స్వమానంలో ఉండటం ద్వారా ఆజ్ఞ యొక్క పాలన.
స్వమానం మరియు ఆజ్ఞ రెండింటిలో ఉండటం మరియు రెండింటిలో
నడవటం ఇలా స్వయాన్ని ధైర్యవంతులుగా భావిస్తున్నారా? సదా స్వమానంలో కూడా ఉండాలి.
వెనువెంట బాబా ఆజ్ఞపై కూడా నడవాలి. ఈ రెండు విషయాలలో స్వయాన్ని మంచిగా
భావిస్తున్నారా? ఒకవేళ స్వమానంలో స్థితులు కాకుండా ఆజ్ఞపై నడిస్తే ఏదోక లోపం
వచ్చేస్తుంది. అందువలన రెండు విషయాలలో యదార్థ రూపంలో స్థితులై మీ స్థితిని
ఉన్నతంగా తయారు చేసుకోండి. వర్తమాన పురుషోత్తమ సంగమయుగంలో బ్రాహ్మణాత్మలైన మీకు
ఉన్నతోన్నతమైన స్వమానం లభించింది. ఆ స్వమానంలో స్థితులై ఉండాలి. ఆ ఒక్క
స్వమానంలో స్థితులై ఉండటం ద్వారా రకరకాలైన దేహాభిమానం స్వతహాగా మరియు సహజంగా
సమాప్తి అయిపోతుంది. అక్కడక్కడ సేవ చేస్తూ, చేస్తూ లేదా పురుషార్ధంలో నడుస్తూ,
నడుస్తూ చాలా చిన్న మాట యొక్క పొరపాటు చేస్తున్నారు. దీని ద్వారానే మొత్తం అన్ని
పొరపాట్లు జరుగుతున్నాయి. అన్ని పొరపాట్లకు బీజం ఒకే మాట యొక్క బలహీనత, అది
ఏమిటి? స్వమానం అనే మాటలో స్వ అనే మాటను తీసేస్తున్నారు. స్వ అనే మాటను తీసేసి
మాన్ అంటే గౌరవంలోకి వచ్చేస్తున్నారు. స్వమానంలో స్వ అనే మాటను తీసేస్తున్నారు.
ఎప్పుడైతే పేరు, గౌరవం, మర్యాద వీటిలోకి వచ్చేస్తారో అప్పుడు స్వమానాన్ని
మర్చిపోతారు. ఇలా గౌరవం యొక్క విషయంలోకి రావటం ద్వారా బాబా ఆజ్ఞను కూడా
మర్చిపోతున్నారు. బాబా ఆజ్ఞ ఏమిటంటే - స్వమానంలో స్థితులై ఉండండి. ఈ స్వమానంలో
స్వ తీసేసి గౌరవంలోకి రావటం ద్వారా బాబా ఆజ్ఞ కూడా సమాప్తి అయిపోతుంది. ఈ చిన్న
మాట యొక్క పొరపాటు ద్వారా అనేక పొరపాట్లు జరుగుతున్నాయి. గౌరవంలోకి వచ్చి
మాట్లాడటం, చేయటం, నడవటం అన్నీ మారిపోతున్నాయి. కేవలం ఒక మాటను కట్ చేయటం ద్వారా
వాస్తవిక స్థితి కట్ అయిపోతుంది. ఈ స్థితిలోకి వచ్చిన కారణంగా ఏదైతే పురుషార్థం,
సేవ చేస్తున్నారో దాని ఫలితం కూడా ఎలా వస్తుందంటే శ్రమ ఎక్కువ, ప్రత్యక్షఫలం
తక్కువ. అందువలనే సఫలతామూర్తిగా కూడా కాలేకపోతున్నారు? మరియు సఫలతామూర్తిగా కాని
కారణంగా, సఫలత ప్రాప్తించని కారణంగా ఫలితము ఎలా వస్తుంది? శ్రమ చేస్తూ, చేస్తూ
నడుస్తూ, నడుస్తూ అలసిపోతున్నారు. ఉల్లాసం తక్కువ అయిపోతుంది. సోమరితనం
వచ్చేస్తుంది. అక్కడక్కడ సోమరిగా అయిపోతున్నారు, అక్కడక్కడ ఇతరులను కూడా సహజంగా
సాథీగా చేసేసుకుంటున్నారు. సోమరితనం తనతో పాటు తన సహయోగులందరిని
తీసుకువచ్చేస్తుంది. ఒంటరిగా రావటంలేదు. ఎలా అయితే బాబా కూడా ఒంటరిగా రారు కదా!
తన పిల్లల సహితంగా ప్రత్యక్షం అవుతారు. అలాగే ఇవి కూడా ఒంటరిగా రావు. వీటికి
కూడా ఐక్యత ఉంది. తన సహయోగులతో సహా వస్తాయి. అందువలనే వికారాలు
ప్రవేశించినప్పుడే బాబా యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారు. బాబా ఆజ్ఞను
ఉల్లంఘించినప్పుడు మీ స్థితి ఎలా అయిపోతుంది? ఏదోక విషయం యొక్క కోరికతో
ఉండిపోతున్నారు. స్వయం సంతుష్టంగా ఉండలేకపోతున్నారు. ఇతరులను సంతుష్టం
చేయలేకపోతున్నారు. కేవలం వీటన్నిటికి కారణం - ఒక్క మాటను కట్ చేస్తున్నారు.
స్వమానంలో స్వ అనే పదాన్ని తీసేస్తున్నారు. అందువలన ఎప్పుడు మీ ఉన్నతికి ఏదైతే
ప్రయత్నం చేస్తున్నారో, సేవ కొరకు ఏవైతే ప్లాన్స్ తయారుచేస్తున్నారో అవి కూడా
ప్రత్యక్షంలోకి తీసుకురాలేకపోతున్నారు. కనుక ఈ ప్లాన్లను ప్రత్యక్షంలోకి
తీసుకువచ్చేటందుకు మొదట మీ స్వమానంలో స్థితులై మీ ప్లాన్ తయారు చేయండి. మరియు
ప్రత్యక్షంలోకి తీసుకురండి. మీ స్థితిని వదిలేసి సేవలో ప్లాన్స్ తయారు చేయకండి.
ఒకవేళ స్థితిని వదిలేసి ప్లాన్స్ తయారుచేస్తే ఏమౌతుంది? వాటిలో ఏ శక్తి ఉండదు.
శక్తి లేకపోతే ప్రత్యక్షంగా వచ్చిన ప్లాన్ యొక్క ప్రభావం పడుతుందా? వీరు చాలా
సేవ చేస్తున్నారు, విస్తారం చాలా చేస్తున్నారు. కానీ బీజరూప స్థితిని
వదిలేస్తున్నారు. విస్తారంలోకి వెళ్ళటం ద్వారా సారాన్ని మర్చిపోతున్నారు.
అందువలన ఇప్పుడు సారాన్ని వదలకండి, విస్తారాన్ని ఎదురుగా తెచ్చుకోవటం అంటే
సారస్వరూపముగా కాలేకపోతున్నారు. సంఖ్యను తయారు చేయటంలోకి వెళ్ళిపోతున్నారు.కానీ
లక్షణాలు కలిగిన ఆత్మలను తయారుచేయటం లేదు. సర్వీస్ యొక్క క్వాలిటీ కూడా
చూడలేకపోతున్నారు. సర్వీస్ యొక్క క్వాంటిటీలోకి వెళ్ళిపోయిన కారణంగా క్వాలిటీ
రావటం లేదు. మీ స్థితిలో కూడా సంకల్పాల యొక్క క్వాంటిటీ అంటే సంఖ్య ఎక్కువ
అయిపోయింది. అందువలన సేవా ఫలితంలో కూడా సంఖ్య వస్తుంది. కానీ లక్షణాలు కలిగిన
ఆత్మలు రావటం లేదు. మొత్తం వృక్షం విస్తారంలోకి వెళ్ళిపోయిన కారణంగా బీజం గుప్తం
అయిపోతుంది. ఒకే బీజం ఉంటే శక్తిశాలిగా ఉంటుంది కదా! ఈ సంఖ్యలో బీజం ఉండాలి,
లక్షణాలు ఉండాలి మరి ఈ లక్షణాల సేవ ఎలా జరుగుతుంది. విస్తారంలోకి వెళ్ళటం ద్వారా
ఇతరుల కళ్యాణం చేస్తూ, చేస్తూ మీ కళ్యాణం కూడా మర్చిపోతున్నారా? ఇతరుల పట్ల
ఎక్కువగా ధ్యాస ఇస్తూ మీ లోపల ఏదైతే ఆందోళన ఉందో దానిని చూసుకోవటం లేదా? మొదట
మీ ఆందోళనపై ధ్యాస పెట్టుకోండి. అప్పుడు విశ్వంలో ఆత్మల ఆందోళన సమాప్తి
చేయగలుగుతారు. మొదట మిమ్మల్ని మీరు చూసుకోండి.మీ సేవ చేసుకోండి. మీ సేవ ద్వారా
ఇతరుల సేవ స్వతహాగానే జరుగుతుంది. మీ సేవను వదిలి ఇతరుల సేవలోకి వెళ్ళటం ద్వారా
సమయం, సంకల్పం ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి. దీని కారణంగా మీకు ఏదైతే జమ కావాలో
అది కూడా జమ కావటం లేదు. ఇక సేవలో జమ అవ్వని కారణంగా నషా, సంతోషం కూడా ఉండటం
లేదు. మీరు ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే తినేస్తున్నారు.
అది అల్పకాలికంగా ఉంటుంది కానీ జమ చేసుకున్నది సదా వెంట వస్తుంది. కనుక ఇప్పుడు
జమ చేసుకోవటం నేర్చుకోండి. కేవలం ఈ జన్మ కొరకు కాదు, 21 జన్మలకు జమ చేసుకోండి.
ఒకవేళ మీరు ఇప్పుడిప్పుడే సేవ చేసారు, సంపాదించుకున్నారు. దానికి ఫలితం గౌరవం
కావాలని కోరుకున్నారు అంటే ఫలం తినేసారు. ఇక భవిష్యత్తుకి ఏమి తయారవుతుంది?
ఇప్పుడిప్పుడే సంపాదించుకోవటం, ఇప్పుడిప్పుడే పంచేయటం, ఇప్పుడిప్పుడే
పోగొట్టుకోవటం ఇవన్నీ ఉండకూడదు. సంపాదించేసుకున్నారు, పంచేసారు దానిలో శక్తి
ఉండదు. కేవలం ఏదైతే లభించిందో అది పంచాము అని సంతోషం ఉంటుంది అంతే, దానం చేసే
సంతోషం ఉంటుంది. కానీ స్వయంలో నింపుకునే శక్తి మీలో ఉండదు. కనుక సంతోషంతో పాటు
శక్తి కూడా ఉండాలి. మొదట సంపాదించుకోవాలి.దానిని మీలో నింపుకోవాలి, తర్వాత
పంచాలి. ఇలా శక్తి లేని కారణంగా నిర్విఘ్నంగా కూడా కాలేకపోతున్నారు. విఘ్నాలను
దాటలేకపోతున్నారు. చిన్న చిన్న విఘ్నాలు సంలగ్నతను కూడా అలజడి చేసేస్తున్నాయి.
అందువలన ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. ఎలా అయితే మీ ముఖంలో సంతోషం యొక్క
మెరుపు కనిపిస్తుందో అలాగే శక్తి యొక్క మెరుపు కూడా కనిపించాలి. సరళచిత్త్
అయ్యారు కానీ ఎంత సరళచిత్తంగా అయ్యారో అంత సహనశీలంగా అయ్యారా? సరళతతో పాటు
ఇముడ్చుకునే, సహించేశక్తి కూడా ఉండాలి. ఒకవేళ ఇముడ్చుకునే శక్తి, సహనశక్తి
లేకపోతే ఒకొక్కసారి సరళత అనే రూపం కూడా చాలా అమాయకరూపం ధారణ చేస్తుంది మరియు
అక్కడక్కడ ఈ అమాయకస్థితి కూడా చాలా నష్టం చేస్తుంది. అందువలన కేవలం సరళచిత్తంగా
అవ్వటమే కాదు.బాబా కూడా అమాయకుడే కదా! భోళానాధుడే కదా! కానీ ఇలాంటి భోళాగా
కాకూడదు. భోళా స్థితితో పాటు బాబా సర్వశక్తివంతుడు కూడా. కేవలము భోళానాధుడే కాదు,
కానీ మీరు ఈ శక్తి స్వరూపాన్ని మర్చిపోయి కేవలం భోళాగా అయిపోతున్నారు. అందువలనే
మాయ వచ్చేస్తుంది. వర్తమాన సమయంలో మీ భోళా స్థితి అంటే అమాయకము కారణంగానే మాయ
యొక్క ఆటలు ఎక్కువగా ఉంటున్నాయి. కనుక మీరు ఎటువంటి శక్తిస్వరూపంగా కావాలంటే
మాయ మొదటే మీకు నమస్కారం చేయాలి. ఎదురుగా కూడా రాకూడదు. చాలా జాగ్రత్తగా,
తెలివైనవారిగా ఉండాలి. మీ వృత్తిని మరియు వాయుమండలాన్ని పరిశీలన చేసుకోండి.
ఎక్కడ నా యొక్క వృత్తి, వాయుమండలం బలహీనంగా లేదు కదా అని. ఎటువంటి వాయుమండలం
అయినా కానీ స్వయం శక్తిశాలి వృత్తితో, వాయుమండలాన్ని కూడా పరివర్తన చేయాలి.
ఒకవేళ వాయుమండలం మన వృత్తిపై ప్రభావం వేస్తుంది అంటే ఇది కూడా అమాయక స్థితియే.
నేను మంచిగా ఉన్నాను కానీ వాతావరణం యొక్క ప్రభావం పడుతుంది. అంటే ఇది కూడా
అమాయకస్థితి. వాతావరణం ఎంత వికారిగా ఉన్నా మీ స్వయం యొక్క వృత్తి నిర్వికారిగా
ఉండాలి. మీరు పతిత పావనీలు, పతితులను పావనంగా చేసేవారు. మరి ఆత్మలను పావనం చేసే
మీరు వాయుమండలాన్ని పతితం నుండి పావనం చేయలేరా? పావనంగా చేసేవారు వాయుండలానికి
వశీభూతం కాకూడదు. కానీ వాయుమండలం వృత్తిపై ప్రభావం వేస్తుంది. అంటే ఇది కూడా
బలహీనతయే. కనుక ప్రతి ఒక్కరు నేను శక్తిశాలి వృత్తితో ఏదైతే అపవిత్రత, బలహీన
వాయుమండలం ఉందో దానిని తొలగించాలి అని భావించండి. మీరు తొలగించేవారు కానీ
వశమయ్యేవారు కాదు. ఏ పతిత వాయుమండలం యొక్క వర్ణన కూడా మనం చేయకూడదు. వర్ణన
చేసాము అంటే చెప్తారు కదా! పాపం చేయకపోయినా చూసిన వారికి కూడా పాపం వస్తుంది అని.
అలాగే బలహీన లేదా పతిత వాయుమండలం యొక్క వర్ణన చేయటం ఇది కూడా పాపమే. ఎందుకంటే
అది వర్ణన చేసేటప్పుడు ఆ సమయంలో బాబాని మర్చిపోతారు. ఎప్పుడు బాబాని మర్చిపోతారో
అక్కడ పాపం వచ్చేస్తుంది. బాబా స్మృతి ఉంటే పాపం ఉండదు. అందువలన పతిత వాయుమండలం
యొక్క వర్ణన కూడా చేయకూడదు. బాబా యొక్క ఆజ్ఞ ఏమిటంటే - మీ నోటి నుండి
జ్ఞానరత్నాలు తప్ప ఒక్క మాట కూడా వ్యర్థము రాకూడదు. కనుక ఈ పతిత వాయుమండలం
గురించి వర్ణన చేయటం ఇది కూడా వ్యర్థమే కదా! ఎక్కడ వ్యర్థం ఉంటుందో అక్కడ
సమర్థత యొక్క స్మృతి ఉండదు. సమర్థ స్మృతిలో ఉంటే ఏ మాట మాట్లాడినా వ్యర్థముగా
మాట్లాడరు. జ్ఞానరత్నాలే మాట్లాడతారు కనుక మీ వృత్తిని, మాటను కూడా పరిశీలన
చేసుకోండి. కర్మ చేసేసాము, పశ్చాత్తాపపడ్డాము, బాబాని క్షమ అడిగాము, బాబా
క్షమించేసారు అనుకోకండి. ఎంత మీరు బాబాని క్షమాపణ కోరుకున్నా కానీ ఏదైనా
పాపకర్మ,వ్యర్థకర్మ జరిగితే దాని గుర్తు తొలగదు. దాని గుర్తు మీపై పడిపోతుంది.మీ
రిజిష్టర్ లో మచ్చ వచ్చేస్తుంది. మీ రిజిష్టర్ స్వచ్ఛంగా ఉండదు. అందువలన
అయిపోయింది, బాబాని క్షమాపణ అడిగాము అనుకోకండి. మీ కర్తవ్యం ఏమిటంటే సంకల్పంలో,
వృత్తిలో, స్మృతిలో ఏ పాప సంకల్పం రాకూడదు. ఇటువంటి వారినే బ్రాహ్మణులు,
పవిత్రులు అని అంటారు. ఒకవేళ ఏదైనా అపవిత్ర వృత్తి స్మృతి సంకల్పంలో వచ్చినా
బ్రాహ్మణ స్థితిలో స్థితులు కాలేరు. కేవలం పేరుకి బ్రాహ్మణులుగా ఉంటారు అంతే.
అందువలన అడుగు అడుగులో జాగ్రత్తగా ఉండండి.సంతోషంతో పాటు వెనువెంట శక్తులను కూడా
వెంట ఉంచుకోండి. విశేషతలతో పాటు మీలో బలహీనత కూడా ఉంటే ఒక బలహీనత అనేక విశేషతలను
సమాప్తి చేస్తుంది. కనుక మీ విశేషతలను ప్రత్యక్షం చేసుకునేటందుకు బలహీనతలను
సమాప్తి చేసుకోండి.అర్థమైందా! మీరు చాలా సేవ చేస్తున్నారు. మీరు చేసే ఆ సేవ
మధ్యలో ఒకవేళ ఒక డిస్ సర్వీస్ జరిగినా ఆ డిస్ సర్వీసే ప్రత్యక్షం అవుతుంది. ఆ
సేవ అంతా సమాప్తి అయిపోతుంది. అమృతంలో ఒక విష బిందువు పడితే మొత్తం అమృతం విషం
అయిపోతుంది. అలాగే మీరు కూడా ఎంత సేవ చేసినా చిన్న పొరపాటు కారణంగా డిస్ సర్వీస్
జరిగితే డిస్ సర్వీస్ మొత్తం సేవను సమాప్తి చేసేస్తుంది. కనుక చాలా ధ్యాస
పెట్టుకోండి. మీపై మీకు కూడా ధ్యాస ఉండాలి. సేవపై కూడా ధ్యాస ఉండాలి.మొదట చేయాలి,
తర్వాత చెప్పాలి. మీకు చేయటం సహజంగా ఉంటుంది. కానీ ఆ చేయటంలో శ్రమ పడాలి. శ్రమ
యొక్క ఫలం చాలా మంచిగా లభిస్తుంది. కేవలం చేస్తే ఫలం రాదు.కనుక మొదట చేయండి
తర్వాత చెప్పండి. అప్పుడు మీ ద్వారా ఎలాంటి క్వాలిటీ సేవ జరుగుతుందో చూడండి. మీ
లక్షణాలను చూసుకోండి.వృత్తి మరియు వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారుచేసుకోండి.
బ్రాహ్మణజన్మ ఎందుకు లభించింది అంటే మీరు తయారవ్వటానికి మరియు ఇతరులను
తయారుచేయటానికి.కేవలం మీరు తయారయ్యేటందుకు కాదు. మీరు చదువుకోవడానికి మరియు
ఇతరులను చదివించడానికి. మీరు విశ్వకళ్యాణకారులు కదా! ఎలా అయితే బాబా
కళ్యాణకారియో అలాగే మీరు కూడా బాబాకి సహాయకారులు. అందువలన ఎప్పుడు కూడా నా
వృత్తి మంచిగానే ఉంది.వాయుమండలం కారణంగా నా స్థితి ఇలా తయారయ్యింది అని
ఆలోచించకండి. మీ వృత్తి మంచిగా ఉంటే ఆ వాయుమండలం యొక్క ప్రభావం మీపై పడదు.
పడుతుంది అంటే మీది శక్తిశాలి వృత్తి కాదు. శక్తిశాలి వస్తువు యొక్క ప్రభావం
చుట్టుప్రక్కల పడుతుంది,కానీ దాగదు. అలాగే మీ వృత్తిని పరిశీలించుకునేటందుకు
వాయుమండలం యొక్క ప్రభావం మీపై పడుతుందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ పడుతుంది
అంటే నా వృత్తిలో బలహీనత ఉంది అని అర్థం చేసుకోండి. ఆ బలహీనతను తొలగించుకోండి.
నలువైపుల సేవా ఫలితంలో ఇప్పుడు విశేషంగా ఏమి కనిపించాలి? ఇప్పుడు పాటలో అందరు
తెలివైనవారిగా అయిపోయారు. కానీ ఇప్పుడు ఆ పాటలో ఉన్న రహస్యాన్ని తెలుసుకోండి.
రాజయుక్తంగా అయ్యారు, కానీ ఇప్పుడు ఆ పాటలో రహస్యయుక్తంగా కూడా అవ్వండి. పాట
మరియు రహస్యం రెండింటిని ఎదురుగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక విషయం ఫోర్స్ గా ఉంటే
ఒక విషయం గుప్తం అయిపోతుంది. అందువలన ఇప్పుడు రాజయుక్తులుగా కూడా కావాలి.
ఇప్పుడు రాజయుక్తులుగా, యోగయుక్తులుగా, యుక్తియుక్తులుగా అవ్వాలి. ఇలా
రాజయుక్తులుగా, యోగయుక్తులుగా, యుక్తియుక్తులుగా నడిచేవారికి బాబా యొక్క నమస్తే.
మంచిది.