01.08.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్వయం యొక్క స్థితిని సెట్ చేసుకునే విధి.

ఈరోజు సమాప్తి రోజా లేక సమర్పణ అయ్యే రోజా? సమర్పణ అనగా ఈశ్వరీయ మర్యాదలకు వ్యతిరేకమైన స్వభావ సంస్కారాలు లేదా మర్యాదలను సమర్పణ చేయాలి. ఏదైనా యంత్రాన్ని సెట్ చేస్తారు కదా! ఒకసారి సెట్ చేస్తే ఆ తరువాత స్వతహాగానే అలా పనిచేస్తూ ఉంటుంది.

అదేవిధంగా ఈ భట్టీలో మీ సంపూర్ణ స్థితిని, బాప్ సమాన స్థితిని, కర్మాతీత స్థితిని ఆవిధంగా సెట్ చేసుకున్నారా? ఇక మీరు సంకల్పం, మాట లేదా కర్మ అన్ని కూడా ఆ సెట్ అనుసారంగా స్వతహాగానే నడుస్తూ ఉండేవిధంగా ఇలాంటి అథారిటీ యొక్క స్మృతిని లేదా స్థితిని సెట్ చేసుకున్నారా? తండ్రి సర్వశక్తివంతుడు కదా! మీరందరూ కూడా స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా భావిస్తున్నారు కదా? ఈ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిని ఒకసారి సెట్ చేసుకుంటే ఇక వారెప్పుడూ బలహీన లక్షణాలు గల ఆలోచనలు, మాటలు, కర్మలు చేయరు. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులు కనుక. విశ్వాన్ని కొద్ది సమయంలో పరివర్తన చేసే శక్తి ఉంది. మరైతే ఇప్పుడు కూడా ఒక్కసెకెనులో స్వయాన్ని పరివర్తన చేసుకునే శక్తి మాస్టర్ సర్వశక్తివంతులైన మీలో లేదా? నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని... ఈ స్థితిని సెట్ చేసుకోండి. ఆటోమేటిక్ గా నడిచే వస్తువును మాటిమాటికి సెట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి సెట్ చేస్తే ఆటోమేటిక్ గా పనిచేస్తూ ఉంటుంది. మీరందరూ కూడా ఇప్పుడు సహజ మరియు సదా కర్మయోగి అనగా నిరంతరం నిర్వికల్ప సమాధిలో ఉండే సహజ యోగిగా అయ్యారా? లేక కేవలం యోగి అయ్యారా? ఎవరైతే సదా యోగిగా ఉంటారో వారు సదాచారిగా ఉంటారు. సదాచారిగా ఎవరు కాగలరు? ఎవరైతే సదా యోగి స్థితిలో స్థితులై ఉంటారో, వారే సదాచారిగా ఉంటారు. మీరు సదాచారి కనుక ఎప్పుడూ ఏవిధంగా కూడా అలజడి కాకూడదు. సదా అచంచలం మరియు స్థిరం. ఈ విధంగా ఈ భట్టీలో మీ ప్రతిజ్ఞ అనే స్విచ్ ను సెట్ చేసుకున్నారా? ప్రతిజ్ఞ అనే స్విచ్ ను సెట్ చేసుకోండి. ప్రత్యక్షంలో ప్రతిజ్ఞ ప్రమాణంగానే నడుస్తారు కదా! అప్పుడు సదాచారిగా, నిరంతరయోగిగా లేదా సహజయోగిగా అవ్వరా? పాండవులు పర్వతాలపైకి వెళ్లి చనిపోయారు అని అంటారు కదా! పర్వతం అంటే అర్ధం ఏమిటి? పర్వతం భూమి కంటే ఎత్తుగా ఉంటుంది కదా! కనుక పాండవులు భూమి అనగా క్రింద స్థితిని వదిలేసి ఉన్నత స్థితిలో స్థితులయ్యారని అర్థం. అంటే పాండవులు తమ దగ్గర ఈశ్వరీయ మర్యాదలకి విపరీతమైన స్వభావం, సంస్కారం, సంకల్పం, కర్మ మరియు మాట ఏవైతే ఉన్నాయో వాటితో స్వయాన్ని మరజీవగా చేసుకున్నారు అంటే చనిపోయారు. మీరు కూడా భూమి కంటే ఉన్నతంగా వెళ్లిపోయారు కదా! పూర్తిగా చనిపోయి వచ్చారా లేక కొంచెం మిగుల్చుకుని వచ్చారా? స్వయంపై 100శాతం నిశ్చయబుద్ధి ఉంటే అలాంటివారు ఎప్పుడూ కుమిలిపోరు. ఒకటి - ధైర్యం కావాలి. రెండు - ధైర్యంతో పాటు ఉల్లాసం కూడా కావాలి. ధైర్యోల్లాసాలు లేకపోతే ఆకర్షణ ఉండదు. అందువలన రెండూ వెనువెంట ఉండాలి. 1. అంతర్ముఖత మరియు 2. బాహ్యంగా సుందరతగా కనిపించే హర్షితముఖత. అలాంటి స్థితి ఉందా? రెండూ వెనువెంటే ఉండాలి. ధైర్యంతో పాటు ఉల్లాసం కూడా ఉండాలి. దీని వలన దూరం నుండే తెలిసిపోతుంది - వీరి దగ్గర ఏదో విశేషత ఉందని..ప్రాప్తి పొందినవారి ప్రతి నడవడిక, ముఖ కవళికల్లో ఉత్సాహ ఉల్లాసాలు కనిపిస్తాయి. భక్తి మార్గంలో కేవలం ఉత్సాహంలోకి తీసుకురావాలని ఉత్సవాలు జరుపుకునే సాధనాలను తయారుచేశారు. సంతోషంలో నాట్యం చేస్తారు కదా! ఎవరికైనా ఉదాసీనత లేదా అలజడి మొదలైనవి ఉన్నట్టయితే అవి కూడా దూరమైపోతాయి. కనుక ధైర్యంతో పాటు ఉల్లాసం కూడా తప్పక ఉండాలి. స్టాంప్ అవినాశిగా వేసుకున్నారా? స్టాంప్ అవినాశిగా వేసుకోకపోతే ఏమవుతుంది? శిక్ష పడుతుంది. అందువలన ఈ స్టాంప్ తప్పక వేసుకోవాలి. ఇది సదాకాలిక సమర్పణ సమారోహం కదా? ఆ తరువాత మరలా మరలా ఈ సమారోహాన్ని జరుపుకోనక్కర్లేదు కదా! స్మృతిచిహ్నంగా జరుపుకోవడం అనేది వేరే విషయం. పుట్టిన రోజు... ఇవన్నీ గుర్తు కోసమే కదా జరుపుకుంటారు. ఈరోజు సమర్పణా రోజు, ప్రతిజ్ఞ రోజు. విజయీ దినోత్సవం కూడా జరుపుకుంటారు. అందరి విజయాష్టమి రోజు కూడా ఉంది కదా? విజయులుగా అయిన రోజు సదా స్మృతిలో పెట్టుకుంటారు. అంతిమ స్వాహా ఎలా చేయాలంటే మిమ్మల్ని చూసి అందరి నోటి నుండి ఓహో.. ఓహో.. అని రావాలి మరియు మిమ్మల్ని అందరూ అనుసరించాలి. ఏదైనా మంచి విషయం ఉంటే అనుకోకుండానే అందరూ వారిని అనుసరించే కోరిక పెట్టుకుంటారు. ఎలాగైతే తండ్రిని అనుసరిస్తున్నారో అలాగే మీ యొక్క ప్రతి కర్మను అనుసరించాలి. మీ కర్మ ఎంత శ్రేష్టంగా ఉంటుందో, అంతగా శ్రేష్టాత్మలుగా మిమ్మల్ని స్మరిస్తారు. నామస్మరణ చేస్తారు కదా! అదేవిధంగా ఎవరు ఎంత శ్రేష్ఠాత్మగా ఉంటారో అనుకోకుండానే వారి గుణాలను మరియు కర్మను ఉదాహరణగా తీసుకునేటందుకు వాటిని స్మరిస్తూ ఉంటారు.

ఈవిధంగా మీరందరూ కూడా శ్రేష్టాత్మలుగా, స్మరణ చేసే యోగ్యులుగా అయిపోతారు.యోగిగా అయ్యే బాధ్యత మాత్రం ఇప్పుడు తీసుకున్నారు. యోగయుక్తం అనగా యుక్తియుక్తం .ఒకవేళ ఏ సంకల్పం అయినా, మాట అయినా, కర్మ అయినా యుక్తీయుక్తంగా లేదంటే యోగయుక్తంగా అవ్వలేనట్లే. యోగయుక్త స్థితికి గుర్తు - యుక్తియుక్తంగా ఉండడం.యోగయుక్తులు ఎప్పుడూ కూడా అయుక్తీయుక్త కర్మ లేదా సంకల్పం చేయరు. ఇదీ వీటికి ఉన్న పరస్పర సంబంధం. మంచిది.