అంతిమ పురుషార్ధం.
మూర్చితులను స్పృహలోకి తీసుకవచ్చేవారు, సర్వులకు
సహయోగం ఇచ్చేవారు మనుష్య ఆత్మలను దేవాత్మలుగా తయారుచేసేవారు సర్వశక్తివాన్
శివబాబా మాట్లాడుతున్నారు -
స్వయాన్ని సర్వశక్తులతో సంపన్నమూర్తిగా అనుభవం
చేసుకుంటున్నారా? బాప్ దాదా ద్వారా ఈ శ్రేష్ట జన్మ యొక్క వారసత్వంగా ఏమి
ప్రాప్తించింది? వారసత్వానికి అధికారి అనగా సర్వశక్తులకు అధికారిగా అవ్వడం.
సర్వశక్తులకు అధికారి అనగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారా? మాస్టర్
సర్వశక్తివంతులుగా అవ్వడం ద్వారా ఏదైతే ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేసుకుంటారో
ఆ అనుభవంలో నిరంతరం స్థితులై ఉంటున్నారా లేక దీంట్లో తేడా ఉందా? వారసత్వానికి
అధికారిగా అవ్వడంలో కేవలం రెండు విషయాలు బుద్ధిలో ఉంచుకోవడం ద్వారా ఆ తేడా
సమాప్తం అయిపోయి నిరంతరం ఆ స్థితిని తయారుచేసుకోగలరు, ఆ రెండుమాటలు ఏవి? అవేమిటో
మీకు తెలుసు కూడా మరియు చేస్తున్నారు కూడా. కానీ నిరంతరం చేయడం లేదా? ఒకటి
స్మృతిని యదార్ధంగా తయారుచేసుకోవడం, రెండు కర్మని యదార్ధంగా తయారుచేసుకోవడం. ఆ
రెండు మాటలు ఏవి? ఒకటి స్మృతి శక్తిశాలిగా తయారుచేసుకునేటందుకు సదా సంబంధం
జోడించబడే ఉండాలి మరియు కర్మని శ్రేష్టంగా తయారుచేసుకునేటందుకు సదా దిద్దుబాటు
చేసుకుంటూ ఉండాలి (కనెక్షన్ మరియు కరెక్షన్). ప్రతి కర్మలో దిద్దుబాటు చేసుకోవడం
లేదు. అందువలన మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో నిరంతరం స్థితులు కాలేకపోతున్నారు.
ఈ రెండు మాటలు ఎంత సరళమైనవి. ఇక్కడికి వచ్చిందే అందుకోసమే కదా! ఏ కర్తవ్యం కోసం
వచ్చారో దానిని చేయడం కష్టమా? కష్టంగా ఎవరికి అనుభవం అవుతుంది? బలహీనంగా
ఉన్నవారికి. అలాంటివారు కష్టంగా ఎందుకు అనుభవం చేసుకుంటారు? సంబంధం జోడించబడి
ఉన్నా, కానీ అప్పుడప్పుడు కష్టంగా అనుభవం చేసుకుంటారు, ఎందుకంటే శ్రమించరు.
తెలిసో మరియు అర్ధం చేసుకుంటారు కూడా, నడుస్తారు. కాని నడుస్తూ నడుస్తూ మరలా
విశ్రాంతికి ఇష్టమైనవారిగా అయిపోతారు. బాప్ దాదాకి ఇష్టమైవారిగా కాదు,
విశ్రాంతికి ఇష్టమైనవారిగా అయిపోతారు. అందువలన తెలిసినా కానీ అలాంటి స్థితే
తయారవుతుంది. ఇలాంటి విశ్రాంతికి ఇష్టమైన వారు బాబా సమానంగా శ్రేష్ట కర్మ
చేయడంలో శ్రేష్ట స్థితిని పొందలేరు. అందువలన ప్రతి సంకల్పాన్ని ప్రతి కర్మను
సరిదిద్దుకోండి మరియు బాప్ దాదా యొక్క కర్మలతో సంబంధం జోడించండి. ఇది బాబా
సమానంగా ఉందా అని చూడండి. శ్రేష్ఠాత్మలైన మీ యొక్క అంతిమ పురుషార్థం ఏమి మిగిలి
ఉంది? అంతిమ స్థితి యొక్క అంతిమ పేపర్ యొక్క ప్రశ్న ఏమిటో తెలుసా? తెలిసిన
వాళ్ళు తప్పక పాస్ అవుతారు కదా? మీ అందరికీ అంతిమ పరీక్ష యొక్క అంతిమ ప్రశ్న
ఏమిటో తెలుసా? మీ లాస్ట్ ప్రశ్న ఏమిటో మీ భక్తులకు కూడా తెలుసు. వారు కూడా
వర్ణిస్తూ ఉంటారు. మీ భక్తులకు తెలుసు కానీ మీకు తెలీదా! అంటే భక్తులు మీకంటే
తెలివైనవారిగా అయిపోయారా? ఈనాటి శ్రేష్ఠాత్మల యొక్క కల్పపూర్వక ఫలితం భక్తులకు
తెలుసు. కానీ మీరు మీ వర్తమాన పురుషార్థం యొక్క అంతిమ స్థితిని మరిచిపోయారు. ఆ
అంతిమ స్థితిని మాటిమాటికి వింటుంటారు, మహిమ కూడా చేస్తుంటారు. గీతాభగవానుడి
ద్వారా గీతాజ్ఞానం అంతా విన్న తరువాత అంతిమ స్థితిని ఏవిధంగా వర్ణిస్తారు? (నష్టోమోహ
స్మృతిర్లబ్ధః) భక్తులు మీ యొక్క స్థితిని ఈ విధంగా వర్ణన చేస్తున్నారు, మరైతే
అంతిమ పేపర్ లో ప్రశ్న ఏమిటి? స్మృతి స్వరూపంగా ఎంతవరకు అయ్యారు మరియు
నష్టోమోహగా ఎంతవరకు అయ్యారు, ఇదే అంతిమ ప్రశ్న. ఈ అంతిమ ప్రశ్నను సంపూర్ణంగా
ప్రత్యక్షంలోకి తీసుకువచ్చేందుకు ఈ రెండు మాటలను ప్రత్యక్షంలోకి తీసుకురావాలి.
ఇప్పుడిక అందరూ పాస్ విత్ ఆనర్ అయిపోతారు కదా! అంతిమ ఫలితం ప్రకటించడానికి ముందే
ప్రశ్న ప్రకటించబడిపోయింది. అయినా కానీ 108 మందే వచ్చారు. అంత కష్టమా ఏమిటి?
మొదటిరోజే ఈ ప్రశ్న తెలిసిపోయింది. జన్మ తీసుకున్నరోజే అంతిమ ప్రశ్న ఏమిటో
చెబుతారు. ఇప్పుడు శ్రేష్టాత్మలైన మీరందరూ ఎవరైతే కూర్చుని ఉన్నారో వారందరూ పాస్
అయ్యేవారే కదా? చెప్పాను కదా! పాస్ అయ్యేటందుకు పాస్ అనే మాటను మరో అర్థంతో
ప్రత్యక్షంలోకి తీసుకురండి - అదేమిటంటే ఏదైతే జరిగిపోయిందే అది పాస్ అయిపోయింది,
అనగా జరిగిపోయింది. జరిగిపోయిందేదో జరిగిపోయిందిగా భావించి నడుస్తూ వెళ్లండి.
అప్పుడు మీరు పాస్ అయిపోలేరా? అలాగే పాస్ అనే మాటను హిందీలో ఉపయోగించినప్పుడు
తోడు అనే అర్థం వస్తుంది. మీరు బాప్ దాదాకి దగ్గరగా ఉన్నారు. ఈ రకంగా ఈ మాటను
మూడురూపాలతో స్మృతిలో ఉంచుకోండి. పాస్ అయ్యారు, బాబాకి దగ్గరగా ఉండాలి మరియు
పాస్ అయిపోయింది. అప్పుడు ఫలితం ఏమి వస్తుంది? సంఘటనకు స్మృతిచిహ్నంగా విజయీమాల
ఏదైతే మహిమ చేయబడుతుందో ఆ విజయీమాలలో మణులుగా తప్పకుండా అయిపోతారు.
బాప్ దాదా పిల్లలను సదా తన దగ్గరే ఉండమని
ఆహ్వానిస్తుంటే, తనతో పాటు ప్రతి చరిత్రను అనుభవం చేసుకోమని ఆహ్వానిస్తుంటే,
ఇలాంటి శ్రేష్ఠ ఆహ్వానాన్ని స్వీకరించడం లేదు - ఎందుకు? కల్పమంతటిలో ఆత్మలైన
మీకు శ్రేష్ఠాత్మల ద్వారా లేదా సాధారణ ఆత్మల ద్వారా రకరకాల ఆహ్వానాలు లభిస్తూ
ఉంటాయి. కానీ ఈ ఆహ్వానం అయితే ఇప్పుడు లేకుండా మరెప్పుడూ లేదు. ఈ ఆహ్వానాన్ని
స్వీకరించాలి. అనగా మిమ్మల్ని మీరు బాబాకి దగ్గరగా పెట్టుకోవాలి. దీంట్లో కష్టం
ఏముంది. ఆహ్వానం మేర స్వయం చేరుకోవాల్సి ఉంటుందంతే. ఇక మిగతా బాధ్యత అంతా
ఆహ్వానించిన వారిపై ఉంటుంది. మిమ్మల్ని మీరు బాబాకి దగ్గరగా తీసుకువెళ్ళాలి,
అంటే బుద్ధితో బాబాకి దగ్గరగా ఉండాలి. దీంట్లో శ్రమ ఏముంది? ఈరోజుల్లో ఎవరైనా
సాధారణ వ్యక్తికి ఈ రోజు నువ్వు నాతో ఉండాలని ప్రెసిడెంట్ ఎవరైనా ఆహ్వానిస్తే
ఏమి చేస్తారు? (ధైర్యం పెట్టుకోలేరు) అయితే వారు ధైర్యం ఇస్తే ఏమి చేస్తారు,
ఆలస్యం చేస్తారు. మరైతే బాబా యొక్క ఆహ్వానాన్ని సదా ఎందుకు
స్వీకరించలేకపోతున్నారు. మిమ్మల్ని లాగే త్రాళ్లు ఏవైనా ఉన్నాయా? పిల్లలు
శక్తివంతులా లేక తండ్రియా? అతి శక్తివంతులు ఎవరు? ఎవరు ఎంత శక్తిశాలి అయినా దాని
నుండి ప్రాప్తించేది ఏమిటి, ప్రాప్తి యొక్క అనుభవీ స్వరూపం ఆధారంగా ఆ ఆకర్షణలో
ఆకర్షితం అయిపోవడం బ్రాహ్మణాత్మలకు శోభిస్తుందా? బ్రాహ్మణాత్మలకు లేదా
శ్రేష్టాత్మలకు ప్రభావశాలి అయిన మాయ కూడా ఏ రూపంలో కనిపిస్తుంది? కాగితపు పులి
వలే అనుభవం అవుతుందా? ప్రభావశాలి అయిన మాయ మాకోసం కాగితపు పులి లాంటిది. అనగా
ఆటబొమ్మ అని అనేవారు చేయి ఎత్తండి. మాయని కాగితపు పులిలా చేసుకోలేదా?
ప్రాణంలేనిది కాదా మాయ? అలంకారం కోసం పెట్టుకున్న దానిని చూసి స్వయం భయపడరు,
ఇతరులు భయపడతారు. ఇప్పుడు మాయలో ప్రాణం ఉందా? అప్పుడప్పుడు ప్రాణం పోసుకుంటుందా?
మాయని మూర్చితంగా చేయలేదా? మూర్చితం అయిపోయిందా, ఇప్పటికీ బ్రతికే ఉందా,
మూర్చితం చేసారా? మీ కోసం మాయం చనిపోయిందా? ఏ స్థితి వరకు వచ్చింది? చనిపోయిందా,
కాలిపోయిందా లేక మూర్చితం అయిపోయిందా? మూడు స్థితులు కొందరికీ మూర్చిత రూపంలో,
కొందరికీ చనిపోయింది, కొందరికి కాలిపోయింది. అంటే నామరూపాలు లేకుండా అయిపోయింది.
ఇప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు చూసుకోండి, ఏ స్థితి వరకు చేరుకున్నారో.
మాయని మూర్చితం చేయడానికి బదులు స్వయం మూర్చితం అయిపోవడం లేదు కదా? సంజీవని
మూలిక సదా వెంట ఉంచుకుంటేనే ఎప్పుడూ కూడా మూర్చితులు కాలేరు. మూర్చితం చేసేవారు
ఎప్పుడు మూర్చితులు కారు. బ్రాహ్మణ జీవతం యొక్క కర్తవ్యమే ఇది. జన్మ తీసుకునే
ముందు ఏమి ప్రతిజ్ఞ చేశారు? మాయాజీత్, జగత్ జీత్ గా అవుతామని ప్రతిజ్ఞ చేశారు
కదా! ఇదే మీ జన్మ కర్తవ్యం. జన్మించినప్పటి నుండి చేసే పని కష్టమని ఎలా
అనిపిస్తుంది? మంచిది.
సదా తెలివిలో ఉండేవారు, సదా సర్వశక్తులతో సంపన్నంగా
ఉండేవారు, సదా బాప్ దాదాతో పాటు ఉండేవారు, సదా బాబా కర్తవ్యంలో చేయి అందించేవారు,
సదా సహయోగి, సదా విజయీ శ్రేష్ఠాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు
నమస్తే.