్పుడు కేవలం తపస్సు యొక్క రూపమే. ఇప్పుడైతే తపస్సు మరియు సేవ వెనువెంట ఉన్నాయి. అప్పట్లో కేవలం తపస్సు యొక్క నషాయే క్రిందకి దిగడానికి ఏ కారణము లేదు. కానీ ఇప్పుడు తపస్సు మరియు సేవ రెండూ వెనువెంట నడుస్తున్నాయి. రెండు కార్యాలు జరుగుతున్నాయి. కనుక మధ్యమధ్యలో మీ నషాను పెంచుకునేటందుకు విశేష ధ్యాస పెట్టుకోవాలి. దీనినే బ్యాటరీ చార్జ్ చేయటం అని అంటారు. అప్పుడు నిజంగానే వృక్షమంతా ప్రత్యక్షంగా ఉన్నట్లు అనుభవం అవుతుంది. సాక్షిగా అయ్యి వృక్షాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ నషా కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. అందువలన వృక్షపతి మరియు వృక్షానికి చాలా మహిమ ఉంది. కనుక ఈ విధంగా భిన్న భిన్న రకాల సేవ చేస్తూ కూడా స్వయంలో తపస్సు యొక్క బలం నింపుకోవాలి. దీని ద్వారా తపస్సు మరియు సేవ రెండూ కలిసి ఒకదానితో ఒకటి ఉంటాయి. సేవలోకి వచ్చాము కదా, తపస్సు మర్చిపోయాము అని అనకూడదు. రెండూ వెనువెంట ఉండాలి, రెండూ కలిసి ఉండాలి. దీని గురించి మధ్యమధ్యలో పరిశీలన చేసుకోవాలి. ఎప్పటి వరకు పరీశీలకులుగా (చెకర్) అవ్వరో అప్పటి వరకు నిర్మాతలుగా (మేకర్) కూడా అవ్వలేరు. విశ్వ నిర్మాతలు, శాంతి దూతలు ఈ మహిమ ఏదైతే ఉందో, ఎప్పటి వరకు మీరు పరిశీలకులు అవ్వరో అప్పటి వరకు మహిమా యోగ్యంగా అవ్వలేరు. కనుక స్వయం యొక్క పరిశీలన చాలా అవసరం. ఇతరులు మిమ్మల్ని ఎంత పరిశీలన చేసినా కానీ మీరు చేసుకున్నంతగా వారు చేయలేరు. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవటం ద్వారానే స్వ ఉన్నతి చేసుకోగలరు. కనుక స్వయాన్ని పరిశీలించుకోవాలి. పరిశీలించుకోవటానికి ప్రత్యేక సమయం కేటాయించనవసరం లేదు. సహజ అభ్యాసం అయిపోయినప్పుడు ప్రత్యేకంగా సమయం కేటాయించవలసిన అవసరం కూడా ఉండదు. స్వతహాగానే పరిశీలన నడుస్తూ ఉంటుంది. మరియు పరిశీలన చేయటానికి ఒక్క సెకను కూడా పట్టదు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవటానికి ఎంత సమయం పడుతుంది? ఒక్క సెకను అయితే ఎంత బిజీగా ఉన్నా కానీ తీయగలరు కదా! కేవలం అభ్యాసం అనేది అవసరం. చెకింగ్ మాస్టర్‌గా అవ్వాలి. అన్నింటిలో కూడా మాస్టర్‌గా అవ్వాలి. మాస్టర్ సర్వశక్తివాన్, మాస్టర్ జ్ఞానసాగరులు.... ఇవి ఎలాగో అలాగే చెకింగ్ మాస్టర్‌గా కూడా అవ్వాలి. మంచిది.

డ్రామానుసారం అందరు మంచిగానే నడుస్తున్నారు. మంచిగానే నడుస్తున్నా కానీ పరిశీలన చేసుకోవాలి. ఇది కళ్యాణకారి యుగం అని మీకు తెలుసు. అయినా కానీ ప్రతీ ఒక్కరు స్వయం మరియు ఇతరుల యొక్క కళ్యాణం గురించి ప్లాన్ ఆలోచించుకోవాలి కూడా. స్థితి పెరిగేలా కొత్త కొత్త ప్లానులు ఏమైనా తయారు చేయండి. అందరూ నడుస్తున్నారు మరియు నడుస్తూ ఉంటారు. కానీ మధ్యమధ్యలో అదనపు శక్తి కోసం ప్లాన్ చేయండి. సహయోగం లభిస్తే వారు మరింత ముందుకి వెళ్లగలరు. ఎలాగైతే రాకెట్ కి అగ్ని యొక్క ఫోర్సు ఇస్తేనే కదా పైకి వెళ్తుంది. అదేవిధంగా లైట్ మరియు మైట్ యొక్క ఫోర్సు లభించాలి. అప్పుడే వారు జంప్ చేయగలరు. అదనపు శక్తి యొక్క సహయోగంతో శక్తి ప్రాప్తించినట్లు అనుభవం అవుతుంది. 1. మననశక్తిలో చాలా బలహీనంగా ఉన్నారు. అందువలనే వ్యర్థ సంకల్పాలను ఎలా అదుపు చేసుకోవాలని ఎక్కువమంది ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ముఖ్య బలహీనతను పరిశీలించుకుని ఎలా సమాప్తి చేసుకోవాలి? దీని కోసం ప్లాన్ ఆలోచించాలి. బలహీనతల గురించి తెలుసు, అవి లోపల అణిచివేయబడుతున్నాయి. కానీ సమాప్తం చేసుకోలేకపోతున్నారు. అందువలన కొద్ది సమయం తర్వాత ఈ ఫిర్యాదు మరలా ఎక్కువమందిలో కనిపిస్తుంది. భట్టీ ప్రారంభం నుండే అదనపు శక్తి లభిస్తుంది. ఎంతోకొంత పరివర్తన కూడా జరుగుతుంది. కానీ ఇక్కడి నుండి తీసుకెళ్ళిన ఆ శక్తిని అక్కడ సదాకాలికంగా నిలుపుకోవాలి. దానికోసం ప్లాన్ ఆలోచించండి. శక్తి లేదు అనేది చాలామంది ఫిర్యాదు. జ్ఞానం ఉంది కానీ జ్ఞానాన్ని ప్రకాశము మరియు శక్తి అని అంటారు. ఆ ఙ్ఞానం ద్వారా స్వయంలో శక్తిని ఎలా నింపుకోవాలో ఆ పద్ధతి రావటం లేదు. మీ దగ్గర అగ్గిపెట్టె ఉంది కానీ అగ్గిపుల్లను ఎలా వెలిగించాలో ఆ పద్దతి తెలియదు. అప్పుడు ఆ పని సిద్ధించదు. అదేవిధంగా జ్ఞానం అందరికీ ఉంది, జ్ఞానాన్ని కొందరు ప్రకాశము మరియు శక్తి రూపంలో అనుభవం చేసుకుంటున్నారు. మరికొందరు కేవలం జ్ఞానాన్ని అర్ధం చేసుకుని వర్ణన చేస్తున్నారు. కానీ జ్ఞానం ద్వారా మీలో శక్తి ఎలా తీసుకురావాలో తెలుసుకోవాలి. భిన్న భిన్న యుక్తులు ద్వారా బలాన్ని నింపుకోవాలి. దాని ద్వారా ముందుకి వెళ్ళాలి.