జ్ఞానం యొక్క ప్రకాశం ద్వారా పురుషార్థం యొక్క
మార్గం స్పష్టం.
ఇప్పుడు ఏదైతే పురుషార్థం చేస్తున్నారో ఆ పురుషార్థం
అనుసారం వర్తమాన సమయంలో పొందాల్సిన ప్రాప్తి యొక్క లక్ష్యం ఏమిటి? దేవతా పదవి
యొక్క ప్రాప్తి అనేది భవిష్యత్తుకి చెందినది. కానీ వర్తమాన సమయం యొక్క
పురుషార్ధం యొక్క ప్రాప్తి యొక్క లక్ష్యం ఏమిటి? (ఫరిస్తా) ఫరిస్తా యొక్క ముఖ్య
లక్షణాలు ఏవి? ఫరిస్తాగా అయ్యేటందుకు రెండు లక్షణాలు ఏవి? 1. ప్రకాశం 2. శక్తి
(లైట్ మైట్) రెండూ కావాలి. లైట్ మరియు మైట్ రెండూ కూడా ఫరిస్తాల జీవితంలో
స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఈ లైట్ ని పొందేటందుకు విశేషంగా ఏ శక్తి కావాలి?
శక్తులు అయితే చాలా ఉన్నాయి కదా! కానీ శక్తిరూపంగా మరియు ప్రకాశ రూపంగా
అయ్యేటందుకు వేర్వేరు గుణాలను చెప్పండి. 1. మననం 2. సహనం. ఎంత సహన శక్తి
ఉంటుందో అంతగా సర్వశక్తివంతుని యొక్క సర్వశక్తులు స్వతహాగానే ప్రాప్తిస్తాయి.
జ్ఞానాన్ని కూడా లైట్ అని అంటారు. పురుషార్థం యొక్క మార్గాన్ని సహజంగా మరియు
స్పష్టంగా చేసుకునేటందుకు జ్ఞానం యొక్క ప్రకాశం కావాలి. ఈ ప్రకాశం కోసం మనన
శక్తి కావాలి. 1.మనన శక్తి 2. సహన శక్తి కావాలి. మీలో ఈ రెండు శక్తులు
ఉన్నట్లయితే నడుస్తూ తిరుగుతూ కూడా ఎవరికైనా కానీ ఫరిస్తాగా సాక్షాత్కారం
కాగలరు. సహనశక్తితో సర్వ గుణాలు ప్రాప్తిస్తాయి. ఎవరిలో సహనశక్తి ఉంటుందో
వారిలో నిర్ణయ శక్తి, పరిశీలనా శక్తి, గంబీరతా శక్తి ఇలా స్వతహాగానే ఒకదానితో
అనేకం వచ్చేస్తాయి. సహనశక్తి కూడా అవసరం మరియు మననశక్తి కూడా అవసరం. మనస్సు
కొరకు మననశక్తి, వాచా లేదా కర్మణా కొరకు సహన శక్తి, సహన శక్తి ఉంటే మీరు
మాట్లాడే మాటలు సాధారణంగా ఉండవు. మరియు కర్మ కూడా అదేవిధంగా చేస్తారు. కనుక
రెండు శక్తులు అవసరం. సహనశక్తి గలవారు కార్యంలో సఫలులు కాగలరు. సహనశక్తి లోటుగా
ఉన్న కారణంగా కార్యంలో సఫలత కూడా తక్కువగా వస్తుంది. సహనశక్తి గలవారికి అవ్యక్త
స్థితి, శుద్ద సంకల్పాల స్వరూపం యొక్క స్థితి ఉంటుంది. సహనశీలత గల వారి ముఖంలో
మెరుపు ఉంటుంది. ఎలాంటి సంస్కారం గలవారినైనా తమ యొక్క సహనశక్తి ద్వారా
తాత్కాలికంగా వారి సంస్కారాలను అణచి వేస్తారు. కనుక రెండు శక్తులు కావాలి. స్వ
పురుషార్ధంలో అయితే మనస్సు యొక్క సంకల్పాలు నడిపించటంలో కూడా సహనశక్తి కావాలి.
దీనినే కంట్రోలింగ్ పవర్ అని కూడా అంటారు. సహనశక్తి ఉంటే వ్యర్ధ సంకల్పాలను
కూడా కంట్రోల్ చేయగలరు. ఈ రెండు శక్తుల కొరకు ధ్యాస పెట్టండి. నెంబరువన్
వ్యాపారస్థులుగా అయ్యేటందుకు సహజ పద్ధతి ఏది? స్వయాన్ని బిజీగా ఉంచుకోవటం
ద్వారా నెంబర్ వన్ వ్యాపారస్థులుగా కాగలరు. ఎవరికైతే స్వయాన్ని బిజీగా
ఉంచుకోవటం రాదో వారు వ్యాపారస్తులుగా అయ్యేటందుకు యోగ్యులు కారు.
వ్యాపారస్తులుగా అవ్వటం అంటే ఇక్కడ స్వయం యొక్క సంపాదన మరియు ఇతరుల యొక్క
సంపాదన కూడా చేయించాలి. దీని కొరకు స్వయాన్ని ఒక్క సెకను కూడా తీరికగా
ఉంచుకోకూడదు. మీరు ఏ నెంబరు వ్యాపారస్తులు? ఇక్కడ ఎంతగా అవకాశాన్ని
అందిపుచ్చుకోగలరో అంతగా భవిష్య సింహాసనాన్ని కూడా అందుకోగలరు. ఎవరు
చేయాలనుకుంటే వారు చేయవచ్చు. స్వేచ్చ ఉంది అందరికీ, ఎంత అవకాశం తీసుకుంటారో
అంతగా మీ సింహాసనంపై గట్టి ముద్ర వేసుకుంటారు. పక్కా వ్యాపారస్తులుగా అంటే ఒక్క
సంకల్పం కూడా వ్యర్ధంగా వెళ్ళకూడదు. ప్రతీ సంకల్పంలో సంపాదన ఉండాలి. స్థూల
వ్యాపారస్థులు ఒకొక్క పైసాని ఎంతగా వృద్ధి చేసుకుంటారు! అదేవిధంగా ఇక్కడ కూడా
ఒకొక్క సెకను, ఒకొక్క సంకల్పంలో సంపాదన చేసుకుని చూపించాలి. మొదటి నెంబరు
వ్యాపారస్తులు అని వీరినే అంటారు. బుద్ధికి ఏమి పని ఉంది? ఈ పనిలోనే మీ బుద్ధి
బిజీగా ఉండాలి. మిగతా అన్ని వైపుల సమాప్తి అయిపోయింది కదా! బుద్ధి వెళ్లేందుకు
ఏదైనా మార్గం మిగిలి ఉందా? సమాప్తం చేయలేదా? మీ పాత సంస్కారాల వైపు వెళ్ళటం
కూడా సమాప్తం అయిపోయింది. బుద్ది వెళ్ళే వైపు, మార్గం లేదా గమ్యం అదే కదా!
బుద్ధి వెళ్తే పాత సంస్కారాల వైపు వెళ్తుంది, లేదా మీ శరీర కర్మల ఖాతా వైపు
వెళ్తుంది లేదా మనస్సు వ్యర్థ సంకల్పాల వైపు వెళ్తుంది, ఇవన్నీ సమాప్తం
అయిపోయినవి కదా! శారీరక రోగం ఉంటుంది. దాని గురించి మీకు తెలుస్తుంది, ఇది
ఫలానా వ్యాధి, దీనికి నివారణ ఇది అని. ఎందుకంటే మీ లక్ష్యం ఏమిటంటే శరీరాన్ని
ఎంత సరిగ్గా ఉంచుకుంటారో అంతగా సేవ చేయగలరు, అంతే కానీ దీంట్లో మీ స్వార్థం ఏదీ
లేదు. సేవార్థం నిమిత్తమాత్రంగా భావిస్తున్నారు అనగా ఇది సాక్షి స్థితి కదా!
ఇప్పుడిక కేవలం ఒకే మార్గం మిగిలి ఉంది. అనేక మార్గాలు ఉండేవి, కనుక బుద్ధి
భ్రమించేది, ఇప్పుడు ఆ మార్గాలన్నీ మూసివేయబడ్డాయి. సర్వశక్తివంతుని గవర్మెంట్
సీల్ వేయబడింది. సీల్ వేసింది ఎప్పుడూ తెరవకూడదు. వారు తెరిచే వరకు తెరవకూడదు.
ఈ విధంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. కొందరికి అదృష్టం ఉంటే పరిస్థితులు
కూడా సహాయకారిగా అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా కల్పపూర్వపు అదృష్టం లేదా
డ్రామా యొక్క నిర్ణయం, అంటే స్వ పురుషార్థం కూడా ఉంటుంది. దాంతోపాటు వీటి సహాయం
కూడా లభిస్తుంది. దైవీ పరివారం ద్వారా మరియు బాప్ దాదా ద్వారా సహాయం యొక్క
బహుమతి వీరికి లభిస్తుంది. బాప్ దాదా లేదా దైవీ పరివారం ద్వారా ఏయే రకాల
బహుమతులు మీకు లభించాయో పరిశీలించుకోవాలి. గొప్ప గొప్ప వ్యక్తులకు బహుమతులు
లభిస్తాయి, వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. వాటి ద్వారా తమ దేశం యొక్క
పేరు ప్రసిద్ధి అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సమయానుసారం మీకు ఏవైతే బహుమతులు
లభించాయో వాటి ద్వారా బాప్ దాదా యొక్క మరియు కులం యొక్క పేరు ప్రసిద్ధి
అవుతుంది. మంచిది.
ఆదిలో మీరు సేవకు వెళ్ళినప్పుడు మీలో జ్ఞానశక్తి
తక్కువగా ఉండేది. కానీ సఫలత ఏ శక్తి ఆధారంగా వచ్చింది? త్యాగము మరియు స్నేహము.
బుద్ధి యొక్క సంలగ్నత, రాత్రిపగలు బాబావైపు మరియు యజ్ఞంవైపు ఉండేవి. బాబా మరియు
యజ్ఞం అనే మాటలు ప్రాణప్రదంగా ఉండేవి. ఆ స్నేహమే అందరినీ సహయోగులుగా చేసింది. ఈ
స్నేహశక్తి ద్వారానే సేవాకేంద్రాలు తయారయ్యాయి. ఆది స్థాపనలో ఏ శక్తి సహయోగం
ఇచ్చిందో అంతిమంలో కూడా అదే జరుగుతుంది. మొదట సాకార బాబా యొక్క స్నేహంతోనే
మన్మనాభవగా అయ్యారు, సాకార స్నేహమే సహయోగిగా తయారు చేసింది లేదా త్యాగం
చేయించింది. సంఘటనా శక్తి మరియు స్నేహ శక్తితో చుట్టుముట్టాలి. విదేశాలలో కూడా
సేవ యొక్క సఫలతకి ముఖ్య కారణం స్నేహి మరియు సహయోగి అయిన ప్రభావమే. జ్ఞానానికి
ప్రత్యక్ష రుజువు స్నేహము మరియు సంఘటనా శక్తి, సేవ యొక్క సఫలతకి ముఖ్య ఆధారం
కూడా ఇదే. ఎక్కడ ఉన్నా కానీ మీరు ఇదే ఆలోచించాలి. సందేశం ఇచ్చే కార్యం ఏ రకంగా
చేస్తే త్వరగా పూర్తవుతుందని. ఇప్పుడు అయితే చాలా మిగిలి ఉంది. స్నేహంతో త్యాగం
చేయాలనే ఉల్లాసం వస్తుంది. మీరందరు ఏవిధంగా త్యాగం చేశారు? అణువణువులోనూ స్నేహం
నిండిపోయింది, అందుకే త్యాగం చేయగలిగారు. విదేశీయులకి కూడా వ్రాసి పంపండి.
ఇప్పుడు ఎలాగైతే ఈశ్వరీయ నషా మరియు సంతోషంలో ఉంటూ ముందుకి వెళ్తున్నారో
అదేవిధంగా సదా అదే నషా మరియు సంతోషంలో ఉంటూ సేవలో సఫలులు అవుతారని, విజయీ తిలకం
పెట్టబడే ఉంది. మీ విజయీ తిలకాన్ని సదా చూసుకుంటూ ఉండండి. ఇప్పటి వరకు చేసింది
చూసి బాప్ దాదా కూడా హర్షిస్తున్నారు. కానీ ఇంకా ముందుకి వెళ్ళాలి కదా!
వారసులను తయారు చేయండి. ఇప్పటి వరకు చేసినది అంతా మంచిదే, బాబా
హర్షిస్తున్నారు. కానీ ఓహో ఓహో అనేలాంటి కార్యం ఇప్పుడు చేయాలి. నషా మరియు
సంతోషం స్థిరంగా ఉంది. అందువలనే హర్షితంగా ఉండగలుగుతున్నారు. ఇప్పటి వరకు ఫలితం
చాలా బావుంది, మీ యొక్క కమాండర్ చాలా ధైర్యవంతులు. ఏ కార్యంలోనైనా ఒక్కరైనా
ధైర్యంతో భాద్యతను తీసుకుంటే మిగతా వారందరు తోడు అయిపోతారు. ఈ గ్రూపు వెరైటీ
పుష్పగుచ్చం. అయినా కానీ బావుంది అందువలన శుభాకాంక్షలు.