భక్తి మరియు భావనకు ఫలం.
విశ్వకళ్యాణకారి, సర్వశక్తివంతుడు, వరదాత సర్వాత్మల
పిత మరియు భావనకు ఫలమిచ్చే భగవంతుడు మాట్లాడుతున్నారు.
ఏవిధంగా అయితే భక్తులకు భావనకు ఫలం ఇస్తారో, అదేవిధంగా
ఏ ఆత్మ అయినా కానీ భావనతో తపిస్తూ మీదగ్గరకు వచ్చి ప్రాణదానం చేయండి లేదా మా
మనసుకు శాంతిని ఇవ్వండి అని అంటే మీరు వారి భావనకు ఫలం ఇవ్వగలరా? వారికి తమ
పురుషార్ధం ద్వారా ఏదైతే ప్రాప్తిస్తుందో అదైతే ప్రాప్తించింది. వారి పురుషార్ధం
మరియు వారి ఫలం. కానీ మీ దగ్గరకు వచ్చి ఎవరైనా నేను నిర్బలంగా ఉన్నాను, నాలో
శక్తిలేదు అని అంటే అలాంటివారికి మీరు వారి భావనకు ఫలం ఇవ్వగలరా? (బాబా ద్వారా)
బాబాని అయితే తరువాత తెలుసుకుంటారు. మొదట మీరు వారికి ధైర్యం, ఓదార్పు
ఇచ్చినప్పుడు. మొదట వారి భావనకు ఫలం ప్రాప్తించినప్పుడు వారి బుద్ధియోగం మీ
ఆజ్ఞానుసారం జోడించగలుగుతారు. ఇలాంటి భావన గల భక్తులు అంతిమంలో చాలామంది వస్తారు.
ఒకరు పురుషార్ధం చేసి పదవి పొందేవారు, అలాంటి వారైతే వస్తూనే ఉంటారు. కానీ
అంతిమంలో పురుషార్ధం చేయడానికి సమయం ఉండదు మరియు ఆత్మల్లో శక్తి కూడా ఉండదు.
అలాంటి ఆత్మలకు మీ సహయోగం ద్వారా మరియు మీ మహాదానం ద్వారా ఇచ్చేటటువంటి మీ
కర్తవ్యం ఆధారంగా వారి భావనకు ఫలం ఇచ్చేటందుకు మీరు నిమిత్తం అవ్వాల్సి ఉంటుంది.
వారైతే శక్తుల ద్వారా నాకు వరదానం లభించాలి అనే భావిస్తారు. దృష్టితో అద్భుతం
చేయాలి అని మహిమ ఉంది కదా? ఎలా అయితే చాలా కాంతివంతమైన బల్బు ఉంటే, దాని స్విచ్
వేయగానే ఎక్కడ ఆ కాంతి పడుతుందో, ఆ స్థానంలో కీటాణువులన్నీ ఒక్క సెకెనులో వెంటనే
భస్మం అయిపోతాయి. అదేవిధంగా ఎప్పుడైతే ఆత్మలైన మీరు మీ సంపూర్ణ శక్తిశాలి
స్థితిలో ఉంటారో అప్పుడు ఎవరైనా వస్తే ఒక్కసెకెనులో స్విచ్ వేసినట్లు మీరు వారి
గురించి శుభ సంకల్పం చేయగానే ఈ ఆత్మకు కల్యాణం జరగాలనే శుభభావన పెట్టుకోవాలి. ఈ
సంకల్పం అనే స్విచ్ వేయగానే అనగా సంకల్పం రచించగానే వెంటనే వారి భావన పూర్తి
అయిపోతుంది, వారు ముగ్ధులు అయ్యిపోతారు. ఎందుకంటే చివరలో వచ్చే ఆత్మలు
కొంచెంలోనే ఎక్కువ రాజీ అయిపోతారు. సర్వ ప్రాపులు లభించినట్టుగా భావిస్తారు.
ఎందుకంటే వారి పాత్రే అలాంటిది. వారికి కొంచెం దొరికినా కానీ వారిలెక్కను
అనుసరించి అదే ఎక్కువగా అనిపిస్తుంది. ఈ విధంగా సర్వాత్మలకు వారి భావనకు ఫలం
ప్రాప్తించాలి. ఎవరు కూడా వంచితులుగా ఉండకూడదు. దీనికోసం అంత శక్తిశాలి స్థితి
అనగా సర్వశక్తులను ఇప్పటి నుండే మీలో జమ చేసుకోండి. అప్పుడే మీరు జమా చేసుకున్న
శక్తులతో కొందరికి ఇముడ్చుకునే శక్తిని మరియు కొందరికి సహనశక్తిని ...ఇలా ఎవరికి
ఏది కావాలంటే అది మీరు ఇవ్వగలరు. వైద్యుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలాంటి రోగియో
వారి అనుసారంగా మందు యొక్క మోతాదులు ఇస్తారు మరియు ఆరోగ్యంగా తయారుచేస్తారు.
అదేవిధంగా మీరు కూడా సర్వశక్తులను మీ దగ్గర జమచేసుకునేటందుకు ఇప్పటి నుండి
పురుషార్ధం చేయాలి. ఎందుకంటే ఎవరైతే విశ్వమహారాజుగా అయ్యేవారుంటారో, వారి
పురుషార్థం కేవలం స్వయం కోసమే ఉండదు. మీ జీవితంలో వచ్చే విఘ్నాలను, పరీక్షలను
దాటటం అనేది చాలా సాధారణ విషయం. కానీ ఎవరైతే విశ్వమహారాజుగా అయ్యేవారున్నారో
వారిదగ్గర ఇప్పటి నుండే స్టాకు నిండుగా ఉండాలి. విశ్వం కోసం ఉపయోగించగలిగి
ఉండాలి. ఇక్కడ కూడా ఎవరైతే, విశేష ఆత్మలు నిమిత్తమై ఉన్నారో వారిలో కూడా
సర్వశక్తుల యొక్క స్టాకు లోపల అనుభవం అవుతూ ఉండాలి. అప్పుడే సంపూర్ణ స్థితి లేదా
ప్రత్యక్షత యొక్క సమయం సమీపంగా ఉన్నట్లు భావించండి. ఆ సమయంలో ఇక ఏ స్మృతి ఉండదు.
ఇతరుల కోసమే ప్రతి సెకెండు, ప్రతి సంకల్పం ఉంటుంది.
ఇప్పుడైతే మీ పురుషార్థం కోసం లేదా మీ తనువు కోసం సమయం
ఇవ్వాల్సి ఉంటుంది. శక్తి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ పురుషార్థం కోసం మనసును
కూడా పెట్టాల్సి ఉంటుంది. ఆ తరువాత ఈ స్థితి సమాప్తం అయిపోతుంది. ఈ పురుషార్థం
మారిపోయి మీకు ఎలా అనుభవం అవుతుందంటే, ఒక్క సెకెండు లేక ఒక్క సంకల్పం మీకోసం
కాకుండా విశ్వకళ్యాణం కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిని సంపూర్ణము
అనగా సంపన్నము అని అంటారు. సంపన్నంగా కాకపోతే సంపూర్ణులుగా కానట్లే. ఎందుకంటే
సంపన్న స్థితియే సంపూర్ణ స్థితి.
ఈ విధంగా మీ పురుషార్థాన్ని మరింత లోతుగా చేసుకుంటూ వెళ్ళాలి. విశేషాత్మల
పురుషార్థం కూడా తప్పకుండా చాలా అతీతంగా ఉంటుంది. మరైతే పురుషార్ధంలో ఇలాంటి
పరివర్తన అనుభవం అవుతుందా? ఇప్పుడైతే దాత యొక్క పిల్లలు దాత యొక్క స్థితికి
రావాల్సి ఉంటుంది. ఇవ్వడమే వారికొరకు తీసుకోవడం అవుతుంది. ఇప్పుడు సమయం యొక్క
సమీపతతో పాటు సంపన్న స్థితి కూడా కావాలి. ఆత్మలైన మీ యొక్క సంపన్న స్థితియే
సంపూర్ణతను సమీపంగా తీసుకువస్తుంది. మీరు ఇప్పుడు స్వయాన్ని పరిశీలించుకోవాలి.
ఎలాగైతే మొదట్లో మీ పురుషార్థంలో సమయం వెళ్ళిపోయేది లేక ఇప్పుడు రోజు రోజుకు
ఇతరుల కోసం ఎక్కువ వెళ్తుంది కదా? మీ దేహాభిమానం కూడా స్వతహాగానే డ్రామానుసారం
సమాప్తం అయిపోతుంది. పరిస్థితుల కారణంగా కూడా ఈ విధంగా జరుగుతుంది. దాని ద్వారా
స్వతహాగానే ఆత్మాభిమానిగా అయిపోతారు. కార్యంలో ఉపయోగించడం అంటే ఆత్మాభిమానిగా
అవ్వడం. ఆత్మాభిమానిగా కాకుండా కార్యం సఫలం అవ్వదు. కనుక నిరంతరం ఆత్మాభిమానిగా
ఉండే స్థితి స్వతహాగా అయిపోతుంది. విశ్వకళ్యాణకారిగా అయ్యారా లేక ఆత్మ
కళ్యాణకారిగా అయ్యారా? మీ లెక్కల ఖాతా చూసుకోవడంలో బిజీగా ఉన్నారా లేక విశ్వం
యొక్క సర్వాత్మల యొక్క కర్మబంధనాలు లేదా కర్మల ఖాతాలను పూర్తి చేయడంలో బిజీగా
ఉన్నారా? దేంట్లో బిజీగా ఉన్నారు? లక్ష్యం పెట్టుకున్నారు - సదా విశ్వకళ్యాణం
కోసం తనువు, మనసు, ధనాలు అన్నీ ఉపయోగించండి.
ఒక్క సెకెను కూడా మరియు ఒక్క సంకల్పం కూడా మీకోసం
వ్యర్ధంగా వెళ్ళకూడదు. విశ్వకళ్యాణార్ధం ఉండాలి. ఇలాంటి స్థితిని సంపూర్ణం అనగా
సంపన్నం అని అంటారు.