20.11.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్థితికి దర్పణం -సేవ.

స్వయాన్ని సదా విజయీగా అనుభవం చేసుకుంటున్నారా? ఎప్పుడైతే మీరు విశ్వంపై విజయీ అయ్యి రాజ్యం చేస్తున్నారో ఇప్పుడు స్వయాన్ని విజయీగా అనుభవం చేసుకుంటున్నారా? ఏ విశ్వంపై మీరు రాజ్యం చేస్తున్నారో ఆ రాజ్యాధికారిగా ఇప్పటి నుండి స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? మొదట స్వయం సర్వ అధికారాలు పొందారా లేక ఇప్పుడు పొందాలా? ఎవరైతే స్వయం సర్వ అధికారాలు పొందుతారో, వారే విశ్వ అధికారిగా అవుతారు. కనుక స్వయం యొక్క సర్వ అధికారాలను నేను ఎంత వరకు పొందాను? అని స్వయాన్ని అడగండి. సర్వ అధికారాలు ఏమిటో తెలుసా? ఆత్మ ముఖ్య గుణాలు, ముఖ్య శక్తులు వర్ణన చేస్తున్నారు కదా ఆ శక్తులు ఏమిటి? మనస్సు, బుద్ధి, సంస్కారం. ఈ మూడింటిపై అంటే స్వయం శక్తులపై అధికారిగా అయ్యారా? మీ యొక్క శక్తులకు మీరు ఆధీనం అవ్వటం లేదు కదా? ఎవరైతే విశ్వసేవకు నిమిత్తం అయ్యారో వారికి స్వయం శక్తులపై అధికారిగా ఉండే స్థితి స్వతహాగా మరియు సహజంగా ఉండాలి లేదా పురుషార్ధం చేసి ఈ స్థితి తయారు చేసుకోవలసి వస్తుందా? పురుషార్ధం యొక్క స్థితిని స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా? లేదా సంగమయుగం అంటే కేవలం పురుషార్ధీ సమయం భవిష్యత్తులో సిద్ధి లభిస్తుంది అని అనుకుంటున్నారా? సంగమయుగంలోనే సిద్ధి స్వరూపంగా, మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంగా అనుభవం చేసుకోవాలా లేదా భవిష్యత్తులో అనుభవం చేసుకోవాలా? ఇప్పటి నుండే అనుభవం చేసుకోవాలా లేదా అంతిమ సమయంలో కొద్ది సమయం అనుభవం చేసుకుంటారా? కేవలం ఆశాసితారలుగా అయ్యి ఉండాలి కదా! ఇప్పటి నుండే సిద్ది స్వరూపాన్ని అనుభవం చేసుకోవాలి. స్వయం సర్వ అధికారాల ప్రాప్తి పొందినప్పుడు సిద్ది తప్పనిసరిగా లభిస్తుంది. మనస్సు, బుద్ధి, సంస్కారం ఈ మూడింటిని స్వయం ఎలా కావాలంటే అలా నడిపించగలగాలి. అప్పుడే ఇతరాత్మల యొక్క మనస్సు, బుద్ధి, సంస్కారాలను మీరు పరివర్తన చేయగలుగుతారు. ఒకవేళ స్వయం పరివర్తనలోనే సమయం పడితే స్వయమే సదా విజయీగా కాకపోతే ఇతరులను విజయీగా చేయటంలో కూడా సమయం మరియు శక్తి ఎక్కువ పడుతుంది. మీ స్థితికి దర్పణం - సేవ. ఈ దర్పణంలో ఏమి కనిపిస్తుంది? ఎలా అయితే పురుషార్ధీ ఆత్మలైన మీ స్థితి తయారవుతుందో అలాగే మీరు ఎవరికైతే సేవ చేస్తున్నారో వారికి కూడా అనుభవం అవుతుందా? మీ స్థితిని ఎంత వరకు తయారు చేసుకున్నారు? దీని సాక్షాత్కారం సేవ ద్వారానే జరుగుతుంది కదా! మీకు ఏ స్థితి తయారయ్యింది, ఎంత వరకు చేసుకున్నారు? సేవ మంచిగా అనిపిస్తుంది కదా? సంతోషంగా అయ్యి వెళ్ళారు కదా! అన్నింటికంటే సంతోషం ఎవరికి వచ్చింది? సేవ యొక్క సిద్ధి చూసి సంతోషం వస్తుందా? అందరు బాబా పరిచయం తెలుసుకుని వెళ్ళారు కదా! ఎలా అయితే బ్రాహ్మణాత్మలలో చాలా మంది స్థితిలో విశేషంగా అంటే విశేష గుణాలు ప్రసిద్ధంగా కనిపించాయి. ఒకటి - పవిత్రత మరియు రెండు - స్నేహం. ఈ రెండు విషయాలలో అందరు పాస్ అయిపోయారు. అలాగే సేవా ఫలితంలో స్నేహం మరియు పవిత్రత యొక్క పలితం స్పష్టంగా కనిపించింది. వచ్చేవారు కూడా అనుభవం చేసుకుంటున్నారు. కానీ ఏదైతే నవీనత అంటే జ్ఞానంలో ఏదైతే విశేషత ఉందో ఆ జ్ఞానస్వరూప స్థితి, మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి, సర్వశక్తివాన్ బాబా ప్రత్యక్ష కర్తవ్యం యొక్క విశేషత ఏదైతే ఇప్పుడు విశేష రూపంలో అనుభవం చేయించాలో అది ఇప్పుడు లోపంగా ఉంది. శక్తి అవతారాల యొక్క పేరు ఏదైతే ప్రసిద్ధి కావాలో ఆ శక్తి రూపం, సర్వశక్తివాన్ బాబా యొక్క పూర్తి పరిచయం అందరు అనుభవం చేసుకుంటున్నారా? మీ యొక్క జీవితంతో అందరు ప్రభావితం అయ్యారు, మీ స్నేహంతో, సహయోగంతో ప్రభావితం అయ్యారు. కానీ బాబా చెప్పే శ్రేష్ఠ జ్ఞానానికి, ఆ జ్ఞానస్వరూప స్థితికి ప్రభావితం కావాలి. నిమిత్తమైన బ్రాహ్మణాత్మలు స్వయం శక్తిరూపంగా అనుభవం చేసుకోవాలి. ఇప్పుడు మీరు మీలో కూడా తక్కువ శాతంలో అనుభవం చేసుకుంటున్నారు. అలాగే సేవా దర్పణంలో కూడా శక్తిరూపం యొక్క అనుభవం తక్కువగా అవుతుంది. స్నేహం మరియు సహయోగం ఇవి ఎక్కువగా అనుభవం అవుతున్నాయి. ఇప్పుడు సేవ ఏదైతే నడుస్తుందో, మీరు ఏదైతే సేవ చేస్తున్నారో అది డ్రామానుసారం చాలా మంచిగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు సమాయానుసారం, సమయం యొక్క సమీపతననుసరించి శక్తి రూపం యొక్క ప్రభావం అంటే స్వయం శక్తిరూపంగా ఉండాలి మరియు ఇతరులపై ఆ శక్తి రూపం యొక్క ప్రభావం వేయాలి. అప్పుడే అంతిమ ప్రత్యక్షతను సమీపంగా తీసుకురాగలరు. ఇప్పుడు శక్తి అనే జెండాను ఎగురవేయండి. ఎలా అయితే అనేక రకాలైన జెండాలు ఎగురవేస్తున్నారో జెండా అంటే ఉన్నతంగా ఎగురుతూ ఉంటుంది. అందువలన అందరి దృష్టి స్వతహాగానే దాని వైపుకి వెళ్తుంది. అలాగే శక్తిరూపం యొక్క జెండా ఎగురవేస్తే మీ శ్రేష్టత మొత్తం విశ్వంలో నవీనత రూపంలో, జెండా రూపంలో ఎగురుతుంది. ఇప్పుడు ఈ జెండా ఎగురవేయండి. అప్పుడు మీరు ఎక్కడున్నా, ఏ ఆత్మకైనా అనుభవం చేయించగలుగుతారు. ఇలా విశేష అనుభవం సర్వాత్మలకు చేయించండి. సేవ అనేది దర్పణం కదా! మీ సర్వశక్తి స్వరూపంతో సర్వశక్తివంతుడైన బాబా పరిచయం ఇవ్వాలి.

ఇలా సర్వశక్తివంతుడైన బాబా పరిచయాన్నిచ్చే ఆత్మలకు,స్వయం శక్తి ద్వారా సర్వశక్తులను సాక్షాత్కారం చేయించేవారికి, విశ్వంలో శక్తి స్వరూపం యొక్క జెండా ఎగురవేసే స్నేహీ, సహయోగి, శక్తి స్వరూప శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.