ఆత్మిక స్నేహీగా అవ్వండి.
వ్యక్తం నుండి అవ్యక్తం అవ్వటానికి ఎంత సమయం
పడుతుంది? ఎవరినైనా అజ్ఞాని నుండి జ్ఞానిగా చేయటానికి ఎంత సమయం పడుతుంది?
ఇప్పటి స్థితిని అనుసరించి ఎంత సమయంలో తయారు చేయగలరు? మీ కోసం ఏమనుకుంటున్నారు,
ఎంత సమయంలో తయారు చేయగలరు? తయారయ్యేవారి విషయం వేరు, కానీ తయారు చేసేవారు
మంచిగా ఉండి, తమ శక్తి అనుసరించి ఎంత సమయంలో తయారుచేయగలరు? మీ వేగం మీకు
తెలుస్తుంది కదా! సమయాన్ని అనుసరించి ఇప్పుడు అజ్ఞానిని జ్ఞానిగా చేయటంలో
కొంచెం సమయం పడుతుంది. అది కూడా ఎందుకంటే తయారుచేసేవారు స్వయం అవ్యక్త స్థితికి
తయారుచేసుకోవటంలో సమయం తీసుకుంటున్నారు. తయారుచేసేవారు ఒక్క సెకనులో స్వయాన్ని
వ్యక్తం నుండి అవ్యక్తం చేసుకోగలిగితే తయారు చేసేవారిని కూడా అంత త్వరగానే
తయారు చేయగలరు. ఎవరైనా దేవతా ధర్మానికి చెందిన వారు కాకపోయినా కానీ ఒక్క
సెకనులో కొందరికి ముక్తి, కొందరికి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని ఇవ్వటానికి
నిమిత్తమవుతారు. సర్వాత్మలకు ముక్తి, జీవన్ముక్తి యొక్క వరదానం బ్రాహ్మణుల
ద్వారానే ప్రాప్తిస్తుంది. యంత్రంలో ఏదైనా వస్తువు వేసినప్పుడు ఏది ఎటువైపుకి
వెళ్ళాలో అది ఆ రూపంలోనే మరియు అదేవిధంగా స్వతహాగానే ఒక్క సెకనులో వెళ్ళి
తయారైపోతుంది మరియు తయారై బయటకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే యంత్రం వేగవంతమైనది.
కనుక ఒక్క సెకనులో ఏది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. ఏది ఏ
రూపాన్ని తీసుకోవాలో ఆ రూపాన్ని తీసుకుంటుంది. అలాగే ఈ ఆత్మిక యంత్రం ఇదేమైనా
తక్కువా? ఈ యంత్రం ద్వారా మీరు ఒక్క సెకనులో ముక్తి వాళ్ళకి ముక్తిని ,
జీవన్ముక్తి వాళ్ళకి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని ఇవ్వలేరా? మీరు మహాదాని,
మహాజ్ఞాని,మహాయోగి కూడా, ఒక్క సెకనులో మీ జన్మ సిద్ధ అధికారాన్ని పొందగలరు అని
వ్రాస్తారు కదా! కేవలం అలా వ్రాస్తారు లేదా అంటారు. అంతేనా లేక యదార్థ విషయం
కనుకనే వ్రాస్తారు లేదా అంటారా! మరయితే ఒక్క సెకనులో ఆత్మకి ముక్తి జీవన్ముక్తి
యొక్క మార్గాన్ని చూపగలరు లేదా వరదానాన్ని ఇవ్వగలరు కదా! వరదానాన్ని ప్రాప్తింప
చేయాలి. స్వయాన్ని వరదానం ద్వారా నిండుగా చేసుకోవటం అనేది వేరే విషయం కానీ మీరు
అయితే వరదానం ఇవ్వగలరు కదా! ఒక్క సెకనులో వరదానం ఇచ్చే వరదానమూర్తియేనా?
స్వయాన్ని ఒక్క సెకనులో వ్యక్తం నుండి అవ్యక్తంగా తయారు చేసుకోగలరా? ఎంత సమయం
ఉండగలరు అలా? కొద్ది సమయానికే అలా అవ్వగలుగుతున్నారు. అందువలనే తయారయ్యే వారికి
కూడా అల్పకాలిక నషా మరియు అల్పకాలిక సంతోషం ఉంటుంది. వారు అల్పకాలికంగానే
పరివర్తన అవుతున్నారు. తయారుచేసే మాస్టర్ రచయితలు ఎలా ఉంటారో రచన కూడా
ఆవిధంగానే ఇప్పటి వరకు తయారవుతున్నారు. ఎలాగైతే మీరు బాబాతో కొద్ది సమయమే
ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, కలుసుకుంటున్నారు, లీనమవుతున్నారు, గుణాలను మరియు
స్వరూపాలను అనుభవం చేసుకుంటున్నారు. అదేవిధంగా రచన కూడా కొద్ది సమయమే మీ యొక్క
మహిమ చేస్తున్నారు. కొద్ది సమయమే మీ సంబంధంలో ఉంటూ మిమ్మల్ని కలుసుకుంటున్నారు.
కొద్ది సమయమే వారు అనుభవం చేసుకుంటున్నారు. గుణగానం చేస్తున్నారు. అప్పుడప్పుడు
మాత్రమే వారి అనుభవాన్ని వర్ణిస్తున్నారు. అయితే దీనికి కారణం ఎవరు? అనేక
కారణాలను తొలగించుకునే కార్యక్రమం మీటింగ్ లో తయారు చేసుకున్నారు. కానీ ఈ
కారణాన్ని నివారించుకుంటే మిగతా కారణాలన్నీ అసలు లేనే లేనట్లుగా సమాప్తం
అయిపోతాయి. అంటే ముఖ్య కారణం ఇది. సదా బాబా యొక్క స్నేహంలో మరియు సహయోగంలో
ఉండటం ద్వారా సర్వాత్మలు మీ స్నేహంలోకి వచ్చి స్వతహాగానే మీకు సహయోగులు
అయిపోతారు. చెప్పాను కదా - ఈనాడు ఆత్మలకి సర్వ అల్పకాలిక సుఖ శాంతి సాధనాలు
ఉన్నాయి కానీ సత్యమైన స్నేహం లేదు. స్నేహానికి ఆకలితో ఉన్నారు, అన్నం మరియు ధనం
శరీర తృప్తికి సాధనాలు కానీ ఆత్మకి తృప్తి అనేది ఆత్మిక స్నేహం ద్వారానే
వస్తుంది. అది కూడా అవినాశిగా ఉండాలి. కనుక స్నేహిలే స్నేహాన్ని దానమివ్వగలరు.
ఒకవేళ స్వయమే సదా స్నేహీగా లేకపోతే ఇతర ఆత్మలకి కూడా సదాకాలికంగా స్నేహాన్ని
ఇవ్వలేరు. అందువలన సదా స్నేహి అవ్వటం ద్వారా, స్నేహీ యొక్క స్నేహంలోకి వచ్చి ఆ
స్నేహి కోసం అన్నింటినీ అర్పణ చేసేస్తారు. స్నేహి కోసం ఏది సమర్పించాలని
ఆలోచించరు, కష్టం అనిపించదు కూడా. ఇన్ని విషయాలు మీరు ఏవైతే వింటున్నారో అనగా
చాలా మర్యాదలు, నియమాలు వింటూ వింటూ వివన్నీ చేయాలా అని ఆలోచనలో పడతారు. కానీ
ఇవన్నీ చేయటానికి అన్నింటికంటే సహజ యుక్తి సర్వ బలహీనతల నుండి ముక్తి అయ్యే
యుక్తి కూడా ఇదే - సదా స్నేహి అవ్వండి ఎవరికి మీరు స్నేహియో ఆ స్నేహి యొక్క
నిరంతర సాంగత్యం ద్వారా ఆత్మీయత యొక్క రంగు సహజంగానే అంటుతుంది.
ఒకవేళ ఒకొక్క మర్యాదను జీవితంలోకి తీసుకువచ్చే
ప్రయత్నం చేస్తే అప్పుడప్పుడు కష్టం, అప్పుడప్పుడు సహజం అనిపిస్తుంది. మరియు
వీటిని అభ్యసించటంలోను లేదా బలహీనతలు తొలగించుకోవటంలోనే సమయం వెళ్ళిపోతుంది.
అందువలన ఇప్పుడు ఒక్క సెకనులో మర్యాద పురుషోత్తములు అవ్వండి. ఏవిధంగా అవుతారు?
కేవలం సదా స్నేహి అవ్వటం ద్వారా, బాబాకి సదా స్నేహి అవ్వటం ద్వారా, బాబా ద్వారా
సదా సహయోగం ప్రాప్తించటం ద్వారా కష్ట విషయం సహజం అయిపోతుంది. ఎవరైతే సదా
స్నేహిగా ఉంటారో వారి స్మృతిలో కూడా స్నేహియే ఉంటారు. వారి ముఖం ద్వారా వారి
స్నేహి యొక్క మూర్తియే ప్రత్యక్షంగా కనిపిస్తుంది. లౌకిక పద్దతిలో కూడా ఏ ఆత్మ
అయినా, మరో ఆత్మ యొక్క స్నేహంలో ఉంటే, వీరు ఎవరి స్నేహంలోనో లీనమై ఉన్నారని
ఇతరులకి అర్థమైపోతుంది. మరయితే ఆత్మిక స్నేహంలో లీనమైన ఆత్మల ముఖం, స్నేహ
మూర్తిని ప్రత్యక్షం చేయలేదా! వారి హృదయం యొక్క తగుల్పాటు సదా ఆ స్నేహితోనే
జోడించబడి ఉంటుంది. ఒకవైపే తగుల్పాటు ఉన్నప్పుడు అనేక వైపుల తగుల్పాటులు
స్వతహాగానే సమాప్తం అయిపోతాయి. ఇతరులతో తగుల్పాటు అనేదే కాదు, స్వయంతో
స్వయానికి తగుల్పాటు అనగా దేహాభిమానం కూడా సమాప్తం అయిపోయి సదా ఆ స్నేహంలోనే
లీనమై ఉంటారు. కనుక సహజ యుక్తి లేదా విధి ఉన్నప్పుడు ఆ సహజ యుక్తి లేదా విధి
ద్వారా మీ స్థితి యొక్క వేగాన్ని వృద్ధి చేసుకుంటున్నారా? సదా స్నేహి అనగా ఒకే
ఒక సర్వశక్తివంతునితో స్నేహి అయిన కారణంగా సర్వాత్మలకు స్నేహిగా స్వతహాగానే
అయిపోతారు. ఈ రహస్యాన్ని తెలుసుకోవటం ద్వారా రహస్యయుక్తంగా, యోగయుక్తంగా లేదా
దివ్య గుణాల యుక్తంగా అవుతారు. రహస్య యుక్త ఆత్మ సర్వాత్మలను స్వతహాగానే రాజీ
చేసుకోగలదు. రహస్యయుక్తంగా అవ్వకపోతే ఎవరొకరిని రాజీ చేసుకోలేరు. ఎదుటి వారి
ముఖం లేదా మాట ద్వారా వారి మనస్సులోని రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే సహజంగానే
వారిని రాజీ చేసుకోగలరు. కానీ అక్కడక్కడ ముఖాన్ని చూసి, మాటను వింటూ కూడా వారి
మనస్సు యొక్క రహస్యాన్ని తెలుసుకోని కారణంగానే ఇతరులతో కోపం లేదా స్వయంతో కోపం.
సదా స్నేహి అవ్వండి అనే రహస్యాన్ని తెలుసుకుని రహస్యయుక్తంగా అవ్వండి. మంచిది.
భవిష్యత్తులో విశ్వ యజమానిగా అవ్వాలి, తెలుసు కదా! కానీ ఇప్పుడు ఎవరు? ఇప్పుడు
విశ్వ యజమానులా లేక సేవాధారులా? మంచిది.