కర్మకి ఆధారం - వృత్తి.
ఈ రోజు ప్రవృత్తిలో ఉండే వారి యొక్క భట్టీ ప్రారంభం.
మిమ్మల్ని మీరు పాండవులుగా భావిస్తున్నారా? మీ పాండవ స్వరూపం నిరంతరం స్మృతిలో
ఉంటుందా? లేక ఒకసారి పాండవులుగా మరోసారి కుటుంబంలో ఉండేవారిగా భావిస్తున్నారా?
నిరంతరం స్వయాన్ని పాండవునిగా అనగా పండాగా భావించటం ద్వారా సదా యాత్ర మరియు
గమ్యం తప్ప మరేదైనా గుర్తు ఉంటుందా? ఒకవేళ మరేదైనా స్మృతి ఉంటుందంటే దానికి
కారణం మీ యొక్క పాండవ స్వరూపాన్ని మర్చిపోవటమే. స్మృతి అనగా వృత్తి మారటం
ద్వారా కర్మ కూడా మారిపోతుంది. కర్మకి ఆధారం - వృత్తి. ప్రవృత్తి అనేది వృత్తి
ఆధారంగా పవిత్రం లేదా అపవిత్రం అవుతుంది. కనుక పాండవసేన మీ వృత్తిని సదా ఒకే
బాబాతో పాటు ఉంచాలి. అప్పుడు ఆ వృత్తి ద్వారా మీ ఉన్నతిలో వృద్ధి అవుతుంది.
వృద్ధికి కారణం - వృత్తి, వృత్తిలో ఏమి పెట్టుకోవాలి? ఒకవేళ వృత్తి ఉన్నతంగా
ఉన్నట్లయితే ప్రవృత్తి కూడా ఉన్నతంగా ఉంటుంది. మరయితే వృత్తిలో ఏమి
పెట్టుకోవాలి. దాని ద్వారా సహజంగా వృద్ధి జరగాలి. దాని కొరకు వృత్తిలో సదా ఇదే
గుర్తుంచుకోండి - ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు. ఒక్క బాబాతోనే సర్వసంబంధాలు,
సర్వ ప్రాప్తులు ఉన్నాయి. ఇది సదా వృత్తిలో ఉండటం ద్వారా దృష్టిలో ఆత్మిక
స్వరూపం అనగా సోదరుల దృష్టి సదా ఉంటుంది. ఎప్పుడైతే ఒక్క బాబాతో సర్వసంబంధాల
ప్రాప్తిని మర్చిపోతారో అప్పుడే వృత్తి చంచలం అవుతుంది. ఒక్క బాబా తప్ప మరే
సంబంధం లేనప్పుడు వృత్తి ఎందుకు చంచలం అవుతుంది? వృత్తి ఉన్నతంగా ఉండటం ద్వారా
చంచలత ఉండదు. వృత్తిని శ్రేష్టంగా తయారుచేస్కోండి. అప్పుడే ప్రవృత్తి
స్వతహాగానే శ్రేష్టం అయిపోతుంది. అందువలన మీ వృత్తిని శ్రేష్టంగా
తయారుచేస్కోండి. అప్పుడు ఇదే ప్రవృత్తి మీ ప్రగతికి కారణం అవుతుంది. మరియు
ప్రగతి ద్వారా గతి సద్గతి సహజంగానే పొందగలరు. అప్పుడు ఈ ప్రవృత్తి అనేది
మిమ్మల్ని పడేయటానికి కారణమవ్వదు. ప్రవృత్తి మార్గంలో ఉండేవారు తమ ప్రగతి కోసం
వృత్తిని సరి చేసుకోవాలి. అప్పుడు వృత్తి యొక్క చంచలత అనే ఫిర్యాదు సమాప్తి
అయిపోతుంది. స్మృతి లేదా వృత్తిలో సదా మీ నిర్వాణధామం మరియు నిర్వాణ స్థితి
ఉండాలి మరియు చరిత్రలో నిర్మానంగా ఉండాలి. నిర్మానం, నిర్మాణం మరియు
నిర్వాణం... ఈ మూడింటి స్మృతి ఉండటం ద్వారా, చరిత్ర, కర్తవ్యం మరియు స్థితి ఈ
మూడింటి స్మృతి ఉండటం ద్వారా సమర్థవంతులు అయిపోతారు. అనగా స్మృతిలో సమర్థత
వస్తుంది. ఎక్కడ సమర్ధత ఉంటుందో అక్కడ మూడింటి యొక్క విస్మృతి ఉండదు. కనుక
విస్మృతిని తొలగించుకునేటందుకు స్మృతిని సమర్థంగా ఉంచుకోండి. ఇదయితే చాలా సహజం
కదా! చరిత్రలో నిర్మానత ఉంటే విశ్వనిర్మాణం యొక్క కర్తవ్యాన్ని స్వతహాగానే
చేయగలరు. నిర్మానత అనగా నిరహంకారి. నిర్మానతలో దేహ అహంకారం స్వతహాగానే సమాప్తం
అయిపోతుంది. ఈ విధంగా నిర్మాన స్థితిలో ఉండేవారు సదా నిర్వాణ స్థితిలో స్థితులై
ఉండి వాణిలోకి వస్తారు. అప్పుడు ఆ వాణి కూడా యదార్ధంగా మరియు శక్తిశాలిగా
ఉంటుంది. ఏ వస్తువు అయినా ఎంత అధిక శక్తిశాలిగా ఉంటుందో అంత చిన్నదిగా మరియు
శక్తివంతంగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే నిర్మాన స్థితిలో స్థితులై వాచాలోకి
వస్తారో అప్పుడు వాచాలో కూడా మాటలు తక్కువ కానీ శక్తి ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ
విస్తారం చేయవలసి వస్తుంది. కానీ శక్తిశాలి స్థితి తయారు చేసుకునే కొలదీ మీ
యొక్క ఒక్కమాటలో వేల మాటల యొక్క రహస్యం నిండి ఉంటుంది. దీని ద్వారా వ్యర్ధ
మాటలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. చిన్న బ్యాడ్జిలో జ్ఞానం యొక్క సారం అంతా
ఎలాగైతే ఇమిడి ఉంటుందో. సాగరం అంతా ఈ చిన్న చిత్రంలో సారరూపంలో ఇమిడి ఉంటుందో,
అదేవిధంగా మీ యొక్క ఒక్క మాట కూడా జ్ఞానం యొక్క అనేక రహస్యాలతో నిండి
వెలువడుతుంది. ఇలా వాడాలో కూడా శక్తిని నింపుకోవాలి. ఎప్పుడైతే వృత్తి మరియు
వాచా శక్తిశాలిగా అయిపోతాయో అప్పుడు కర్మ కూడా సదా యదార్ధంగా మరియు శక్తిశాలిగా
ఉంటుంది...
బ్యాటరీని చార్జ్ చేసుకునేటందుకు ఇక్కడికి వచ్ఛారు.
బ్యాటరీ చార్జ్ చేసుకునేటందుకు సదా స్వయాన్ని విశ్వ నిర్మాణం చేసే ఇన్చార్జిగా
భావించండి. సదా స్వయాన్ని ఈ సృష్టి కర్తవ్యం యొక్క ఇన్చార్జిగా భావిస్తే సదా
బ్యాటరీ చార్జ్ అయ్యి ఉంటుంది. ఈ స్మృతి నుండి విస్మృతి అవుతున్నారు. అందువలనే
బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోతుంది. అందువలన సదా స్వయాన్ని ఈ కర్తవ్యంలో
ఇన్చార్జిగా భావించండి మరియు మీ బ్యాటరీ చారింగ్ ని తరచుగా పరిశీలించుకోండి.
అప్పుడు ఎప్పుడూ కూడా మీ సంకల్పం లేదా కర్మలో లేదా ఆత్మ యొక్క స్థితిలో
చార్జింగ్ తక్కువ అవ్వదు. అప్పుడు ఈ ఫిర్యాదు సమాప్తం అయిపోతుంది. ఈ ఫిర్యాదు
కూడా ఉంది కదా! అందరిలో ఎక్కువగా ఈ ఫిర్యాదు ఉంది. దీనికి కారణం ఏమిటంటే సదా
స్వయాన్ని ఇటువంటి శ్రేష్ట కర్మకి ఇన్ చార్జిగా భావించటం లేదు. నేను ఏ కర్మ
అయితే చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు. ఈ సూక్తి అయితే ఉంది. కానీ ఈ
సూక్తిని మరింత గుహ్య రూపంలో ఎలా ధారణ చేయాలో తెలుసా? పాండవుల భట్టీలో గుహ్య
సూక్తి అవసరం అది ఏమిటి? ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అనేది
ఎలాగైతే చెప్పానో, అలాగే నిమిత్త అత్మనైనా నా యొక్క వృత్తి ఏవిధంగా ఉంటుందో
వాయుమండలం ఆవిధంగా ఉంటుంది. నా వృత్తి ఎలాంటిదో వాయుమండలం అలా ఉంటుంది. కనుక
వాయుమండలాన్ని పరివర్తన చేసేది వృత్తి కర్మకంటే వృత్తి అనేది సూక్ష్మమైనది.
ఇప్పుడు కేవలం కర్మపైనే ధ్యాస ఇవ్వటం కాదు. వృత్తి ద్వారా వాయుమండలాన్ని
తయారుచేసే ఇన్ చార్జిని నేనే అని స్వయాన్ని భావించాలి. వాయుమండలాన్ని సతో
ప్రధానంగా ఎవరు తయారుచేస్తారు? నిమిత్త ఆత్మలైన మీరందరు కదా! ఒకవేళ ఈ సూక్తి
సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే వృత్తి చంచలం అవుతుందా? పిల్లలు కూడా అల్లరి
ఎప్పుడు చేస్తారు? ఖాళీగా ఉన్నప్పుడు. అదేవిధంగా ఎప్పుడైతే వృత్తి లేదా స్మృతి
ఇంత పెద్ద కార్యంలో ఉండకుండా, తీరికగా ఉంటుందో అప్పుడే చంచలం అవుతుంది. ఒకవేళ
ఎవరైనా అతి చంచల బిడ్డ బిజీగా ఉన్నా కానీ చంచలత వదలకపోతే దానికి మరొక సాధనం
ఏమిటి? ఇదే ఫిర్యాదు ఇప్పటి వరకు ఉంది. వృత్తిని స్మృతిలో లేదా జ్ఞానంలో బిజీగా
ఉంచేటందుకు ప్రయత్నిస్తున్నారు కూడా. అయినా కానీ చంచలం అయిపోతున్నాయి. అప్పుడు
ఏమి చేయాలి? ఎలాగైతే అల్లరి పిల్లలని ఏదోక రకంగా, ఏదోక బంధనలో బంధించడానికి
ప్రయత్నిస్తారు. స్థూల బంధన అయినా లేదా మాటలతో చెప్పి లేదా ఏదోక ప్రాప్తిని
ఇచ్చి వారిని మీ యొక్క స్నేహంలో బంధిస్తారు. అదేవిధంగా బుద్దిని లేదా
సంకల్పాన్ని కూడా ఏదోక బంధనలో బంధించవలసి ఉంటుంది. ఆ బంధన ఏమిటి? బుద్ది
ఎక్కడికి వెళ్తుందో మొదట పరిశీలించండి. ఆ తర్వాత సంకల్పం లేదా వృత్తి ఎక్కడికి
వెళ్తుందో ఆ లౌకిక దేహధారిని లేదా వస్తువుని పరివర్తన చేసుకోండి. ఆ లౌకిక
దేహధారి లేదా వస్తువుకి బదులు అలౌకిక అవినాశి వస్తువుని స్మృతిలోకి
తెచ్చుకోండి. ఏ దేహధారి పైన అయినా మీ వృత్తి చంచలం అవుతుంటే ఏ సంబంధంలో చంచలము
అవుతుందో ఆ సంబంధాన్ని ప్రత్యక్షంగా అవినాశిగా బాబాతో అనుభవం చేసుకోండి. కుటుంబ
సంబంధాలలో వృత్తి చంచలం అవుతుందంటే సర్వసంబంధాలను తండ్రితో నిలుపుకుని
ప్రాప్తిని పొందండి. ఎప్పుడైతే ప్రాప్తి పొందుతారో అప్పుడు చంచలత నుండి
నివృత్తి అయిపోతారు. అర్ధమైందా? సర్వ సంబంధాలు లేదా సర్వ ప్రాప్తులు ఒకే బాబాతో
పొందితే అప్పుడిక ఇతర వైపుకి బుద్ధి చంచలం అవుతుందా? మీ చంచల వృత్తిని
సర్వసంబంధాల బంధనలో ఒకే బాబాతో జోడించండి అప్పుడు సర్వ చంచలతలు సహజంగానే
సమాప్తి అయిపోతాయి. మరే ఇతర సంబంధం లేదా ప్రాప్తిని పొందే సాధనం కనబడదు, వృత్తి
వెళ్ళదు. సీతకి గీత లోపల ఉండమనే ఆజ్ఞ ఉంది కదా! అలా మిమ్మల్ని మీరు ఈ బంధనలో
బంధించుకోండి. ప్రతీ అడుగు వేస్తూ, ప్రతీ సంకల్పం చేస్తూ బాబా ఆజ్ఞ అనే రేఖలోపల
ఉండండి. సంకల్పంలోనైనా ఆజ్ఞ అనే రేఖ నుండి బయటికి వస్తే అప్పుడే వ్యర్థ విషయాలు
యుద్ధం చేస్తాయి. సదా ఆజ్ఞ అనే రేఖ లోపల ఉంటే రక్షణగా ఉంటారు. ఏరకమైన రావణ
సంస్కారాలు యుద్ధం చేయవు మరియు ప్రతిసారి ఈ వ్యర్థ విషయాలలో మీ సమయం వ్యర్ధం
అవ్వదు. యుద్ధం ఉండదు, సమయం కూడా తరచు వ్యర్థం అవ్వదు. అందువలన ఇప్పుడు ఆజ్ఞను
సదా గుర్తుంచుకోండి. ఈవిధంగా ఆజ్ఞాకారులుగా అవ్వటానికే భట్టీకి వచ్చారు. కనుక
ఒక్క సంకల్పం కూడా ఆజ్ఞ లేకుండా ఉండకూడదు. అలాంటి అభ్యాసం చేసుకుని వెళ్ళండి.
అలాంటి ఆజ్ఞాకారులు అనే తిలకాన్ని సదా స్మృతిలో పెట్టుకోండి. ఈ తిలకం
పెట్టుకోండి, అప్పుడు చూస్తాను - మొదటి నెంబరుగా ఎవరు అవుతారో. ఈ తిలకాన్ని
ధారణ చేయటంలో మొదటి నెంబరు ఎవరు తీసుకుంటారో చూస్తాను. మంచిది.