04.05.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అధికారి మరియు అధీనులు.

సర్వశక్తివంతుడు, నెంబర్ వన్ ఆర్టిస్టుగా తయారుచేసేవారు, భాగ్యవిధాత సర్వాత్మల అదృష్టాన్ని మేల్కొలిపే బాబా మాట్లాడుతున్నారు -

ధ్వనిలోకి వచ్చే అభ్యాసం ఎంతగా నిరంతరం మరియు స్వతహా రూపంలో ఉందో, అంతగానే ధ్వనికి అతీతంగా ఆత్మ అయిన మీ యొక్క స్వధర్మం అనగా శాంతి స్వరూప స్థితిని అనుభవం చేసుకోవడం అనేది స్వతహాగా మరియు నిరంతరం చేసుకుంటున్నారా? రెండు అభ్యాసాలు సమానంగా అనుభవం అవుతున్నాయా లేక 84 జన్మలుగా శరీరధారి అయిన కారణంగా ఆ సంస్కారం చాలా కఠినమైపోయిందా? 84 జన్మలు మాటల్లోకి వస్తునే ఉంటారు. మరి 84 జన్మల సంస్కారాన్ని ఒక్కసెకెనులో పరివర్తన చేసుకోగలుగుతున్నారా? అనగా వాణికి అతీతమైన స్థితిలో స్థితులు కాగలుగుతున్నారా లేక ఆ సంస్కారం మాటిమాటికి తనవైపుకు ఆకర్షిస్తుందా? ఏమని భావిస్తున్నారు? 84 జన్మల సంస్కారం ప్రబలంగా ఉందా లేక ఈ సౌభాగ్యశాలి సంగమయుగం యొక్క ఒక్క సెకెనులో అశరీరిగా, వాణికి అతీతంగా, మీ అనాది స్థితి యొక్క అనుభవం ప్రబలంగా ఉందా? దాంట్లో పోలిస్తే ఈ శక్తిశాలి స్థితి తనవైపునకు ఆకర్షిస్తుందా? లేక 84 జన్మల సంస్కారం శక్తిశాలిగా ఉందా? అవి 84 జన్మలు. ఇది ఒక్కసెకెను యొక్క అనుభవం. అయినా కానీ ఏది శక్తివంతమైన అనుభవం? ఏమనుకుంటున్నారు? ఏది ఎక్కువ ఆకర్షిస్తుంది? ఆ అనుభవమా లేక ఈ అనుభవమా? వాణిలోకి వచ్చే సంస్కారమా లేక వాణీకి అతీతంగా వెళ్ళే అనుభవమా? వాస్తవానికి ఇక్కడ ఈ ఒక్కసెకెను యొక్క అనుభవం చాలా సమయం యొక్క అనుభవానికి ఆధారం. ఒక్క సెకెనులో అనేక ప్రాప్తులను అనుభవం చేయించేది. అందువలన ఈ ఒక్క సెకెను అనేక సంవత్సరాలతో సమానం. ఇలా అనుభవం చేసుకుంటున్నారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మీ నోటిని నడిపించగలుగుతున్నారా? సెకెను అని దీనినే అంటారు. ఈ శరీరాన్ని నడిపించే మాస్టర్ యజమాని స్థితి యొక్క అనుభవం అవుతుందా, యజమాని అయ్యారా? శరీరానికి యజమాని అయ్యారా? యజమానికిగా ఎవరు కాగలరు తెలుసా? యజమానిగా ఎవరు అవుతారంటే ఒకవేళ బిడ్డగా కాకపోతే మీరు మీ శరీరానికి కూడా యజమానిగా కాలేరు. సర్వశక్తివంతుని సంతానం మీ ప్రకృతికి యజమానిగా కాలేరా? మేము పిల్లలము మరియు యజమానులము. ఇప్పుడు ఈ ప్రకృతికి యజమానులం. తరువాత విశ్వానికి యజమానులు అవుతాము. ఈ విధంగా ఎంతగా పిల్లవాని స్మృతి - ప్రీతి స్మృతి ఉంటుందో అంతగా యజమాని స్థితి యొక్క నషా ఉంటుంది. సంతోషం ఉంటుంది మరియు అదే ఆనందంలో లీనమై ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా ప్రకృతికి ఆధీనం అవుతున్నారంటే దానికి కారణం ఏమిటి? మీ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిని మరిచిపోతున్నారు. మీ అధికారాన్ని సదా ఎదురుగా పెట్టుకోవడం లేదు. అధికారి అయిన వారు ఎప్పుడూ దేనికీ ఆధీనం అవ్వరు. స్వయాన్ని ఎవరెడీగా మరియు ఆల్రౌండర్ అని భావిస్తున్నారా? ఎవరెడీ అంటే అర్ధం ఏమిటి? ఎలాంటి పరిస్థితి అయినా గానీ, ఎలాంటి పరీక్షలు అయినా కానీ శ్రీమతం ప్రమాణంగా ఏ స్థితిలో స్థితులవ్వాలనుకుంటున్నారో దాంట్లో స్థితులు కాగలుగుతున్నారా? అనగా బాబా ఆజ్ఞానుసారం ఎవరెడీయేనా? ఆజ్ఞ అనగా శ్రీమతం. సంకల్పం కూడా శ్రీమతానుసారంగానే నడవాలి. ఇలాంటి ఎవరెడీయేనా? ఒక్కసెకెనులో సాక్షి స్థితిలో స్థితులవ్వండి అనేది శ్రీమతం. మరి ఆ సాక్షి స్థితిలో స్థితులవ్వడంలో ఒక్కసెకెనుకు బదులు, రెండు సెకెనుల పడితే వారిని ఎవరెడి అంటారా? సైన్యంలో ఉన్నవారికి ఆర్డర్ వస్తుంది, స్టాప్ అని. అప్పుడు వెంటనే స్టాప్ అయిపోతారు కదా! స్టాప్ అని అనిన తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అదేవిధంగా శ్రీమతం లేదా ఆజ్ఞ లభించింది, ఒక్క సెకెనులో ఆ స్థితిలో స్థితులయిపోవాలి. మరో సెకెను కూడా పట్టకూడదు, అలాంటి వారిని ఎవరెడీ అంటారు. ఆ స్థితిలో ఒక్క సెకెనులో స్థితులయిపోవాలి. ఒక్క సెకెనులో స్వయాన్ని స్థితులు చేసుకునే పురుషార్థాన్ని తీవ్ర పురుషార్ధం అంటారు. అందరూ తీవ్ర పురుషార్థులేనా? పురుషార్ధి స్థితి నుండి ఇప్పుడు దాటేసారు కదా? అందరూ ఇప్పుడు తీవ్ర పురుషార్టీ స్థితికి చేరుకున్నారా? ఈ విధంగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? కొంచెం కూడా సంకల్పంలో కూడా అలజడి ఉండకూడదు. ఇలాంటి స్థితిని అనుభవం చేసుకుంటూ వెళ్తున్నారా? ఈ లెక్క ప్రకారం అందరూ ఎవరెడీగా ఉన్నారా? శస్త్రధారి శక్తి సేన ఈ స్థితి వరకు చేరుకున్నారా లేక చేరుకుంటున్నారా? ఇంకా చేరుకోలేదా? ఏమని భావిస్తున్నారు? దీంట్లో పాండవులు నెంబర్ వన్ లేక శక్తులా? అద్భుతం ఏమిటంటే పాండవులు వాతావరణం లేదా వాయుమండలం యొక్క సంపర్కంలోకి వస్తూ కూడా తమ స్థితిని ఈ విధంగా తయారుచేసుకోవాలి. ఎలా అంటే మీ కారు లేదా ఏదైనా వాహనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపగలరా లేదా అదేవిధంగా మీ యొక్క ప్రతి కర్మేంద్రియాన్ని ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే అలా ఉపయోగించగలరు. ఉపయోగించకూడదనుకుంటే కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకోగలరు. మీ బుద్ధిని ఎక్కడ కావాలంటే ఎంత సమయం కావాలంటే అంత సమయం ఆ స్థితిలో స్థితులు చేయగలుగుతున్నారా? పాండవులు మొదటి నెంబర్ కాదా? ఏ విషయంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలో దాంట్లో శక్తులను ముందు పెట్టేస్తున్నారు. శక్తులను ఢాలుగా తయారు చేసుకుంటున్నారా? శక్తులు కూడా తక్కువ కాదు. శక్తులు పాండవులకు అదనపు సహాయాన్ని ఇస్తారు. శక్తులు మహాదాని కనుక ఇలాంటి ఎవరెడీగా తయారు చేయాలి.

మంచిది. ఆల్‌రౌండర్ అంటే అర్ధమేమిటి? ఆల్‌రౌండర్ అంటే అర్థమేమిటో తెలుసా? మీరు ఆల్‌రౌండర్ కదా? సంపూర్ణ స్థితిలో ఆల్‌రౌండర్ స్థితి అంటే ఏమిటి? దీంట్లో మూడు విశేష విషయాలు ధ్యాస పెట్టుకోవాలి. ఎవరైతే ఆల్‌రౌండర్‌గా ఉంటారో వారు 1. సేవలో ఉంటారు 2.స్వభావ సంస్కారాల్లో కూడా అందరితో కలిసిపోయే విశేష గుణం కలిగి ఉంటారు. 3. ఏ స్థూల కార్యం అయినా కానీ దానిని మీరు కర్మణ అని అంటారు. ఈ కర్మణా సబ్జెక్టులో కూడా ఎక్కడ ఏ సమయంలో ఇమిడిపోవాలంటే అక్కడ ఇమిడిపోతారు. చాలా కాలం నుండి ఆ పనిచేస్తున్నవారిలా ఇమిడిపోతారు. ఏమి కొత్తదనం ఉండదు. ప్రతి పనిలో బాగా పాతవారిలా అన్నీ తెలిసినవారిలా కనిపిస్తారు. ఇలా మూడు విషయాల్లో ఎవరైతే ప్రతి సమయం ఇమిడిపోతారో, నిమగ్నమైపోతారో వారినే ఆల్‌రౌండర్ అని అంటారు. ఎందుకంటే ఈ ఒకొక్క విషయం ఆధారంగానే కర్మ రేఖలు తయారవుతాయి లేదా ఆత్మలో సంస్కారాల రికార్డింగ్ జరుగుతుంది. కనుక ఈ అన్ని విషయాలతో ప్రాలబ్ధానికి చాలా సంబంధం ఉంది. ఏ విషయంలో అయినా 90% ఉండి, 10% లోపం ఉన్నా ప్రాలబ్దంలో కూడా ఆ కొద్దిపాటి లోపం యొక్క ప్రభావం పడుతుంది. ఈ సూక్ష్మ లోపం కారణంగా నెంబర్ తగ్గిపోతుంది. చూడడానికి అసామాన్య పురుషార్థిగా కనిపిస్తారు. ముఖ్య విషయాలలో సమానంగా కనిపిస్తారు. కానీ లోతైన రూపంతో చూస్తే ఎంతోకొంత శాతం లోపంగా ఉన్న కారణంగా అసామాన్యులుగా కనిపిస్తున్నప్పటికీ నెంబర్ లో తేడా వచ్చేస్తుంది. దీని ఆధారంగా మా నెంబర్ ఏమిటి అనేది మీకు మీరే తెలుసుకోవచ్చు. మూడు విషయాల్లో ఎంత శాతం ఉందో చూసుకోండి. మూడు విషయాలు నాలో ఉన్నాయి అనుకుని కేవలం దీంట్లో సంతోషం అయిపోకండి. దీని ద్వారా నెంబర్ తయారవదు. ఎంత శాతంలో ఉన్నాయో దాని అనుసారంగా నెంబర్ తయారవుతుంది. ఈ విధమైన ఎవరెడి మరియు ఆల్‌రౌండర్ అయ్యారా? అందరూ ఫస్టులో రావాలి అనే లక్ష్యం ఉంది కదా! లాస్టులో వచ్చినా పరవాలేదు అనే లక్ష్యంతో అయితే లేదు కదా! ఎంత లభిస్తే అంతే మంచిది, ఇలాంటి లక్ష్యం ఉందనుకోండి వారిని ఏమంటారు? ఇలాంటి నిర్భల ఆత్మకు ఏ టైటిల్ లభిస్తుంది? ఇలాంటి ఆత్మలకు కూడా శాస్త్రాల్లో మహిమ ఉంది. ఒకటి - వారి టైటిల్ ఏమిటో చెప్పండి; రెండు - వారి మహిమ ఏమిటో చెప్పండి. ఇలాంటి ఆత్మల యొక్క మహిమ ఏమిటంటే భగవంతుడు భాగ్యాన్ని పంచి పెడుతున్నప్పుడు వారు నిద్రపోయారు. సోమరితనం అనేది కూడ సగం నిద్ర, సోమరితనంలో ఉండడం కూడా నిద్రపోతున్న స్థితియే. సోమరిగా ఉన్నా కూడా నిద్రపోతున్నారనే అంటారు. వీరి టైటిల్ ఏమిటి? ఇలాంటి వారిని వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకున్నవారంటారు. భాగ్యవిధాతకు పిల్లలుగా అయ్యారు, అనగా అధికారిగా అయ్యారు. భాగ్యం ఎదురుగా వచ్చింది, అనగా భాగ్యవిధాత తండ్రి ఎదురుగా వచ్చారు. ఎదురుగా వచ్చిన భాగ్యాన్ని తయారు చేసుకునేదానికి బదులు పోగొట్టుకున్నారు. ఇలాంటి వారిని ఏమంటారు? భాగ్యహీనులు. వీరు ఎప్పుడూ సుఖం పొందలేరు. ఇలా తయారయ్యేవారు ఎవరూ లేరు కదా? మీ అదృష్టాన్ని తయారుచేసుకునేవారు కదా? ఎలాంటి అదృష్టం మీరు తయారుచేసుకుంటారో అలాంటి భవిష్య ప్రాలబ్దం అనే చిత్రం తయారవుతుంది. మీ భవిష్య చిత్రం మీకు తెలుసా? మీ చిత్రాన్ని గీసుకునే చిత్రకారులు మీరు కదా? ఎంతవరకు మీ అదృష్టాన్ని తయారుచేసుకున్నారనేది మీకు తెలుసు కదా? ఇప్పుడు చిత్రాన్ని గీస్తున్నారా లేక కేవలం ఫైనల్ టచింగ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయా? చిత్రం తయారుచేసుకున్నట్లయితే అది తప్పకుండా ఎదురుగా వస్తుంది. ఒకవేళ ఎదురుగా రావడం లేదంటే ఇంకా తయారు చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. తయారైపోతే అది మాటిమాటికి ఎదురుగా ఉంటుంది. అందరూ నెంబర్ వన్ ఆర్టిస్టులు కదా! సెకెండ్ నెంబర్ లేదా థర్డ్ నెంబర్ కాదు కదా! చాలామంది మంచి ఆర్టిస్టులుగా ఉంటారు. కానీ విశాల హృదయులుగా లేకపోతే ఏదోకటి లోపం చేస్తారు. ఆర్టిస్టు మంచివారు, మంచి సామాన్లు కూడా లభించాయి. అయినా కానీ విశాల హృదయులు అవ్వండి. అంటే మీ సంకల్పాన్ని కర్మను, వాచా, సమయాన్ని, శ్వాసను ఈ అన్ని ఖజానాలను విశాల హృదయంతో ఉపయోగించండి. అప్పుడు మీ చిత్రం మంచిగా తయారవుతుంది. కొందరి దగ్గర ఇవన్నీ ఉన్నా కానీ ఉపయోగించడం లేదు, పొదుపు చేస్తున్నారు. దీంట్లో ఎంత విశాల హృదయులు అవుతారో, అంతగా మీ చిత్రం ఫస్ట్ క్లాస్ గా తయారవుతుంది. సమయాన్ని కూడా పొదుపు చేయకూడదు. ఈ కార్యం చేయడంలో పొదుపు చేయకూడదు. వ్యర్థ కార్యాలు చేయడంలో సమయాన్ని పొదుపు చేయాలి. శ్రేష్ట కార్యం చేయడంలో సమయాన్ని పొదుపు చేయకూడదు. చెప్పాను కదా - యదార్ధ పొదుపు అంటే ఏమిటో. ఒకని పేరు ప్రసిద్ది చేసేవారిగా అవ్వాలి. ఒకని పేరునే సదా స్మృతిలో ఉంచుకోవాలి. అలాంటి వారే పొదుపు చేయగలరు. ఒకని పేరును ప్రసిద్ది చేసేవారిగా కాకపోతే నిజమైన పొదుపు చేయలేరు ఎంత ప్రయత్నించినా కానీ.

ఈవిధంగా సదా స్వధర్మం అనగా వాణీకి అతీత స్థితిలో స్థితులై వాణిలోకి వచ్చేవారికి, సదా సర్వశక్తులను కార్యంలో ఉపయోగించే మాస్టర్ సర్వ శక్తివంతులకు, ఎవరెడీ ఆల్‌రౌండర్ పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.