25.05.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


భవిష్య ప్లాన్.

విశ్వపరివర్తకులు, విశ్వకళ్యాణకారి, వరదాని, మహాదాని, దృష్టి ద్వారా అద్భుతం చేసే బాబా మాట్లాడుతున్నారు -

స్వయాన్ని విశ్వ పరివర్తకులుగా లేదా విశ్వ కళ్యాణకారీగా భావిస్తున్నారా? విశ్వంలో ప్రతి ఆత్మకు సందేశం ఇచ్చేవారిగా భావించి విశ్వంలో ఎంత వరకు సందేశం ఇచ్చారు. దీని యొక్క లెక్క తీస్తున్నారా ఎక్కడెక్కడ సందేశం ఇచ్చే కర్తవ్యం ఎక్కువ జరగాలో దాని కోసం కొత్త కొత్త ప్లాన్స్ తయారుచేస్తున్నారా? ఎవరికి ఏ కర్తవ్యమో లేదా భాద్యత ఉంటుందో, ఆ కర్తవ్యం అనుసారంగా సదా ప్లాన్లు వేస్తుంటారు. అదేవిధంగా ఎక్కడైనా సందేశం ఇచ్చేటందుకు లేదా బాబా పరిచయం యొక్క ధ్వనిని వ్యాపింపచేసేటందుకు ఇప్పటి వరకు ఏదైతే భిన్నభిన్న ప్లాన్లు ప్రత్యక్షంలోకి తీసుకువచ్చారో వాటన్నింటిలో ముఖ్య ప్రయత్నం ఇదే చేసారు. ఏ భూమిలో లేదా ఏ స్థానంలో ఈ సందేశం ఇవ్వాలో, అక్కడ మొదట వేదిక తయారు చేస్తారు, ఉపన్యాసం తయారు చేస్తారు, పబ్లిసిటీ యొక్క భిన్న భిన్న సాధనాలు అవలంబిస్తారు. వాటి ద్వారా ఆ స్థానంలో ఆత్మలకు సందేశం ఇచ్చే కర్తవ్యం చేస్తూ ఉన్నారు. కానీ ఈ సాధనాల ద్వారా ఇప్పటి వరకు విశ్వంలోని అంశమాత్రపు ఆత్మలకు మాత్రమే సందేశం ఇవ్వగలిగారు. ఇప్పుడు కొద్ది సమయంలో మొత్తం విశ్వంలోని ఆత్మలకు సందేశం ఇచ్చే లేదా జ్ఞానము మరియు యోగం యొక్క పరిచయం ఇచ్చే లేదా బాబాని గ్రహింపజేసే కర్తవ్యం చేయాల్సిందే. దీంతో పాటు ఈ ప్రకృతిని కూడా పావనంగా తయారుచేయాలి. అప్పుడే విశ్వ పరివర్తన జరుగుతుంది. దీనికొరకు కొద్ది సమయంలో చాలా గొప్పకార్యం చేసేటందుకు భవిష్య ప్లాన్ ఏదైనా తయారుచేసారా, ఆ రూపురేఖ బుద్ధిలోకి వస్తుందా? ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అదే రూపురేఖయా లేక కొంచెం భిన్నమైనదా, అది ఏమిటో ముందుగానే చూడగులుగుతున్నారా లేక నడుస్తూ నడుస్తూ చూస్తారా? ఒకవేళ స్పష్టంగా తెలిస్తే రెండుమాటల్లో చెప్పండి. సమయం తక్కువగా ఉంది కనుక. ప్లాన్ కూడా చిన్నదిగా ఉండాలి. కానీ శక్తివంతంగా ఉండాలి. ఆ రెండు మాటలు ఏమిటి? భవిష్య ప్లాన్ ప్రత్యక్షంలోకి ఆ రెండు మాటల ఆధారంగానే వస్తుంది. ఆ రెండు మాటలు ఇంతకుముందు కూడా చెప్పాను. ఒకటి - సాక్షాత్తు బాబా సమానమూర్తి, మరియు రెండు - సాక్షి మరియు సాక్షాత్కారమూర్తి. ఎప్పటి వరకు ఈ రెండు మూర్తులుగా తయారుకారో, అప్పటి వరకు విశ్వపరివర్తనను కొద్ది సమయంలో చేయలేరు. ఈ ప్లాన్ ప్రత్యక్షంలోకి తీసుకువచ్చేటందుకు సేవలో ఎలాగైతే వేదికను మరియు ఉపన్యాసాన్ని తయారుచేసుకుంటారో, అలాగే ఇప్పుడు మీ స్థితి అనే వేదికను తయారుచేసుకోవలసి ఉంటుంది. మీ ముఖకవళికల ద్వారా భవిష్యత్తును సాక్షాత్కారం చేయించేటందుకు ఎలాగైతే భిన్నభిన్న పాయింట్లు ఆలోచించి వేదికను తయారుచేస్తారో, అలాగే మీ ముఖంలో ఏవైతే ముఖ్య కర్మేంద్రియాలున్నాయో వాటి ద్వారా బాబా యొక్క చరిత్రను, బాబా యొక్క కర్తవ్యాన్ని సాక్షాత్కారం చేయించాలి. బాబా గుణాలు కూడా సాక్షాత్కారం అవ్వాలి. ఇటువంటి భిన్న భిన్న పాయింట్లు తయారు చేయాలి. నయనాల ద్వారా అనగా దృష్టి ద్వారా అద్భుతం చేయగలగాలి. నయనాల దృష్టి ద్వారా ఆ ఆత్మల యొక్క దృష్టి, వృత్తి, స్మృతి మరియు కృతిని పరివర్తన చేసేయండి. మస్తకం ద్వారా మీ యొక్క లేక అందరి యొక్క స్వరూపాలను సాక్షాత్కారం చేయించండి. పెదవుల ద్వారా, ఆత్మిక చిరునవ్వు ద్వారా అవినాశీ సంతోషం యొక్క అనుభవం చేయించండి. ఇలా మొత్తం ముఖం ద్వారా వర్తమాన శ్రేష్ట పదవి మరియు భవిష్య పదవి యొక్క సాక్షాత్కారం చేయించండి. మీ శ్రేష్ట సంకల్పం ద్వారా ఇతరాత్మల యొక్క వ్యర్థ సంకల్పాలు లేదా వికల్పాలు అనే ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోతున్న నావను మీ శక్తితో అల్పకాలికంగా ఒడ్డున చేర్చి చూపించండి. వ్యర్థ సంకల్పాలను శుద్ద సంకల్పాల్లోకి పరివర్తన చేసేయండి. మీ యొక్క ఒక్క మాట ద్వారా చాలా సమయం నుండి తపిస్తున్న ఆత్మలకు తమ గమ్యాన్ని చేరుకునే అనుభవం చేయించండి. ఆ ఒక్క మాట ఏమిటి? శివబాబా. శివబాబా అనడం ద్వారా గమ్యం లభించేస్తుంది, మీ యొక్క ప్రతి కర్మ అనగా చరిత్ర ద్వారా. చరిత్ర అనేది కేవలం తండ్రికే కాదు, శ్రేష్ట ఆత్మలైన మీ యొక్క ప్రతి శ్రేష్ట కర్మ కూడా చరిత్రయే. సాధారణ కర్మను చరిత్ర అని అనరు. కనుక ప్రతి శ్రేష్ఠ కర్మ రూపీ చరిత్ర ద్వారా బాబా యొక్క చిత్రాన్ని చూపించండి. ఎప్పుడైతే ఇలాంటి ఆత్మిక ప్రత్యక్ష ఉపన్యాసం చెబుతారో, అప్పుడే కొద్ది సమయంలో విశ్వపరివర్తన ........ దీనికొరకు వేదిక కూడా కావాలి. వేదికను తయారుచేయడంలో ఏవేమి ముఖ్య సాధనాలు కావాలి? అదైతే మీకు తెలుసు కదా! మీ యొక్క ముఖ్యమైన గుర్తు ఏమిటంటే వేదికను తెలుపురంగులోకి తయారుచేస్తారు. మీకు ఇదే ముఖ్య గుర్తు. ఎలాగైతే మీ దుస్తులు ప్రసిద్ధమో అలాగే మీ ఆత్మ యొక్క స్థితి కూడా లేదా బాహ్య వేదికకు కూడా అదే రూపాన్ని ఇస్తారు. స్థూల వేదికపై వేటిపైన అయితే ధ్యాస పెడతారో ఒక్క వస్తువును మరిచిపోయినా కానీ వేదిక సరైన విధంగా తయారుకాదు. వేదిక యొక్క మెరుపు మంచిగా కనిపించదు. అదేవిధంగా మీ స్థితి అనే వేదిక ద్వారా ప్రత్యక్ష ఉపన్యాసం చెప్పాలి. దీనికొరకు కూడా ఈ అన్ని విషయాల యొక్క తయారీ ఉండాలి. లైట్ కావాలి అనగా డబల్ లైట్ స్వరూపం యొక్క స్థితి కావాలి. ఇదైతే మీకు తెలుసు రెండు రకాల లైట్లు వేదికపై ఉన్నవారు తేలికగా లేకపోతే లేవటానికి, కూర్చోడానికి భారీగా అనిపిస్తే ఉపన్యాసం వినడానికి బదులు వారిని చూస్తారు. అలాగే ఇక్కడ కూడా స్థితి డబల్ లైట్‌గా ఉండాలి. ఇక మైక్ కూడా పవర్‌ఫుల్ గా ఉండాలి. దూరం వరకు స్పష్టంగా వినిపించాలి. కనుక మైక్ లో కూడా శక్తి ఉండాలి. ఒక సంకల్పం చేయండి లేదా ఒక దృష్టి వేయడం ద్వారా ఆ దృష్టి సంకల్పం లైట్ హౌస్ వలే పనిచేయాలి. ఒక స్థానంలో ఉంటూ కూడా అనేక ఆత్మలపై మీ శ్రేష్ఠ సంకల్పం మరియు దివ్యదృష్టి యొక్క ప్రభావం పడాలి. ఇలాంటి శక్తిశాలి మైక్ తయారుచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మైక్ ఏమైంది, సంకల్పం మరియు దృష్టి, దివ్య మరియు ఆత్మిక దృష్టి, అదేవిధంగా తెలుపుదనం అనగా స్వచ్చబుద్ది కావాలి. దాంట్లో కొంచెం కూడా మచ్చ ఉండకూడదు. వేదికపై ఏ చిన్నమచ్చ ఉన్నా, తెలుపుదనం లేకపోయినా అందరి ధ్యాస అటువైపే ఉంటుంది. అదేవిధంగా స్లోగన్ల యొక్క అలంకారం కూడా కావాలి. స్థితి అనే వేదికపైన ఏ స్లోగన్ యొక్క అలంకారం కావాలి? స్థితి అనే వేదిక మనసా, వాచా, కర్మణా యొక్క ఉపన్యాసం. ఈ వేదిక కొరకు ఏ స్లోగన్ కావాలి? నేను ఆత్మ విశ్వకళ్యాణమనే శ్రేష్ట కర్తవ్యం కొరకు సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా నిమిత్తమై ఉన్నాను. ఈ సూక్తి స్మృతిలో ఉండాలి. ఈ స్థితిలో ఈ స్లోగన్ గుర్తులేకపోతే మీ స్థితి శుభ్రంగా అనిపించదు. విశేష ధారణలే మీ స్లోగన్స్. అలాగే మరో స్లోగన్ నేను ఆత్మ మహాదానీ మరియు వరదాని. ఏ ఆత్మలకైతే దానమిచ్చే మరియు తీసుకునే సాహసం లేదో వారికి కూడా వరదాత అయిన తండ్రి ద్వారా లభించిన వరదానాల ద్వారా మీ స్థితి యొక్క సహయోగం ద్వారా వరదానం ఇవ్వాలి. కనుక మీ స్లోగన్ ఏమిటి నేను మహాదాని మరియు వరదానీ. ఇది స్పష్టీకరణ. ఇక మూడవ విషయం ఆత్మనైన నేను నా యొక్క చరిత్ర మరియు మాట లేదా సంకల్పం ద్వారా నా మూర్తిలో ఆత్మలందరికీ బాప్ దాదా యొక్క చిత్రాన్ని లేదా మూర్తిని సాక్షాత్కరింపచేయాలి.

ఈవిధంగా మీ స్థితిని సుందరంగా తయారుచేసే స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్మృతిలో ఉంచుకోవాలి. ఈ విధంగా మీ స్థితిని మరియు ఉపన్యాసాన్ని తయారుచేసుకోండి. వేదికపై కుర్చీలో కూర్చోండి అంటే మీ స్థితి అనే కుర్చీలో కూర్చోండి. ఈ విధంగా వేదిక, ఉపన్యాసము మరియు మీ స్టేటస్ మూడు కూడా అవసరం. అప్పుడు కొద్ది సమయంలో విశ్వాన్ని పరివర్తన చేయగలరు. ఇలా చేయడం వస్తుందా. స్థితి ఇంత గట్టిగా ఉండాలి. ఈ ధ్యాస పెట్టుకోవాలి. ఏకరసంగా, అచంచలంగా, స్థిరంగా ఉండాలి. ఏ తుఫాను, ఏ వాతావరణం మీ స్థితిని కదిలించలేకుండా ఉండాలి. ఈ విధంగా మీ తయారీలు చేసుకోండి. ఇలాంటి అభ్యాసం ఉందా, ఈవిధంగా ఎవరెడీగా ఉన్నారా? ఎవర్ హేపీగా ఉన్నారా? సెకెనులో ఎలాంటి స్థితియో, ఎలాంటి స్థానమో, ఎలాంటి ఆత్మల యొక్క భూమియో, ఆ రకంగా కొద్ది సమయంలో మీ స్థితిని తయారుచేసుకుని ప్రాక్టికల్ ఉపన్యాసం చెప్పగలిగి ఉండాలి. అర్ధమైందా! ఇదే భవిష్యప్లాన్. మంచిది.

ఈవిధంగా సదా తమ స్థితి ద్వారా స్టేటస్ ద్వారా సర్వాత్మలకు తమ సంపూర్ణ స్థితిని మరియు తమ వాస్తవిక స్థితిని సాక్షాత్కారం చేయించే శ్రేష్ఠాత్మలకు, విశ్వకళ్యాణకారి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్పృతులు మరియు నమస్తే.