విల్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్.
మీలో విల్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ రెండూ
ఉన్నట్లు అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే మీ పురుషార్ధం కొరకు లేదా ఇతరాత్మల
ఉన్నతి కొరకు ఈ రెండు శక్తులు చాలా అవసరం. ఒకవేళ స్వయంలోనే విల్ పవర్ మరియు
కంట్రోలింగ్ పవర్ లేనట్లయితే ఇతరులను కూడా విల్ అనగా అర్పణ చేసే శక్తి రాదు.
ఇతరుల వ్యర్ధ సంకల్పాలను, వ్యర్ధ నడవడికను కంట్రోల్ చేయలేరు. విల్ పవర్ ఉండదు.
విల్ పవర్ అనగా ఏ సంకల్పం చేసినా, మాట్లాడినా లేదా కర్మ చేసినా అవన్నీ బాబా
ముందు విల్ అనగా అర్పణ చేసేయాలి. భక్తిమార్గంలో ఏది చేసినా, తింటున్నా,
నడుస్తున్నా ఈశ్వరార్పణం అని అంటూంటారు పైపైకి. కానీ ఇక్కడ మీరయితే ఏదయితే
చేస్తున్నామో అదంతా కళ్యాణకారి తండ్రి యొక్క కళ్యాణ కర్తవ్యం కోసం అర్పణ చేశాము
అని భావిస్తారు. ఏదైతే ఉందో దానిని ఎంతెంత అర్పణ చేస్తుంటారో అంతంత అర్పణమయ
దర్పణంగా అవుతారు. ఏదయితే ఎవరికి అర్పణ చేశారో ఆ అర్పణ ద్వారా వారు స్వతహాగానే
అందరికీ సాక్షాత్కారం అవుతారు. కనుక అర్పణ చేసి దర్పణంగా అయ్యే పురుషార్ధం ఇదే.
దీని కోసం విల్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ కూడా కావాలి. అంటే ఎక్కడ కావాలంటే
అక్కడ స్వయాన్ని స్థితులు చేసుకోగలగాలి. అంతేకానీ స్థితిని తయారు చేసుకోవటానికి
కూర్చున్నారు, బాబాని స్మృతి చేయటానికి కూర్చున్నారు, కానీ దానికి బదులు వ్యర్ధ
సంకల్పాలు వస్తున్నాయి, స్థితి అలజడి అవుతుందంటే అది కంట్రోలింగ్ పవర్ కాదు.
ఒక్క సెకను కంటే తక్కువ సమయంలో మీ సంకల్పాలను ఎక్కడ కావాలంటే అక్కడ స్థిరం
చేయగలగాలి. ఒకవేళ స్వయమే స్థితులు కాలేకపోతే ఇతరులను ఆత్మిక స్థితిలో ఎలా
స్థితులు చేయగలరు? అందువలన మీ స్థితి మరియు మీ పదవి రెండింటి స్మృతి సదా
ఉండాలి. అప్పుడే లక్ష్యాన్ని పొందగలరు. కనుక విల్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్
ఈ రెండింటి కోసం ముఖ్యంగా ఏమి గుర్తు పెట్టుకుంటారు? ఈ శక్తుల గురించి
పురుషార్థం ఏమిటంటే. కంట్రోలింగ్ పవర్ కోసం సదా మహాన్ అంతరాన్ని ఎదురుగా
పెట్టుకుంటే స్వతహాగానే ఏదయితే శ్రేష్టంగా ఉంటుందో అటువైపు బుద్ది వెళ్తుంది.
ఏదయితే వ్యర్ధంగా అనుభవం అవుతుందో అటువైపుకి బుద్ధి స్వతహాగానే వెళ్ళదు. కనుక ఏ
కర్మ చేస్తున్నా శుద్ధం మరియు అశుద్ధం, సత్యం మరియు అసత్యం, స్మృతి మరియు
విస్మృతి... ఇలా మహాన్ అంతరాన్ని (తేడా) ఎదురుగా పెట్టుకుంటే స్థితి
బావుంటుంది. ఈ విధంగా వ్యర్ధం మరియు సమర్ధ సంకల్పాలలో గల తేడా ఏమిటి అని ప్రతీ
విషయంలో మహాన్ అంతరాన్ని అనుభవం చేసుకుంటూ వెళ్తే అప్పుడు కంట్రోలింగ్ పవర్
అనేది బుద్ధికి స్వతహాగానే వచ్చేస్తుంది. ఇక రెండవది విల్ పవర్. దీని కోసం మహా
మంత్రం - కంట్రోలింగ్ పవర్ కోసం మహాన్ అంతరం, విల్ పవర్ కోసం మహామంత్రం ఈ
రెండింటినీ గుర్తు పెట్టుకుంటే బుద్దిని కంట్రోల్ చేయటంలో ఎప్పుడూ శ్రమ
అనిపించదు. ఇది సహజమే కదా! మొదట పరిశీలించుకోండి అనగా తేడా ఏమిటో ఆలోచించండి. ఆ
తర్వాత కర్మ చేయండి. తేడాను గుర్తించటం లేదు, నిర్లక్షంగా నడుస్తున్నారు.
అందువలన కంట్రోలింగ్ పవర్ రావటం లేదు. మహామంత్రం ద్వారా విల్ పవర్ అనేది
స్వతహాగానే వచ్చేస్తుంది. ఎందుకంటే మహామంత్రం ఏమిటి? బాబా స్మృతి అనగా బాబాతో,
బాబా యొక్క కర్తవ్యంతో, బాబా యొక్క గుణాలతో సదా మీ బుద్ధిని స్థిరం చేయటం. కనుక
మహామంత్రం బుద్ధిలో ఉండటం ద్వారా, బుద్ధి యొక్క సంబంధం పవర్‌హౌస్
(సర్వశక్తివంతుడు) ఉన్న కారణంగా విలపవర్ (ఆత్మిక శక్తి) వచ్చేస్తుంది. కనుక
మహామంత్రం మరియు మహా అంతరం (తేడా) ఈ రెండు గుర్తు పెట్టుకుంటే రెండు శక్తులు
స్వతహాగానే వచ్చేస్తాయి. మహా మంత్రం మరియు మహా అంతరం ఈ రెండింటినీ బుద్దిలో
పెట్టుకుని జ్ఞాన నేత్రాన్ని ఉపయోగిస్తే సఫలత ఎంతగా లభిస్తుందో చూడండి.
చెప్పాను కదా - హంస యొక్క కర్తవ్యం ఏమిటి? హంస సదా రాళ్ళు మరియు రత్నాలు
రెండింటి తేడాను గుర్తిస్తుంది. అదేవిధంగా బుద్ధిలో సదా మహాన్ అంతరం గుర్తుంటే
మహామంత్రం కూడా సహజంగానే గుర్తొస్తుంది. ఏదైనా వస్తువు శ్రేష్టమైనది అని
తెలుసుకున్నప్పుడు నీచమైన వస్తువులను స్వతహాగానే వదిలేస్తారు. కానీ తేడా
గుర్తండటం లేదు, కనుక మంత్రం కూడా మర్చిపోతున్నారు మరియు జ్ఞానం యొక్క యంత్రం
ఏదయితే లభించిందో దానిని కూడా పూర్తిగా సఫలం చేసుకోలేకపోతున్నారు. కనుక ఇప్పుడు
ఏమి చేస్తారు? కేవలం రెండు మాటలు గుర్తుంచుకోండి. హంస అయ్యి తేడాను
గుర్తించండి. ఏవిధంగా అయితే బాప్ దాదాతో ముఖ్యంగా మూడు సంబంధాలు ఉన్నాయో సర్వ
సంబంధాలు ఉండాలి, కానీ ముఖ్యమైనవి మూడు సంబంధాలు, అదేవిధంగా రోజంతటిలో మీ యొక్క
ముఖ్యమైన మూడు రూపాలు మీకు గుర్తుండాలి. ఎలాగైతే బాల్యావస్థ, యవ్వనం మరియు
వృద్ధ అవస్థ ఉంటాయో అలాగే రోజంతటిలో ఏ మూడు రూపాలు గుర్తుంచుకుంటారు? దాని
ద్వారా స్మృతి కూడా సహజంగా ఉండాలి మరియు సఫలత కూడా ఎక్కువ రావాలి. బాబా యొక్క
మూడు రూపాలను ఎలా అయితే వర్ణిస్తారో అదేవిధంగా మీ యొక్క మూడు రూపాలు ఏవి?
ప్రొద్దు పొద్దునే అనగా అమృతవేళ లేచినప్పుడు స్మృతియాత్రలో ఉంటారు లేదా ఆత్మిక
సంభాషణ చేస్తారు. ఆ సమయం యొక్క మీ రూపం ఏమిటి? బాబాకి పిల్లలు మరియు యజమానులు.
ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు పిల్లల రూపం గుర్తుంటుంది. ఎప్పుడైతే స్మృతియాత్ర
యొక్క అనుభవం అవుతుందో అప్పుడు యజమాని స్థితి యొక్క స్మృతి ఉంటుంది. కనుక
అమృతవేళ పిల్లలు మరియు యజమానుల యొక్క రూపం. ఆ తర్వాత ఏ రూపం? ఈశ్వరీయ
విధ్యార్ధి రూపం (గాడ్లీ స్టూడెంట్ లైఫ్) ఆ తర్వాత సేవాధారి రూపం. ఈ మూడు
రూపాలను రోజంతటిలో ధారణ చేసి కర్తవ్యం చేస్తూ వెళ్తున్నారా? ఇవి మూడు రూపాలు.
ఇక రాత్రి ఏ రూపం ఉంటుంది? అంతిమంలో రాత్రి నిద్రించే సమయంలో ఏ స్థితి ఉంటుంది?
స్వయాన్ని పరిశీలించుకునే రూపం మరియు వెనువెంట వాణీకి అతీతంగా వెళ్ళే స్థితి
కూడా ఉంటుంది. ఆ స్థితిలో స్థితులై ఒక రోజుని సమాప్తం చేస్తున్నారు, ఆ తర్వాత
మరుసటి రోజు ప్రారంభమవుతుంది. ఆ సమయంలో స్థితి ఎలా ఉండాలంటే నిద్రలో ఈ ప్రపంచం
యొక్క ఏ విషయం కానీ, ఏ ధ్వని కానీ, ఏ రకమైన ఆకర్షణ ఎలాగైతే ఉండదో, మంచిగా
నిద్రపోయినప్పుడు చక్కగా ఉంటారు, కలలు రావటం అనేది వేరే విషయం. నిద్రపోయే ముందు
ఇలాంటి స్థితిని తయారు చేసుకుని ఆ తర్వాత నిద్రపోవాలి. అంతిమంలో ఆత్మ ఏ
సంస్కారాన్ని అయితే తీసుకువెళ్తుందో అవే సంస్కారాలు నిండుతాయి. ఆ తర్వాత అవి
బయటికి వస్తాయి. అదేవిధంగా ఇక్కడ కూడా రోజుని సమాప్తి చేస్తున్నారు, అలాంటి
సమయంలో మీ సంస్కారం అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. ఈ సంస్కారాలతో నిద్రపోవటం
ద్వారా మరుసటి రోజు కూడా ఆ సంస్కారాలు సహాయం చేస్తాయి. అందువలన రాత్రి సమయంలో
అంటే రోజుని సమాప్తి చేసేటప్పుడు స్మృతి అనే అగ్నిలో లేదా స్మృతి శక్తితో పాత
ఖాతాను సమాప్తం అనగా పూర్తి చేసేయాలి. లెక్క పూర్తి చేసేయాలి. వ్యాపారస్థులు
లెక్కలఖాతాను పూర్తి చేసుకోకపోతే ఖాతా పెరిగిపోతుంది మరియు రుణగ్రస్తులు కూడా
అయిపోతారు. అదేవిధంగా రోజంతటిలో చేసిన కర్మలఖాతాను మరియు సంకల్పాల ఖాతాను
సమాప్తం చేసుకోండి. మరుసటి రోజు కోసం అప్పుగా ఏదీ ఉంచుకోకండి. ఒకవేళ అప్పు
రూపంలో ఉంచుకున్నట్లయితే అదే మీ బుద్ధిని బలహీనం చేసేస్తుంది. రోజూ మీ లెక్కని
సమాప్తం చేసుకుని కొత్త రోజు కొత్త స్మృతిలో ఉండాలి. మీ కర్మలు మరియు సంకల్పాల
యొక్క ఖాతా క్లియర్ గా (స్పష్టంగా) ఉంచుకుంటే సంపూర్ణంగా మరియు సఫలతా మూర్తిగా
అయిపోతారు. ఒకవేళ మీ లెక్కను పూర్తి చేసుకోలేకపోతే ఇతరుల యొక్క కర్మ బంధనలు
లేదా ఇతరుల యొక్క కర్మలఖాతాను ఎలా పూర్తి చేయగలరు? అందువలన రోజూ మీ రిజిస్టర్
ని స్వచ్చం చేసుకోవాలి. ఏదయితే జరిగిందో దానిని యోగాగ్నిలో భస్మం చేసుకోవాలి.
ముళ్ళుని కాల్చేసి నామరూపాలు లేకుండా చేసేస్తారు కదా! అదేవిధంగా మీ
జ్ఞానశక్తితో మరియు యోగశక్తితో విల్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ తో మీ
రిజిస్టర్ ని రోజూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఏదీ మిగిలి ఉండకూడదు. ఒక రోజులో చేసిన
వ్యర్థ సంకల్పాలు లేదా వ్యర్ధ కర్మల యొక్క రేఖ రెండవ రోజు కనిపించకూడదు. అప్పు
మిగలకూడదు, శేషం మిగలకూడదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది బిందువు... ఇలా
రిజిస్టర్ ని స్వచ్చంగా పెట్టుకునేవారు సహజంగా సఫలతా మూర్తి కాగలరు. అర్ధమైందా?
రోజంతా కూడా పరిశీలకులుగా అవ్వాలి. స్వదర్శనచక్రం వలె ఇది ఒక రోజు యొక్క చక్రం.
ఆదిలో డ్రిల్ చేయించేవారు. ఒక చక్రం నుండి మరొక చక్రంలోకి రావటం మరియు అన్ని
చక్రాల నుండి బయటకి రావటం. ఇది బేహద్ 5000 సంవత్సరాల చక్రం. దాంట్లో ఇవన్నీ
చిన్న చిన్న చక్రాలు. అందువలన మీ దినచర్య యొక్క చక్రం క్లియర్‌గా ఉండాలి.
అయోమయంగా ఉండకూడదు అప్పుడు చక్రవర్తి రాజాగా అవుతారు. రిజిష్టర్ ని స్వచ్చంగా
చేసుకోవటం వస్తుంది కదా! ఈరోజుల్లో విజ్ఞానం వారు ఎలాంటి ఆవిష్కరణలు చేశారంటే
రాసినదంతా పోతుంది, తెలియనే తెలియకుండా. అదేవిధంగా శాంతిశక్తి ద్వారా మీ
రిజిష్టర్ ని రోజూ స్వచ్చం చేసుకోలేరా? అందువలనే చెప్పాను - బాబాకి ప్రియంగా
లేదా ప్రభువుకి ప్రియంగా మరియు దైవీలోకానికి ప్రియంగా మరియు లోక ప్రియంగా ఎవరు
కాగలరు? సత్యత మరియు స్వచ్చత ఉన్నవారే ప్రభువుకి ప్రియంగా అవుతారు, లోక
ప్రియంగా అవుతారు మరియు స్వయానికి స్వయం కూడా ప్రియంగా అవుతారు. సత్యత,
స్వచ్చతని అందరూ ఇష్టపడతారు. రిజిష్టర్ ని స్వచ్ఛంగా ఉంచుకోవటమే స్వచ్చత కదా!
సత్యమైన మనస్సుకి యజమాని రాజీ అయిపోతారు. అనగా ధైర్యం మరియు స్మృతి ద్వారా బాబా
నుండి సహాయం లభిస్తుంది. మంచిది.