సింపుల్‌గా (సాధారణంగా) అవ్వండి, శాంపిల్‌గా
(ఉదాహరణగా) అవ్వండి.
ఈనాటి ఈ సంఘటనను ఏ సంఘటన అని అంటారు? కర్తవ్యం
అనుసారంగా ఈ సంఘటనకి పేరు ఏమిటి? (ప్రతీ ఒక్కరు చెప్పారు) ఎవరైతే ఇలా పేర్లు
చెప్పారో అవన్నీ మీ యొక్క ప్రత్యక్ష కర్తవ్యంగా భావించి చెప్పారా? ప్రత్యక్షంగా
ఆవిధంగా నడుస్తున్నారంటే మీరు ఏమయ్యారు? సుపుత్రులు మరియు ఉదాహరణ మూర్తులు.
అభ్యాసంలో ఉన్నట్లయితే ఉదాహరణ మూర్తులు అని అనరు. ప్రత్యక్ష కర్మ చేస్తేనే
సుపుత్రులు మరియు ఉదాహరణ మూర్తులు, రెండూ కూడా. ఈ గ్రూపు సింపుల్ మరియు
శాంపిల్. సింపుల్ గా అయ్యి శాంపిల్ చూపించేవారు. సాధారణత అనేది కేవలం వస్త్రాలు
మొదలైనవాటిలోనే కాదు, అన్ని విషయాలలో కూడా సాధారణంగా అయ్యి ఉదాహరణగా అయ్యేవారు.
ఏ వస్తువు అయినా సాధారణంగా మరియు స్వచ్ఛంగా ఉంటే అందరినీ ఆకర్షిస్తుంది కదా!
అదేవిధంగా మనస్సులో ఏవైతే సంకల్పాలు ఉంటాయో వాటిలో, సంబంధంలో, వ్యవహారంలో మరియు
ఉండటంలో కూడా అన్నింటిలో కూడా సాధారణంగా మరియు స్వచ్ఛంగా ఉండేవారు ఉదాహరణ అయ్యి
అందరినీ తమ వైపు ఆకర్షితం చేసుకుంటారు. సంకల్పంలో లేదా సంబంధంలో సాధారణంగా
ఉండకపోతే ఏమవుతుంది? సింపుల్ అనగా సాధారణత, సాధారణతలో మహానత. ఎలాగైతే తండ్రి
సాకార సృష్టిలో సాధారణంగా ఉంటూ మీ అందరికీ ఉదాహరణగా అయ్యారు. అతి సాధారణతయే అతి
మహానతను ప్రసిద్ది చేస్తుంది. కనుక సింపుల్ అనగా సాధారణంగా ఉండకపోతే ప్రాబ్లమ్
అనగా సమస్యగా అవుతారు. సంకల్పాలలో కూడా సమస్యలో ఉంటారు. ఉండటంలో సాధారణంగా
ఉండకపోతే ఇతరులకు లేదా మీ కోసం ఏదొక సమస్యగా అవుతారు. ఇలా సమస్యగా అవ్వాలా లేక
సాధారణంగా అవ్వాలా? సాధారణంగా అవ్వాలి. కనుక మనస్సులో కూడా సాధారణంగా ఉండాలి.
ఒకవేళ మనస్సులోనైనా ఏదైనా అలజడి అనగా సమస్య ఉంటే వారిని సింపుల్ అని అంటారా?
చూడండి, గాంధీజీని సింపుల్ అని అంటారు. అలా సింపుల్ గా అయ్యి ఒక శాంపిల్
చూపించారు కదా! సాధారణ నడవడికయే మహానతకి గుర్తు. అది హద్దులోని పాత్ర. కానీ
ఇక్కడ బేహద్ తండ్రి యొక్క పిల్లలు కనుక బేహద్ పాత్ర అభినయించాలి. అంటే మీరు
విశ్వానికి నిమిత్తులు కదా! విశ్వం అనంతమైనది, తండ్రి అనంతమైనవారు, పాత్ర
అభినయించే మీరు కూడా బేహద్ స్థితిలో స్థితులై పాత్ర అభినయించాలి. అప్పుడు ఆ
పాత్ర అందరినీ ఆకర్షిస్తుంది. కనుక ఆకర్షణామూర్తి అయ్యేటందుకు ఏమి చేయాలి?
సాధారణంగా అవ్వాలి. ఇక్కడ దైవీ పరివారంలో కూడా ఒకవేళ ఎవరైనా సింపుల్ గా లేకపోతే
సమస్యగా అవుతారు. అప్పుడు ఫలితం ఏమి వస్తుంది? స్నేహము మరియు సహయోగం నుండి
వంచితులుగా ఉండిపోతారు. ఎవరైతే సాధారణంగా అనగా సింపుల్ గా ఉంటారో వారి గురించి
అందరికీ స్నేహం మరియు సహయోగం ఇవ్వాలనే శుభ భావన ఉంటుంది. కనుక సర్వులకి సహయోగం
ఇచ్చేటందుకు, సర్వుల నుండి సహయోగం పొందేటందుకు సాధారణంగా అవ్వటం చాలా అవసరం.
మీకు ఏ సమస్యా లేదు కదా! అదేవిధంగా మీరు సమస్యగా అవ్వటం లేదు కదా? లౌకిక
పరివారంలో లేదా వ్యవహారంలో లేదా దైవీ పరివారంలో ఎప్పుడూ కూడా మీలో సమస్య
ఉండకూడదు, మీరు ఎవరికీ సమస్యగా కాకూడదు. ఒకవేళ మీరు సమస్యగా అయ్యారంటే సేవ
తీసుకునేవారిగా అయిపోతారు. మీరు ఈశ్వరీయ సేవాధారి, సేవాధారి అనగా సేవ చేసేవారు
కానీ సేవ తీసుకునేవారు కాదు. సేవ తీసుకునేవారిగా అయ్యారంటే మీ పేరు అనుసారంగా
మీ కర్తవ్యం లేనట్లే కదా! ఈశ్వరీయ సేవాధారులు ఎవరి నుండి సేవ తీసుకోరు. సేవ
చేస్తారు. ఎందుకంటే దాత యొక్క పిల్లలు కదా! బాబా ఏమైనా తీసుకుంటారా? ఆయన దాత
కదా! ఒకవేళ సమస్యగా అయ్యి సేవ తీసుకుంటూ ఉన్నట్లయితే వారు దాత పిల్లలా? ఏ
రకంగానైనా అదనపు సేవ మీ కోసం తీసుకుంటూ ఉన్నట్లయితే మేమే దాత, వరదాత యొక్క
పిల్లలం అనే నషా ఎప్పుడూ కూడా ఉండదు. ఇది ప్రవృత్తి వారి గ్రూపుయా లేక నివృత్తి
వారి గ్రూపుయా? లౌకిక ప్రవృత్తి అయితే సమాప్తం అయిపోయింది కదా! లౌకిక
ప్రవృత్తిని ఈశ్వరీయ ప్రవృత్తిలోకి పరివర్తన చేశారా? ఎంత వరకు చేయరో అంత వరకు
అలౌకిక స్థితిలో ఏకరసంగా ఉండలేరు. అందువలనే చెప్పాను - మీ నామ, రూప, గుణ మరియు
కర్తవ్యాలను సదా గుర్తుంచుకుని ప్రవృత్తిలో ఉండండి, దాని ద్వారా లౌకిక
ప్రవృత్తి పరివర్తన అవుతుంది. స్వయాన్ని సదా సేవాధారిగా భావించటం ద్వారా
ఎప్పుడూ కూడా గర్వం అనేది రాదు. సేవాధారి సదా నమ్రచిత్తులుగా నిర్మాణంగా
ఉంటారు. అలాంటి వారు తమ ఇంటిని కూడా ఇల్లుగా కాదు, సేవాస్థానంగా భావిస్తారు.
సేవాధారికి ముఖ్య గుణం - త్యాగం. త్యాగం లేకపోతే సేవ కూడా జరగదు. త్యాగం
ద్వారానే తపస్విమూర్తిగా కూడా అవుతారు. సేవాధారి యొక్క కర్తవ్యం - సదా సేవలో
ఉండటం. మనసా సేవలోనో, వాచా సేవలోనో, కర్మణా సేవలోనో ఏదైనా కానీ సేవాధారి అనగా
నిరంతరం సేవలో తత్పరులై ఉండేవారు. అలాంటి వారు ఎప్పుడూ కూడా సేవ అనేది తమ నుండి
వేరుగా ఉన్నట్లు భావించరు. నిరంతరం సేవ యొక్క ధ్యాసయే ఉంటుంది. అలాంటి వారినే
సేవాధారి అని అంటారు. ఈ విధంగా స్వయాన్ని సేవాధారిగా భావించండి మరియు ఇంటిని
సేవాస్థానంగా భావించి ఉండండి. త్యాగవృత్తి కలిగి తపస్విమూర్తులై ఉండండి.
బుద్ధిలో నిరంతరం సేవ గురించి సంలగ్నత ఉండాలి. అప్పుడు లౌకిక ప్రవృత్తి
మారిపోయి ఈశ్వరీయ ప్రవృత్తిగా అవ్వదా? మరయితే ఈ గ్రూపు ఏమి నవీనత చూపిస్తారు?
మరే గ్రూపు చూపించని నవీనత చూపించాలి. ఏదో ఒక కొత్తదనాన్ని తప్పకుండా
తీసుకురావాలి. విశేష భట్టికీ వచ్చారు కనుక స్వయంలో పరివర్తన కూడా విశేషంగా
ఉండాలి. మామూలుగా నడుస్తూ తిరుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు విశేషంగా ఏదొక నవీనత
తీసుకువచ్చి విశేషాత్మలలో మీ పేరుని నమోదు చేయించుకుని వెళ్ళాలి. బాప్ దాదా
దగ్గర ఎన్ని రకాల జాబితాలు ఉన్నాయో తెలుసా? మీ పేరు ఏ జాబితాలో ఉందో తెలుసా? మీ
పేరు విశేషాత్మలలో ఉండాలి. దీని కోసం ప్రయత్నించండి. విశేష ఆత్మలుగా ఎప్పుడు
అవుతారు? విశేష కార్యం చేసినప్పుడు లేదా విశేషత చూపించినప్పుడు. కనుక విశేష
ఆత్మగా అయ్యే వెళ్ళాలి. మరజీవగా అయ్యారా లేక అయ్యేటందుకు వచ్చారా? మరజీవగా
అయ్యి బ్రహ్మాకుమార్ గా అయ్యారా లేక ఇప్పుడు అవుతారా? చనిపోయి జన్మించారు,
అప్పుడే బ్రహ్మాకుమారులు అని అంటున్నారు. చనిపోయి కొత్త జన్మ తీసుకోవటం, దానినే
మరజీవ అని అంటారు. జన్మ తీసుకోక మునుపు బ్రహ్మాకుమారులుగా ఏవిధంగా అయ్యారు?
పిల్లలే అధికారులు కానీ సుపుత్రులై ఉదాహరణ చూపించాలి. కనుక బ్రహ్మాకుమారులుగా
అయ్యారంటే మరజీవగా అయిపోయారు. మరజీవగా అయిపోయాం అని స్మృతిలో ఉంచుకుంటే ఈ శరీరం
కూడా మీది కాదు. ఈ శరీరం బాబా ఈశ్వరీయ సేవ కోసం ఇచ్చారు. మీరయితే చనిపోయారు. ఈ
పాత శరీరం కేవలం ఈశ్వరీయ సేవ కోసమే లభించింది. ఈవిధంగా భావించి నడవటం ద్వారా ఈ
శరీరాన్ని కూడా ఒక తాకట్టు వస్తువుగా భావిస్తారు. తాకట్టు వస్తువుపై నాది అనే
భావం ఉండదు కదా! మమకారం ఉండదు కదా! అదేవిధంగా ఈ శరీరాన్ని కూడా తాకట్టు
వస్తువుగా భావించండి. అప్పుడు దేహంపై మమకారం కూడా సమాప్తం అయిపోతుంది.
నిమిత్తమాత్రంగా దేహంలో ఉండటం ద్వారా, దేహాన్ని తాకట్టు వస్తువుగా భావించటం
ద్వారా మమత్వం తగ్గిపోతుంది. శరీరం కేవలం ఈశ్వరీయ సేవ కోసమే తాకట్టు వస్తువుగా
మనకి లభించింది. తాకట్టు వస్తువుని చూసి ఎవరు తాకట్టుగా ఇచ్చారో వారు గుర్తు
వస్తారు కదా! ఆత్మిక తండ్రి తాకట్టుగా ఇచ్చారు. మరయితే ఆత్మిక తండ్రి గుర్తు
ఉంటున్నారా? తాకట్టు వస్తువుగా భావించటం ద్వారా ఆత్మీయత ఉంటుంది. ఆత్మీయత
ద్వారా బుద్ధికి అలసట ఉండదు. తాకట్టు వస్తువుని ద్రోహం చేస్తే ఆత్మీయతకి బదులు
అలజడి వస్తుంది, భయం వస్తుంది. కనుక ఈ శరీరం ఈశ్వరీయ సేవార్థం లభించింది. ఇది
తాకట్టు వస్తువుగా భావించటం ద్వారా స్వతహాగానే ఆత్మీయత యొక్క స్థితి వస్తుంది.
ఇది సహజ ఉపాయం కదా! ఇప్పుడిక సహజ యోగిగా అవ్వగలరు కదా! నిరంతరం ఆత్మీయత యొక్క
స్థితిలో స్థితులై ఉండండి. ఈ నవీనత చూపించండి. మిమ్మల్ని చూసి అందరూ అనుభవం
చేసుకోవాలి - వీరు ఒక ఉదాహరణ అయ్యి వచ్చారని, ఇతరులకు కూడా స్మృతియాత్రను
సహజంగా చేసేటందుకు ఉదాహరణ అయ్యి వెళ్ళాలి. ఈ గ్రూపు ఉదాహరణగా అయ్యి వెళ్తారు
కదా! ఒకొక్క స్థానానికి ఒకొక్క ఉదాహరణ వెళ్తే అది చాలా సింపుల్ విషయం కదా!
అయితే మీ పేరు ఏమిటి? సేవాధారి. సేవాధారులే కానీ సేవ ఎలా చేయాలంటే
ప్రత్యక్షఫలాన్ని ప్రాప్తింప చేసుకోవాలి. ఏమి స్లోగన్ గుర్తుంచుకుంటారు? మీ
ఆత్మీయత యొక్క స్థితిని ప్రత్యక్షం చేసి ప్రతీ ఆత్మకి ప్రత్యక్ష ఫలాన్ని
ఇప్పించేవారు. ఎంతగా మీ ఆత్మీయత యొక్క స్థితిని పక్కాగా చేసుకుంటారో అంతగా
ప్రత్యక్షఫలం ఇవ్వగలరు. ఒకవేళ ఆత్మీయత యొక్క స్థితి ప్రత్యక్షంగా చూపించకపోతే
ప్రత్యక్ష ఫలాన్ని చూపించలేరు. కనుక ప్రత్యక్ష ఫలాన్ని చూపించేటందుకు మీ
ఆత్మీయత యొక్క స్థితిని ప్రత్యక్షం చేయండి. స్లోగన్ అర్ధమైందా? మీపై ఏ ముద్ర
వేసుకున్నారు? సేవాధారిగా భావిస్తున్నారు కదా! మనస్సులో కూడా సేవ. ఈ గ్రూపు
ముఖ్యంగా ఏది త్యాగం చేస్తారు? ఆ త్యాగం ద్వారా తపస్విగా అవ్వగలగాలి. మీ
ప్రత్యక్ష దినచర్యలో ఎక్కువగా ఏది విఘ్న రూపంగా అవుతుంది? ఒక మాటలో చెప్పాలంటే
గర్వం. అందువలన ఆత్మీయత రావటం లేదు. ప్రవృత్తిలో ఉంటూ గర్వంగా ఉంటారు, నేను
రచయితను అని, అలాగే వ్యవహారం చేస్తూ కూడా వ్యవహార సంబంధ గర్వం చూపిస్తూ ఉంటారు.
సంబంధాలలో కూడా ముఖ్యంగా గర్వాన్ని త్యాగం చేయాలి. సేవాధారులు గర్వం చూపించరు.
అందువలన గర్వాన్ని త్యాగం చేయండి. ఇది ముఖ్యమైన త్యాగం. త్యాగం చేసేటందుకు
ధైర్యం ఉంది కదా! ఏవయితే ప్రతిజ్ఞలు చేస్తున్నారో ఒకొక్క ప్రతిజ్ఞపై అవినాశి
ముద్రవేయండి. ఈ ముద్రవేయటం లేని కారణంగా ఆ ప్రతిజ్ఞ అల్పకాలికంగానే ఉంటుంది.
కొంతమంది ఫలితం ఏమి కనిపిస్తుందంటే ఇక్కడ ప్రతిజ్ఞ చేసి వెళ్తారు. అక్కడికి
వెళ్ళిన తర్వాత విలపిస్తూ ఉంటారు - ఏమి చేయము, ఏమైపోయిందో, సహాయం చేయండి,
అనుకోలేదు కానీ ఈ కారణంగా ఇలా అయిపోయింది. ఇలా యోగికి బదులు వియోగి అయిపోయి
విలపిస్తారు. ఇప్పుడు నిరంతర యోగి అవ్వాలి. విలాపాల యొక్క వియోగిగా అవ్వకూడదు.
ఈ గ్రూపు ఇది ప్రత్యక్షంగా చేసి చూపించాలి. ఎన్ని విషయాలు సహించవలసి వచ్చినా,
ఎదుర్కోవలసి వచ్చినా బాబా ఏది చెప్పారో అది చేసి చూపిస్తాము. విజయీగా అయ్యి
చూపిస్తాము, సహాయకారులు అవుతాము, శుభ చింతకులుగా అవుతాము అని ప్రతిజ్ఞ చేయండి.
ఒకరికొకరు సహయోగిగా అయితే అందరిపై ప్రభావం వేయగలరు. మీరు అందరు కలిసి మాయని
ముట్టడించలేరా? పాండవులు మాయని ముట్టడించలేరా? పరస్పరంలో శుభ చింతకులుగా
సహయోగిగా అవుతూ ఉన్నట్లయితే మీ మధ్యలోకి మాయకి వచ్చే ధైర్యం ఉండదు. ఇదే సహయోగ
శక్తి, సహయోగ శక్తికి గుర్తు. ఈ సంఘటన. సంఘటన యొక్క సహయోగ శక్తికి ప్రత్యక్ష
రూపం చూపించాలి. మంచిది.