దీపావళి చైతన్య దీపాల యొక్క మాలకి స్మృతిచిహ్నం.
ఈరోజు బాప్ దాదా ఏమి చూస్తున్నారు? దీపాలైన మీ మాలను
చూసేటందుకు వచ్చారు. ఈ దీపమాలకి స్మృతిచిహ్న రోజుని ప్రజలు జరుపుకుంటున్నారు.
కానీ బాప్ దాదా చైతన్య దీపాల యొక్క మాలను చూస్తున్నారు. మీరందరు కూడా దీపావళి
రోజున వెలుగుతున్న దీపాలను చూస్తారు కదా! అలా చూసినప్పుడు మా యొక్క స్మృతి
చిహ్నాన్నే జరుపుకుంటున్నారు అని స్మృతి ఉంటుందా? వెలుగుతున్న దీపం ఎలాగైతే
ప్రియంగా అనిపిస్తుందో అదేవిధంగా మీ స్మృతి చిహ్నాన్ని చూస్తూ ఆ స్మృతి
రావటంతోనే మీరందరు కూడా విశ్వపితకి మరియు విశ్వంలోని ఆత్మలందరికీ కూడా ప్రియంగా
అనిపిస్తారు. కనుక ఈరోజు స్మృతిచిహ్న రూపాన్ని ప్రత్యక్ష రూపంలో చూసేటందుకు
వచ్చారు. మాలలో ఒక పూస మాత్రమే ఉండదు, అనేక పూసలతో మాల తయారవుతుంది. అదేవిధంగా
ఒకే దీపం వేరుగా వెలుగుతూ ఉంటే దానిని దీపాల మాల అని అనరు. అనేక దీపాలు
వెలుగుతూ ఉన్నాయి కనుక మాల రూపంలో కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని
మీరు ఈ దీపమాల మధ్యలో గ్రుచ్చబడి వెలుగుతున్న దీపంగా భావిస్తున్నారా? మీరు కూడా
వెలుగుతున్న అనేక దీపాల యొక్క మాలను చూసి సంతోషిస్తున్నారా? ఈరోజు దీపమాల యొక్క
రోజు, మీరందరు కూడా దీపావళి జరుపుకున్నారా? ఈ రోజు విశేష రూపంతో దీపావళి
జరుపుకున్నారా? వాస్తవానికి మీరు సదా వెలుగుతూ ఉండే దీపాలు. కానీ ఎప్పుడైతే
విశేష సృతిచిహ్నరోజు ఉంటుందో అప్పుడు విశేషాతలైన మీరు ఏమి చేయాలి? విశేష రూపంతో
నిమిత్తమైన విశేషాత్మలు, మీరు ఏ విశేష సేవ చేయాలి? విశేష ఆత్మలు ఇతరాత్మల కంటే
విశేష కార్యం చేయాలి. ఎందుకంటే ఇతరాత్మలు చేసినదే మీరు కూడా చేస్తూ ఉంటే ఇక
తేడా ఏమి ఉంటుంది? కనుక విశేష ఆత్మలు విశేష కార్యం చేయాలి. బాప్ దాదా విశేష
రోజుల్లో విశేష రూపంతో పిల్లల యొక్క మరియు భక్తుల యొక్క సేవ మూడు రూపాలతో
చేస్తారు. విశేష ఆత్మలు విశేషంగా తమ యొక్క స్నతిచిహ్న రోజున సాక్షాత్కారమూర్తి
అయ్యి సాక్షాత్తు బాప్ దాదా సమాన ఆత్మల వలె తమ కళ్యాణ భావనతో, ఆత్మిక స్నేహ
స్వరూపంతో, తమ యొక్క సూక్ష్మ శక్తులతో ఆత్మలలో బలం నింపాలి. అవ్యక్త రూపంలో
బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల యొక్క సేవ చేస్తారు. అప్పుడు వారు అనుభవం
చేసుకుంటారు - బాప్ దాదా నాతో సంభాషించారు. నా స్మృతికి జవాబు ఇచ్చారు లేదా నా
స్మృతికి ప్రత్యక్ష ఫలాన్ని నేను అనుభవం చేసుకున్నానని, అదేవిధంగా భక్తులు కూడా
మాకు ఇష్టమైన దానిని, మా భావనకి ఫలాన్ని భగవంతుడు ఇచ్చారు. మా కోరికను పూర్తి
చేశారని ప్రత్యక్ష రూపంలో అనుభవం చేసుకుంటారు. అదేవిధంగా విశేష ఆత్మలు తమ
అవ్యక్త స్థితిలో తమ ఆత్మిక ప్రకాశం మరియు శక్తి యొక్క స్థితి ద్వారా లైట్ హౌస్
మరియు మైట్ హౌస్ అయ్యి ఒకే స్థానంలో ఉంటూ కూడా నలువైపుల అలౌకిక ఆత్మిక సేవను
భావన మరియు వృత్తి ద్వారా చేస్తారు. దీనిన బేహద్ సేవ అని అంటారు. నా ప్రజలు
లేదా భక్తులు ఈ విశేష స్పృతిచిహ్న రోజున విశేషాత్మనైన నన్ను స్మృతి
చేస్తున్నారని అనుభవం చేసుకోవాలి. అల్పకాలిక సిద్ధులు ఇచ్చేవారు ఒక స్థానంలో
ఉంటూ కూడా తమ భక్తులకి తమ రూపాన్ని సాక్షాత్కారం చేయించగలరు. మరయితే విశేష
అత్మలైన మీరు మీ ప్రకాశము మరియు శక్తి ద్వారా భక్తులకు లేదా ప్రజలకు సేవ చేసి
అనుభవం చేయించలేరా? ఎప్పుడైతే ఇలాంటి విశేష స్మృతిచిహ్న రోజులు వస్తాయో అప్పుడు
విశేషాత్మలు ఇలాంటి విశేష సేవను అనుభవం చేసుకోవాలి. ఇలాంటి సేవ చేశారా? ఇది సేవ
యొక్క విషయం.
ఇంకా దీపావళి రోజున స్వయం పట్ల విశేష ధ్యాస పెట్టారా?
ఈరోజు అతలైన మీ యొక్క సంస్కారాలను పరివర్తన చేసుకునే విశేష ధ్యాస పెట్టారా?
స్నతిచిహ్న రూపంలో ఈరోజు పాత ఖాతాని సమాప్తి చేసుకునే ఆచారం నడుస్తుంది. అంటే
అది మీరు ప్రత్యక్షంగా తప్పకుండా చేశారు. కనుకనే స్మృతిచిహ్నం అలా తయారయ్యింది.
కనుక ఈ రోజు మీ యొక్క మిగిలిఉన్న కొద్దిపాటి పాత సంస్కారాల ఖాతాను సమాప్తం
చేశారా? సమాప్తి చేసుకునేముందు ఖాతాను పరిశీలిస్తారు. ఫలితం తీస్తారు.
అదేవిధంగా మీరందరు కూడా మీ యొక్క లెక్కాచారాన్ని పరిశీలించుకున్నారా? ఏమి
పరిశీలించుకోవాలి? ఈ రోజు వరకు ఏదైతే పురుషార్ధం చేశారో దాని యొక్క ఫలితం
అనుసారంగా ఇప్పుడు ఏ విషయాలలో, ఎంత శాతం సఫలతామూర్తులు అయ్యారో చూసుకోవాలి.
మొదట మీ మనసా సంకల్పాల యొక్క లెక్కాచారాన్ని పరిశీలించుకోండి. ఇప్పటి వరకు
సంపూర్ణ శ్రేష్ట సంకల్పాలు చేసే పురుషార్ధంలో ఎంత వరకు సఫలత వచ్చింది?
వ్యర్థసంకల్పాలు లేదా వికల్పాలపై ఎంత వరకు విజయీ అయ్యాను? మరియు వాచా ద్వారా
ఎంత వరకు ఆత్మలకు బాబా పరిచయాన్ని ఇచ్చాను? ఎంతమందిని స్నేహిగా లేదా సహయోగిగా
తయారు చేశాను? వాచాలో ఆత్మీయత లేదా అలౌకికత లేదా ఆకర్షణ ఎంత వరకు వచ్చింది?
అదేవిధంగా కర్మణాలో సదా అతీతంగా మరియు ప్రియంగా అలౌకిక అసాధారణ కర్మ ఎంత వరకు
చేస్తున్నాను? కర్మలలో ఎంత వరకు కర్మయోగి స్థితిని, యోగయుక్త, యుక్తి యుక్త
మరియు స్నేహ యుక్త స్వరూపాన్ని తీసుకువచ్చాను? సంస్కారాలలో మరియు స్వరూపంలో
అనగా ముఖంలో ఎంత వరకు బాబా సమానమైన ఆకర్షణీయ రూపం, స్నేహి రూపం, సహయోగి రూపం
తయారయ్యింది? ఈ విధంగా మీ లెక్కాచారాన్ని పరిశీలించుకోవటం ద్వారా ఇప్పటి వరకు
ఏదైతే లోపం లేదా బలహీనత మిగిలిపోయి ఉందో దానిని సమాప్తం చేసుకుని కొత్త ఖాతాను
ప్రారంభించగలరు. ఈవిధంగా మీ యొక్క లెక్కాచారాన్ని పరిశీలించుకోండి. దీనినే
దీపావళిలో జరుపుకోవటం అని అంటారు. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా తయారు చేసుకోవాలని
ధృడ సంకల్పం చేయటమే జరుపుకోవటం, మరయితే దీపావళిని ఇలా జరుపుకున్నారా లేక కేవలం
మిలనం చేసుకున్నారా? మిలనం జరుపుకున్నదానికి స్మృతిచిహ్నంగా మాల రూపంలో
చూపించారు. కానీ ధృడ సంకల్పానికి స్మృతి చిహ్నంగా దీపంలోని జ్యోతి రూపంలో
చూపించారు. కనుక మీరు రెండు రూపాలతో జరుపుకోవాలి. నూతన వస్త్రాలు వేసుకున్నారా?
ఆత్మకి క్రొత్త శరీరం దేని ఆధారంగా లభిస్తుంది? సంస్కారాల ఆధారంగానే లభిస్తుంది
కదా! ఆత్మకి ఎలాంటి సంస్కారం ఉంటుందో అలాంటి శరీరమే తయారవుతుంది. క్రొత్త
శరీరాన్ని లేదా కొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తారు? ఆత్మలో క్రొత్త యుగం యొక్క
సంస్కారాలు లేదా నవయుగ స్థాపకుడైన బాబా సమానమైన సంపూర్ణ సంస్కారాలను ధారణ
చేయటమే క్రొత్త వస్త్రాలను ధరించటం. శరీరానికి క్రొత్త దుస్తులు ఎన్ని అయినా
వేసుకోండి. కానీ ఈనాటి పాత ప్రపంచంలో క్రొత్త వస్తువు కూడా, క్రొత్త ప్రపంచం
ముందు పాతదే. ఎందుకంటే జడీభూత స్థితికి చేరుకుంది. కనుక క్రొత్త దుస్తులు
వేసుకున్నా కానీ అవి క్రొత్తవి అని అనకూడదు. సతోప్రధాన ప్రపంచంలో అన్నీ
క్రొత్తవి ఉంటాయి. తమోప్రధాన ప్రపంచంలో వస్తువులన్నీ పాతవే, అసారమైనవి. వాటిని
క్రొత్తవి అని అంటారా, ఏమిటి? నూతన వస్త్రాలు అనగా నూతన సంస్కారాలు, శ్రేష్ట
సంస్కారాలు ధారణ చేయాలి. ఇంకా ఏమి చేస్తారు? ఎవరైతే ఆత్మలో క్రొత్త సంస్కారాలని
ధారణ చేసేశారో, లెక్కాచారం సరిచేసుకుంటే ఇల్లు అలకటం పూర్తయినట్లే. ఇల్లు అలకటం
అంటే స్వచ్ఛత, సత్యత. ఎలాగైతే ఇల్లు అలికితే అస్వచ్చత, క్రిమికీటకాదులు అన్నీ
నమాప్తం అయిపోతాయో, అలాగే మీ ఖాతాను పరిశీలించుకోవటం ద్వారా మీలో ఏవైతే
బలహీనతలు ఉంటాయో అవన్నీ స్వతహాగానే సమాప్తం అయిపోతాయి. ఏ మధుర మాటలను ఒకరికొకరు
పంచుకుంటారు? దీపావళి రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు కదా!
ఒకరికొకరు ఏమి బహుమతి ఇస్తారు? మీ దగ్గర ఏమి ఉన్నాయి బహుమతి ఇచ్చేటందుకు?
స్నేహం అనే బహుమతి ఉంది. స్నేహం అయితే ఒకరికొకరు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటారు.
కానీ ఈ రోజు విశేష స్నేహిగా అయ్యారా? స్నేహిలే మీరు కానీ ఆ స్నేహంతో ఒకరికొకరు
సమీపంగా ఉన్నదానికి గుర్తుగా దీపాల మాల అని అంటారు. విశేష రోజుల్లో విశేషంగా ఏ
బహుమతి ఇవ్వాలి? ఇప్పటి వరకు మీ పురుషార్ధం ద్వారా ఏదైతే సహజ సఫలత పొందారో లేదా
ఏదైతే అనుభవం చేసుకున్నారో అలా మీ అనుభవాల యొక్క జ్ఞాన రత్నాలను, వేటి ద్వారా
వారిని ప్రత్యక్ష అనుభవిగా తయారు చేయగలరో అలాంటి రత్నాలను విశేషంగా ఒకరికొకరు
ఇచ్చిపుచ్చుకోండి. అర్థమైందా! బాబా ఇచ్చిన ఖజానాను మీ అనుభవం ద్వారా ఏదైతే మీ
స్వంతం చేసుకున్నారో, అలా మీ స్వంతం చేసుకున్న జ్ఞాన రత్నాలను ఒకరికొకరు
ఇవ్వండి. వాటి ద్వారా ఆ ఆత్మ కూడా అంతే సహజంగా అనుభవీ అయిపోవాలి. ఇదే బహుమతి
ఇవ్వటం. ఒకరికొకరు ఇదే బహుమతిని ఇచ్చుకోవాలి, అది సదాకాలికంగా గుర్తు
ఉండిపోవాలి. ఎప్పుడైతే ఇలాంటి రత్నాలను ఎవరికైనా ఇస్తారో సదాకాలికంగా ఆ ఆత్మకి
బాబాతో పాటు మీరు ఇచ్చిన రత్నాలు తప్పకుండా గుర్తుంటాయి. ఈ విధంగా ఎవరినైనా
కానీ సదాకాలికంగా సంపన్నం చేసే బహుమతిని ఇవ్వాలి. ఇలాంటి దీపావళిని జరుపుకోండి.
మరియు ఇలాంటి శ్రేష్ట ఆత్మగా అయ్యి ఇతరాత్మల యొక్క శ్రేష్ఠ సేవను చేయండి.
ఈరోజున సర్వాత్మలు ధనానికి దప్పికతో ఉంటారు. అలా
దప్పికగొన్న ఆత్మలకి ఆత్మిక ధనాన్ని ఇవ్వండి. దాని ద్వారా ఆ ఆత్మకి ఎప్పుడూ
కూడా ధనం అడగాల్సిన అవసరం ఉండదు. ధనాన్ని ఎవరు అడుగుతారు? బికారులు. అంటే ఈరోజు
అందరు బికారులు అవుతారు. రాయల్ బికారులు. ఎంత కోటీశ్వరులు అయినా కానీ ఈ రోజున
అందరు కూడా బికారులు అవుతారు. అలాంటి బికారి ఆత్మలను బికారి స్థితి నుండి
విడిపించండి. ఇది బేహద్ సేవ. దాత యొక్క పిల్లలు కదా! దాత యొక్క పిల్లలు, వరదాత
యొక్క పిల్లలు. మీ వరదానం యొక్క శక్తి ద్వారా, జ్ఞానధనం యొక్క శక్తి ద్వారా
బికారులను సంపన్నంగా తయారుచేయండి. ఈరోజు ఇలాంటి బికారి ఆత్మలపై విధాత మరియు
వరదాత పిల్లలకి దయ రావాలి. ఏ ఆత్మలకైతే ఇలాంటి దయ వస్తుందో వారికే మాయ మరియు
విశ్వంలోని ఆత్మలందరు నమస్కరిస్తారు. అందువలనే ఇప్పటి వరకు కూడా దీపం
వెలిగించినా, లైటు వేసినా నమస్కరిస్తారు. ఇలా వెలిగే జ్యోతులకు స్మృతిచిహ్నంగా
దీపానికి లేదా లైటుకి నమస్కరించే నియమం స్థిరంగా ఉంది. ఆరిపోయిన దీపానికి ఎవరూ
నమస్కరించరు. కనుక సదా వెలిగే జ్యోతిగా అవ్వండి. అలాంటి ఆత్మలకి బాప్ దాదా కూడా
నమస్కరిస్తారు. మంచిది.