విశ్వమహారాజులుగా అయ్యేటందుకు విశ్వకళ్యా ణకారి
స్థితి.
స్వయాన్ని ఒక్క సెకనులో ఈ శరీరానికి అతీతంగా అశరీరీ
ఆత్మగా భావించి ఆత్మాభిమాని స్థితిలో స్థితులవ్వగలుగుతున్నారా? అంటే ఒక సెకనులో
కర్మేంద్రియాలను ఆధారంగా చేసుకుని కర్మ చేయాలి. ఒక సెకనులో ఈ కర్మేంద్రియాలకు
అతీతం కావాలి. ఈ అభ్యాసం అయ్యిందా? ఏ కర్మ చేస్తున్నా ఆ కర్మబంధనలో చిక్కుకోవటం
లేదు కదా? కర్మ చేస్తూ కర్మబంధనకు అతీతంగా ఉంటున్నారా లేదా కర్మేంద్రియాల ద్వారా
కర్మ చేస్తూ కర్మకు వశీభూతం అయిపోతున్నారా? ప్రతి కర్మేంద్రియాన్ని ఏవిధంగా
కావాలంటే, ఆవిధంగా నడిపించుకోగలుగుతున్నారా లేదా మీరు ఒకటి అనుకుంటే
కర్మేంద్రియాలు ఇంకొకటి చేస్తున్నాయా? రచయిత అయ్యి రచనను నడిపిస్తున్నారా? ఏదైనా
జడవస్తువుకి చైతన్య ఆత్మ లేదా చైతన్య మనుష్యాత్మ ఆ వస్తువుకి ఏ రూపం కావాలంటే ఆ
రూపం ఇవ్వగలుగుతుంది. ఎలాంటి కర్తవ్యంలో కావాలంటే అలాంటి కర్తవ్యంలో
ఉపయోగిస్తుంది, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలుగుతుంది అంటే జడవస్తువు చైతన్యం
యొక్క వశంలో ఉంటుంది. చైతన్యం జడ వస్తువు యొక్క వశంలో ఉండదు. అలాగే పంచతత్వాలతో
కూడిన జడ శరీరాన్ని చైతన్య ఆత్మ ఏవిధంగా కావాలంటే ఆవిధంగా నడిపించలేదా? ఎలా
అయితే జడవస్తువుని ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో పరివర్తన చేయగలుగుతున్నారు కదా!
అలాగే కర్మేంద్రియాలను వికారి నుండి నిర్వికారిగా వికారాల యొక్క అగ్నిలో
కాలిపోతున్న కర్మేంద్రియాలను శీతలంగా చేయలేరా? చైతన్య ఆత్మలో ఇంత పరివర్తనా
శక్తి లేదా? ఏ కర్మేంద్రియం యొక్క చంచలతను అయినా సహనశీలంగా, సరళచిత్తంగా అయ్యి
తొలగించుకోలేకపోతున్నారా? ఇంత శక్తి మీలో అనుభవం చేసుకుంటున్నారా? మీరు
శక్తిశాలి ఆత్మలు కదా! ఎవరైతే భాగ్యశాలి ఆత్మలు ఉంటారో, వారు శక్తిశాలిగా కూడా
తయారవుతూ ఉంటారు లేదా కేవలం బ్రహ్మాకుమార్, బ్రహ్మాకుమారీ అయిన భాగ్యం కారణంగా
భాగ్యశాలిగా అయ్యారా? కేవలం భాగ్యశాలిగా అవ్వటం ద్వారా కూడా మాయాజీత్ గా కాలేరు.
భాగ్యశాలితో పాటు శక్తిశాలిగా కూడా అవ్వాలి. రెండింటి అనుభవం అవుతుందా?
భాగ్యశాలి ఆత్మను అనే నషా అవినాశిగా ఉంటుంది కదా? దీనిని ఎవరు నాశనం చేయలేరు.
అలాగే శక్తిశాలి యొక్క వరదానం వరదాత బాబా నుండి తీసుకున్నారు కదా! లేదా ఇప్పుడు
తీసుకోవాలా? ఏమని భావిస్తున్నారు? బ్రహ్మాకుమార్, కుమారీగా అయితే అయిపోయారు. ఈ
అవినాశి ముద్ర పడిపోయింది. మరి ఇప్పుడు శక్తిశాలి వరదానం తీసుకున్నారా లేదా
తీసుకోవాలా? మీరు శక్తిశాలిగా అయిపోతే మాయా శక్తి మీపై యుద్ధం చేస్తుందా? మీది
రచయిత శక్తి, అది రచన శక్తి. బలహీనులు బలవంతుల పై యుద్ధం చేసే ధైర్యం చూపిస్తారా?
ఒకవేళ బలహీనులు బలవంతుల ఎదురుగా వస్తే పరిణామం ఎలా ఉంటుంది? ఎవరు విజయీ అవుతారు?
బలవంతులే కదా! కనుక రచయిత యొక్క శక్తి గొప్పది. ఇక రచయితపై మాయ ఎలా యుద్ధం
చేస్తుంది? మాయతో మీరు ఎలా ఓడిపోగలుగుతారు? స్వయాన్ని శక్తిశాలిగా భావించటం లేదు.
సదా శక్తిశాలి స్థితి యొక్క స్మృతిలో స్థితులవ్వటం లేదు. అందుకే ఓడిపోతున్నారు.
ఎక్కడైతే శక్తిశాలి స్థితి యొక్క స్మృతి ఉంటుందో అక్కడ విస్మృతి రావటం అసంభవం.
ఎలా అయితే రాత్రి, పగలు కలిసి ఉండవో, వెలుగు ముందు అంధకారం రావటం అసంభవమో, అలాగే
శక్తిశాలి స్థితిలో స్థితులైనప్పుడు మాయతో ఓడిపోవటం కూడా అసంభవం. ఇలా స్వయాన్ని
తయారు చేసుకున్నారా లేదా ఇప్పటి వరకు సంభవం అవుతుందా? ఎప్పుడు మాయ మిమ్మల్ని
ఓడించకూడదు. ఇలా అవినాశి నిశ్చయబుద్దిగా అయిపోయారా? సంకల్పంలో కూడా మాయ మమ్మల్ని
ఓడిస్తుంది అని అనుకోకూడదు. ఇలా తయారయ్యారా లేక ఇప్పుడు కూడా మాయ వస్తుందా?
యుద్ధం చేసి విజయం పొందుతున్నారా? ఇప్పటి వరకు యుద్ధం చేయటంలోనే సమయం
ఉపయోగిస్తున్నారా? ఒకవేళ ఇప్పటి వరకు మాయతో యుద్ధం చేస్తూ, చేస్తూ శరీరాన్ని
వదిలేస్తే ఎలా అవుతారు? కనుక దీనిని ఇప్పుడు సమాప్తి చేయాలి. ప్రపంచం వారికి
ఇప్పుడు చాలా తక్కవ సమయం ఉంది అని సందేశం ఇస్తున్నారు. కదా! మరి ఈ కొద్ది సమయంలో
యుద్ధం చేసే స్థితిలో లేదా యుద్ధం చేసే స్థితిని సమాప్తి చేసుకోకపోతే సూర్యవంశీ
స్థితి తయారవ్వదు. ఈ యుద్ధం చేసే స్థితి చంద్రవంశీ స్థితి. సూర్యవంశీయులు అంటే
జ్ఞానసూర్య స్థితిలో ఉండాలి. సూర్యుని కర్తవ్యం ఏమిటి? సూర్యుడు అన్నింటిని
భస్మం చేస్తాడు. సూర్యవంశీ స్థితి అంటే సర్వవికారాలను భస్మం చేసి సదా విజయీగా
అయ్యే స్థితి. స్వయాన్ని ఇప్పుడు ఏ స్థితిలో స్థితులైనట్లు భావిస్తున్నారు?
సూర్యవంశీయులా లేదా చంద్రవంశీయులా? ఒకవేళ యుద్ధం చేయటంలో సమయం ఉపయోగిస్తున్నారు
అంటే చంద్రవంశీయులనే అంటారు కదా? ఇప్పటి వరకు మీ పట్లే సమయం ఉపయోగిస్తున్నారు.
అంటే బాబాకి సహాయకారి అయ్యి ప్రత్యక్షంగా మాస్టర్ విశ్వకళ్యాణకారి అయ్యి
విశ్వకళ్యాణం. పట్ల ఎప్పుడు సమయాన్ని ఉపయోగిస్తారు? ఇప్పుడు మీ పట్లే
ఉపయోగించుకుంటే విశ్వకళ్యాణం పట్ల ఎప్పుడు ఉపయోగిస్తారు? అంతిమ స్థితి ఏమిటి?
ఇప్పుడు ఈ ప్రయత్నం చేయండి. రాత్రి, పగలు సంకల్పంలో, సెకనులో విశ్వకర్తవ్యంలో
లేదా సేవలో నిమగ్నమవ్వాలి. ఎలా అయితే లౌకికంలో కూడా లౌకిక రచనకు రచయిత
అయినప్పుడు రచయిత అయిన తర్వాత ఇక స్వయానికి సమయం ఉపయోగించుకోరు. తమ రచనకే
ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది అనుభవమే కదా? అతి రోగంతో, అతి దు:ఖంతో, అతి అశాంతితో
మీ రచన ఉంది అనుకోండి. రచయిత అయిన తల్లి, తండ్రి పూర్తి ధ్యాస ఆ పిల్లలపైనే
పెడతారు కదా! స్వయాన్ని కూడా మర్చిపోతారు, అది హద్దు రచన. కానీ మీరు బేహద్
విశ్వం యొక్క మాస్టర్ రచయితలు. మొదట మీ పట్ల సమయం ఉపయోగించారు. ఇప్పుడు మాస్టర్
రచయిత స్థితిలోకి వచ్చారు. కేవలం ఇప్పుడు ఒకటి రెండు విషయాలు కాదు, మొత్తం
విశ్వంలో ఉన్న ఆత్మలందరు దు:ఖిగా, అశాంతిగా, రోగిగా, అలజడిగా, బికారీగా ఉన్నారు.
మరి బేహద్ రచన అంటే మొత్తం విశ్వానికి మీరు కళ్యాణకారి అయ్యి సదాకాలికంగా ఆ
ఆత్మలను సుఖీగా, శాంతిగా తయారుచేయాలి. బేహద్ రచయితలైన మీరు మీ రచనపై ధ్యాస
పెట్టాలి. విశ్వకళ్యాణంలో నిమగ్నమవ్వాలి. ఇప్పటి వరకు ఇంకా మీ పట్ల సమయం
ఉపయోగించటం, యుద్ధం చేయటం దీనిలోనే ఉపయోగిస్తున్నారా? ఇప్పుడు మిగిలి ఉన్న
కొద్ది సమయం విశ్వకళ్యాణం కోసం అని భావించండి. భక్తిమార్గంలో కూడా మహాదాని
కళ్యాణకారి వృత్తి కలిగిన సేవాధారులు స్వయం పట్ల దానం చేసుకోరు. సర్వాత్మల కోసమే
ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధానం కూడా శేష్ట కళ్యాణకారి ఆత్మలైన మీ ద్వారానే వచ్చింది.
భక్తిలో కూడా ఈ పద్ధతి మీ నుండే ప్రారంభం అయ్యింది. ప్రత్యక్షంగా మీరు చేసిన
విశ్వసేవకు స్మృతిచిహ్నమే అక్కడ నడుస్తుంది. ప్రత్యక్షంగా చేసినదే స్మృతిచిహ్నం
తయారవుతుంది కదా! ఇప్పుడు ఈ పరివర్తన తీసుకురండి. ఇతరుల పట్ల సేవాధారిగా అవ్వటం
ద్వారా, ఇతరుల పట్ల సేవలో సమయాన్ని ఉపయోగించటం ద్వారా, ఇలా సేవాధారిగా అవ్వటం
ద్వారా విజయీలుగా స్వతహాగానే అవుతారు. ఎందుకంటే అనేక ఆత్మలకు సుఖం, శాంతి ఇవ్వటం
ద్వారా ప్రత్యక్షఫల రూపంలో మీకు స్వతహాగానే సుఖ,శాంతి లభిస్తుంది. అలాగే సేవ
చేయటం ద్వారా సేవాఖాతా కూడా మీకు జమ అవుతుంది. దానితో పాటు సేవకు ప్రత్యక్షఫలం
యొక్క ప్రాప్తి కూడా స్వతహాగానే లభిస్తుంది. కనుక సేవాధారిగా అవ్వండి. అప్పుడు
మీ ఉన్నతి స్వతహాగానే జరుగుతుంది. మీ ఉన్నతి చేసుకోవలసిన అవసరం లేదు. ఇతరులకు
ఇవ్వటం అంటే స్వయంలో నింపుకోవటం, స్వయం మీ ఉన్నతి కోసం వేరే సమయాన్ని ఎందుకు
ఉపయోగించాలి? ఒకే సమయంలో రెండు కార్యాలు జరగాలి. డబుల్ ప్రాప్తి లభించాలి.
సింగిల్ ప్రాప్తిలో సమయాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? మొత్తం రోజంతటిలో
విశ్వకళ్యాణం పట్ల ఎంత సమయం తీస్తున్నారు? బ్రాహ్మణుల ఈ అలౌకిక జన్మ ఎందుకోసం?
విశ్వకళ్యాణం కోసం కదా! దేని కోసం ఈ జన్మ లభించిందో ఆ కర్మ ఎందుకు చేయటం లేదు?
ఏ కులంలో జన్మ తీసుకుంటారో ఆ కులం యొక్క సంస్కారం జన్మ తీసుకుంటూనే స్వతహాగా
వచ్చేస్తుంది కదా? స్టూలపని చేసే ఇంటిలో పుట్టిన పిల్లలు చిన్నప్పటి నుండి
తల్లి,తండ్రిని చూసి వారు కూడా అదే కార్యంలో స్వతహాగా నిమగ్నమైపోతారు మరి
జన్మతోనే బ్రహ్మాకుమారీ, కుమారులుగా అయ్యారు. కనుక మీ కర్తవ్యం, బాబా కర్తవ్యం
ఏదైతే ఉందో అది సంస్కారంగా అవ్వాలి కదా! సాకారంలో బ్రహ్మాబాబాను ప్రత్యక్షంలో
చూసారు. రాత్రి నిద్ర సమయాన్ని లేదా తన శరీరం యొక్క విశ్రాంతి సమయాన్ని కూడా
ఎక్కువగా ఎక్కడ ఉపయోగించేవారు? విశ్వకళ్యాణం యొక్క కర్తవ్యంలో, సర్వాత్మల
కళ్యాణం పట్ల ఉపయోగించేవారు, స్వయం పట్ల కూడా కాదు. వాణీ ద్వారా కూడా
విశ్వకళ్యాణం యొక్క మాటలే చెప్పేవారు. సంకల్పాలు కూడా విశ్వకళ్యాణం కోసమే
చేసేవారు. ఇటువంటి ఆత్మను విశ్వకళ్యాణకారి ఆత్మ అని అంటారు. మనస్సు ద్వారా మన
స్వయం యొక్క విఘ్నాలలో, యుద్ధం చేయటంలో సమయాన్ని ఉపయోగించటం ఇది కూడా వ్యర్ధంగా
సమయాన్ని ఉపయోగించటం. దీనిని అవసరం అనరు, వ్యర్థం అంటారు. అవసర సమయాన్ని కూడా
కళ్యాణం పట్ల ఉపయోగించాలి. పిల్లలు వ్యర్ధంగా సమయాన్ని పోగొట్టుకుంటున్నారు.
అంటే బాబాని అనుసరించినట్లా? బాబా సమానంగా కావాలి కదా! కనుక సదా పరిశీలించుకోండి
ఎక్కువలో ఎక్కువ సదా నా సమయాన్ని, సంకల్పాన్ని విశ్వకళ్యాణం పట్ల
ఉపయోగిస్తున్నానా? ఇలా సదా విశ్వకళ్యాణం చేసేవారు ఎలా అవుతారు? విశ్వమహారాజులు.
ఒకవేళ మీ పట్లే సమయాన్ని ఉపయోగించుకుంటే విశ్వమహారాజుగా ఎలా అవుతారు? కనుక
విశ్వమహారాజుగా అయ్యేటందుకు విశ్వకళ్యాణకారిగా అవ్వండి. ఇంత బిజీ అయిపోతే సమయం
సంకల్పం వ్యర్ధంగా పోతాయా? వ్యర్ధం స్వతహాగానే సమాప్తి అయిపోతుంది. సదా వ్యర్ధ
సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. విశ్వసేవలో సమయం ఉపయోగించగలుగుతారు. ఎప్పుడైతే మీరు
విశ్వ వేదికపై విశ్వకళ్యాణం చేస్తూ ఉంటారో, అప్పుడు చిన్నచిన్న విషయాలలో సమయం
ఉపయోగించటం, బుద్ధి యొక్క సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవటం ఇవన్నీ చిన్నతనం
ఆటల్లాగా అనిపిస్తాయి. లౌకికంలో కూడా రచయితలు హద్దు యొక్క బ్రహ్మగా కూడా అవుతారు,
విష్ణువుగా కూడా అవుతారు. కాని శంకురునిగా అవ్వటం లేదు. హద్దు స్థితిలో స్థితులై
ఉన్నవారు వ్యర్ధ సంకల్పాలకు రచయితగా అవుతున్నారు, పాలన కూడా చేస్తున్నారు. కానీ
ఆ సంకల్పాలను వినాశనం చేయటం లేదు. ఎందుకంటే హద్దు యొక్క స్థితిలో
స్థితులవుతున్నారు, బేహద్ స్థితిలో స్థితులైలే మీ యొక్క విషయమే కాకుండా మొత్తం
విశ్వంలో ఉన్నటువంటి వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు వికర్మలను వినాశనం చేసే
వినాశనకారులుగా కాగలుగుతారు. కనుక ఇప్పుడు మీరు వ్యర్ధ సంకల్పాల యొక్క రచన
చేస్తున్నారు. పాలన చేస్తున్నారు, కానీ చివరి స్థితి ఏమిటంటే వినాశనకారి. మీ
యొక్క వ్యర్ధ సంకల్పాలనే కాకుండా విశ్వంలో ఉన్న ఆత్మలందరి వ్యర్ధ సంకల్పాలను
వినాశనం చేయాలి. కళ్యాణకారిగా అయినప్పుడే వినాశనకారిగా అవుతారు. ఇలాంటి స్థితి
ఉందా? ఇప్పుడు హద్దు వదిలేసారు కదా?
ఇలా విశ్వకళ్యాణకారి స్థితిలో మరియు సేవలో స్థితులై
ఉండే మహానాత్మలకు బాప్ దాదా యొక్క నమస్తే.