27.07.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బుద్ది రూపి నేత్రాన్ని స్పష్టంగా మరియు శక్తిశాలిగా తయారు చేసుకోండి.

ఈరోజు భట్టీలోని చదువు యొక్క పేపర్ ని వ్రాసి ఇచ్చారు. రేపు ఏ పరీక్ష మొదలవుతుందో తెలుసా? ప్రత్యక్ష పరీక్షలో ఏ ప్రశ్న వస్తుందో తెలుసా? ఏయే రకాల ప్రశ్నలు వస్తాయి? కల్పపూర్వం అత్మలైన మన ద్వారా ఏమేమి జరిగాయో అవి స్మృతిలోకి వస్తున్నాయా? (వస్తున్నాయి) మీకు గుర్తు వస్తున్నాయంటే ఏ ప్రశ్నలు వస్తాయి, అవి కూడా గుర్తు రావటం లేదా? మాయ ఎదుర్కుంటుంది. కానీ ఏయే రూపాల్లో ఎదుర్కుంటుంది? అవి తెలుసా, తెలియదా? మాస్టర్ జ్ఞాన సాగరులై వెళ్తున్నారు కదా! మాస్టర్ జ్ఞాన సాగరులకి అన్నీ ముందుగానే తెలిసిపోతాయి. వైజ్ఞానికులు తమ యంత్రాల ద్వారా తుఫాను వస్తుంది లేదా వర్షం వస్తుంది లేదా భూకంపం వస్తుందని ముందుగానే తెలుసుకోగలుగుతున్నారు కదా! అదేవిధంగా మీరందరు కూడా మాస్టర్ జ్ఞాన సాగరులు. కనుక ముందుగానే మీ బుద్ది బలం ద్వారా అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నారా? రోజురోజుకీ ఎంతెంతగా స్మృతి యొక్క సమర్ధత మీలో వస్తుందో అనగా మీ ఆత్మ రూపి నేత్రం శక్తివంతంగా తయారు చేసుకుంటూ ఉంటారో, స్పష్టంగా తయారు చేసుకుంటూ ఉంటారో అంతంతగా ఏ విఘ్నం అయినా రాబోతున్నప్పుడు ముందుగానే మీకు ఈరోజు ఏదో పరీక్ష రానున్నదని అనుభవం అయిపోతుంది. ఎంత ముందుగా మీకు తెలిసిపోతుందో అంతగా ముందు నుండే విఘ్నాలలో సఫలత పొందగలుగుతారు. ప్రభుత్వం వారికి శత్రువు రానున్నాడని ముందుగానే తెలిసిపోతుంది. కనుక తయారుగా ఉంటారు. అందువలన విజయీ అవుతారు. అకస్మాత్తుగా ఆక్రమిస్తే విజయీగా కాలేరు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు త్రికాలదర్శులు అనగా కల్పపూర్వపు విషయం, నిన్నటి విషయం అంత స్పష్టంగా తెలిసిపోతుంది. అంతేకాదు మీరు జ్ఞాన సాగరులు, మీ బుద్ధిరూపి నేత్రం శక్తివంతంగా మరియు స్పష్టంగా ఉన్న కారణంగా ముందుగానే ఆ విషయాలను మీరు గ్రహించేస్తారు. ఇలా మూడు రకాలుగా మీకు ధ్యాస ఉన్నట్లయితే లేదా మూడు రకాల స్థితి మీకు ఉన్నట్లయితే రాబోయే విఘ్నాలను ముందుగానే గ్రహించలేరా? ముందుగానే గ్రహించినప్పుడు లేదా పరిశీలించినప్పుడు ఎప్పుడూ కూడా ఓడిపోరు, సదా విజయీ అవుతారు. నేత్రం సరిగ్గా లేని కారణంగా లేదా సి.ఐ.డిల చెకింగ్ సరిగ్గా లేని కారణంగా అప్పుడప్పుడు ప్రభుత్వం కూడా మోసపోతుంది. అదేవిధంగా సదా మీ బుద్ధి రూపి నేత్రాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ నేత్రం యదార్థ విధిగా పని చేస్తుందా అని చూసుకుంటూ ఉండాలి. సి.ఐ.డి అనగా మరొక అర్థం ఏమిటి? పరిశీలనయే సి.ఐ.డి. కనుక పరిశీలన అనే సి.ఐ.డి తెలివిగా ఉంటే ఎప్పుడూ శత్రువుతో ఓడిపోరు. కనుక ఇప్పుడు కూడా ప్రయత్నించండి. మీకు ముందుగానే విఘ్నం తెలిసేలా! ప్రకృతి ముందుగానే కొన్ని సూచనలు చేస్తుంది. అవి తెలిసిన వారు ప్రకృతి యొక్క యుద్ధం నుండి రక్షించుకోగలరు. ఒకవేళ తెలియకపోతే ప్రకృతి యొక్క రకరకాల చిన్న చిన్న ఘటనలు దు:ఖాన్ని ఇస్తాయి, లేదా రోగం రావటానికి కారణమవుతాయి. అప్పుడు మీరు వాటికి ఆధీనం అయిపోతారు. దీనంతటికీ కారణం ఏమిటి? మీరు గ్రహించలేదు, అనగా మీకు ఆ తెలివి లేదు. ఎంతెంత స్మృతిశక్తి అనగా శాంతిశక్తి మీలో నిండుతూ ఉంటుందో అంతంతగా ఈరోజు ఏదో జరగనున్నది అని ముందుగానే మీకు తెలిసిపోతుంది. రోజురోజుకీ అమూల్యమైన మహారథీలు ఎవరైతే ఉన్నారో, వారు సదా ధ్యాసలో, పరిశీలనలో ఉంటారు. కనుక వారు ఇవన్నీ అనుభవం చేసుకుని, ముందుకి వెళ్తున్నారు. జ్వరం రానున్నది అనుకోండి ముందుగానే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి తెలిస్తే జాగ్రత్తపడతారు. అదేవిధంగా ఏదైనా పరీక్ష వచ్చే ముందు కొన్ని గుర్తులు తప్పక కనిపిస్తాయి. కానీ మీరు జ్ఞాన సాగరులుగా ఉండి, పరిశీలనాశక్తి శక్తివంతంగా ఉంటే ఎప్పుడూ ఓడిపోరు. జ్యోతిష్యులు కూడా తమ జ్యోతిష్య జ్ఞానంతో గ్రహాల జ్ఞానంతో జరగబోయేది ముందుగా తెలుసుకుంటారు. మీ జ్ఞానం ముందు ఆ జ్ఞానం అస్సలు ఏమీ లేదు, తుచ్చమైనది. అలాంటి తుచ్చమైన జ్ఞానం కలిగినవారే ముందుగానే తెలుసుకోగలుగుతుంటే మీరు మీ జ్ఞానశక్తితో శ్రేష్టాతి శ్రేష్టమైన జ్ఞానంతో మాస్టర్ జ్ఞాన సాగరులై ముందుగా తెలుసుకోలేరా? ఒకవేళ తెలుసుకోలేకపోతున్నారంటే దీనికి కారణం - మీ బుద్ధి రూపి నేత్రం స్పష్టంగా లేదు. జాగ్రత్తగా లేరు, జాగ్రత్తగా లేరు కనుకే జ్ఞానం లేదు. జ్ఞానం లేదు కనుకనే శక్తివంతంగా లేరు. శక్తివంతంగా లేరు కనుకే విజయం పొందలేకపోతున్నారు. మీ నేత్రాన్ని స్పష్టంగా పెట్టుకోవటం ఏమైనా కష్టమైన విషయమా? మీరు భట్టీకి వచ్చారు. కనుక మధువనం నుండి అనగా వరదాన భూమి నుండి ఏమి వరదానం తీసుకుని వెళ్తారు? 1. మీ బుద్ధి రూపి నేత్రాన్ని స్పష్టంగా మరియు జాగ్రత్తగా ఉంచుకోవాలి. 2. జ్ఞాన సాగరులై ముందుగానే తెలిసేలా పరిశీలన యొక్క వరదానాన్ని తీసుకుని వెళ్ళాలి. వీటి ద్వారా ఎప్పుడూ కూడా మాయతో ఓడిపోరు. ఎవరైతే మాయతో ఓడిపోరో వారిపై వినేవారు మరియు చూసేవారు కూడా బలిహారం అయిపోతారు. కనుక ప్రవృత్తిలో ఉంటూ మీపై మీ సమీపంలోని వారు, దూరంలోని వారు బలిహారం అవ్వాలంటే దానికి యుక్తి ఏమిటంటే మీరు మొదట మాటిమాటికీ ఓడిపోకూడదు. మాటిమాటికీ మీరు ఓడిపోతుంటే, ఓడిపోయే మీపై వారు ఎలా బలిహారం అవుతారు. అందువలన అందరినీ మీకు అనగా బాబాకి బలిహారం చేయాలంటే మీరు ఎప్పుడూ ఓడిపోకూడదు. హారాన్ని ధరించే యోగ్యంగా అవ్వాలి, అంతేకానీ ఓడిపోకూడదు. ప్రవృత్తిలో ఉండే పాండవుల కోసం విశేషమైన శిక్షణ ఇదే. మీ మీ ప్రవృత్తికి వెళ్ళినప్పుడు ప్రవృత్తిని ప్రవృతిగానే భావిస్తారా లేక మరో విధంగా ఏమైనా భావిస్తారా? మేము ప్రవృత్తిలోని వాళ్ళం ..... ఈ పేరు మారిపోయింది కదా! ఇప్పటికీ స్వయాన్ని అదర్ కుమారులుగా భావిస్తారా? మీ ప్రవృత్తి గురించి కొంచెం కూడా సంకల్పం రాకూడదు. (అలా వారి ధ్యాస వచ్చే ప్రసక్తే లేదు) ప్రశ్న రావచ్చు, కానీ ధ్యాస రాకూడదు. మేము ప్రవృత్తి మార్గంలోని వాళ్ళం, ఈ రిజిస్టర్ ఈ రోజు నుండి మూసేసి, నేను సేవాధారిని అనే కొత్త రిజిస్టర్ తెరవండి. సరేనా! దీపావళికి పాత ఖాతా సమాప్తి చేసి కొత్త ఖాతాను ప్రారంభిస్తారు కదా! మరయితే మీరందరు కూడా సత్యమైన దీపావళిని జరుపుకున్నారా? దీపాన్ని వెలిగించుకున్నారా? పాత సంస్కారాల యొక్క స్మృతి, పాత ప్రవృత్తి యొక్క స్మృతి రెండింటినీ సమాప్తం చేసేశారా? ఎలాంటి స్మృతియో అలాంటి సంస్కారం తయారవుతుంది. మరయితే ఈ ఖాతాను పూర్తిగా కాల్చేశారా? లేక కొంచెం ప్రక్కన పెట్టి ఉంచారా? కొంచెం ప్రక్కన పెట్టి ఉంచితే అప్పుడప్పుడు బుద్ది అటువైపుకి వెళ్తుంది. కాల్చేసి సమాప్తం చేసేస్తే ఇక అప్పుడప్పుడు చూడాలి అనే మనస్సు కూడా ఉండదు. కొన్ని వస్తువుల వలన భయం ఉత్పన్నం అవుతుంది. అలాంటి వాటిని దూరంగా పెట్టడానికి బదులు కాల్చేస్తారు. తప్పు లెక్కలు వ్రాసేవారు ప్రభుత్వానికి భయపడతారు, అందువలన ఆ కాగితాలు అన్నింటినీ కాల్చేస్తారు, ఏ గుర్తులు వారికి దొరకకూడదని. అదేవిధంగా పాత స్మృతుల యొక్క ఖాతాని లేదా రిజిస్టర్ ని పూర్తిగా కాల్చేసి అనగా సమాప్తం చేసుకుని వెళ్ళాలి. 1. దూరంగా పెట్టటం 2. కాల్చేయటం, రావణుడిని కేవలం చంపరు, కాలుస్తారు కూడా. అదేవిధంగా వీటిని కూడా కేవలం దూరంగా పెడితే వాటి గుర్తులు మిగిలిపోతాయి. పాత రిజిష్టరు యొక్క చిన్న ముక్క దొరికినా కానీ పట్టుబడిపోతారు. మాయ చాలా తెలివైనది, మాయ యొక్క పరిశీలనాశక్తి తక్కువైనది కాదు. ఎలాగైతే ప్రభుత్వ అధికారులు కొంచెం అయినా ఏదైనా దొరికితే దానితో పట్టుకుంటారు. అదేవిధంగా కొంచెం గుర్తులు మిగిలినా కానీ మాయ ఏదోక రకంగా పట్టేసుకుంటుంది. కనుక కాల్చేసే వెళ్ళాలి. చెప్పాను కదా - కుమారులలో జేబుఖర్చు కోసం దాచుకునే సంస్కారం ఉంటుందని, అదేవిధంగా ప్రవృత్తిమార్గం వారిలో కూడా విశేష సంస్కారం ఒకటి ఉంటుంది - అవసరం అయినప్పుడు ఉపయోగపడతాయని కొన్నింటిని దాస్తారు. ఎంత లక్షాధికారి అయినా కానీ ఈ సంస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బాబాకి ఎంత స్నేహి అయినా కానీ మరలా ఈ సంస్కారాలు కూడా ఉంటాయి. మరలా ఆ సంస్కారాలే ఇక్కడ పురుషార్ధంలో విఘ్న రూపంగా అవుతాయి. కొందరు అనుకుంటారు - కొంచెం అయినా గర్వం యొక్క సంస్కారం లేకపోతే ప్రవృత్తిని ఎలా నడిపిస్తాం, కొంచెం అయినా లోభం యొక్క సంస్కారం లేకపోతే సంపాదన ఎలా చేస్తాం, కొంచెం అయినా అహంకారం లేకపోతే ప్రజల ముందు మన వ్యక్తిత్వం ఏమి కనిపిస్తుంది? ఇలా కొన్ని పనులు కోసం లేదా అవసరాల కోసం కొన్ని కొన్ని ఖజానాలను దాచి పెట్టుకుంటారు. ఈ సంస్కారాలే మోసం చేస్తాయి. ఇవేమీ వ్యక్తిత్వం కాదు. మరియు ఈ పాత సంస్కారాలు అనేవి ప్రవృత్తిని పాలన చేసే సంస్కారాలు కూడా కావు. పాత సంస్కారాలు అనగా లోభం అనేది రాయల్ రూపంలో లేదా అంశమాత్రంగా ఉంటుంది. ఉదాహరణకి ప్రవృత్తిలో ఉన్నవారు ఏదోక వ్యవహారం చేస్తూ ఉంటారు, ఎక్కడైనా కొంచెం ఎక్కువ ప్రాప్తి లభిస్తుందనుకోండి, ఆ ప్రాప్తి వెనుక పడతారు. ఎంతగా దానిలో నిమగ్నం అయిపోతారంటే ఈ ఈశ్వరీయ సంపాదనను తక్కువ చేసేసుకుంటారు. ఇటువైపు ధ్యాస తగ్గించి అటు వచ్చే ప్రాప్తి వైపు ఎక్కువ ధ్యాస పెడతారు. ఇది లోభం యొక్క అంశం కాదా? ఇలా అవసరానికి పనికొస్తాయని పాత సంస్కారాల ఆస్తిని అనగా ఖజానాని ఎంతోకొంత ప్రక్కన పెట్టుకుంటారు. కానీ ఈ సంస్కారాలను కూడా సమాప్తం చేసుకోవాలి. ఎక్కడా, ఏ మూలలో కూడా, కొంచెం కూడా ఈ పాత సంస్కారాలు దాగి లేవు కదా! అని పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా మోహం కూడా ఉంటుంది. కుటుంబం వైపు ఎక్కువ ధ్యాస పెట్టడం ఇది కూడా రాయల్ రూపంగా మోహం యొక్క అంశం. ఇది బేహద్ కుటుంబం, 21 జన్మలు మీ వెంట ఉండే కుటుంబం. ఆ కుటుంబం కర్మబంధనను పూర్తి చేసుకునే కుటుంబం. మరి కర్మబంధనను పూర్తి చేసుకునే కుటుంబంపై ఎక్కువ ధ్యాస పెట్టి ఈ కుటుంబంపై తక్కువ పెడుతుంటే మోహం లేదా మమత రాయల్ రూపంలో రాలేదా? ఇలా అంశం అనేది వృద్ధి పొందుతూ, పొందుతూ విఘ్న రూపంగా అవుతుంది. మిమ్మల్ని ఓడించేస్తుంది. విజయీగా కానివ్వదు. అందువలన ప్రవృత్తి వారు స్థూలంగా చూస్తే మహాజ్ఞాని మహాదానిగా కూడా అయ్యారు. కానీ ప్రక్కన పెట్టి ఉంచిన వికారాల వంశం యొక్క అంశాన్ని కూడా సమాప్తం చేయాలి. ఈ ధ్యాస కూడా పెట్టుకోవాలి. కోర్సు చేశాము, పాస్ అయ్యాము అని భావించకండి. దీనిలో కూడా పాస్ అవ్వండి. కొంచెం కూడా ఏ మూలలో కూడా పాత ఖజానా యొక్క గుర్తులు కనిపించకూడదు. అలాంటి వారిని మరజీవ లేదా సర్వస్వత్యాగి లేదా సర్వ సమర్పణ లేదా నిమిత్తము లేదా యజ్ఞ స్నేహి లేదా సహయోగి అని అంటారు. ఇదీ కోర్సు. కోర్సు అయితే టీచర్లు చేయించారు. కానీ కోర్సు తర్వాత కావలసింది ఫోర్సు అనగా శక్తి, కోర్సు చేసి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నంత వరకు ఆ కోర్సు సరిగ్గానే ఉంటుంది. కానీ పరీక్ష సమయంలో ఆ కోర్సు మొత్తం మర్చిపోతున్నారు. కనుక కోర్సుతో పాటు ఫోర్సు కూడా నింపుకుని వెళ్ళాలి. అప్పుడు కోర్సు మరియు ఫోర్సు ఈ రెండూ విజయీగా చేస్తాయి. ఎప్పుడూ ఓడిపోరు. కనుక శక్తిని నింపుకుని వెళ్ళాలి. అప్పుడే సదా విజయీగా కాగలరు. కొంచెం కూడా గుర్తులు దాగి ఉండకూడదు. కొంచెమైనా గుర్తులు ఉన్నట్లయితే బుద్ధి స్థిరంగా ఉండలేదు. ఇది పెద్ద పరీక్ష. చిన్న చిన్న పరీక్షల్లో పాస్ అయిపోవటం పెద్ద విషయం కాదు. సూక్ష్మ లోతైన పేపరులో పాస్ అవ్వటమే పాస్ విత్ ఆనర్ యొక్క గుర్తు. ఇప్పుడు అర్థమైందా? ఏమి చేయాలో! మీ పాత ఖాతా మొత్తం కాల్చి వెళ్ళాలి. చాలా శక్తిని నింపుకుని వెళ్ళాలి. బట్టలు ఉతికిన తర్వాత ఇస్త్రీ లేకపోతే ఆ బట్టలకి మెరుపు ఉండదు. అదేవిధంగా కోర్సు చేసిన తర్వాత మీలో ఫోర్స్ అనగా శక్తిని నింపుకోకపోతే చమత్కారాన్ని చూపించలేరు. ఇప్పుడు చమత్కారి అయ్యి వెళ్ళాలి. మరియు దూరం నుండే అందరినీ ఆకర్షించేలా. అన్నింటికంటే ఎక్కువ తనవైపుకి ఆకర్షించుకునే వస్తువు ఏది? దూరం నుండే ఆకర్షించేది ఏది? (మెరుపు) మరయితే మెరుపు ఏవిధంగా వస్తుంది? మీ ప్రదర్శినిలో అన్నింటికంటే ఎక్కువ ఏది అందరినీ ఆకర్షిస్తుంది. 1. ప్రకాశం 2. శక్తి ఇవి అందరినీ ఆకర్షిస్తాయి. కనుక స్వయంలో ఈశ్వరీయ ప్రకాశం లేదా స్వయాన్ని పరివర్తన చేసుకునే శక్తిని నింపుకుని అందరినీ ఆకర్షించాలి. ఎవరైతే స్వయాన్ని పరివర్తన చేసుకోలేరో వారు అందరినీ ఆకర్షించలేరు. కనుక స్వయంలో ధారణ చేయటం ద్వారా ప్రతీ ఆత్మను మీవైపు ఆకర్షితం చేసుకోగలరు. మంచిది.