రావణునికి విముఖంగా మరియు బాబాకి సన్ముఖంగా
ఉండండి.
ఈ సమయంలో ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వారందరి ఈ సమయం
యొక్క స్థితిని శ్రేష్టస్థితి అంటారా? లేదా అవ్యక్త స్థితి అని అంటారా? ఈ సమయంలో
అందరికి అవ్యక్త స్థితి ఉందా లేదా ఇప్పుడు కూడా ఏదైనా వ్యక్త భావం ఉందా? ఎవరైనా
వ్యక్త స్థితిలో స్థితులై కూర్చుంటే అవ్యక్త కలయిక, అవ్యక్త మాట ధారణ చేయలేరు.
కనుక అవ్యక్త స్థితిలో స్థితులయ్యారా? ఎవరైతే ఇలా లేరో వారు చేతులు ఎత్తండి! ఈ
సమయంలో అవ్యక్త స్థితిలో స్థితులయ్యారు, వ్యక్త భావానికి అతీతంగా ఉన్నారు,
ఎందుకు ఉన్నారు? అందరికీ ఒకే విధమైన అవ్యక్తస్థితి ఎందుకు తయారయ్యింది? ఎలా
తయారయ్యింది? అవ్యక్త బాప్ దాదా ఎదురుగా ఉన్న కారణంగా అందరికి ఒకే విధమైన
అవ్యక్త స్థితి తయారయ్యింది. ఇలా సదా స్వయం బాప్ దాదాను సన్ముఖంగా ఉంచుకుని
నడిస్తే ఎలాంటి స్థితి ఉంటుంది? అవ్యక్త స్థితి ఉంటుంది బాప్ దాదాకి సదా
సన్ముఖంగా ఉండడానికి బదులు వేరుగా లేదా దూరంగా భావించి ఎందుకు నడుస్తున్నారు?
సీత యొక్క ఉదాహరణ వినిపిస్తారు. లేదా వింటూ ఉంటారు. సదా ఎవరి సన్ముఖంలో ఉండేది?
సదా రాముని సన్ముఖంలో ఉండేది కదా! సన్ముఖం అంటే స్థూలంగా సన్ముఖంగా ఉండటం కాదు,
సదా బుద్ధితో బాగా సన్ముఖంలో ఉండాలి. బాప్ దాదాకు సన్ముఖంగా ఉండటం అంటే రావణ
మాయ నుండి విముఖంగా ఉండటం. ఎప్పుడైతే మాయకు సన్ముఖంగా అయిపోతారో అప్పుడు బాబాతో
బుద్ధి విముఖంగా అయిపోతుంది. ఎవరితోనైనా చాలా ప్రియమైన సంబంధం ఉంటే స్వతహాగానే
వారితో కూర్చోవటం, లేవటం, నడవటం అంటే సదా తోడు యొక్క అనుభవం అవుతుంది. కనుక సదా
బాబా సన్ముఖంగా ఉండలేకపోతున్నారా? సదా సన్ముఖంగా ఉంటే అవ్యక్త స్థితి ఉంటుంది.
ఎందుకు దూరం అవుతున్నారు? ఇక్కడ కూడా చిన్నతనం యొక్క ఆట ఆడుతున్నారా? కొంతమంది
పిల్లలు తల్లి తండ్రులు ఎంతగా పిలుస్తున్నా అల్లరి కారణంగా అంత దూరంగా
పారిపోతారు. అది మంచిగా అనిపిస్తుందా? సదా స్వయాన్ని బాబాకి సన్ముఖంగా భావించటం
ద్వారా సదా సర్వశక్తివంతునిగా అనుభవం చేసుకుంటారు. సర్వశక్తివంతుల ముందు ఏ
అధికారం యుద్ధం చేయదు లేదా సర్వశక్తివంతులు ఎప్పుడు ఓడిపోరు. ఈరోజుల్లో
అల్పకాలిక అధికారం ఉన్నవారు కూడా ఎంత శక్తిశాలిగా ఉంటున్నారు. మరి సర్వశక్తుల
అధికారం కలిగిన మీరు మాస్టర్ సర్వశక్తివంతులు కదా! సర్వశక్తుల ముందు అల్పకాలిక
అధికారం కలిగినవారు కూడా తల వంచుతారు. యుద్ధం చేయటానికి బదులు మాటి మాటికి
నమస్కారం చేస్తారు. ఇలా స్వయాన్ని సర్వశక్తివంతునిగా భావించి ప్రతి అడుగు
వేస్తున్నారా? స్వయాన్ని సర్వశక్తివంతునిగా భావించటం అంటే సర్వశక్తివంతుడైన
బాబాను సదా తోడు పెట్టుకోవటం. ఈరోజుల్లో భక్తిమార్గం వారి దగ్గర ఏ అధికారం ఉంది?
వారి బుద్ధిలో సదా శాస్త్రాలే ఉంటాయి కదా! ఏ పని చేస్తున్నా శాస్త్రాలనే ఎదురుగా
తెచ్చుకుంటారు, ఏ కర్మ చేస్తున్నా శాస్త్ర ప్రమాణంగా చేస్తున్నాము అని అంటారు.
ఎలా అయితే శాస్త్రాల యొక్క అధికారం ఉన్నవారికి బుద్ధిలో శాస్త్రాల ఆధారం ఉంటుంది.
అంటే వారికి శాస్త్రాలే బుద్ధిలో ఉంటాయి. వారి ఎదురుగా శాస్త్రాలు ఉన్నాయి. మీ
ఎదురుగా ఏమి ఉంది? సర్వశక్తివంతుడైనా బాబా ఉన్నారు. ఎలా అయితే వారు ఏ కార్యం
చేస్తున్నా, శాస్త్రాల ఆధారంగా చేస్తున్న కారణంగా ఇదే సత్య కర్మ అని భావించి
చేస్తారు. మీరు ఎంతగా తొలగించడానికి ప్రయత్నించినా వారు తమ ఆధారం వదలరు. ఏ
విషయంలో అయినా శాస్త్రాల ఆధారంగా మేము మాట్లాడుతున్నాము అని మాటికి మాటికి
చెప్తారు. శాస్త్రాలు ఎప్పుడు అసత్యం కాదు, శాస్త్రాలలో ఏమి ఉన్నాయో అవి సత్యం
అని మాటి మాటికి చెప్తూ ఉంటారు. ఇంత స్థిరమైన నిశ్చయం ఉంటుంది. అలాగే
సర్వశక్తివంతుని బాబా యొక్క అధికారం ద్వారా మనం అన్ని పనులు చేసేవాళ్ళం. కనుక
మనకి ఎంత స్థిరమైన నిశ్చయం ఉండాలి అంటే దీనిని ఎవరు కదపకూడదు. ఇలా స్థిరమైన
నిశ్చయం ఉందా? సదా మీ అధికారం కూడా జ్ఞాపకం ఉండాలి. ఇతరుల అధికారం చూస్తూ మీ
అధికారం మర్చిపోతున్నారా? అందరి కంటే శ్రేష్ట అధికారం యొక్క ఆధారంతో నడిచేవారు
కదా! ఒకవేళ సదా ఈ అధికారం జ్ఞాపకం ఉంచుకుంటే పురుషార్ధంలో ఎప్పుడు కష్ట
మార్గాన్ని అనుభవం చేసుకోరు. ఎంత పెద్ద కార్యం అయినా కానీ సర్వశక్తివంతుని
అధికారం ఆధారంగా చాలా సహజంగా అనుభవం చేసుకుంటారు. ఏ కర్మ అయినా చేసే ముందు
అధికారాన్ని ఎదురుగా ఉంచుకోవటం ద్వారా ఈ కర్మ చేయాలా, వద్దా అనేది సహజంగా
నిర్ణయంచుకోగలరు. ఎదురుగా అధికారం యొక్క ఆధారం ఉన్న కారణంగా దానిని కాపీ చేయాలి.
కాపీ చేయటం సహజంగా అనిపిస్తుందా లేదా కష్టంగా అనిపిస్తుందా? అవునా, కాదా? అనే
జవాబు అధికారం ఎదురుగా ఉంచుకోవటం ద్వారా సహజంగా లభిస్తుంది. ఈ రోజుల్లో
వైజ్ఞానికులు కూడా ఏదైనా ప్రశ్న అడగగానే దానికి సహజంగా జవాబు చెప్పే మిషన్ తయారు
చేసారు కదా! మిషన్ ద్వారా ప్రశ్నకు జవాబు వస్తుంది అంటే బుద్ది ఉపయోగించవలసిన
పని లేదు. అలాగే సర్వశక్తివంతుని అధికారం ఎదురుగా ఉంచుకోవటం ద్వారా ఏ ప్రశ్న
వచ్చినా దాని జవాబు ప్రత్యక్షంలో మీకు సహజంగా లభిస్తుంది. సహజ మార్గంగా అనుభవం
అవుతుంది. ఈ విధమైన సహజ, శ్రేష్ట అధికారం లభిస్తున్నా కూడా ఒకవేళ ఆ ఆధారం యొక్క
లాభం ఉపయోగించుకోకపోతే ఏమంటారు? మీ బలహీనత, బలహీన ఆత్మగా అవ్వడానికి బదులు
శక్తిశాలి ఆత్మగా అవ్వండి మరియు ఇతరులను తయారుచేయండి. స్వయాన్ని సర్వశక్తివంతుని
అధికారిగా భావించటం ద్వారా మూడు విషయాలు స్వతహాగానే మీలో ధారణ అవుతాయి ఆ మూడు
విషయాలు ఏమిటి?
బుద్ధి యొక్క వ్యాయామం చేయటం ద్వారా విన్న జ్ఞానం
యొక్క మననం చేస్తున్నారు. ఇది కూడా మంచిదే దీని ద్వారా కూడా శక్తి లభిస్తుంది.
ఏదైనా అధికారం ఉన్నవారిలో అంటే సాధారణ అధికారం ఉన్న వారిలో కూడా మూడు విషయాలు
ఉంటాయి. 1.నిశ్చయం 2.నషా 3. నిర్భయత. ఈ మూడు విషయాల అధికారం ఉన్నవారు అసత్యంగా,
అయదార్ధంగా ఉన్నా కూడా ఎంత ధృడనిశ్చయంతో మాట్లాడతారు, నడుస్తారు! ఎంత నిశ్చయం
ఉంటుందో అంతగా నిర్భయంగా అయ్యి నషాతో మాట్లాడతారు! అలాగే మీరు సర్వశక్తివంతుని
అధికారి ఆత్మలు, అందరి కంటే శ్రేష్ట అధికారం కలిగిన వారు మరి మీకు ఎంత నషా
ఉండాలి? ఎంత నిశ్చయం ఉండాలి? మరలా నిర్బయత కూడా ఉండాలి. ఎవరు. ఏవిధంగా
ఓడించడానికి ప్రయత్నం చేసినా కానీ నిర్భయత, నిశ్చయం, నషా ఆధారంగా ఎప్పుడైనా
ఓడిపోతారా? సదా విజయీ అవుతారు, ఓడిపోరు. విజయీ అవ్వకపోవటానికి కారణం - ఈ మూడు
విషయాలలో ఏదోక విషయంలో లోపం ఉంది. అందువలనే విజయం పొందటం లేదు. ఎంత వరకు ఈ మూడు
విషయాలు ప్రతి అడుగులో ప్రత్యక్షంలోకి వస్తున్నాయి అని పరిశీలన చేసుకోండి. ఒకటి
- మొత్తం జ్ఞానంపై, బాబాపై నిశ్చయం ఉంది. కానీ ఏ కర్మ చేస్తున్నా, మాట
మాట్లాడుతున్నా ఈ మూడు లక్షణాలు ఉండాలి. ప్రత్యక్ష విషయం అనేది రెండవ విషయం
మరియు ఎప్పుడైతే ప్రతి కర్మలో, ప్రతి మాటలో ఈ మూడు విషయాలు వస్తాయో అప్పుడు
ప్రతి కర్మ మరియు ప్రతి మాట సర్వశక్తివంతుడిని ప్రత్యక్షం చేస్తాయి. ఇప్పుడు
సాధారణంగా భావిస్తున్నారు. వీరి అధికారం స్వయం సర్వశక్తివంతుడైన బాబాది అని
అనుభవం చేసుకోవటం లేదు. ఎప్పుడైతే ఒక సెకను కూడా అధికారాన్ని వదలకుండా కర్మ
చేస్తారో, మాట్లాడతారో అప్పుడు ఈ అనుభవం చేయించగలరు. అధికారాన్ని మర్చిపోవటం
ద్వారా సాధారణ కర్మ అవుతుంది. ఇతరులు ఎలాగైతె చేస్తున్నారో అలాగే చేస్తే
సాధారణంగా అనుభవము అవుతుంది. ఎవరైనా వచ్చినా ఫలితంలో ఏమి చెప్తున్నారు? మీ
విశేషతలను వర్ణన చేస్తూ విశేషతలతో పాటు సాధారణతను కూడా తప్పకుండా వర్ణన చేస్తూ
ఉంటారు. ఇతర సంస్థలలో కూడా ఇలా ఉంది. వారు ఎలా చేస్తున్నారో మీరు కూడా
చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఇది సాధారణత అయ్యింది కదా! ఒకటి, రెండు
విశేషంగా అనిపిస్తున్నాయి. కానీ ప్రతి కర్మ, ప్రతి మాట విశేషంగా అనిపించాలి.
ఇతరులతో పోల్చలేనిదిగా ఉండాలి. ఆ స్థితి రాలేదు కదా! సర్వశక్తివంతుల ఏ నడవడిక
అయినా సాధారణంగా ఎలా ఉంటుంది? పరమాత్మ అధికారం మరియు ఆత్మల అధికారంలో రాత్రికి,
పగలుకు ఉన్నతం తేడా ఉండాలి. ఇలా స్వయంలో అంటే మీ మాట మరియు కర్మలో ఇతరాత్మలతో
రాత్రికి, పగలుకు ఉన్న తేడా అనుభవం చేసుకుంటున్నారా? రాత్రి, పగలు అర్ధం
చేసుకోవడానికి ఎవరు కష్ట పడవలసిన అవసరం లేదు. స్వతహాగానే ఇది రాత్రి, ఇది పగలు
అని తెలిసిపోతుంది. మీరు సర్వశక్తివంతుని అధికారం ఆధారంగా ప్రతి కర్మ చేసేవారు,
ప్రతి సలహా ప్రకారం నడిచేవారు. కనుక రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా కనిపించాలి.
ఇది సాధారణ స్థానం కాదు, వీరి జ్ఞానం సాధారమైనది కాదు. ఇలా ప్రభావం పడినప్పుడే
మీ అధికారాన్ని ప్రత్యక్షం చేసినట్లు. ఎలా అయితే శాస్త్రవాదులకు శాస్త్రాల
అధికారం ఉంది అని వారి మాటల ద్వారానే తెలుస్తుంది. అలాగే ప్రతి మాట ద్వారా ఈ
అధికారం ప్రసిద్ధం అవ్వాలి. ఇదే అంతిమ స్థితి కదా! మాట ద్వారా, ముఖం ద్వారా,
నడవడిక ద్వారా, అన్నింటి ద్వారా అధికారం తెలియాలి. ఈ రోజుల్లో చిన్న, పెద్ద
అధికారులు తమ కర్తవ్యంలో ఉన్నప్పుడు ఎంతగా తమ కర్మ యొక్క అధికారం చూపిస్తారు!
నషా ఉంటుంది కదా! ఆ నషాతో ప్రతి కర్మ చేస్తారు. అది హద్దు శాస్త్రాల యొక్క
అధికారం. ఇది అలౌకిక అవినాశి అధికారం.
ఈ విధంగా అధికారి బాబాని ఎదురుగా ఉంచుకుని అధికారంతో
నడిచే ఆత్మలకు నమస్తే.