విశ్వకళ్యాణకారిగా అయ్యేటందుకు ముఖ్య ధారణలు.
ఈనాటి ఈ సంఘటనను ఏ సంఘటన అని అంటారు? గుజరాత్ వారి
యొక్క సంఘటనా? మిమ్మల్ని మీరు గుజరాత్ కి చెందినవారిగా భావించటం లేదు కదా? ఎలా
అయితే తండ్రి బేహద్ యజమానియో అలాగే మీరు ఎక్కడ నిమిత్తం అయినా కానీ మీరు
విశ్వకళ్యాణకారి. దృష్టి వృత్తి మరియు స్మృతిలో కూడా విశ్వ కళ్యాణకారి భావన సదా
ఉంటుందా? లేక గుజరాత్ యొక్క కళ్యాణ భావన ఉంటుందా? గుజరాత్ లో ఉంటూ విశ్వం యొక్క
లక్ష్యం పెట్టుకున్నారు. కదా? బేహద్ సేవలో ఉన్నారు కదా? ఇది కేవలం నిమిత్త
మాత్ర కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిమిత్త మాత్రంగా అభినయిస్తున్నారు, కానీ మీకు
ఏమి నషా ఉంటుంది? మేము విశ్వకళ్యాణకారులం, విశ్వాన్ని పరివర్తన చేసేవాళ్ళం ఇదే
వర్ణన చేస్తున్నారు కదా! ఏదయితే సేవ చేస్తున్నారో లేదా సేవ కోసం ఏవయితే సాధనాలు
తయారు చేస్తున్నారో వాటిలో కూడా విశ్వం అనే పదం వ్రాస్తున్నారు కదా! విశ్వ నవ
నిర్మాణం చేసేవారు మీరు. విశ్వ పరివర్తన అవుతూ ఉంది. ధ్వని ఒకచోట నుండి
వస్తుంది కానీ అది నలువైపులకి వెళ్తుంది. అదేవిధంగా నిమిత్తమాత్రంగా ఒక
స్థానంలో ఉండి ధ్వని వ్యాపిస్తున్నారు. కానీ అది నలువైపులకి వెళ్తుంది కదా!
కనుక విశ్వ కళ్యాణకారి అయ్యేటందుకు ముఖ్యంగా రెండు ధారణలు అవసరం. వీటి ద్వారా
హద్దులో ఉంటూ కూడా బేహద్ కళ్యాణకారిగా కాగలరు. ఒకవేళ ఈ ధారణలు లేకపోతే వారి
యొక్క ధ్వని, వారి యొక్క దృష్టి బేహద్ విశ్వానికి చేరుకోదు. అయితే
విశ్వకళ్యాణకారి అయ్యేటందుకు రెండు ధారణలు ఏవి? మీరు ఏ రెండు ధారణల ఆధారంగా
విశ్వకళ్యాణ కర్తవ్యాన్ని చేస్తున్నారు? విశ్వకళ్యాణం జరగాలని ఏదయితే శుభ భావన
ఉందో దానికి ప్రత్యక్షఫలం తప్పక లభిస్తుంది. భావనకి ఫలం భక్తిమార్గంలో కూడా
లభిస్తుంది. కానీ అది అల్పకాలికమైనది. ఇక్కడ సదాకాలికం, ఆ ప్రత్యక్ష ఫల
ప్రాప్తి కోసం ముఖ్యంగా ఏ రెండు ధారణలు అవసరం? ఆ ధారణలు లేకుండా మీ యొక్క లేదా
సేవ యొక్క ఉన్నతి జరగదు. ఆ ధారణలు చేస్తున్నారు. మరియు చేయాలి కూడా. చేస్తాము
అనే మాట కూడా లేదు. చేయాల్సిందే, ఇదే మాట. ముఖ్యంగా రెండు ధారణలు 1. ఈశ్వరీయ
నషా మరియు 2. దయ. నషా మరియు దయ రెండూ వెనువెంట ఉన్నట్లయితే, సమానంగా
ఉన్నట్లయితే ఈ రెండు గుణాల సమానత ద్వారా ఆత్మిక స్థితి తయారవుతుంది. దీనినే
ఆత్మీయత లేదా ఆత్మిక స్థితి అని అంటారు. నషా కూడా పూర్తిగా ఉండాలి మరియు దయ
కూడా పూర్తిగా ఉండాలి. ఇప్పుడు నషాని వదిలేసి కేవలం దయ చూపిస్తున్నారు లేదా
దయని వదిలేసి కేవలం నషాలో ఉంటున్నారు. కానీ రెండింటి సమానత ద్వారా ఏదయితే
ఆత్మిక స్థితి తయారవుతుందో అది ఇప్పుడు తక్కువగా ఉంది. అందువలన సదా ఏ కర్తవ్యం
చేస్తున్నా లేదా నోటితో ఏ మాట మాట్లాడుతున్నా మొదట పరిశీలించుకోండి - నషా మరియు
దయ రెండూ సమానంగా ఉన్నాయా? రెండింటినీ సమానంగా చేసుకోవటం ద్వారా మీ స్వమానాన్ని
మీరు కాపాడుకోగలరు. సర్వాత్మల నుండి కూడా స్వమానాన్ని పొందగలరు. స్వమానాన్ని
వదిలి గౌరవం కావాలనే కోరిక పెట్టుకుంటే సఫలత రాదు. గౌరవము కావాలనే కోరిక
వదలండి, స్వమానంలో స్థితులవ్వండి. అప్పుడు గౌరవం అనేది నీడ వలె మీ వెనుక
వస్తుంది. ఎలాగైతే భక్తులు తమ ఇష్ట దేవీదేవతల వెనుక అంధశ్రద్ధతో ఎంతగా పరుగులు
తీస్తున్నారు! మరయితే చైతన్య స్వరూపంలో స్వమాన స్థితిలో స్థితులైన ఆత్మల వెనుక
సర్వాత్మలు గౌరవించడానికి వస్తారు, పరుగెడతారు. అది మీ యొక్క స్మృతిచిహ్న
జడచిత్రం, ఆ చిత్రంలో కూడా ముఖ్యంగా ఈ రెండు ధారణలే చూపిస్తారు. శక్తులలో
ఒకవైపు నషా పూర్తి శక్తివంతంగా చూపిస్తారు. మరోవైపు దయను కూడా చూపిస్తారు. ఒకే
చిత్రంలో రెండు భావాలను ప్రకటింప చేస్తారు. ఇలా ఎందుకు తయారైంది? ఎందుకంటే
ప్రత్యక్షంలో మీరు నషా మరియు దయా హృదయ మూర్తిగా అయ్యారు. అందువలన జడ చిత్రాలలో
కూడా అవే ముఖ్య ధారణలు చూపించారు. ఇప్పుడు మీరు సేవార్థం ఉన్నారు. కనుక సేవ
యొక్క ప్రత్యక్షఫలానికి ఆధారం కూడా ఈ రెండు ధారణలే. దయా హృదయులు కూడా తప్పకుండా
అవ్వాలి. కానీ దీని ఆధారంగా మరియు ఎప్పుడు అనేది కూడా చూసుకోవాలి. నషా కూడా
పెట్టుకోవాలి, కానీ ఎలా మరియు ఏ పద్దతితో ప్రత్యక్షం చేయాలి అనేది కూడా
చూసుకోవాలి. నషా అనేది వర్ణిస్తే లేదా చూపిస్తే కనిపించేది కాదు. నషా అనేది
నయనాలలో, ముఖకవళికల్లో తనకు తానుగా సాక్షాత్కారం అవుతుంది. ఒకవేళ ఆ నషాని వర్ణన
చేసి చెప్తే అది నషాకి బదులు అహంగా కనిపిస్తుంది. గర్వం లేదా అహంకారం ఇవి కూడా
క్రోధం యొక్క వంశావళియే. అందువలన గర్వం చూపించకూడదు, నషాలో తప్పకుండా ఉండాలి.
ఎంతెంత దయా హృదయంతో పాటు నషాలో ఉంటారో అంతంతగా గర్వం సమాప్తం అయిపోతుంది. ఎవరు
ఎటువంటి ఆత్మ అయినా కానీ గర్వించేవారు అయినా కానీ నషా మరియు దయా హృదయులుగా
అవ్వటం ద్వారా గర్వంలోకి ఎప్పుడూ రాలేరు. పరిస్థితి అలా వచ్చింది, అలాంటి మాటలు
వారు మాట్లాడరు. కనుక ఇలా చేయవలసి వచ్చింది అని కూడా అనకూడదు. అలా చేయాల్సిందే,
ఇది అలా అవుతూ ఉంటుంది, ఇప్పుడింకా సంపూర్ణం అవ్వలేదు కదా! ఈ మాటలు ఈ సంఘటనలో
ఉండకూడదు. ఎందుకంటే మీరు సేవ కోసం నిమిత్తమై ఉన్నారు. అందువలన ఈ సంఘటనని
మాస్టర్ జ్ఞాన సాగరులు, సేవాధారులు మరియు సఫలతామూర్తుల యొక్క సంఘటన అని అంటారు.
సఫలతామూర్తులు కారణాన్ని చెప్పరు, కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసుకుంటారు.
కారణాన్ని ముందు పెట్టుకోరు. మాస్టర్ ఙ్ఞాన సాగరులు, సఫలతా మూర్తులైన వారు ఏ
కారణంగానైనా సఫలులు అవ్వకపోవటం అనేది జరుగుతుందా? మాస్టర్ జ్ఞాన సాగరులు, సఫలతా
మూర్తులు తమ జ్ఞానశక్తితో కారణాన్ని కూడా నివారణలోకి మార్చుకుంటారు. అప్పుడు
కారణం సమాప్తం అయిపోతుంది. కనుక నిమిత్తంగా అయిన వారు విశేషంగా తమ ప్రతీ
సంకల్పంపై కూడా ధ్యాస పెట్టుకోవాలి. ఎందుకంటే నిమిత్తంగా అయిన ఆత్మల పైన అందరి
దృష్టి ఉంటుంది. నిమిత్తంగా అయిన ఆత్మలే కారణాలు చెప్తూ ఉంటే మిమ్మల్ని చూసి
ముందుకి వెళ్ళే ఇతరాత్మలు మీకు ఏమని చెప్తారు? ఈ కారణంగా మేము రాలేకపోతున్నాము,
ఈ కారణంగా మేము నడవలేకపోతున్నాము అని అంటారు. స్వయమే కారణాలు చెప్పేవారిగా ఉంటే
ఇతరుల యొక్క కారణాలను ఎలా నివారణ చేయగలరు? ఎందుకంటే ప్రజలు చాలా తెలివైనవారిగా
అయిపోయారు. ఇక్కడ మీరు ఎలాగైతే రోజు రోజుకీ ఙ్ఞాన సాగరులు అవుతూ ఉన్నారో అలాగే
ప్రపంచంలో ప్రజలు కూడా విజ్ఞాన శక్తితో, విజ్ఞానంతో జ్ఞాన సాగరులు
అయిపోతున్నారు. వారు మీ సంకల్పాలను కూడా మీ మస్తకంతో, నయనాలతో ,ముఖంతో
పరిశీలించేస్తారు. మీలో ఎలాగైతే జ్ఞాన శక్తి నిండుతూ ఉందో అక్కడ ఆ విజ్ఞాన
శక్తి కూడా తక్కువైనది ఏమి కాదు. రెండింటికీ శక్తి ఉంది. ఒకవేళ నిమిత్తంగా అయిన
వారిలో ఏదైనా బలహీనత ఉంటే అది దాగదు. అందువలన నిమిత్త ఆత్మలైన మీరు మీ సంకల్పం,
వాణి మరియు కర్మపై ఇంతగా విశేష ధ్యాస పెట్టుకోవాలి. ఒకవేళ మీకు అటెన్షన్
లేకపోతే మీ ముఖంలో వారికి టెన్షన్ యొక్క రేఖలు కనిపిస్తాయి. స్థూలంగా రేఖల
ఆధారంగా వారి భాగ్యం ఎలా ఉంటుందో చెప్తూ ఉంటారు కదా! అదేవిధంగా మీపై అటెన్షన్
తక్కువగా ఉంటే మీ ముఖం ద్వారా టెన్షన్ యొక్కరేఖలు కనిపిస్తాయి. మాయ యొక్క జ్ఞాన
సాగరులైన వారు గ్రహించేస్తారు. వారు కూడా తక్కువైన వారు కాదు. ఎప్పుడైనా
నిర్లక్ష్యం కారణంగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోకపోతే వారు ఈ విషయంలో మీ
కంటే తెలివైనవారు. ఎందుకంటే వారి కర్తవ్యమే అది. అందువలన నిమిత్తంగా అయిన వారు
ఇంత బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. ఏ విషయం అయినా కష్టం అనిపిస్తే తప్పకుండా మనలో
ఏదో లోపం ఉన్నట్లే. స్వయంపై నిశ్చయబుద్ధి అవ్వటంలో అప్పుడప్పుడు కొంచెం తక్కువ
అయిపోతున్నారు. బాబాపై 100% నిశ్చయం ఉంది, ఒకవైపు మీరు నిశ్చయబుద్ధిగా ఉన్నారు,
రెండవ వైపు మొత్తం విశ్వంలోని ఆత్మలు ఉన్నారు. అయినా కానీ మీరు అలజడి
అవ్వకూడదు. దైవీ లేదా ఈశ్వరీయ పరివారంలోని ఆత్మల ద్వారా లేదా ప్రపంచంలోని ఆత్మల
ద్వారా ఎవరైనా కానీ మిమ్మల్ని అలజడి చేయటానికి కారణం అయినా కానీ మీపై మీరు
నిశ్చయబుద్ది అవ్వటంలో ఎప్పుడూ లోపం ఉండకూడదు. అందువలన నషాతో పాటు దయ కూడా
ఉండాలి. నిశ్చయబుద్ది అయ్యి కళ్యాణ భావన పెట్టుకోవటం ద్వారా దృష్టి మరియు
వృత్తి రెండూ మారిపోతాయి. ఎటువంటి క్రోధి మనిషి అయినా కానీ, ఎదుర్కునేవారు
అయినా కానీ, నిందించేవారు అయినా కానీ, గ్లాని చేసేవారు అయినా కానీ ప్రతీ ఆత్మ
పట్ల కళ్యాణ భావన పెట్టుకున్నప్పుడు వారి అహంకారం పరివర్తన అయిపోయి దయలోకి
వచ్చేస్తారు. అప్పుడు ఏమి ఫలితం వస్తుంది? అలాంటి వారిని ఎవరైనా కదపగలరా? వారి
యొక్క శుభ కళ్యాణకారి భావన ఎదుటి వారి సంస్కారాలను పరివర్తన చేసే ఫలాన్ని
చూపిస్తుంది. బీజం ఏదైనా కానీ ప్రత్యక్ష ఫలం తప్పక వస్తుంది. కొన్ని వెంటనే
రావు, కొంచెం సమయం పడుతుంది. కనుక ఫలం లభించటం లేదని అధైర్యపడకూడదు. అన్నీ
వెంటనే లభించవు. సహజ వర్షం పడినప్పుడు కొన్ని బీజాలు ఫలిస్తాయి. రోజూ నీరు
వేయటం ద్వారా ఫలం రాదు. అది కూడా డ్రామా యొక్క నిర్ణయం. కనుక ఇప్పుడు అవినాశి
బీజం ఏదయితే మీరు వేస్తున్నారో వాటిలో కొన్నింటికి ప్రత్యక్ష ఫలం కనిపిస్తుంది.
కొన్ని ప్రకృతి ఆపదల తర్వాత ఫలిస్తాయి. డ్రామా యొక్క దృశ్యాలు మారినప్పుడు ఆ
వాయుమండలం వాతావరణం ఆధారంగా ఆ బీజాలు సహజంగా ఫలిస్తాయి. వినాశనం అయితే
అవుతుంది, ఇదయితే గ్యారంటీ. ఫలం రాకుండా ఉండటం అనేది ఉండదు. కానీ కొన్ని త్వరగా
వస్తాయి, కొన్ని తర్వాత వస్తాయి. అందువలన ఎప్పుడు సేవ చేసినా ఏదయితే చేశామో అది
వ్యర్థం అయిపోయింది అని ఎప్పుడూ అనుకోకూడదు. నెంబరువారీగా సమయప్రమాణంగా ఫలం
తప్పక వస్తుంది. కనుక ఇది సఫలతామూర్తుల గ్రూపు. జ్ఞాన సాగరులు, సేవాధారులు ఇది
ముద్ర. మీ త్రిమూర్తి ముద్ర పడింది కదా! కనుక ఇదే స్మృతిలో ఉంచుకుని ప్రతీ సేవ
అనే అడుగులో పదమపదాలను సంపాదించుకుని నడవండి. పరిశీలించుకోండి, ప్రతీ సంకల్పంతో
కోటానుకోట్ల సంపాదన అవుతుందా? ప్రతీ మాటతో, ప్రతీ కర్మతో, ప్రతీ అడుగుతో
కోటానుకోట్ల సంపాదన జమ అయ్యిందా? ఒకవేళ అవ్వకపోతే ఒక అడుగులో కోటానుకోట్ల
సంపాదన అనే పదం ఎక్కడి నుండి వచ్చింది. పద్మం అని కమలపుష్పాన్ని అంటారు. పద్మం
సమానంగా అయ్యి నడవటం ద్వారా ప్రతీ సంకల్పం మరియు ప్రతీ అడుగులో పదమాల సంపాదన
చేసుకోగలరు. ఒక్క సంకల్పం కూడా సంపాదన లేకుండా ఉండదు. ఇప్పుడు ఇంత ధ్యాస
పెట్టుకోవలసిన సమయం. ఒక్క అడుగు కూడా పదమాల సంపాదన లేకుండా ఉండకూడదు.
నిమిత్తమైన గ్రూపు కదా మీరు. కిరీటధారిగా అయితే అవ్వాల్సిందే. మీ భాద్యతా
కిరీటాన్ని ఎంతెంత ధారణ చేస్తారో అంతగా ఇతరుల బాధ్యతా కిరీటాన్ని కూడా ధారణ
చేయగలరు. నిమిత్త టీచర్లు కనుక ఎక్కువగా అందరి దృష్టి మీపై ఉంది. ఎదురుగా ఉన్న
ఉదాహరణ మీరు. అందువలన మీపై ఎక్కువ భాద్యత ఉంది. ఒకొక్కరు అద్దం వలె ఇతరుల ముందు
ఉన్నారు. మీ జ్ఞానయుక్త స్థితి అనే దర్పణంలో స్వ స్వరూపాన్ని సాక్షాత్కారం
చేయించే వారు మీరు. దర్పణం ఎంత శక్తివంతంగా ఉంటే సాక్షాత్కారం అంత స్పష్టంగా
ఉంటుంది. అలాంటి వారి స్మృతి శక్తిశాలిగా ఉంటుంది. ఎదురుగా ఎవరు వచ్చినా కానీ
ప్రతీ ఒక్కరు దర్పణంలో తమ యొక్క స్పష్ట సాక్షాత్కారాన్ని చేసుకోవాలి. అది వారు
ఎప్పుడూ మర్చిపోనివిధంగా ఉండాలి. మీ దేహం సాక్షాత్కరించినప్పుడు మీరు ఎప్పుడూ
మర్చిపోరు కదా! అదేవిధంగా స్వ స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించండి. వారు
ఎప్పుడూ దానిని మర్చిపోకూడదు. శక్తిశాలి దర్పణంగా అయ్యేటందుకు ముఖ్య ధారణ
ఏమిటి? ఎంతెంత స్వయం అర్పణ అవుతారో అంతగా శక్తిశాలి దర్పణంగా అవుతారు. మామూలుగా
అయితే అర్పణమయులే. నైవేద్యం పెట్టేటప్పుడు బాబా ముందు అర్పణ చేస్తారు కదా! దాని
ద్వారా దానిలో శక్తి నిండుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతీ సంకల్పం, ప్రతీ
అడుగు బాబాకి అర్పణ చేయండి. ఏది చేసినా, ఏది ఆలోచించినా అర్పణ చేయండి. బాబా
స్మృతి అనగా బాబా కర్తవ్యం యొక్క స్మృతి. ఎంత అర్పణమయ సంస్కారమో అంత దర్పణం
శక్తిశాలి. ప్రతీ సంకల్పాన్ని నిమిత్తమాత్రంగా చేస్తారు. నిమిత్తంగా అవ్వటం
అనగా అర్పణ. నమ్రచిత్ లు వంగి ఉంటారు. వంగటం అనగా వంగింప చేసుకోవటం,
సంస్కారాలలో కూడా వంగాలి. వారు కూడా కొంచెం వంగాలి కదా అని ఆలోచించకూడదు. మేము
వంగితే అందరూ వంగుతారు. సత్వమైన సేవాధారులు అందరి ముందు వంగుతారు, అప్పుడే సేవ
చేయగలరు. చిన్నవారు ప్రియంగా అనిపిస్తారు. అందువలన స్వయాన్ని గారాబమైన వారిగా
భావించండి. సర్వుల స్నేహిలు, పెద్దవారు అయితే ఎవరైనా ఏమైనా అంటారు. చిన్నవారు
అయితే వదిలేస్తారు. కానీ మీలో ఏ లోపాన్ని పెట్టుకోకూడదు. అందరి కంటే ముందుకి
వెళ్ళాలనే లక్ష్యం తప్పకుండా పెట్టుకోండి. ముందుకి వెళ్తూ, ముందుకి
తీసుకువెళ్ళేవారిని గౌరవించటం వదలకూడదు. ముందుకి తీసుకువెళ్ళిన వారిని మీరు
గౌరవిస్తే అప్పుడు వారు మీకు గౌరవిస్తారు. మిమ్మల్ని చూసి ఇతరులు చేస్తారు.
హ్యాండ్స్ అనగా విశాలబుద్ధి గల వారు. నష్టం దేనిలో ఉంది, లాభం దేనిలో ఉంది
అనేది వీరు అన్ని రకాలుగా చూసుకుంటారు. అందరూ విశాలబుద్ధి, త్రినేత్రి,
త్రికాలదర్శియే కదా! ఏ కర్మ అయినా ముందు చూసుకుని ఆ తర్వాత చేయండి. ఎలా ఇది
జరిగిపోయిందో తెలియదు అనే మాటరాదు. పరిశీలన తక్కువ అయినప్పుడు అలా జరుగుతుంది.
అనుకోలేదు కానీ అయిపోయింది, ఇవి త్రికాలదర్శిల మాట కాదు. మాస్టర్
సర్వశక్తివంతులు కావలసినది చేయలేకపోవటం అనేది ఉండదు. ఇప్పుడు ఈ భాషను సమాప్తి
చేయండి. శక్తులు కదా! శక్తుల యొక్క కర్మ మరియు సంకల్పం సమానంగా ఉంటాయి. సంకల్పం
ఒకటి, కర్మ మరొకటి ఇది శక్తి యొక్క లోపం. మంచిది.