రిఫైన్ అంటే (స్వచ్చమైన స్థితి) యొక్క పరిశీలన.
ఎలా అయితే విజ్ఞానం స్వచ్చమౌతూ ఉందో, అలాగే మీలో
శాంతిశక్తి లేదా మీ స్థితి స్వచ్చమౌతూ ఉందా? స్వచ్చమైన వస్తువు యొక్క విశేషత
ఏమిటి? స్వచ్చమైన వస్తువు యొక్క క్వాంటిటీ (సంఖ్య) తక్కువ ఉంటుంది. కానీ
క్వాలిటీ శక్తిశాలిగా ఉంటుంది. ఏ వస్తువైతే రిఫైన్ గా అంటే స్వచ్ఛంగా ఉండదో దాని
క్వాంటిటీ అంటే సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ క్వాలిటీ అంటే లక్షణాలు తక్కువగా
ఉంటాయి. కనుక ఇక్కడ కూడా మీరు ఎంతెంతగా రిఫైన్ అంటే స్వచ్చంగా అవుతూ ఉంటారో,
అంతంతగా తక్కువ సంకల్పం, తక్కువ సమయం, తక్కువ శక్తిలో ఏదైతే కర్తవ్యం మీరు
చేయాలో అది 100 రెట్లు ఎక్కువ చేయగలుగుతారు మరియు తేలికతనం కూడా ఉంటుంది.
తేలికతనానికి గుర్తు - వారు ఎప్పుడు క్రిందికి రారు. స్వతహగానే ఉన్నతస్థితిలో
ఉంటారు. ఇదే స్వచ్ఛతకు గుర్తు. ఇదే స్వచ్ఛత యొక్క లక్షణం. కనుక ఈ రెండు విశేషతలు
మీలో అనుభవం అవుతున్నాయా? బరువుగా ఉంటే శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది. తేలికగా
ఉండటం వలన శ్రమ తక్కువగా ఉంటుంది. ఇలా స్వతహా పరివర్తన ఉంటుంది. కనుక ఈ రెండు
విశేషతలు సదా ధ్యాసలో ఉండాలి. ఈ రెండు విశేషతలు ఎదురుగా పెట్టుకుని మీ స్వచ్చత
యొక్క విశేషతను పరిశీలించుకోవచ్చు. అలాగే స్వచ్చతతో ఉన్న వస్తువు ఎక్కువ
భ్రమించదు, వేగంగా ఉంటుంది. ఒకవేళ స్వచ్చంగా లేకపోతే దానిలో ఏదైనా మురికి
కలిస్తే వేగంగా ఉండదు, అది నిర్విఘ్నంగా కూడా నడవదు. ఒకవైపు ఎంతెంత స్వచ్ఛం
అవుతూ ఉంటుందో, అంతంతగా చిన్న చిన్న విషయాలు లేక పొరపాట్లు లేదా సంస్కారాలు
ఏవైతే ఉన్నాయో వాటికి శిక్ష కూడా పెరుగుతూ ఉంటుంది. ఒకవైపు స్వచ్ఛత యొక్క దృశ్యం,
రెండవవైపు ఈ చిన్న చిన్న విషయాలు, పొరపాట్లు, సంస్కారాలకు శిక్ష ఈ రెండు
దృశ్యాల ఫోర్స్ చాలా ఉంటుంది. ఒకవేళ మీరు రిఫైన్ అంటే స్వచ్ఛంగా కాకుండా ఉంటే
ఫైన్ అంటే శిక్ష పడుతుంది. కనుక ఇప్పుడు రెండు దృశ్యాలు మీకు వెనువెంట
కనిపిస్తాయి. రిఫైన్ స్థితి అంటే స్వచ్చత యొక్క స్థితి కూడా అతిలోకి వెళ్తుంది
మరియు ఈ శిక్షల యొక్క స్థితి కూడా అతిలోకి వెళ్తుంది. ఇప్పుడు గుప్తంగా ఉంది అది
ప్రత్యక్షం కానున్నది. ఎందుకంటే ఇప్పుడు యదార్ధ మాల యొక్క మణులు ప్రత్యక్షం
కానున్నాయి. ఈ రెండు విషయాల యొక్క ప్రత్యక్షత అనుసరించే నెంబర్ తయారవుతుంది.
మాల చేతితో త్రిప్పుతారు కదా! ఈ మాలలో మణులుగా అయ్యేటందుకు మీకు మీకే నెంబర్
లభిస్తుంది. ఇప్పుడు మీ నెంబర్ నిర్ణయించుకునే సమయం వస్తుంది. అందువలన ఈ రెండు
విషయాలు మీలో స్పష్టంగా కనిపించాలి. కనుక ఈ రెండు విషయాలను చూస్తూ సాక్షి అయ్యి
సంతోషంగా ఉండాలి. ఈ ఆట మంచిగా అనిపిస్తుంది కదా! ఈ ఆటలో కూడా ఇప్పుడు అతి
పెరుగుతుంది. ఆ దృశ్యాలు కూడా ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి
మజా దృశ్యాలు నడుస్తాయి. మీకు చూడటంలో మజా వస్తుంది కదా లేక దయ వస్తుందా? ఒకవైపు
సంతోష పడుతూ ఉంటారు, రెండవ వైపు దయ కూడా వస్తుంది, రెండింటి ఆట నడుస్తుంది. ఈ
రోజు పరదా లోపల ఏమి జరుగుతుంది అనే ఆట చూపిస్తున్నారు. వతనం నుండి చాలా వేగంగా
కనిపిస్తుంది. ఎంతగా ఎవరు ఉన్నతంగా అవుతూ ఉంటారో, అంతగా స్పష్టంగా ఉంటుంది.
క్రింద స్థితిలో ఉన్నవారికి ఏమైనా కనిపిస్తుందా? ఏమీ కనిపించదు. కనుక సాక్షి
అయ్యి పై నుండి అన్నీ స్పష్టంగా చూడవచ్చు. కనుక ఈరోజు బాబా వర్తమానం యొక్క ఆటను
వతనంలో చూస్తున్నారు. మంచిది.