లక్కీ అంటే అదృష్టవంతులుగా మరియు లవ్లీ అంటే
బాబాకి ప్రియమైన వారిగా అయ్యే పురుషార్ధం.
స్వయాన్ని లవ్లియెస్ట్ అంటే బాబాకి ప్రియమైనవారిగా,
లక్కీయెస్ట్ అంటే అదృష్టవంతులుగా భావిస్తున్నారా? మీరు లవ్లీ కూడా మరియు లక్కీ
కూడా ఈ రెండు భావిస్తున్నారా? సదా స్వయాన్ని నిర్విఘ్నంగా, సంలగ్నతలో నిమగ్నమైన
స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? కేవలం మీరు అదృష్టవంతులుగా అయ్యారు. కానీ సదా
బాబాకి ప్రియంగా కాకపోతే సదా మీరు సంలగ్నతలో నిమగ్నమై ఉంటారు. కానీ
నిర్విఘ్నస్థితిలో ఉండలేరు. అందువలన కేవలం ప్రియమైనవారిగా అవ్వటమే కాదు,
అదృష్టవంతులుగా కూడా అవ్వాలి. ఈ స్థితిని అనుభవం చేసుకోవాలి. ఈ స్థితి అవసరం.
ఇలా ప్రియమైనవారిగా, అదృష్టవంతులుగా అయ్యేటందుకు మూడు విషయాలు చాలా అవసరం. ఆ
మూడు విషయాలు మీలో అనుభవం చేసుకుంటే అదృష్టవంతులుగా మరియు ప్రియమైనవారిగా
అయిపోతారు. ఆ మూడు విషయాలు ఏమిటి? దాని ద్వారా స్వతహాగానే ఈ స్థితిని అనుభవం
చేసుకుంటారు. అదృష్టమైతే తయారయ్యి ఉంది, తయారైపోయింది కూడా. తయారయ్యి ఉందా లేదా
తయారవుతుందా? మీ అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారా లేదా మొదటే అదృష్టం తయారై
బాబా వారిగా అయ్యారా? ఇప్పుడు అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారా లేదా తయారైన
అదృష్టంపై నడుస్తున్నారా? మీ అదృష్టాన్ని మార్చుకుంటున్నారా లేదా?
దురదృష్టవంతుల నుండి అదృష్టవంతులుగా అయిపోయారు కదా? ఇప్పుడు మీ అదృష్టాన్ని
తయారు చేసుకునేటందుకు ఇప్పుడు ఇంకా సమయం యొక్క అవకాశం ఉంది కదా! మరి మీరు బాబా
దగ్గరకు అదృష్టాన్ని మేల్కొల్పుకుని వచ్చారా లేదా అదృష్టాన్ని
మేల్కొల్పుకునేటందుకు వచ్చారా? తయారైన అదృష్టాన్ని తీసుకుని వచ్చారా లేదా తయారు
చేసుకునేటందుకు వచ్చారా? ఏ స్థితి ఉంది? మీరు ఏదైతే అదృష్టాన్ని మేల్కొల్పుకుని
వచ్చారో ఆ అదృష్టంతోనే బాబా దగ్గరకు వచ్చారు. కానీ బాబా వారిగా అవ్వటమే అదృష్టం.
అంటే అదృష్టాన్ని తయారు చేసుకుని కూడా వచ్చారు మరియు ఇప్పుడు తయారు
చేసుకుంటున్నారు కూడా. ఇలా ఉన్నారా? ఎప్పుడైనా, ఏదైనా విషయంలో ఎక్కువ పురుషార్టం
చేయాల్సి వచ్చినప్పుడు నా పురుషార్ధంలో ఇది లేదేమో అనే సంకల్పం వస్తుందా?
పురుషార్ధం చేసిన తర్వాత సఫలత రాకపోయినా నా అదృష్టంలో ఉంది అని అనుకుంటున్నారా?
పురుషార్ధంలో సఫలత రాకపోవటానికి కారణం ఏమిటి? మంచిగా పురుషార్థము చేసారు, కానీ
సఫలత రాలేదు. అప్పుడు ఏమంటున్నారు? నా డ్రామాలో ఇలానే ఉంది అంటున్నారు. మరి
తయారైపోయిన డ్రామాలో మీరు అదృష్టాన్ని తీసుకుని వచ్చారు కదా? కనుక పురుషార్థీలు
ఎప్పుడు కూడా ఇలా అనుకోకూడదు. పురుషార్థము చేసిన తర్వాత అసఫలత అనేది రాదు. మీరు
చేసిన పురుషార్ధం ఎప్పుడు వ్యర్ధంగా పోదు. ఒకవేళ మీరు సరైన పద్ధతిలో పురుషార్ధం
చేస్తే దానికి సఫలత లభించకపోవటమనేది ఉండదు.ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా తప్పకుండా
లభిస్తుంది. కనుక అసఫలతా రూపాన్ని చూసి ఇది నాకు పరీక్ష, దీనిని దాటిన తర్వాత
నాకు పరిపక్వత వస్తుంది అనుకోండి. అది అసఫలత కాదు, పురుషార్ధం యొక్క పునాదిని
పక్కా చేయటానికి ఒక సాధనం. ఏదైనా ఒక విషయాన్ని గట్టిగా చేయాలంటే పునాదిని లోతుగా
తవ్వుతారు కదా! లోతుగా తవ్వి అప్పుడు దానిని పక్కా చేస్తారు. అలాగే ఇది కూడా
పరిపక్వతకు సాధనం. ఎప్పుడైనా కానీ మీ వ్యక్తిగత పురుషార్థములో సంఘటనలోనైనా,
ఈశ్వరీయ సేవలో అయినా ఈ మూడు రకాల పురుషార్థాలలో బయట రూపంగా మీకు ఏదైనా అనఫలత
కనిపించినా ఇది అసఫలత కాదు, నేను పరిపక్వం అవ్వటానికి సాధనం అని భావించండి.
తుఫానులను తుఫానుగా కాదు, కానుకగా భావించాలి. సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి,
కెరటాలు వస్తూ ఉంటాయి. ఎందుకు? ముందుకు తీసుకువెళ్ళటానికి సాధనం అలాగే మీ
అసఫలతలో కూడా సఫలత నిండి ఉంటుంది. ఇది అర్ధం చేసుకుని ముందుకి వెళ్ళాలి. అసలు
అసఫలత అనే పదమే మీ బుద్ధిలోకి రాకూడదు. మీ పురుషార్థము సరిగ్గా ఉంటే అసలు అసఫలత
అనేదే రాదు. కనుక అదృష్టవంతులుగా, బాబాకి ప్రియమైనవారిగా అయ్యేటందుకు మూడు
విషయాలు అవసరం అని బాబా చెప్పారు కదా! అవి ఏమిటి? మొదట మీ అదృష్టం ఎలా
తయారవుతుందో ఆలోచించండి, మీకు మీరు చూసుకోండి. మనం లక్కీగా, లవ్లీగా ఎలా అయ్యాము?
మన అదృష్టాన్ని మనం ఎందుకు మేల్కొల్పలేకపోతునాము, దానికి ముఖ్య కారణం ఏమిటి?
మీరు నాలెడ్జ్ ఫుల్ గా కాలేకపోతున్నారు. నాలెడ్జ్ ఫుల్ అంటే అన్ని రకాలైన జ్ఞానం
దీనిలో వచ్చేస్తుంది. మీరు ఎంతగా జ్ఞానస్వరూపంగా ఉంటారో అంతగా అదృష్టం తప్పకుండా
తయారవుతుంది. ఎందుకంటే జ్ఞానమనేది లైట్ అంటే ప్రకాశం మరియు మైట్ అంటే శక్తి,.
దీనితో ఆది, మధ్య అంత్యం యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని మీరు ఏదైతే పురుషార్ధం
చేస్తారో దానిలో తప్పకుండా సఫలత లభిస్తుంది. సఫలత పొందటమే అదృష్టానికి గుర్తు.
కనుక నాలెడ్జ్ ఫుల్ అంటే ప్రతి విషయంలో పూర్తి జ్ఞానిగా ఉండాలి. ఫుల్ అంటే
సంపూర్ణంగా ఉండాలి. ఏదైనా కొంచెం లోపంగా ఉన్నా మీ అదృష్టం తయారవ్వటంలో కూడా
నెంబర్ వచ్చేస్తుంది. మీరు నాలెడ్జ్ ఫుల్‌గా ఉంటే నెంబర్ వన్అ దృష్టవంతులుగా
అయిపోతారు. కర్మ యొక్క జ్ఞానం కూడా ఉండాలి, రచయిత యొక్క జ్ఞానం కూడా ఉండాలి.
అలాగే పరివారంలో జ్ఞానీ ఆత్మల సంపర్కంలోకి ఎలా రావాలి, ఈ జ్ఞానం కూడా మనకి
ఉండాలి. కేవలం జ్ఞానం అంటే రచయిత, రచన గురించి చెప్పటం కాదు. కానీ
జ్ఞానస్వరూపులు అంటే ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ జ్ఞానస్వరూపంగా
ఉండాలి. ఇటువంటి వారిని నాలెడ్జ్ ఫుల్ అంటారు. ఎవరు ఎంత నాలెడ్జ్ ఫుల్ గా ఉంటారో
అంత కేర్ అంటే జాగ్రత్తగా ఉంటారు. ఇలా ఎవరు ఎంతగా కేర్‌ఫుల్‌గా అంటే జాగ్రత్తగా
ఉంటారో అంతగా వారు ఛీర్‌ఫుల్‌గా అంటే హర్షితముఖిగా ఉంటారు. ఒకవేళ కేర్‌ఫుల్‌గా
లేరు అంటే బాబాకి ప్రియంగా కూడా కాలేరు. ఛీర్‌ఫుల్‌గా అంటే హర్షితంగా లేరు. అంటే
అప్పుడు కూడా బాబాకి ప్రియంగా కాలేరు. ఎవరైతే కేర్‌ఫుల్‌గా ఉంటారో అంటే
జాగ్రత్తగా ఉంటారో ఆ సమయంలో తమ ద్వారా లేదా ఇతరుల సంపర్కంలోకి రావటం ద్వారా
ఏవోక చిన్న, పెద్ద పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దాని కారణంగా బాబాకి ప్రియంగా
కాలేరు, ఇతరులకు కూడా ప్రియంగా కాలేరు. అందువలన ఎవరైతే కేరుగా ఉంటారో అంత వారు
ఛీర్‌ఫుల్‌గా అంటే హర్షితంగా ఉండగలరు. కేర్ అంటే పురుషార్థములో టెన్షన్ (ఆందోళన)
పెట్టుకోకూడదు, ఛీర్‌ఫుల్‌గా అంటే హర్షితముగా ఉండాలి, కేర్‌ఫుల్‌గా ఉండటం అంటే
పురుషార్థములో నిమగనమైపోయి అందోళన పెట్టుకోకూడదు. ఛీర్‌ఫుల్‌గా ఉండాలి అంటే
హర్షితంగా ఉండాలి. కేర్‌ఫుల్‌గా ఉండటం అంటే పురుషార్థములో నిమగ్నమైపోయి, ఛీర్‌ఫుల్‌గా
అంటే హర్షితస్థితి లేకుండా ఉండకూడదు. కేర్‌ఫుల్‌గా ఉండేదాని గుర్తు ఏమిటంటే -
ఛీర్‌ఫుల్ అంటే సంతోషస్థితి మీలో కనిపించాలి. పురుషార్ధంలో ఎంత ధ్యాస
పెట్టుకుని పురుషార్ధం చేస్తారో అంత మీ ముఖంలో హర్షితస్థితి కనిపించాలి. ఇలా ఈ
మూడు లక్షణాలు అంటే 1. నాలెడ్జ్ ఫుల్ అంటే జ్ఞానస్వరూపంగా ఉండాలి. 2. కేర్‌ఫుల్
అంటే పురుషార్ధంలో జాగ్రత్తగా ఉండాలి 3. ఛీర్‌ఫుల్ అంటే హర్షితంగా ఉండాలి. ఈ
మూడు విషయాలు ఉన్నప్పుడే లక్కీగా మరియు లవ్లీగా అవుతారు. ఒకరికొకరు సహయోగం
చేసుకోవటం ద్వారా కూడా అదృష్టం తయారవుతుంది. కానీ ఒకరి నుంచి ఒకరికి సహయోగం కూడా
కేర్‌ఫుల్‌గా, ఛీర్‌ఫుల్‌గా ఉన్నప్పుడే అవుతుంది. ఒకవేళ మీరు ఛీర్‌ఫుల్‌గా లేరు
అంటే సక్సెస్ ఫుల్ అంటే విజయీవంతులుగా కూడా కాలేరు. కనుక కేర్‌ఫుల్‌గా అంటే
జాగ్రత్తగా మరియు ఛీర్‌ఫుల్‌గా అంటే హర్షితంగా ఉండాలి. అప్పుడు సక్సెస్ ఫుల్
అంటే విజయవంతంగా అయిపోతారు. అప్పుడు మీరు లక్కీ అంటే అదృష్టవంతులు. కనుక ఈ మూడు
విషయాలు మీలో చూసుకోండి. ఒకవేళ ఈ మూడింటిలో మంచి పర్సెంటేజ్ అంటే మంచి శాతం ఉంటే
అదృష్టవంతులుగా ఉన్నట్లు భావించండి. ఒకవేళ దీనిలో మీకు శాతం తక్కువగా ఉంది అంటే
మీరు అదృష్టవంతమైన ఆత్మలు కాదు. అంటే శాతం తేడా వచ్చేస్తుంది. కనుక
అదృష్టవంతమైన ఆత్మల గుర్తులు ఏమిటో అర్థమైందా? నోటి ద్వారా జ్ఞానం వినిపించటం
ద్వారా అంత ప్రభావం పడదు. ఎవరైతే సదా హర్షితముఖంగా ఉంటారో, దు:ఖం యొక్క అల
సంకల్పంలో కూడా రాదో అటువంటి వారిని సదా హర్షితముఖి అని అంటారు. ఇలా దు:ఖం
యొక్క అల లేనటువంటి హర్షితముఖమే సేవ చేస్తుంది. అయస్కాంతానికి లోహం స్వతహాగానే
ఆకర్షితం అవుతుంది కదా! అలాగే సదా హర్షితముఖంతో ఉండేవారు అయస్కాంతంలా ఉంటారు.
వారిని చూస్తూనే అందరు సమీపంగా వస్తారు. ఈ రోజుల్లో ప్రపంచంలో దు:ఖం, అశాంతి
యొక్క మేఘాల ఛాయ ఉంది. కనుక ఇటువంటి వాయుమండలంలో మీరు సదా సంతోషవంతంగా ఉండాలి.
వారు ఎందుకు? ఏమిటి? అనే ఉత్కంఠతలో ఉన్నారు. కనుక మీరు సంతోషకరమైన ముఖంతో ఉంటే
అది చూసి వారు వారి దు:ఖాన్ని మర్చిపోతారు. బాగా పెద్ద తుఫాను వచ్చినప్పుడు,
బాగా వర్షం పడుతున్నప్పుడు ప్రజలు ఆ తుఫాను నుండి, వర్షం నుండి
రక్షించుకోవటానికి పరుగు పెడతారు కదా! వారిని ఏ స్థానం పిలవదు, కానీ వాతావరణం
అనుసరించి రక్షణా స్థానానికి స్వతహాగానే పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే
తమని తాము రక్షించుకోవటానికి ఆ స్థానాన్ని తోడుగా తీసుకుంటారు. ఆకర్షించి
వచ్చేస్తారు. అలాగే వర్తమాన సమయంలో నలువైపుల మాయా తుఫానులు మరియు దు:ఖం యొక్క
మేఘాలు అవరించి ఉన్నాయి. ఈ సమయంలో రక్షణా సాధనం చూసి ఆత్మలు మీ వైపు ఆకర్షితమై
వచ్చేస్తారు. ఆత్మలను ఆకర్షించే బయటి రూపం ఏమిటి? హర్షితముఖం అంటే సంతోషంగా ఉండే
ముఖం. కనుక లవ్లీగా అంటే ప్రియమైన వారిగా కూడా ఉండాలి, మరియు లక్కీగా అంటే
అదృష్టవంతులుగా కూడా ఉండాలి. అక్కడక్కడ నాలెడ్జ్ ఫుల్, అక్కడక్కడ ఈ కేర్‌ఫుల్‌గా,
అక్కడక్కడ ఛీర్‌ఫుల్‌గా అలా కాదు. మీరు ఏం చేస్తున్నారంటే కేర్‌ఫుల్‌గా అంటే
జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ ఇలా జాగ్రత్తగా ఉంటూ ఉంటూ ఛీర్‌ఫుల్‌గాఅంటే హర్షిత
స్థితిని వదిలేస్తున్నారు. ఛీర్‌ఫుల్‌గా కాలేకపోతున్నారు, కానీ రెండు సమానంగా
ఉండాలి. రెండు ధారణలు మీలో ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే ధ్యాస కూడా
మీకు ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండటం ద్వారా ఈ మూడు విషయాల మీలో వస్తాయి?
తెలుసా? ఏ విషయంలో జాగ్రత్త పెట్టుకోవాలి? పిల్లలు రకరకాల సమాధానాలు చెప్పారు.
బాబా మిమ్మల్ని జాగ్రత్తగా తన వారిగా చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు? ముఖ్య
విషయం ఏమిటి? మహిమ ఏమిటి? సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ
నిర్వికారులు, మర్యాదా పురుషోత్తములు అంటే మీరు ఒకొక్కసారి మర్యాదలను
ఉల్లంఘిస్తున్నారు. దాని కారణంగానే కేర్ లెస్ అంటే లెక్కలేనితనంలోకి
వచ్చేస్తున్నారు. మీ సంపూర్ణస్థితి యొక్క మహిమ ఏదైతే ఉందో రామాయణ కథలలో కూడా
చెప్తారు కదా! సీతకు రాముడు మర్యాద అనే రేఖ లోపల ఉండే ఆజ్ఞ ఇచ్చారు. కానీ అది
రేఖ కాదు, స్థూలంగా వారు రేఖ చూపించారు. కానీ బాబా మర్యాదయే ఆత్మ రూపి సీతలకు
రేఖ. ఒకవేళ ఆత్మ రూపి సీతలైన మీరు ఈశ్వరీయ మర్యాదలు అనే రేఖ దాటితే ఫకీరుగా
అయిపోతారు. అంటే మీకు ఏవైతే మర్యాదలు లభించాయో వాటిని ఉల్లంఘిస్తే ఫకీరు
అయిపోతారు, తర్వాత అరుస్తారు. ఫకీరులు రెండు పైసలు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి అని
అరుస్తూ ఉంటారు కదా! అలాగే మీరు కూడా ఎప్పుడైతే బాబా మర్యాద అనే రేఖను ఉల్లంఘన
చేస్తారో ఆ స్థితి మిమ్మల్ని బికారీగా చేసేస్తుంది. అప్పుడు మీరు కూడా బాబాని
కృప చూపించండి, ఆశీర్వాదం ఇవ్వండి, స్నేహం ఇవ్వండి, సహయోగం ఇవ్వండి అని
అడుక్కుంటూ ఉంటారు. అంటే ఫకీరు అయిపోయినట్లే కదా! నా అధికారం అనుకోండి, మీరు
ఎవరు? బాలక్ మరియు మాలిక్ పిల్లలు కూడా, యజమానులు కూడా పిల్లలు కూడా. ఆధీనం
అయ్యి అడుక్కోవటం కూడా బికారీ స్థితి. ఏ వస్తువుని అడుక్కున్నా ఫకీరులే కదా!
కనుక మీరు బాబా మర్యాద అనే రేఖను దాటుతున్నారు. అందువలనే ఫకీరుగా అయిపోతున్నారు.
మరలా బాబా సహాయం తీసుకోవల్సి ఉంటుంది. బాబాకి పిల్లలు అయ్యారంటే లక్కీ మరియు
లవ్లీ కూడా. మీరు ఈశ్వరీయ కార్యంలో సహాయకారులు కానీ సహాయం తీసుకునేవారు కాదు.
మీరు సహాయకారి అయిన దానికి చిత్రం కూడా తయారయ్యింది కదా! సహాయం అడిగిన దానికి
చిత్రం లేదు. భక్తులు అడుక్కునే చిత్రం తయారు చేయలేదు, మీరు ఎవరు? బాలక్ సో
మాలిక్ అంటే పిల్లల నుండి యజమానులు. కనుక సదా సహాయకారులుగా ఉండాలి. ఎవరైతే స్వయం
సహాయకారులుగా ఉంటారో వారు అందరి నుండి సహాయం పొందుతారు. ఇచ్చేవారిగా ఉంటారు,
కానీ తీసుకునేవారిగా ఉండరు. దాతలు అంటే ఎప్పుడు తీసుకోరు, ఇచ్చేవారిగా ఉంటారు.
ఒకే బాబా వారిగా అంటే ఒకే రాముని యొక్క సత్యమైన సీతగా భావించి మర్యాద అనే రేఖ
లోపల ఉండండి, అంటే జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండేవారు స్వతహాగానే హర్షితంగా
ఉంటారు. కనుక బాబా యొక్క మర్యాదలు కూడా మీ బుద్దిలో ఉండాలి. ఉదయం నుండి రాత్రి
వరకు ఏ మర్యాదలు, ఏయే కర్మలలో ఎలా ఆజ్ఞ ఇచ్చారు అనే జ్ఞానమంతా బుద్దిలో ఉండాలి.
ఒకవేళ ఈ జ్ఞానం కనుక లేకపోతే మీరు కేర్‌ఫుల్‌గా అంటే జాగ్రత్తగా కూడా ఉండలేరు.
మిమ్మల్ని మీరు సీతగా భావించి మర్యాద అనే రేఖ లోపల ఉండండి. అంటే కేర్‌ఫుల్‌గా
ఉండండి. ఎవరైతే మర్యాద అనే రేఖ లోపల ఉంటారో వారే మర్యాదా పురుషోత్తములుగా
అవుతారు. మీరు ఒకవేళ హర్షితంగా ఉండలేకపోతున్నారు అంటే ఏదో మర్యాదను ఉల్లంఘన
చేస్తున్నట్లే. సంకల్పం కొరకు కూడా బాబా మర్యాద ఇచ్చారు. సంకల్పం కొరకు బాబా
మర్యాద ఏమిటంటే - వ్యర్థ సంకల్పాలు చేయకండి. ఒకవేళ సంకల్పం విషయంలో కూడా ఈ రేఖ
నుండి బయటకి వచ్చారు, వ్యర్థ సంకల్పాలు చేసారంటే ఈ సంకల్పమనే మర్యాదను
ఉల్లంఘించిన కారణంగా సంతోషంగా ఉండలేరు. అలా నోటికి అంటే మాట కొరకు ఏ మర్యాద
ఇచ్చారు, ఏ స్థితిలో స్థితులై మాట్లాడాలి? ఇది కూడా మాట కొరకు బాబా యొక్క
మర్యాద. ఈ మాటలో మీరు బాబా మర్యాదను ఉల్లంఘించినా సంతోషంగా ఉండలేరు. ఇలా
సంకల్పానికి బాబా ఆజ్ఞను ఉల్లఘించి వ్యర్దసంకల్పం, వికల్పం చేసినా హర్షితముఖి
స్థితి నుండి క్రిందికి పడిపోతారు. ఎందుకంటే మర్యాదను ఉల్లంఘించారు కదా! మర్యాద
అనే రేఖ లోపల ఉంటే మాయ యొక్క ఏ విఘ్నం ఈ రేఖ లోపలకు వచ్చే ధైర్యము చేయదు. ఏ
విఘ్నమైనా, తుఫాను అయినా, అలజడి అయినా, ఉదాసీనత అయినా వస్తుంది అంటే ఎక్కడోక్కడ
మర్యాద అనే రేఖ నుండి పాదం బయట పెట్టినట్లే, సీత కేవలం పాదం బయట పెట్టింది. మీరు
బుద్ధి అనే పాదాన్ని బయట పెడుతున్నారు. బుద్ధి రూపి పాదం మర్యాద అనే రేఖ నుండి
బయటకు వస్తే ఈ విషయాలన్నీ వచ్చేస్తాయి. ఎలా అయిపోతారు? బాబాకి ప్రియంగా,
అదృష్టవంతులుగా ఉండటానికి బదులు ఫకీరుగా అయిపోతారు. ఫకీరుగా అయిన దానికి గుర్తు
ఏమిటంటే ఆత్మలను, బాబాను అడుక్కుంటూ ఉంటారు. మీ ఖజానాలు, శక్తులు ఏవైతే ఉన్నాయో
అవి సమాప్తి అయిపోతాయి. రేఖ దాటకూడదు, ఫకీరుగా అయ్యేవారు రేఖను కూడా దాటేస్తారు.
అంటే వారికి శక్తిశాలి స్థితి సమాప్తి అయిపోతుంది. జ్ఞానం చెప్తూ ఉంటారు,
పురుషార్ధం చేస్తూ ఉంటారు. కానీ ఆ రేఖను దాటిన కారణంగా ఫకీరుల్లా మాట్లాడుతూ
ఉంటారు. ప్రాప్తి యొక్క నషా, శక్తి ఏదైతే ఉండాలో అది వారిలో ఉండదు.
భక్తిమార్గంలో కూడా ఈ కధ చెప్తారు కదా! ఈ మర్యాదలు అనే రేఖను ఎవరైతే ఉల్లంఘన
చేస్తారో వారు రెండు రకాలుగా ఫకీరుగా అయిపోతారు. అందువలన ఎప్పుడు
అడుక్కునేవారిగా, ఫకీరుగా అవ్వద్దు. ఈ సమయంలో మీరందరు విశ్వం యొక్క
చక్రవర్తిత్వం తీసుకోవాలి. ఎవరైతే ఈ సమయంలో విశ్వ చక్రవర్తిగా అవుతారో, వారే
భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారిగా అవుతారు. రాజులకు రాజు అంటారు కదా! మరి
విశ్వానికి రాజుగా ఎప్పుడు అవుతారు? ఈ సమయం యొక్క స్థితి బ్రాహ్మణ స్థితి. బాబా
ద్వారా డైరెక్ట్ నాలెడ్జ్ ఫుల్ అయ్యే స్థితి , ఈ స్థితిని వదిలేసి ఫకీరుగా
అవ్వటం మీకు ఏమైనా శోభిస్తుందా? అందువలన ప్రతి సంకల్పం, ప్రతి కర్మను
పరిశీలించుకోండి. జాగ్రత్తగా ఉంచుకోండి, మర్యాద అనే రేఖ నుండి బయటకు రాకుండా
స్వయాన్ని మర్యాదా పురుషోత్తములుగా తయారుచేసుకోండి. ఇలా పురుషోత్తములుగా
అయ్యేటువంటి తీవ్రపురుషార్ధి ఆత్మలకు కేర్‌ఫుల్‌గా మరియు ఛీర్‌ఫుల్‌గా ఉండే
శ్రేష్టాత్మలకు బాప్ దాదా నమస్తే.