సంపూర్ణస్థితి యొక్క పరిశీలన.
స్వయాన్ని విఘ్నవినాశకులుగా భావిస్తున్నారా? ఏమైనా
విఘ్నాలు వస్తే ఎదుర్కునేశక్తిని అనుభవం చేసుకుంటున్నారా? అంటే మీ పురుషార్ధం
ద్వారా బాప్ దాదాకి మరియు మీ సంపూర్ణస్థితి సమీపంగా వెళ్తున్నట్లు అనుభవం
చేసుకుంటున్నారా లేదా ఎక్కడి వారు అక్కడే ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటున్నారా?
ఎలా అయితే బాటసారి ఎప్పుడు ఆగడు. అలాగే స్వయాన్ని రాత్రి బాటసారిగా భావించి
నడుస్తు ఉంటున్నారా? సంపూర్ణ స్థితి యొక్క ముఖ్య గుణం ప్రత్యక్ష స్థితిలో లేదా
కర్మలో ఏమి కనిపిస్తుంది? లేదా సంపూర్ణ స్థితి యొక్క విశేష గుణం ఏమిటి? ఈ స్థితి
ద్వారా మీరు సంపూర్ణ స్థితికి దూరంగా ఉన్నారా లేదా దగ్గరగా ఉన్నారా అనేది
పరిశీలించుకోండి. ఇప్పుడు ఒక సెకను మీ సంపూర్ణ స్థితిలో స్థితులై చెప్పండి? ఏ
విశేష గుణం సంపూర్ణ స్థితిని ప్రత్యక్షం చేస్తుంది? సంపూర్ణస్థితి పొందిన
ఆత్మలకు ప్రత్యక్ష కర్మలో ఏమి మహిమ ఉంది? సమానత యొక్క మహిమ ఉంది. నింద, స్తుతి,
జయం, పరాజయం, సుఖం, దు:ఖంలో సమానత ఉండాలి, దీనినే సంపూర్ణ స్థితి అంటారు.
దుఃఖంలో కూడా ముఖంలో దు:ఖం యొక్క అలకు బదులు సుఖం, సంతోషం యొక్క అల కనిపించాలి.
నింద వింటున్నప్పటికి ఇది నింద కాదు, సంపూర్ణ స్థితికి దగ్గరగా వెళ్ళేటందుకు
మహిమాయోగ్యమైన మాట అని అనుభవం చేసుకోవాలి. ఈ విధంగా సమానంగా ఉండాలి, దీనినే బాప్
సమాన స్థితి అంటారు. ఆలోచన, దృష్టిలో కొద్దిగా కూడా తేడా రాకూడదు. వీరు
శత్రువులు. వీరు మంచి చేసేవారు అనే ఈ ఆలోచన ఉండకూడదు. శుభచింతక ఆత్మ యొక్క
వృత్తి, కళ్యాణకారి దృష్టి ఉండాలి. ఇద్దరి పట్ల ఒకేవిధంగా ఉండాలి, దీనినే సమానత
అని అంటారు. సమానత లేని కారణంగా బాబా ద్వారా ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు.
బాబా దయాహృదయుడు కదా! మీపై దయ చూపించాలన్నా లేదా బాబా ద్వారా ఆశీర్వాదాలు
తీసుకోవాలన్నా ఒక - సాధనం - సదా రెండు విషయాల యొక్క సమానత ఉండాలి. స్నేహం మరియు
శక్తి యొక్క సమానత లేకపోతే బాబా యొక్క ఆశీర్వాదాలు రావు. పిల్లిమొగ్గల ఆట
చూపిస్తారు కదా! వారి యొక్క విశేషత ఏమిటి? సమానత. అది సాధారణమే, కానీ సమానతలో
విశేషత ఉంటుంది. ఈ ఆట చూసారు కదా! సమానత మంచిగా ఉండటంలో అద్భుతం ఉంది. సమానత
మంచిగా ఉండటం లేదు, మహిమ వింటున్నప్పుడు మరింత నషాలోకి వచ్చేస్తున్నారు. కానీ
గ్లాని ద్వారా అసహ్యంలోకి వచ్చేస్తున్నారు. వాస్తవానికి మహిమ యొక్క సంతోషం,
గ్లాని యొక్క అసహ్యం కూడా రాకూడదు. రెండింటి సమానత మంచిగా ఉండి, స్వయానికి
స్వయమే సాక్షిగా అయ్యి చూసుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీకు మీరు సంతోషం
అవుతారు మరియు ఇతరులను సంతోషం చేస్తారు. కనుక మీ పురుషార్ధం యొక్క లోపం కారణంగా,
సమానత యొక్క లోపం కారణంగా ఆశీర్వాదాలు పొందటం లేదు. కనుక ఇప్పుడు కారణం ఏమిటి?
సమానతను మంచిగా ఉంచుకోండి. కొన్ని రెండేసి మాటలు ఉంటాయి - అతీతం మరియు ప్రియం,
మహిమ మరియు నింద. మీది ప్రవృతి మార్గం కదా! ఆత్మ మరియు శరీరం రెండు, బాబా మరియు
దాదా కూడా ఇద్దరు. ఇద్దరి కర్తవ్యం ద్వారా విశ్వపరివర్తన అవుతుంది. కనుక
ప్రవృతిమార్గం అనాది, అవినాశి. లౌకిక కుటుంబంలో కూడా ఒకరు మంచిగా నడుస్తూ,
రెండవ వారు బలహీనంగా ఉంటే అంటే సమానత మంచిగా లేకపోతే గొడవ అవుతుందా? సమయం
వ్యర్థం అయిపోతుంది. పొందవలసిన శ్రేష్ట ప్రాప్తిని పొందలేకపోతున్నారు. ఒక కాలుతో
నడిచేవారిని ఏమంటారు? వికలాంగులు అంటారు. వారు హైజంప్ చేయగలరా లేదా వేగంగా పరుగు
పెట్టగలరా? దీనిలో సమానత లేకపోతే అటువంటి పురుషార్థులను ఏమంటారు? ఒకవేళ
పురుషార్థంలో ఒక వస్తువు యొక్క ప్రాప్తి ఎక్కువగా ఉండి, ఒక వస్తువు యొక్క
ప్రాప్తి లోపంగా ఉంటే హైజంప్ చేయలేము మరియు పరుగు పెట్టలేము అని భావించండి.
హైజంప్ చేయలేనివారు, పరుగు పెట్టలేనివారు సంపూర్ణతకు సమీపంగా ఎలా వస్తారు? ఈ
లోపం వస్తుంది అని స్వయం కూడా వర్ణన చేస్తున్నారు. స్నేహ సమయంలో శక్తి లోపం
వస్తుంది, శక్తి సమయంలో స్నేహం లోపం వస్తుంది. రెండింటి సమానత మంచిగా ఉండటం లేదు.
రెండింటి సమానత మంచిగా ఉంటేనే అద్భుతం అని అంటారు. ఒకవేళ ఒక సమయంలో ఒకటి, ఇంకొక
సమయంలో ఇంకొకటి ఇది వేరే విషయం. కానీ ఒకే సమయంలో రెండింటి సమానత ఉండాలి. వీరినే
సంపూర్ణం అని అంటారు ఒకటి లోపించి రెండవది ప్రత్యక్షం అయితే ఒకదాని ప్రభావమే
పడుతుంది. శక్తుల చిత్రంలో స్నేహం మరియు శక్తి రూపం రెండింటి సమానత సదా
చూపిస్తారు కదా! నయనాలలో సదా స్నేహం మరియు కర్మలో సదా శక్తి రూపం ఉండాలి.
చిత్రకారులకు కూడా ఈ శివశక్తులు రెండింటి సమానత ఉంచుకునేవారు అని తెలుసు వారు
కూడా చిత్రంలో ఇదే భావం ప్రకటిస్తారు. ప్రత్యక్షంగా చేసినప్పుడే చిత్రం
తయారయ్యింది. ఈ లోపాన్ని ఇప్పుడు సంపన్నం చేయండి. అప్పుడే ఏ ప్రభావం రావాలో ఆ
ప్రభావం వస్తుంది. ఇప్పుడు ఈ విషయం యొక్క ప్రభావం ఎక్కువగా, రెండవ విషయం యొక్క
ప్రభావం తక్కువగా ఉన్న కారణంగా తక్కువగానే ప్రభావం పడుతుంది. ఒక విషయం వర్ణన
చేస్తారు. అన్ని వర్ణన చేయరు సర్వగుణ సంపన్నంగా అవ్వాలి కదా! ఈ విధంగా
సంపూర్ణతను సమీపంగా తీసుకురండి. ధర్మం మరియు కర్మ రెండింటి సహయోగం చెప్తున్నారు.
ప్రజలు రెండింటిని వేరు చేస్తున్నారు, కానీ కర్మ చేస్తూ ధర్మం అంటే ధారణ కూడా
సంపూర్ణంగా ఉండాలి. ధర్మం మరియు కర్మ రెండింటి సమానత కారణంగా ప్రభావం పడుతుంది.
కర్మ చేసే సమయంలో కర్మలో లీనమవుతున్నారు. కానీ ధారణ మంచిగా లేకపోతే వారిని
ఏమంటారు? ప్రజలు ధర్మం మరియు కర్మను వేరు చేసిన కారణంగా ఈ జీవితం మరియు
పరిస్థితులు ఎలా అయిపోయాయి? ధర్మం మరియు కర్మ అంటే ధారణలు మరియు కర్మ రెండింటి
సమానత ఉంటుందా? లేదా కర్మ చేస్తూ మర్చిపోతున్నారా? కర్మ పూర్తయినప్పుడు ధారణ
స్మృతిలోకి వస్తుంది. కర్మలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ధారణ ఉంటుందా? లేక
చిన్నపని అయినప్పుడే ధారణ ఉంటుందా? ధారణ బరువు అయినప్పుడు కర్మ తేలిక అయిపోతుందా?
త్రాసు రెండు ముళ్ళులు సమానంగా ఉంటేనే దానికి విలువ ఉంటుంది. లేకపోతే త్రాసుకి
విలువ ఉండదు. త్రాసు అంటే బుద్ది. బుద్ధిలో రెండింటి సమానత మంచిగా ఉంటే వారిని
దివ్యబుద్ధిమంతులు, తేజ(వేగవంతమైన) బుద్ధిమంతులు, శ్రేష్ట బుద్ధిమంతులు అని
అంటారు. లేకపోతే సాధారణ బుద్ది అంటారు. కర్మ కూడా సాధారణంగా, ధారణలు కూడా
సాధారణంగా ఉంటాయి. సాధారణతలో సమానత ఉండకూడదు. కానీ శ్రేష్టతలో సమానత ఉండాలి. ఎలా
అయితే కర్మ శ్రేష్టంగా ఉందో, అలాగే ధారణలు కూడా శ్రేష్టంగా ఉండాలి. వారినే
ధర్మాత్మ అంటారు. ధర్మాత్మ, మహాత్మ, కర్మయోగి అన్నా ఒకే విషయం. ఈ విధమైన
ధర్మాత్మగా అయ్యారా? ఈ విధమైన కర్మయోగిగా అయ్యారా? ఈ విధమైన ఆశీర్వాదాలు
పొందేవారిగా అయ్యారా? ఏకాంతవాసిగా కూడా ఉండాలి మరియు వెనువెంట రమణీయత కూడా
ఉండాలి. ఎక్కడ ఏకాంతస్థితి మరియు ఎక్కడ రమణీయత, మాటలలో చాలా తేడా ఉంది కానీ
సంపూర్ణతలో రెండింటి సమానత ఉండాలి. ఎంత ఏకాంతవాసీయో అంత వెనువెంట రమణీయత కూడా
ఉండాలి. ఏకాంతంలో రమణీయత మాయం కాకూడదు. రెండు సమానంగా మరియు వెనువెంట ఉండాలి.
మీరు రమణీయతలోకి వచ్చినప్పుడు అంతర్ముఖత నుండి క్రిందికి వచ్చేస్తున్నారు.
అంతర్ముఖతలోకి వెళ్ళినప్పుడు ఈ రోజు రమణీయత ఎలా వస్తుంది అని అంటున్నారు. కానీ
రెండు వెనువెంట ఉండాలి. ఇప్పుడిప్పుడే ఏకాంతవాసి, ఇప్పుడిప్పుడే రమణీయంగా
అవ్వాలి. ఎంత గంభీరతయో అంత అందరితో కలయిక కూడా ఉండాలి. అన్ని సంస్కారాలను మరియు
స్వభావాలను కలుపుకోవాలి. గంభీరత అంటే కలయిక నుండి దూరంగా ఉండటం కాదు. ఏ
విషయంలోనైనా అతిగా ఉండటం మంచిది కాదు. ఏ విషయంలోనైనా అతిలోకి వెళ్తే దానిని
తుఫాను అంటారు. ఒక గుణం తుఫానులా ఉండి, మరొక గుణం మాయం అయితే మంచిగా ఉంటుందా?
ఎలా కావాలంటే అలా స్థితులయ్యేలా శక్తిశాలి ధారణ చేయాలి. బుద్ధి రూపి పాదం
నిలబడటం లేదు అనకూడదు. సమానత మంచిగా లేని కారణంగా స్థిరంగా ఉండటంలేదు.
అప్పుడప్పుడు అక్కడక్కడ పడిపోతున్నారు లేదా చలిస్తున్నారు. ఈ బుద్ది యొక్క అలజడి
కారణంగా సమానత అంటే సంపన్నత ఉండటంలేదు. ఏవిషయం అయినా సంపూర్ణంగా ఉంటే దాని
మధ్యలో ఎప్పుడు అలజడి రాదు. సంపన్నంగా లేనప్పుడు, లోపం ఉన్నప్పుడు అలజడి
వస్తుంది. సంపన్నంగా, సంపూర్ణంగా కానంత వరకు వ్యర్ధ సంకల్పాలు, మాయ అలజడి
వస్తుంది. రెండింటిలో సంపన్నత, సంపూర్ణత ఉంటే అలజడి రాదు. కనుక ఏ అలజడి నుండి
అయినా స్వయాన్ని రక్షించుకోవాలంటే సంపూర్ణంగా, సంపన్నంగా అవ్వాలి. సంపూర్ణ
స్థితి అంటే సంపూర్ణ వస్తువు యొక్క ప్రభావం పడకుండా ఉండదు. చంద్రుడు కూడా 16 కళా
సంపూర్ణంగా ఉన్నప్పుడు అందరిని ఆకర్షిస్తాడు కదా! ఏ వస్తువైనా సంపన్నంగా ఉంటే
అందరిని ఆకర్షిస్తుంది. సంపూర్ణత యొక్క లోపం కారణంగా విశ్వం యొక్క సర్వాత్మలను
ఆకర్షించలేకపోతున్నారు. ఎంత మీలో లోపం ఉంటే అంత ఆత్మలు మీ వైపు తక్కువగా
ఆకర్షితం అవుతారు. చంద్రుని కళలు తక్కువ అయితే ఎవరి ధ్యాస దాని వైపు వెళ్ళదు.
సంపూర్ణంగా అయితే అందరి ధ్యాస స్వతహాగానే చంద్రుని వైపు వెళ్తుంది కదా! ఎవరు
చూసినా చూడకపోయినా తప్పకుండా కనిపిస్తుంది. సంపూర్ణతలో ప్రభావం యొక్క శక్తి
ఉంటుంది. ప్రభావశాలి అవ్వటానికి సంపూర్ణంగా అవ్వాలి. ఒకవేళ సమానత మంచిగా లేకపోతే
అటు ఇటు ఊగే ఆట ఆడతారు. అది సాక్షి అయ్యి చూస్తే మీపై మీకు చాలా నవ్వు వస్తుంది.
ఎవరైనా పూర్తిగా తెలివిలో లేకపోతే వారి నడవడిక చూసి నవ్వు వస్తుంది కదా! అలాగే
మాయ మిమ్మల్ని మూర్చితం చేసినప్పుడు, ఆ సమయంలో మీ నడవడిక ఎలా ఉంటుందో చూసుకోండి.
ఆ దృశ్యం ఎదురుగా వస్తుందా? ఆ సమయంలో ఒకవేళ సాక్షి అయ్యి చూస్తే నవ్వు వస్తుంది.
బాప్ దాదా సాక్షి అయ్యి ఆట చూస్తున్నారు. ఈ ఆట చూపించటం మంచిగా అనిపిస్తుందా?
బాప్ దాదా ఏమి చూడాలనుకుంటున్నారో అది కూడా మీరు తెలుసుకుంటున్నారు. తెలుసుకుని
అంగీకరించి కూడా ఎందుకు నడవటంలేదు? మూడు మూలలు మంచిగా ఉండి ఒకటి మంచిగా లేకపోతే
ఏమౌతుంది? నాలుగు విషయాలు తెలుసుకుని, అంగీకరించి కూడా కొన్ని నడుస్తున్నారు.
కొన్ని నడవటం లేదు అంటే లోపం వచ్చేసినట్లే కదా! ఇప్పుడు ఈ లోపాన్ని
నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండేసి విషయాలు విన్నారు. అలాగే
జ్ఞానస్వరూపులు మరియు శక్తిశాలి ఈ రెండింటి సమానత మంచిగా ఉంటే సంపూర్ణత సమీపంగా
వస్తుంది. జ్ఞానస్వరూపంగా చాలా అవుతున్నారు. కానీ శక్తాశాలిగా తక్కువగా
అవుతున్నారు. సమానత ఉండటం లేదు. శక్తులకు శక్తుల సమానత చూపిస్తారు. ఆశీర్వాదాలు
ఇస్తున్నట్లు చూపిస్తారు. స్వయం సమానతలో మంచిగా లేకపోతే అనేకులకు ఆశీర్వాదాలు
ఇచ్చేవారిగా ఎలా అవుతారు? ఇప్పుడు ఈ వస్తువుకి అందరు బికారిగా ఉన్నారు.
ఆశీర్వాదం యొక్క వరదానం లేదా మహాదానం శివుడు మరియు శక్తులు తప్ప మరెవ్వరు
ఇవ్వలేరు. ఏ వస్తువు యొక్క మహాదాని, వరదానియో అది మొదట స్వయంలో సంపన్నంగా
ఉన్నప్పుడే ఇతరులకు ఇవ్వగలరు.
ఇలా మాస్టర్ జ్ఞానస్వరూపులు, ఆశీర్వాదాలు ఇచ్చేవారికి
మరియు జాగ్రత్తగా ఉండే శ్రేష్ట ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు
నమస్తే.