18.07.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బలహీనతలను సమాప్తి చేసుకునే సాధనమే - తీవ్రపురుషార్ధం.

స్వయాన్ని ఎవరెడిగా భావిస్తున్నారా? ఎవరైతే ఎవరెడిగా ఉంటారో వారి ప్రత్యక్ష స్వరూపంలో ఎవ్వరి హ్యాపీ అంటే సదా సంతోషంగా ఉంటారు. ఏ పరిస్థితి రూపి పేపర్, ప్రకృతి ఆపద ద్వారా పరీక్ష వచ్చినా, శారీరక కర్మభోగ రూపి పరీక్ష అయినా ఏ పరీక్ష వచ్చినా అన్ని పరీక్షలలో ఫుల్ పాస్ అవుతారు. మంచి మార్కులు తీసుకుంటారు. ఇలా స్వయాన్నిఎవరెడిగా భావిస్తున్నారా? ఎవరెడికి గుర్తు - ఎవ్వర్ హ్యపి మరి ఈ సంతోషాన్ని మీరు అనుభవం చేసుకుంటున్నారా? ఏ ఘడియలో ఏ పేపర్ వచ్చినా తయారుగా ఉన్నారా? ఇలా ఎవరెడిగా ఉన్నారా? శ్రేష్ట ఆత్మలైన మీ ద్వారా అనేకాత్మలు నెంబర్ వారీగా వారసత్వాన్ని పొందనున్నారు. వారికి ఇప్పుడు ఈ కొద్ది సమయం మిగిలి ఉంది. ఇప్పుడు సమయం చాలా వేగంగా ముందుకి వెళ్తుంది. ఎలా అయితే సమయం ఎవరికోసం ఆగటంలేదో, నడుస్తూ వెళ్ళిపోతుందో అలాగే మిమ్మల్ని మీరు స్వయం కూడా నేను మాయా విఘ్నాలకు ఆగిపోవటం లేదు కదా? అని అడగండి. స్థూలంగా లేదా సూక్ష్మంగా వచ్చే మాయా విఘ్నాలకు లేదా మాయా యుద్ధాన్ని ఒక్క సెకనులో శ్రేష్ట గౌరవంలో స్థితులై ఆ మాయా శత్రువుని కూడా మంచిగా చేస్తున్నారా?శ్రేష్ట గౌరవంలో లేని కారణంగా మీరు అలజడి అయిపోతున్నారు. ఇప్పుడు అలజడి అవుతున్నారా లేదా విజయం పొందుతున్నారా? ఒకవేళ ఇప్పటి వరకు ఏదోక రకమైన అలజడులలో ఉంటే ఇతరాత్మల అలజడులను ఎలా తొలగిస్తారు? అలజడులను తొలగించేవారు స్వయం అలజడి అవుతారా? ఇప్పుడు ఏదైతే బట్టీ చేస్తున్నారో ఆ బట్టీ యొక్క సమాప్తి సమారోహం లేదా పరివర్తనా సమారోహం జరుపుకుంటున్నారు కదా! మరి ఈ బేహద్ బట్టీలో బలహీనతల సమాప్తి |సమారోహాన్ని, పరివర్తనా సమారోహాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి ఏదైనా తారీఖు నిర్ణయంచారా? లేదా డ్రామా చేయిస్తాదా? డ్రామా అయితే సర్వాత్మలను పాత ప్రపంచం నుండి సమాప్తి సమారోహం చేస్తుంది. కానీ తీవ్ర పురుషార్థీ శ్రేష్టాత్మలు మొదటే బలహీనతల యొక్క సమాప్తి సమారోహాన్ని జరపుకోవాలి. మీరు కూడా అందరితో పాటు అంతిమంలో చేస్తారా? ఎలా అయితే ఈ సెమినార్ ఇవన్నీ పెడుతున్నారో వీటికి తారీఖు నిర్ణయించు కుంటున్నారో అలాగే ఆ ప్రోగ్రామ్ తయారుచేసుకున్న కారణంగా ఆ కార్యంలో సఫలతను కూడా పొందగలుగుతున్నారు.అలాగే ఈ బలహీనతలను, లోపాలను తొలగించుకునే సెమినరీ యొక్క తారీఖు నిర్ణయించుకోవటం లేదా? ఇది జరగటం సంభవమేనా? ఏదైనా యజ్ఞాన్ని రచించినప్పుడు మధ్య మధ్యలో ఆహుతి చేస్తూ ఉంటారు కానీ అంతిమంలో అన్నింటిని కలిపి సంపూర్ణ ఆహుతి చేస్తారు. అలాగే మీరందరు కూడా పరస్పరం అందరు కలిసి సంపూర్ణ ఆహుతి చేస్తారా? సర్వ బలహీనతలను స్వాహా చేయరా? ఎప్పటి వరకు అందరు సంపూర్ణ ఆహుతి చేయరో అంత వరకు మొత్తం విశ్వం యొక్క వాయుమండలం, సర్వాత్మల యొక్క వృత్తులు, తరంగాలు ఎలా పరివర్తన అవుతాయి? మీరందరు విశ్వ పరివర్తన యొక విశ్వ నవ నిర్మాణం యొక్క బాధ్యత తీసుకున్నారు కదా? మరి మీరు స్వయం బలహీనతలను అర్పణ చేయకపోతే ఆ కార్యం ఎలా పూర్తవుతుంది? కనుక మీ యొక్క బాధ్యతలను పూర్తి చేసుకునేటందుకు లేదా మీ కార్యాన్ని పూర్తిగా సంపన్నం చేసేటందుకు సంపూర్ణ ఆహుతి చేయాల్సిందే. స్వయాన్ని ఎవరెడిగా తయారు చేసుకునేటందుకు ఏ యుక్తి మీరు రచిస్తున్నారు? ఆ యుక్తి ద్వారా సహజంగానే బలహీనతల నుండి ముక్తి అవ్వాలి. ఆ యుక్తి ఏమిటి? యుక్తులైతే చాలా లభించాయి ఈ రోజు బాబా మరొక యుక్తి చెప్తున్నారు. అందరి కంటే ఎక్కువ స్మృతి చిహ్నంగా ఎవరికి తయారవుతుంది? మరియు అనేక రకాలైన స్మృతిచిహ్నం ఎవరికి తయారవుతుంది? ఈ బాబాకా లేదా పిల్లలకా? బాబా యొక్క స్మృతి చిహ్నమైతే ఒక శివలింగ రూపంలోనే తయారవుతుంది కానీ మీ యొక్క అంటే శ్రేష్టాత్మలకు అనేక రూపాలలో అనేక ఆచార వ్యవహారాలతో పూజలు జరుగుతూ ఉంటాయి శ్రేష్టాత్మలైన మీకే రకరకాల కర్మలకు రకరకాల స్మృతిచిహ్నాలు తయారయ్యాయి అంటే బాబా కంటే ఎక్కువ అనేక రకాలైన స్మృతి చిహ్నాలు మీకే తయారయ్యాయి కదా! ఎందువలన? మీ యొక్క ప్రత్యక్ష శ్రేష్టకర్మ, శ్రేష్టస్మృతికి స్మృతి చిహ్నం తయారవుతుంది కదా! మీరు ఏదైతే సంకల్పం చేస్తున్నారో, మాట మాట్లాడుతున్నారో, కర్మ చేస్తున్నారో ఆ ప్రతి మాటను, కర్మను పరిశీలన చేసుకోండి. ఈ మాట లేదా కర్మ మా యొక్క స్మృతిచిహ్నం తయారయ్యే విధంగా ఉందా? ఎవరికి స్మృతిచిహ్నం తయారవుతుంది? ఎవరైతే ప్రతి మాట, ప్రతి కర్మ స్మృతిలో ఉంటూ చేస్తారో వారికి స్మృతిచిహ్నం తయారవుతుంది. స్మృతితో చేసిన కర్మ ద్వారా సదాకాలికంగా స్మృతి చిహ్నాన్ని తయారు చేసుకుంటారు. ఏదైనా వస్తువుని ప్రపంచం ముందుకి తీసుకు రావాలంటే ఎంత సుందరంగా, ఎంత స్పష్టంగా తయారు చేస్తారు? సాధారణంగా తీసుకురారు, ఏదోక విశేషత ద్వారా ఆ వస్తువుని అందరి ముందుకి తీసుకువస్తారు. అలాగే మీరు కూడా ప్రతి కర్మ, ప్రతి మాట విశ్వం ముందు స్మృతిచిహ్నరూపంలో చూపించాలి. మరి ఇంత ధ్యాస పెట్టుకుని, ఇంత స్మృతి ఉంచుకుంటూ ప్రతి కర్మ, ప్రతి మాట మాట్లాడుతున్నారా? అది స్మృతి చిహ్నం తయారయ్యే యోగ్యంగా ఉండాలి. స్మృతిచిహ్నం తయారయ్యే యోగ్యంగా లేకుండా కర్మ చేయకండి. ఇది స్మృతి ఉంచుకోండి.ప్రతి కర్మ ద్వారా స్మృతిచిహ్నం తయారవ్వాలి అలాంటి కర్మ ఉంటే చేయండి, లేకపోతే చేయకండి. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు వ్యర్ధ సంకల్పాలు చేస్తున్నారు లేదా వ్యర్ధ మాటలు మాట్లాడుతున్నారు లేదా సాధారణ కర్మ చేస్తున్నారు దీనికి స్మృతిచిహ్నం తయారవుతుందా? స్మృతిచిహ్నాన్ని తయారు చేసుకునేటందుకు స్మృతిలో ఉంటూ ప్రతి కర్మ చేయండి. బ్రహ్మాబాబాని చూసారు కదా ప్రతి కర్మ స్మృతిలో చేయటం వలనే ఈ రోజు వరకు అందరి మనస్సులో ఆయన స్మృతిచిహ్నం గుర్తించబడి ఉండిపోయింది. అలాగే మీ యొక్క కర్మలు కూడా విశ్వం ముందు స్మృతిచిహ్నం రూపంలో తయారుచేసుకోండి. ఇది సహజమేనా? అన్ని స్మృతి చిహ్నాలు మావే మేము అనేకసార్లు చేసిన శ్రేష్టకర్మ స్మృతిచిహ్నంగా తయారవుతుంది అది మేము రిపీట్ చేస్తున్నాము అనే నిశ్చయంతో ఉండండి. అప్పుడు దానిలో కష్టం ఉండదు.కేవలం కల్పపూర్వం చేసింది మీరు రిపీట్ చేయాలి అంటే. మాస్టర్ త్రికాలదర్శి అయ్యి కల్పపూర్వం చేసిన కర్మను స్మృతి చిహ్నాన్ని ఎదురుగా ఉంచుకుని కేవలం దానిని రిపీట్ చేయండి. ఈ స్మృతిలో ఉంటూ పురుషార్ధం చేయటం కష్టమా? మాయ ఇప్పటి వరకు ఈ స్మృతికి తాళం వేసేస్తుందా? తాళం వేసేస్తే ఏమౌతుంది? తాళం పడిపోతే కష్టం కదా? ఈ స్మృతికి తాళం ఎందుకు వేస్తున్నారు? మీ యొక్క లక్ అంటే అదృష్టాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? మీ లక్ అంటే అదృష్టాన్ని మర్చిపోయి లాక్ అంటే తాళం వేసేస్తున్నారు. అదృష్టాన్ని చూసుకుంటే ఆ స్మృతికి ఎప్పుడు లాక్ పడదు. ఇలా లాక్ అంటే తాళం పడిపోయినప్పుడు దానికి తాళంచెవి ఏమిటి? స్వయాన్ని లక్కీగా అంటే అదృష్టంగా భావించండి. మీరు బాబాకి లవ్లీ అంటే ప్రియమైనవారు కూడా మరియు లక్కీ అంటే అదృష్టవంతులు కూడా! కేవలం అదృష్టాన్ని మర్చిపోయి ప్రియంగా ఉన్నా కూడా, సగమే ఉన్నట్లు. కనుక ప్రియమైనవారిగా కూడా కావాలి మరియు అదృష్టవంతులుగా కూడా కావాలి. ఈ రెండు విషయాలు స్మృతిలో ఉంచుకోవటం ద్వారా మీకు మాయ లాక్ వేయదు. అందువలన కల్పపూర్వపు యొక్క స్మృతిచిహ్నాలను స్మృతి ఉంచుకుని వాటిని మరలా రిపీట్ చేయండి. ఇప్పుడు కూడా ఏదైనా స్మృతిచిహ్నం యుక్తియుక్తంగా తయారు చేయకపోతే ఈ స్మృతిచిహ్నాన్ని చూసి, ఇది యుక్తియుక్తంగా తయారు చేయలేదు అని సంకల్పం వస్తుంది కదా! ఏ దేవతలవి అయినా, శక్తులవి అయినా చిత్రాలు యుక్తియుక్తంగా లేకపోతే ఈ చిత్రాలు మంచిగా లేవు అని సంకల్పం వస్తుంది కదా! మరి ఆ చిత్రం అలా తయారయ్యింది అంటే మీ కర్మల ఆధారంగానే తయారయ్యింది కదా? కనుక మీ కర్మలను కూడా చూసుకోండి. ప్రతి సమయం మీ రూపాన్ని, ఆత్మీయతను చూసుకోండి. ఈ సమయంలో నా రూపం, ఆత్మీయత స్మృతిచిహ్నంగా తయారవుతుందా? అని. యుక్తియుక్త స్మృతిచిహ్నంగా తయారయ్యేలా నా స్మృతిచిహ్నం ఉందా? అని చూసుకోండి. యుక్తియుక్త స్మృతిచిహ్న చిత్రానికి చాలా విలువ ఉంటుంది. ప్రతి సమయం నా చరిత్రకు అంత విలువ ఉంటుందా? అని చూసుకోండి. ఒకవేళ మీరు విలువైన చరిత్రవంతులుగా కాకపోతే మీ స్మృతిచిహ్నం కూడా విలువైనదిగా తయారవ్వదు. ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది, మీ యొక్క ప్రతి సంకల్పం చరిత్ర రూపంలో సృతిచిహ్నంగా తయారవుతుంది. కనుక మీ యొక్క ఒకొక్క మాట సర్వాత్మల మనన్సు నుండి మహిమాయోగ్యంగా అవుతుంది. కనుక స్వయాన్ని ఇటువంటి పూజ్యనీయ, మహిమాయోగ్యంగా బావించి ప్రతి కర్మ చేయండి.

ప్రతి కర్మలో స్మృతిలో ఉంటూ ఆ కర్మను స్మృతిచిహ్నంగా తయారు చేసుకునే లవ్లీ మరియు లక్కీ సితారలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.