పవిత్ర హంసగా అయ్యే దానికి సృతచిహ్నం - హోలీ.
మీరు సదా బాబా సాంగత్యంలో, ఆత్మిక రంగులో ఉండే పవిత్ర
హంసలు. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారికి సదా హోలీయే, కనుక సదా బాబాకి స్నేహిగా,
సహయోగిగా, సర్వశక్తుల రంగులో ఉండే ఆత్మ, కనుక మీరు సదాకాలికంగా హోలీ
జరుపుకుంటున్నారా? లేక అల్పకాలికంగా జరుపుకుంటున్నారా? సదా హోలీ జరుపుకునేవారు
సదా బాబా కలయిక జరుపుకుంటూ ఉంటారు. సదా అతీంద్రియ సుఖంలో, అవినాశి సంతోషంలో
తేలుతూ మరియు ఊగుతూ ఉంటారు. మీరు ఈ విధమైన స్థితిలో ఉండే పవిత్ర హంసలేనా? ప్రజలు
ఉత్సాహం కోసం, ప్రతి పండుగ కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే పండుగ వారిలో
అల్పకాలిక ఉత్సాహం తీసుకువస్తుంది. కానీ శ్రేష్టాత్మలైన మీకు ప్రతి రోజే కాదు,
ప్రతి సెకను పండుగే, అంటే ఉత్సాహాన్నిచ్చేది. అవినాశి అంటే మీకు నిరంతరం పండుగ
అయ్యింది కదా! కనుక హోలీ జరుపుకోవటానికి వచ్చారా లేదా పవిత్రంగా అయ్యి పవిత్ర
బాబాతో కలయిక జరుపుకునేటందుకు వచ్చారా? లేక మీరు సదా సాంగత్యంలో ఉండే రంగు
యొక్క రూపం చూపించటానికి వచ్చారా? హోలీలో అల్పకాలిక ఆనందంలో లీనమైపోతారు. కనుక
మీరు మీ అవినాశి ఈశ్వరీయ ఆనంద స్వరూపాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఎలా అయితే
హోలీ ఆనందంలో లీనమైన కారణంగా తమ సంబంధం అంటే చిన్న, పెద్ద అనే అభిమానాన్ని
మర్చిపోతారు. పరస్పరం ఒకటిగా భావించి ఆనందంలో ఆడతారు. మనస్సులో ఎవరి పట్ల
శత్రువు అనే సంకల్పం ఉన్నా అది అల్పకాలికంగా మర్చిపోతారు. ఎందుకంటే మంగళ కలయిక
రోజుగా జరుపుకుంటారు. ఈ వినాశి విధానం ఎక్కడి నుండి ప్రారంభం అయ్యింది? ఈ విధానం
నడిపించడానికి ఎవరు నిమిత్తం అయ్యారు? బ్రాహ్మణులైన మీరే అయ్యారు. ఇప్పుడు కూడా
ఎప్పుడైతే హోలీ అంటే పవిత్ర స్థితిలో ఉంటారో లేక బాబా సాంగత్యమనే రంగులో ఉంటారో
అప్పుడు ఈశ్వరీయ ఆనందంలో ఈ దేహం యొక్క అభిమానం లేదా భిన్న,భిన్న సంబంధాల అభిమానం,
చిన్న, పెద్ద యొక్క అభిమానం మర్చిపోయి ఒకే ఆత్మ స్వరూపం యొక్క అభిమానం ఉంటుంది
కదా! మీ సదాకాలిక స్థితి యొక్క స్మృతిచిహ్నం ప్రపంచం వారు జరుపుకుంటున్నారు. ఈ
విధమైన సంతోషం ఉంటుందా? మీ ప్రత్యక్ష స్థితి యొక్క ప్రమాణ స్వరూపమే ఈ
స్మృతిచిహ్నం. స్మృతిచిహ్నం చూస్తూ మీ కల్పపూర్వపు ప్రవర్తన యొక్క స్మృతి
వస్తుందా? లేక వర్తమాన సమయంలో మీరు చేసిన ఈశ్వరీయ చరిత్ర యొక్క సంస్కారం మీ
దర్పణంలో సాక్షాత్కారం చేసుకుంటున్నారా? అద్భుతం కదా! ఇక్కడే చైతన్య చరిత్ర
చూస్తున్నారు, ఇక్కడే మీ స్మృతిచిహ్నం కూడా చూస్తున్నారు కదా! మీ స్థితి యొక్క
వర్ణన ఇతరాత్మల ద్వారా వర్ణన రూపంలో వింటున్నారు. మీ చైతన్య ఆత్మిక రూపం యొక్క
చరిత్రల స్మృతిచిహ్నం కూడా చూస్తున్నారు. ఇవన్నీ చూస్తూ, వింటూ ఏమి అనుభవం
చేసుకుంటున్నారు? ఇది నేనే అని భావిస్తున్నారా? ఈ విధంగా భావిస్తున్నారా లేదా ఈ
స్మృతిచిహ్నం ఎవరో విశేషాత్మలది అని భావిస్తున్నారా? ఎలా అయితే సాకార
బ్రహ్మాబాబాలో ఈ నిశ్చయం కర్మలో చూసారు కదా! తన భవిష్య చిత్రాన్ని చూస్తూ సదా
ఇది నేనే అని ఆనందం, సంతోషం ఉండేది. అదేవిధంగా మీ అందరి స్మృతిచిహ్న చిత్రం
చూస్తూ లేదా చరిత్ర వింటూ లేక గుణాల మహిమ వింటూ ఆ చిత్రం నేనే అనే సంతోషం
ఉంటుందా? మేము ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష రూపంలో పాత్ర అభినయిస్తున్నాము,
ఇప్పుడిప్పుడే మన స్మృతిచిహ్నం యొక్క పాత్ర చూస్తున్నాము అని స్మృతి ఉండాలి.
మొత్తం కల్పంలో తమ స్మృతి చిహ్నాన్ని చూసే ఆత్మలు ఎవరైనా ఉన్నారా? ఈ స్మృతిలో
స్మృతిచిహ్నం చూస్తున్నారు. స్మృతి ద్వారా మీ స్మృతిచిహ్నం చూస్తే ఏమవ్వాలి?
విజయీ అవ్వాలి. విజయీ తిలకం పెట్టబడి ఉంది. ఎలా అయితే గురువుల దగ్గరకు, పండితుల
దగ్గరకు వెళ్లే వారు తిలకం పెడతారు కదా! అలాగే ఇక్కడికి రావటంతోనే పిల్లలు
అవ్వటంతోనే స్వ స్మృతి ద్వారా విజయీ అయ్యే తిలకం బాప్ దాదా ద్వారా పెట్టబడుతుంది.
అందువలనే పండితులు కూడా తిలకం పెడతారు. అన్ని విధానాలు బ్రాహ్మణుల ద్వారా
తయారవుతాయి. బ్రాహ్మణుల తండ్రి, రచయిత వెంటే ఉన్నారు. పిల్లలు అనే మాటయే
తండ్రిని ప్రసిద్ధం చేస్తుంది. బలిహారం అయ్యే వారికి ఓటమి ఉండదు. ఈ స్మృతి
స్వరూపంలో మీ స్మృతి స్వరూపాన్ని చూస్తూ అన్ని స్మృతులు వస్తున్నాయా? స్మృతి
శక్తిని తీసుకువస్తుంది మరియు శక్తిలోకి రావటం ద్వారా కార్యం సఫలం అవుతుంది. నషా,
ఆనందం, సంతోషం, గమ్యం అన్నీలభిస్తాయి. ఈ అన్ని విషయాలు మాయం అవ్వటానికి కారణం -
నిర్బలత. విస్మృతికి కారణం- శక్తి లేకపోవటం. కనుక స్మృతి ద్వారా శక్తి రావటం
ద్వారా అన్నీ లభిస్తాయి. అంటే అని కార్యాలు సిద్ధిస్తాయి. సర్వ స్మృతిలో
ఉండేవారు సదా ఏ కార్యం చేసినా లేదా సంకల్ప చేసినా దానిలో వారికి ఈ కార్యం లేదా
సంకల్పం సిద్దించే ఉంది అనే నిశ్చయం ఉంటుంది. అంటే నిశ్చయబుద్ధి ఆత్మలు తమ విజయం
లేదా సఫలత నిశ్చితం అయిపోయింది అని భావించి నడుస్తారు. నిశ్చితం అయిపోయింది. ఈ
నిశ్చయబుద్ధి ఆత్మల నడవడిక ఎలా ఉంటుంది? వారికి ముఖంలో విశేషంగా ఏమి మెరుపు
కనిపిస్తుంది? విజయం మాకు నిశ్చితం అయిపోయింది అనే నిశ్చయం ఉంటుంది, కాని వారి
ముఖంలో ఏమి కనిపిస్తుంది? విజయం నిశ్చితం అయితే నిశ్చింతగా ఉంటారు కదా! ఏ
విషయంలో చింత యొక్క రేఖ కనిపించదు. ఈవిధంగా నిశ్చయబుద్ది విజయీ నిశ్చింత. మరి
సదా నిశ్చయంగా ఉండేవారేనా? ఒకవేళ నిశ్చయం లేకపోతే 100 శాతం నిశ్చయబుద్ది అని ఎలా
అంటారు? 100 శాతం నిశ్చయుబుద్ది అంటే విజయం నిశ్చితమై ఉంటుంది. బాబాపై నిశ్చయం
ఉంటే నిశ్చయుబుద్ది అని అనరు. బాబాపై నిశ్చయంతో పాటు వెనువెంట మీపై మీకు కూడా
నిశ్చయం ఉండాలి మరియు వెనువెంట డ్రామా యొక్క పాత్ర ప్రతి సెకను ఏదైతే రిపీట్
అవుతుందో దానిపై కూడా 100 శాతం నిశ్చయం ఉండాలి. వీరినే నిశ్చయబుద్ధి అంటారు.
బాబాపై 100 శాతం నిశ్చయబుద్ధి అయ్యారు కదా! దీనిలో సంశయం యొక్క విషయం లేదు.
కేవలం ఒక దానిలో పాస్ అవ్వటం కాదు, మీపై మీకు కూడా నేను కల్పపూర్వపు ఆత్మను,
బాబాతో పాత్ర అభినయించే శ్రేష్టాత్మను మరియు వెనువెంట డ్రామాలో ప్రతి సెకను
యొక్క పాత్ర కూడా నాకు కళ్యాణకారి అనే స్థితిలో చూడాలి. మీపై మీకు కూడా ఇంత
నిశ్చయం ఉండాలి. ఎప్పుడైతే ఈ మూడు రకాలైన నిశ్చయంలో సదా దగ్గరగా ఉంటారో ఈ
విధమైన నిశ్చయబుద్ది ఆత్మలే జీవన్ముక్తి మరియు ముక్తిలో కూడా బాబాకి దగ్గరగా
ఉంటారు. ఇటువంటి నిశ్చయబుద్ది ఆత్మలేనా లేదా మీపై లేదా పాత్రపై ఎప్పుడైనా
ప్రశ్న వస్తుందా? నిశ్చయబుద్ది ఆత్మకు ఎప్పుడు ప్రశ్న రాదు. నిశ్చయబుద్ధి
ఆత్మలకు ఎందుకు, ఏమిటి అనే భాషే ఉండదు. ఎందుకు అనే వెనుక క్యూ పెడితే ఆ క్యూలో
భక్తులు ఉంటారు, జ్ఞానీ ఆత్మలు కాదు. క్యూలో ఎదురుచూడవలసి వస్తుంది. ఎదురుచూసే
సెకనులు సమాప్తి అయిపోయాయి. ఎదరుచూసే ఘడియలు భక్తులవి. జ్ఞానం అంటే ప్రాప్తి
యొక్క ఘడియలు, కలయిక యొక్క ఘడియలు. ఇటువంటి నిశ్చయబుద్ధి ఆత్మలే కదా! ఇటువంటి
నిశ్చయబుద్ధి ఆత్మల స్మృతిచిహ్నం ఇక్కడే చూపించబడింది. మీ స్మృతిచిహ్నం చూసారా?
అఛలఘర్ చూసారా? ఎవరైతే సదా సర్వ సంకల్పాల సహితంగా బాబాపై బలిహారం అవుతారో వారి
ఎదురుగా మాయ ఎప్పుడూ యుద్ధం చేయదు. ఈ విధంగా మాయ నుండి రక్షించబడి ఉంటారు.
పిల్లలుగా అయితే రక్షించబడతారు. పిల్లలుగా కాకపోతే మాయా యుద్ధం నుండి
రక్షించబడరు. మాయ నుండి రక్షించుకునే యుక్తి చాలా సహజమైనది. పిల్లలుగా అయ్యి
ఒడిలో కూర్చుంటే రక్షించబడతారు. మొదట రక్షించుకునే యుక్తి చెప్తున్నాను, తర్వాత
పంపిస్తున్నాను. బలవంతులుగా అవ్వడానికి పంపిస్తున్నాను, ఓడిపోవడానికి కాదు. ఆట
ఆడడానికి పంపిస్తున్నాను ఎప్పుడైతే అలౌకిక జీవితంలో ఉన్నారో, అలౌకిక కర్మ
చేస్తున్నారో ఈ అలౌకిక జీవితంలో ఆటబొమ్మలు అన్ని అలౌకికమైనవే. ఇవి కేవలం అలౌకిక
యుగంలోనే అనుభవం చేసుకుంటున్నారు. ఇది ఆటబొమ్మ దీనితో ఆడుకోవాలి, ఓడిపోకూడదు.
ఆరోగ్యానికి, శారీరక శక్తి కోసం కూడా ఆడతారు కదా! అలౌకిక యుగంలో, అలౌకిక బాబా
ద్వారా ఇది అలౌకిక ఆట. ఈ విధంగా భావించి ఆడితే భయపడరు, అలజడి అవ్వరు, ఓడిపోరు.
సదా ఇదే గౌరవంలో ఉండండి. దీని ద్వారా సహజంగానే దేహాభిమానం సమాప్తి అయిపోతుంది.
ఈశ్వరీయ గౌరవం నుండి క్రిందికి వచ్చేస్తున్నారు. అప్పుడు దేహాభిమానంలోకి
వచ్చేస్తున్నారు. సదాకాలికంగా సాంగత్యం ద్వారా సాంగత్యం యొక్క రంగు అంటించుకోండి.
ప్రతి రోజు బాబాని కలుసుకుంటూ, ప్రతి రోజు అమృతవేళ పెట్టబడిన విజయీ తిలకం
చూసుకోండి. మీ చార్ట్ రూపి దర్పణంలో ఎలా అయితే అమృతవేళ లేచి శరీర రూపి శృంగారం
చేసుకుంటారు కదా! అలాగే బాబా ద్వారా లభించిన సర్వశక్తుల ద్వారా ఆత్మ యొక్క
శృంగారం చేసుకోండి. శృంగారం చేసుకున్నవారు సంహారిమూర్తిగా కూడా ఉంటారు. మొత్తం
మీరు శ్రేష్టాత్మలు కనుక శ్రేష్టాత్మల శృంగారం కూడా శ్రేష్టంగా ఉంటుంది. మీ
జడచిత్రాలు సదా శృంగారించబడి ఉంటాయి. దేవతల చిత్రాలలో శృంగారమూర్తి మరియు
సంహారిమూర్తి రెండు కనిపిస్తాయి. కనుక రోజు అమృతవేళ ఈ విధంగా శృంగారం చేసుకోండి.
చేసేవారు కూడా మీరే మరియు చేసుకునేవారు కూడా మీరే. అప్పుడిక ఏ పరిస్థితిలో అలజడి
అవ్వరు, స్థిరంగా ఉంటారు. అటువంటి వారిని పవిత్ర హంసలు అంటారు. ప్రజలు హోలీ
జరుపుకుంటారు, కానీ మీరు స్వయం పవిత్ర హంసలు. ఇటువంటి పవిత్ర హంసలకు హెలీయస్ట్
అయిన బాబా యొక్క నమస్తే.