15.03.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


త్యాగం మరియు భాగ్యం.

స్వయాన్ని త్యాగి, తపస్వీ మూర్తిగా భావిస్తున్నారా? అన్నింటికంటే ఉన్నతోన్నతమైన శ్రమతో కూడిన త్యాగం ఏమిటి? దేహాభిమానం అని పిల్లలు చెప్పారు. అయితే ఈ జ్ఞాన అభిమానం లేదా బుద్ధి యొక్క అభిమానం కూడా ఎందుకు వస్తుంది? పాత సంస్కారాలను ఎందుకు త్యాగం చేయలేకపోతున్నారు? దీనికి ముఖ్య కారణం - దేహాభిమానం. దేహాభిమానాన్ని వదలటమే ఉన్నతోన్నతమైన త్యాగం. కనుక ప్రతి సెకను స్వయాన్ని పరిశీలించుకోండి. స్థూల త్యాగం ఏదైతే ఉందో అది ఒకసారి త్యాగం చేసిన తర్వాత దానిని ఇక తొలగించేస్తారు. కానీ ఈ దేహాభిమానం యొక్క త్యాగం ఎలాంటిది అంటే ప్రతి సెకను దేహం యొక్క ఆధారం తీసుకుంటూ ఉంటారు, కానీ అతీతంగా ఉంటారు. ఈ కారణంగా దేహంతో ఆత్మకు లోతైన సంబంధం ఉన్న కారణంగా ఈ దేహాభిమానం కూడా చాలా లోతుగా వచ్చేస్తుంది. అందువలన ఈ దేహాభిమానాన్ని తొలగించుకునేటందుకు శ్రమ అనిపిస్తుంది. ఏ వస్తువునైనా త్యాగం చేస్తే దానిని మర్చిపోతాము. కానీ మనం ఈ దేహాభిమానాన్ని త్యాగం చేసినప్పుడు ఈ దేహంతో మనకు ఎప్పుడూ సంబంధం ఉంటుంది, కనుక దానిని తొలగించుకోవటం మనకు శ్రమ. కనుక స్వయాన్ని నేను అన్ని రకాలుగా త్యాగం చేసానా అని అడగండి. ఎందుకంటే ఎంతగా త్యాగం చేస్తారో అంతగానే వర్తమాన సమయంలో మరియు భవిష్యత్తులో కూడా భాగ్యాన్ని పొందగలుగుతారు. సంగమయుగంలో కేవలం త్యాగమే చేయాలి, భవిష్యత్తులో భాగ్యం పొందుతాము అని అనుకోకండి. కానీ ఇలా కాదు ఈ సంగమయుగంలో ఎవరు ఎంత త్యాగం చేస్తారో మరియు ఏ ఘడియ త్యాగం చేస్తారో ఆ ఘడియలోనే ఆ త్యాగానికి బదులుగా ఇక్కడే ఆ త్యాగానికి భాగ్యం లభిస్తుంది. ఈ సంగమయుగంలో త్యాగానికి ప్రత్యక్ష రూపంలో భాగ్యం ఏమి లభిస్తుంది? తెలుసా? ఇప్పుడిప్పుడే మీకు భాగ్యం లభిస్తుంది. సత్యయుగంలో అయితే జీవన్ముక్తి పదవి లభిస్తుంది. కానీ ఇప్పుడు ఏమి భాగ్యం లభిస్తుంది? మీ త్యాగానికి తప్పకుండా భాగ్యం లభిస్తుంది. సంగమయుగంలో త్యాగానికి చాలా ఉన్నతోన్నతమైన భాగ్యం లభిస్తుంది. అది ఏమిటి? స్వయం భాగ్యం తయారుచేసే భాగ్యవిధాత మనవారిగా అవ్వటమే ఉన్నతమైన భాగ్యం. ఇది అన్నింటికంటే ఉన్నతోన్నతమైన భాగ్యం కదా? భాగ్యవిధాత భగవంతుడు మనవారిగా అవ్వటం ఈ సంగమయుగంలోనే ప్రాప్తిస్తుంది. స్వయం భగవంతుడు మనవారిగా అయిపోతారు. త్యాగం లేకపోతే బాబా కూడా మనవారిగా అవ్వరు. దేహాభిమానం ఉంటే మీకు బాబా గుర్తు ఉంటారా? బాబా యొక్క సంబంధం, మీ యొక్క సంబంధం అనుభవం అవుతుందా? ఎప్పుడైతే మీరు దేహాభిమానాన్ని త్యాగం చేస్తారో అప్పుడే దేహీ అభిమాని అంటే ఆత్మాభిమాని స్థితి తయారవుతుంది. దీని ద్వారా మీకు ఏమి ప్రాప్తిస్తుంది? నిరంతరం బాబా స్మృతిలో ఉండగలుగుతారు. ప్రతి సెకను త్యాగం చేయటం ద్వారా, ప్రతి సెకను బాబాతో సర్వ సంబంధాల యొక్క, సర్వశక్తుల యొక్క అనుభూతిని చేసుకోగలుగుతారు. మరియు ఇది అన్నింటికంటే ఉన్నతమైన భాగ్యం కాదా? ఇలా బాబాతో సర్వ సంబంధాలు, సర్వ శక్తుల అనుభూతి అనేది మనకు భవిష్యత్తులో కూడా లభించదు. అందువలనే ఇది సహజ జ్ఞానం మరియు సహజ రాజయోగం. దీనికి కేవలం భవిష్య ఫలమే కాదు, ఈ సంగమయుగంలో కూడా ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. భవిష్యత్తుతో పాటు వర్తమానం కూడా మీకు బంధీ అయ్యి ఉంది. కానీ సర్వ శ్రేష్ట భాగ్యం మొత్తం కల్పంలో మీకు ఎక్కడ దొరకదు. ఈ సమయం యొక్క త్యాగం మరియు తపస్య ద్వారా ప్రతి సెకను బాబాతో అనుభవం చేసుకుంటున్నారు. అంటే సర్వసంబంధాల రూపంతో బాబాను మీ వారిగా చేసుకుంటున్నారు. మీరు బాబాని పిలవటం లేదు, మీకు సర్వ ప్రాపులు లభించాయి కదా! సంకల్పంలో, స్వప్నంలో కూడా అనుకోనిది మీకు ప్రాప్తించింది కదా! దీనినే భాగ్యం అంటారు. శ్రమతో లభించే వస్తువుని భాగ్యం అనరు, మీకు సహజంగా లభించింది. అసంభవం సంభవం అయ్యింది. నిరాశావాదుల నుండి ఆశావాదులుగా అయ్యారు. అందువలనే దీనిని భాగ్యం అంటారు. మరి మీకు భాగ్యంగా లభించలేదా? మీరు బాబాని పిలిచింది కేవలం మీ వారిగా చేసుకో అని పిలిచారు. ఇంత ఉన్నతంగా తయారు చేయమని పిలవలేదు కానీ మీకు బాబా వారిగా అయిన తర్వాత ఏమి లభించింది? స్వయం ఉన్నతంగా తయారయ్యారు మరియు బాబాని కూడా అన్ని విధాలుగా మీ వారిగా చేసుకున్నారు. ఇది భాగ్యం కాదా? ఉన్నతోన్నతమైన శ్రేష్టభాగ్యం ఈ దేహాభిమానం యొక్క త్యాగం ద్వారానే లభిస్తుంది. ఒకవేళ దేహాభిమానాన్ని త్యాగం చేయలేకపోతున్నారు. అంటే ఆత్మాభిమానిగా కాలేకపోతున్నారు, అంటే మీకు భాగ్యం కూడా లభించదు. అంటే భాగ్యం నుండి మీరు వంచితం అయిపోతున్నారు. మొత్తం రోజంతటిలో కొంచెం సమయం దేహాభిమానాన్ని త్యాగం చేస్తున్నారు మరియు కొంచెం సమయం క్రిందికి వచ్చేస్తున్నారు. అంటే దేహాభిమానాన్ని త్యాగం చేయలేకపోతున్నారు, అంటే సంగమయుగము యొక్క భాగ్యము నుండి మీరు వంచితం అయిపోతున్నారు. భాగ్యం తయారుచేసే బాబా ప్రతి సెకను మీకు భాగ్యం తయారయ్యే విధి చెప్తున్నారు. మరి ఇంకేమి కావాలి? ఆ విధితో సర్వ సిద్దులు పొందాలి. కానీ ఆ విధిని మీరు సొంతం చేసుకోవటంలేదు. దాని వలన ఏమి ఫలితం స్తుంది? మీ స్థితి యొక్క వృద్ధి కూడా అవ్వటంలేదు మరియు సర్వప్రాప్తుల సిద్ధి కూడా లభించటంలేదు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? విధాత ద్వారా లభించిన విధులను మీ సొంతం చేసుకోవాలి. విధి ద్వారా వృద్ధి కూడా అవుతుంది, సిద్ది కూడా లభిస్తుంది. కనుక సంకల్ప రూపంలో నేను వ్యర్ధ సంకల్పాలను ఎంత వరకు త్యాగం చేసాను? అని పరిశీలన చేసుకోండి. వృత్తి రూపంలో సదా సోదరుల దృష్టి, వృత్తి ఉండాలి. ఆ వృత్తిని నేను ఎంత వరకు సొంతం చేసుకున్నాను? దేహంలో దేహధారి స్థితి యొక్క వృతిని ఎంత వరకు త్యాగం చేసాను? మైసూర్ వారు ఏమని భావిస్తున్నారు? ఈరోజు ఈ గ్రూపుని కలుసుకునేటందుకు వచ్చారు. ఎందుకంటే ఇంత దూరం నుండి శ్రమతో, స్నేహంతో వచ్చారు. కనుక బాబా కూడా దూరదేశం నుండి రావల్సి వచ్చింది. కనుక సంతోషంగా ఉంది కదా? ఈరోజు దూరదేశీ పిల్లలను కలుసుకునేటందుకు దూరదేశీ బాబా కూడా వచ్చారు. ఎవరితో స్నేహం ఉంటుందో ఆ స్నేహంలో త్యాగమేమీ గొప్ప విషయం కాదు. మీరు కూడా వికారాల యొక్క స్నేహంలోకి వచ్చి మీ యొక్క తెలివిని కూడా త్యాగం చేసారు. ఈ శరీరాన్ని కూడా త్యాగం చేసారు. తల్లి పిల్లల స్నేహంలో తనువుని కూడా త్యాగం చేస్తుంది మరి దేహధారి సంబంధం యొక్క స్నేహంలో తమ కిరీటాన్ని, సింహాసనాన్ని మరియు అసలైన స్వరూపాన్ని అన్నీ వదిలేసారు. మరి ఇప్పుడు బాబాకి స్నేహిగా అయ్యారు. బాబా స్నేహంలో ఈ దేహాభిమానాన్ని త్యాగం చేయలేరా? కష్టమా? ఆలోచించండి, అల్పకాలికంగా తల్లి, పిల్లల సంబంధంలోనే అంత శక్తి ఉన్నప్పుడు మరి మీకు బాబాతో ఎంత మంచి సంబంధం ఉంది? బాబా గురించి మీరు ఎంత త్యాగం చేయాలి? బాబాతో సంబంధం జోడించగలుగుతున్నారా? సర్వ సంబంధాలు బాబాతో జోడించి, బాబా స్నేహంలో ఈ వ్యతిరేక దేహాభిమానాన్ని త్యాగం చేయటం ఏమైనా గొప్ప విషయమా? చిన్న విషయమే కదా? మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక్క సెకనులో చేయాలి. ఎవరైనా బిడ్డ ఒక నెల జబ్బు పడితే తల్లి తన అల్పకాలిక సంబంధంతో దేహ సంబంధంలో ఒక నెల రోజులు అన్నింటిని త్యాగం చేస్తుంది. దేహ స్మృతి, సుఖం అన్నింటిని త్యాగం చేయటంలో ఆలస్యం చేయదు. కష్టమని కూడా అనుకోదు. మరి మీరు ఏం చేయాలి? బాబాతో మీకు సదాకాలిక సంబంధం మరియు సర్వ సంబంధాలు సర్వప్రాప్తులు లభిస్తున్నాయి. కనుక ఇక్కడ ఒక్క సెకనులో బాబా కోసం త్యాగం చేయటంలో ఆలస్యం చేయకూడదు. కాని మీకు దేహాభిమానం త్యాగం చేయటంలో ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పటికి బాబా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 36 సంవత్సరాలు అయ్యింది. మీకు ఒక్క సెకను పట్టాలి. కానీ 36 సంవత్సరాలు పట్టింది. అయినా ఇంకా అతీతం కాలేదు. అర్దకల్పం నుండి ఈ దేహాభిమానం అభ్యాసం అయిపోయింది కదా బాబా అని పిల్లలు బాబాకి చెప్పారు. మరి అర్దకల్పం నుండి దేహాభిమానంతో, వికారాలతో అతీతంగా ఉన్నారు. మరి ఈ అర్దకల్పం యొక్క అభ్యాసాన్ని ఒక్క సెకనులో మర్చిపోయారా? సత్య, త్రేతాయుగాలలో ఈ దేహాభిమానం, వికారాలు లేవు కదా! ద్వాపరయుగంలోకి వచ్చేసరికి ఒక్క సెకనులో మర్చిపోయారు కదా, సమయం పట్టిందా? త్రేతాయుగంలో కూడా రెండు కళలు తక్కువ అయిపోయాయి కదా! మరి వికారాలకు అతీతం కాలేకపోతున్నారా? సత్య, త్రేతాయుగాలలో నిర్వికారులుగా ఉండేవారు కదా! త్రేతాయుగంలో 2 కళలు తక్కువ అయిపోతాయి. అయినా కానీ నిర్వికారి అని అంటారు కదా! అంటే త్రేతాయుగంలో కూడా వికారాల యొక్క ఆకర్షణకు అతీతంగా ఉన్నారు. మరి అది ఎందుకు మీకు స్కృతి ఉండటంలేదు? ఆత్మ యొక్క అసలైన స్వరూపం ఏమిటి? ఆత్మ యొక్క అసలైన నిజ సంస్కారాలు ఏమిటి? సత్య, త్రేతాయుగాలలో ఉండేవే కదా! బాబా యొక్క గుణాలే మీ గుణాలు కదా! బాబా యొక్క గుణాలు ఏమిటి? జ్ఞాన సాగరుడు, సుఖసాగరుడు, శాంతి సాగరుడు మరి బాబా సాగరుడైతే మీరు కూడా ఆ స్వరూపంలో ఉండాలి కదా! ఆత్మ యొక్క నిజ గుణం శాంతి స్వరూపం కదా! మరి ఈ సాంగత్యం యొక్క రంగులో మీరు పరివర్తన కావాలి. కానీ వాస్తవానికి ఆత్మ యొక్క స్వరూపాన్ని మర్చిపోతున్నారు. ఆత్మ యొక్క స్వరూపం, గుణాలు అన్ని బాబా సమానంగా ఉండాలి. మరి ద్వాపరయుగీ నుండి వచ్చిన ఆ సంస్కారాలు గుర్తు ఉంటున్నప్పుడు ఈ సంస్కారాలు ఎందుకు గుర్తు ఉండటంలేదు? ఇలా మీరు స్వయంతో స్వయం మాట్లాడుకుంటూ అంటే అత్మిక సంభాషణ చేసుకుంటూ ఆత్మీయత యొక్క స్థితిలో స్థితులైతే ద్వాపరయుగీ పాత సంస్కారాలు మీకు గుర్తు రావు. నా ఆత్మ యొక్క ఆది, అనాది సంస్కారం ఏమిటి? అని ఆలోచించండి. సృష్టి ఆదిలో ఆత్మలు క్రిందికి వచ్చినప్పుడు ఆత్మలో ఏ సంస్కారాలు ఉండేవి? సత్యయుగంలో అందరు దైవీ సంస్కారాలతో దేవతలుగా ఉండేవారు కదా! ఆదిలోఆత్మ యొక్క సంస్కారాలు, గుణాలు ఏమిటి? ఇవి ఆలోచించండి. ఈ మధ్య సంస్కారాల గురించి ఆలోచించండి. అనాది,ఆది సంస్కారాల గురించి ఆలోచిస్తూ ఉంటే మధ్య సంస్కారాలు ఏవైతే ప్రజ్వలితం అవుతున్నాయో అవి మధ్యమం అయిపోతాయి. మధ్య సంస్కారాలు బలహీనం అయిపోతాయి. అనాది, ఆది సంస్కారాలు ప్రత్యక్షంలోకి వచ్చేస్తాయి. కనుక సదా అనాది, ఆది సంస్కారాల గురించి ఆలోచించండి. ఎలాంటి సంకల్పం చేస్తారో అటువంటి స్మృతి ఉంటుంది, మరియు ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి సమర్దత కర్మలోకి వస్తుంది. అందువలన సదా మీ స్మృతిని శ్రేష్టంగా ఉంచుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రతి సెకను యొక్క త్యాగం ద్వారా ప్రతి సెకను యొక్క ప్రాప్తిని పొందుతూ వెళ్ళండి. ఎందుకంటే సంగమయుగం అంటే భాగ్యాన్ని పొందే యుగం. ఇప్పుడు మీకు ఏదైతే భాగ్యం లభిస్తుందో అది మొత్తం కల్పం అనుభవిస్తారు. ఇప్పుడు మీరు శ్రేష్టభాగ్యాన్ని తయారు చేసుకున్నా, నీచ భాగ్యాన్ని తయారు చేసుకున్నా ఈ భాగ్యం మొత్తం కల్పానికి వెంట వస్తుంది. ఈ సంగమయుగంలోనే భాగ్యం తయారు చేసుకుంటారు. ఎంత కావాలంటే అంత తయారు చేసుకోగలుగుతారు. ఎందుకంటే భాగ్యం తయారుచేసే బాబా మీ వెంట ఉన్నారు. తర్వాత బాబా మీ వెంట ఉండరు, ఈ ప్రాప్తి కూడా ఉండదు. ప్రాప్తి ఇచ్చేవారు కూడా ఇప్పుడే ఉన్నారు మరియు ప్రాప్తి పొందేవారు కూడా ఇప్పుడే పొందుతారు. కనుక ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. ఈ స్లోగన్ స్మృతిలో ఉంచుకోండి. ఈ స్లోగన్ వ్రాసి పెడతారు కదా! ఈ స్లోగన్ మా కోసం అనుకుంటున్నారా? ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు అంటే ఏం చేస్తారు? ఇప్పుడే చేయాలి అని ఆలోచించండి. ఇదే స్లోగన్ సదా స్మృతిలో ఉంచుకోండి. మీ స్థితిని సదా త్యాగం చేయండి, సదా భాగ్యశాలిగా అయ్యేటందుకు పరిశీలన చేసుకుంటూ ఉండండి. కానీ ఆ పరిశీలనలో కూడా ముఖ్యంగా ఏమి పరిశీలించుకోవాలి? పరిశీలన ద్వారా స్వతహాగా మీలో పరివర్తన రావాలి. ఆ పరిశీలన ఏమిటి? పరిశీలన కొరకు స్లోగన్ ఏమిటి? బాబా చాలా సార్లు చెప్పారు. పరిశీలన కొరకు స్లోగన్ ఏమిటంటే - తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం. ఇప్పుడు తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం ఎలా వస్తుంది? బయట ప్రజలు స్థూలధనంలో తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం పొందే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు సంగమయుగంలో ఎన్ని రకాల ఖజానాలు బాబా నుండి పొందారో తెలుసా? సమయం, సంకల్పం, శ్వాస ఇవన్నీ ఖజానాలే. కానీ వీటితో పాటు అవినాశి జ్ఞానరత్నాలు కూడా ఖజానా మరియు ఐదవది స్థూలధనం యొక్క ఖజానా. ఇవన్నీ పరిశీలించుకోండి. సంకల్పంలో కూడా తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితంలో పొందేవారిగా నేను అయ్యానా? సంకల్పాలను ఎక్కువగా ఖర్చు చేయకండి. తక్కువగా ఖర్చు చేయండి. అలాగే మీ సంకల్ప ఖజానాను వ్యర్ధంగా పోగొట్టుకోకండి. సమర్ధమైన, శ్రేష్ట సంకల్పాలే చేయండి. ఎందుకంటే శ్రేష్ట సంకల్పాలకు ప్రాప్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది. ఇలా సంకల్ప ఖజానాయే కాదు, సమయం యొక్క ఖజానా దీనిని కూడా వ్యర్థం చేయకూడదు. ఈ సంగమయుగం యొక్క సమయాన్ని ఒకవేళ వ్యర్ధం చేస్తే ఏమౌతుంది? ఈ సంగమయుగంలో ఒకొక్క సెకను సంపాదనకు ఆధారం. అందువలన ఈ సమయాన్ని కూడా వ్యర్ధంగా పోగొట్టుకోకండి. అలాగే శ్వాస ప్రతి శ్వాసలో బాబా స్మృతి ఉండాలి. ఒకవేళ ఈ శ్వాస యొక్క ఖజానాలో ఒక్క శ్వాసలో బాబా యొక్క స్మృతి లేకపోయినా అది వ్యర్ధమైపోయినట్లే. అందువలన శ్వాసను కూడా వ్యర్ధంగా పోగొట్టుకోకండి. అలాగే జ్ఞానం యొక్క ఖజానా దీనిలో కూడా మీకు ఖజానాను సంభాళించుకోవటం రావటం లేదు, సంపాదించుకుంటున్నారు, సమాప్తి చేసేసుకుంటున్నారు. జ్ఞానం చాలా ఉంది, కానీ మననం చేయలేదు. ఎందుకంటే జ్ఞానాన్ని మననం చేసిన తర్వాతే మీకు సంతోషం ప్రాప్తిస్తుంది. ఆ సంతోషం యొక్క స్థితులయ్యే అభ్యాసం లేకపోతే జ్ఞానం యొక్క ఖజానాను వ్యర్ధం చేసినట్లే. ఎలా అయితే మీరు భోజనం చేసారు, అరిగించుకోకపోతే శక్తి రాదు. అంటే ఆ తిన్నటువంటి భోజనం వ్యర్ధం అయిపోయినట్లే. అలాగే ఈ జ్ఞానఖజానాను స్వయం పట్ల, ఇతరుల పట్ల దానం చేయటంలో ఉపయోగించకపోతే ఈ ఖజానాను కూడా వ్యర్ధం చేసినట్లే. అలాగే స్థూలధనం యొక్క ఖజానా, దీనిని కూడా ఈశ్వరీయ కార్యంలో, విశ్వకళ్యాణార్ధ కార్యంలో లేదా మీ ఉన్నతి యొక్క కార్యాలలో ఉపయోగించకుండా ఇతర స్థూల కార్యాలలో ఉపయోగిస్తే ఈ స్థూలధనం యొక్క ఖజానాను కూడా వ్యక్తం చేసినట్లే. ఎందుకంటే ఈ స్థూలధనాన్ని ఈశ్వరీయ కార్యంలో ఉపయోగించటం ద్వారా ఒకటికి లక్ష రెట్లు అయ్యి మీకు ప్రాప్తి లభిస్తుంది. ఒకవేళ వ్యర్ధం చేసినట్లైతే ఒకటి వ్యర్ధం చేసినట్లు కాదు, లక్ష రూపాయలు వ్యర్ధం చేసినట్లు. ఇలా సంగమయుగంలో ఏవైతే సర్వ ఖజానాలు లభించాయో వాటిని పరిశీలన చేసుకోండి. ఏ ఖజానా వ్యర్ధంగా పోవటం లేదు కదా? అని. వ్యర్థం నుండి రక్షించుకునేటందుకు తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం అనేది స్మృతి ఉంచుకోవాలి. ఇలా తక్కువ ఖర్చు, ఎక్కువ పలితం పొందేవారిగా అయ్యారా? లేక ఇప్పటి వరకు సోమరిగా ఉంటూ వ్యర్థంగా పోగొట్టుకుంటున్నారా? ఎవరైతే సోమరిగా ఉంటారో వారు వ్యర్ధంగా పోగొట్టుకుంటారు. ఎవరైతే తెలివైనవారిగా, జ్ఞానసాగరులుగా ఉంటారో వారు చిన్న వస్తువుని కూడా వ్యర్ధంగా పోగొట్టుకోరు. అటువంటి వారినే తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం పొందేవారు అని అంటారు. ఇలా ఉన్నారా? ఎలా అయితే సాకార బ్రహ్మాబాబా తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం పొందటంలో ఉదాహరణగా అయ్యి చూపించారు కదా! మరి మీరు తండ్రిని అనుసరించటం లేదా? ఒకవేళ మీ దగ్గర స్థూలధనం లేకపోయినా యజ్ఞనివాసీయులైన మీకు యజ్ఞం యొక్క ప్రతి వస్తువు కూడా స్థూలధనంతో సమానం. ఒకవేళ ఈ యజ్ఞం యొక్క ఏదైనా వస్తువుని మీరు వ్యర్ధంగా పోగొడితే మీరు తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం పొందేవారిగా కాలేరు. వ్యర్ధం చేసినట్లు అవుతుంది. కుటుంబంలో ఉండేవారు స్థూలధనంతో బాబా సేవ చేసి ఉన్నతపదవి పొందుతారు. అలాగే యజ్ఞనివాసీయులు స్థూలధనం లేనప్పటికి యజ్ఞం యొక్క స్థూల వస్తువులను తక్కువ ఖర్చు చేసి ఎక్కువ ఫలితం పొందే వారిగా అయ్యి మీ పట్ల మరియు ఇతరుల పట్ల ఏదైతే పొదుపు చేస్తూ వచ్చారో ఆ లెక్క మీకు భవిష్యత్తుకి జమఅయిపోతుంది. కేవలం స్థూలధనం గురించి కుటుంబంలో ఉండేవారికే చెపున్నారు అని అనుకోకండి. కానీ యజ్ఞనివాసీయులు యజ్ఞ సేవలో యజ్ఞం యొక్క వస్తువులను పొదుపు చేయాలి. ఆ పొదుపు చేసిన ధనం మీకు స్థూలధనం కంటే ఎక్కువ సంపాదన చేస్తుంది. ఎక్కువ జమ అవుతుంది. కనుక యజ్ఞనివాసీయులు ఈ విషయంపై చాలా ధ్యాస పెట్టుకోవాలి. యజ్ఞం యొక్క ఒకొక్క వస్తువుని యదార్ధంగా ఉపయోగించాలి, సంభాళించాలి, వ్యర్థం నుండి రక్షించాలి. అప్పుడు మీకు భవిష్యత్తుకి ప్రాప్తి వస్తుంది. మీరు ఆ వస్తువులను వ్యక్తం నుండి రక్షిస్తున్నారు అంటే భవిష్య ప్రాప్తిని తయారు చేసుకుంటున్నట్లే. అందువలన ప్రతి ఒక్కరు ప్రతి ఖజానాలో నేను తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం పొందేవానిగా ఉన్నానా? అని పరిశీలన చేసుకోండి. ప్రతి ఖజానాలో వ్యర్ధం నుండి రక్షించుకోండి, సమర్థంగా అవ్వండి. ఎక్కడ వ్యర్థం ఉంటుందో అక్కడ సమర్ధత ఉండదు. ఎక్కడ సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్ధం రానే రాదు. మరి మీరు ఖజానాలను వ్యర్థం చేస్తూ ఉంటే మీ దగ్గరకు సమర్ధత అంటే శక్తి రాదు. ఎక్కడైనా ఏదైనా లీకేజ్ ఉంటే మీరు ఎంత ప్రయత్నించినా ఆ లీకేజ్ కారణంగా శక్తి నిండదు. అలాగే వ్యర్థం కూడా లీకేజ్. ఈ లీకేజ్ కారణంగా మీరు ఎంత పురుషార్ధం చేసినా, ఎంత శ్రమ చేసినా శక్తిశాలిగా కాలేరు. అందువలన మీ లీకేజీని పరిశీలించుకోండి. ఈ లీకేజుని పరిశీలించుకోవటానికి చాలా తెలివి కావాలి. ఒకోసారి ఎక్కడ లీక్ అవుతుంది అనేది కూడా మనకు తెలియదు. ఎవరైతే జ్ఞాన స్వరూపంగా ఉంటారో వారు ఎక్కడ లీకేజ్ ఉంది అని లీకేజునిక్యాచ్ చేయగలుగుతారు. జ్ఞానసాగరులుగా లేకపోతే ఆ లీకేజుని వెతకవలసి వస్తుంది. కనుక ఇప్పుడు జ్ఞానసాగరులుగా అయ్యి పరిశీలన చేసుకుని వ్యర్ధం నుండి సమర్థంగా అవ్వండి. మైసూర్ వారు బాబా యొక్క స్మృతియాత్రలో ఉంటున్నారు కదా! ఎందుకంటే మీకు భాష అర్ధం కావటంలేదు. తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం అనేది గుర్తు పెట్టుకోండి. మీకు భాష అర్ధం కానప్పటికీ చాలా భాగ్యశాలి ఆత్మలు. మొత్తం కల్పంలో మేము చాలా విశేషాత్మలం అనుకుంటున్నారా? ఇక్కడికి చాలా సార్లు వచ్చాము అనుకుంటున్నారా? లేక మొదటిసారి బాబాని కలుసుకోవడానికి వచ్చాము అనుకుంటున్నారా? మీకు ఏ బంధన లేదు కదా? భాగ్యశాలి ఆత్మలం అనుకుంటున్నారా లేదా దౌర్భాగ్యశాలి ఆత్మలం అనుకుంటున్నారా? మీకు బంధన లేనప్పుడు నిర్బంధనంగా ఉన్నప్పుడు మీ భవిష్యత్తుని ఉన్నతంగా తయారు చేసుకోవచ్చు కదా! మీరు డబుల్ భాగ్యశాలి ఆత్మలు. ఒకటి - మీకు బాబా దొరికారు, రెండు - భవిష్యత్తు కొరకు నిర్బందునులుగా అయిపోయారు. ఇక భవిష్యత్తులో మీకు ఏ బంధనాలు ఉండవు. మరి ఈ సంతోషం ఉంటుందా? దు:ఖం అనుభవం అవుతుందేమో అనుకుంటున్నారా? మీకు ఇక సుఖమే ఉంటుంది. ఇప్పుడు బంధనలో ఉన్నా భవిష్యత్తులో నిర్భంధునులు అయిపోతారు. ఇలా స్వయాన్ని సౌభాగ్యశాలిగా భావిస్తే మీకు ఎప్పుడైనా దు:ఖం వస్తుందా? ఎవరినైనా తోడు పెట్టుకుంటే గొడవలు వస్తాయి. శివబాబాను తోడుగా పెట్టుకుంటే గొడవలు ఉండవు. సంగమయుగంలో లౌకిక సౌభాగ్యం యొక్క త్యాగం కూడా సౌభాగ్యానికి గుర్తు. ఆత్మ యొక్క కుటుంబంలో ఈ లౌకిక సంబంధాలు ఉండవు. ఈ కుటుంబం యొక్క సంబంధంలోకి వస్తున్నారా? మీరు ఆ కుటుంబంలో ఉంటూ కూడా ఆత్మ యొక్క సంబంధం బాబాతో పెట్టుకోండి. అప్పుడు డబుల్ భాగ్యవంతులుగా తయారవుతారు. కుటుంబంలో ఉంటూ దేహ సంబంధంతో అతీతంగా ఉండగలుగుతున్నారా? కుటుంబంలో ఉండేవారు ఆ సంబంధంలో ఉంటూ ఆత్మ సంబంధాన్ని బాబాతో పెట్టుకోవటం ద్వారా భాగ్యవంతులుగా అవుతారు.